Konakanamitla
-
‘కొనకొనమిట్ల’ సభ: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ ఇవే
సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు పెద్ద శాడిస్టు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 10వ రోజు ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా జిల్లా కొనకనమిట్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారేనని.. చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలేనని ధ్వమెత్తారు. సీఎం జగన్ స్పీచ్.. హైలైట్స్ వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేస్తున్నాడు అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు పింఛన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదవాడు పెద్దవాడవుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదలకు స్థలాలిస్తుంటే అడ్డుకునేవాడిని శాడిస్టు అంటారు వ్యవసాయం దండగ అన్న వ్యక్తే శాడిస్టు ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు శాడిస్టు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతంటే అడ్డుకున్నవాడు శాడిస్టు పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు శాడిస్టు కాక ఇంకేంటి వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన బాబు అండ్ గ్యాంగ్ మొత్తం శాడిస్టులే మేలు జరిగిందని చెప్పినందుకు గీతాంజలిని సోషల్ మీడియాలో సైకోలతో వేధించిన పెద్ద శాడిస్టు చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసినా ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ గుర్తుకు రాని చంద్రబాబు మనకు ప్రత్యర్థి ఇది మీ బిడ్డ 58 ఏళ్ల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్.. మీ బిడ్డ గ్రామగ్రామానా ఫ్యామిలీ డాక్టర్ అంటే మీ జగన్.. మీ బిడ్డ అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్ అంటే మీ జగన్.. మీ బిడ్డ ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్..మీ బిడ్డ పగటి పూటే రైతన్నలకు ఉచిత కరెంటు, ఉచిత పంటబీమా అంటే మీ జగన్..మీబిడ్డ ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే మీ జగన్..మీ బిడ్డ అమూల్‌ను తీసుకువచ్చి పాడి రైతులకు ధరలు పెంచింది మీ జగన్.. మీ బిడ్డ వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది మీ జగన్..మీ బిడ్డ ఏకంగా 30 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది మీ జగన్..మీ బిడ్డ నాడు..నేడుతో ప్రభుత్వ బడులు రూపు రేఖలు మారాయంటే కారణం మీ జగన్..మీ బిడ్డ అమ్మఒడి ఇచ్చింది మీ జగన్.. మీ బిడ్డ పెద్ద చదువుల కోసం విద్యాదీవెన, విద్యావసతి ఇచ్చింది మీ జగన్..మీ బిడ్డ ప్రభుత్వ ఆస్పత్రులు రూపు మారాయంటే కారణం మీ జగన్.. మీ బిడ్డ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అంటే మీ జగన్ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కారణం మీ జగన్ అక్క చెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్ అంటే మీ జగన్ వాహన మిత్ర అంటే మీ జగన్ లా నేస్తం అంటే మీ జగన్ స్కీములన్నీ గ్రామంలో కళ్లెదుటే కనిపిస్తున్నాయి ఈ కార్యక్రమాలన్నీ మీ బిడ్డ ఎలా చేశాడు..చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు స్కీములన్నీ చూస్తుంటే చంద్రబాబుకు 20 జెలుసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కడుపుమంట తగ్గట్లేదు ఇందుకే మన జెండా తలెత్తుకోని ఎగురుతూ ఉంది వాళ్ల జెండా 4 జెండాలతో జత కట్టినా కింద పడుతోంది 2014లో చంద్రబాబు ఇదే కూటమితో ముందుకువచ్చారు మళ్లీ అదే చంద్రబాబు,పవన్‌కల్యాణ్, మోదీ వస్తున్నారు హామీల కరపత్రాలను చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు 80 వేల కోట్ల రుణమాఫీ చేశాడా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేశాడా ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా ఇంటింటికి ఉద్యోగమిచ్చాడా..నిరుద్యోగ భృతి ఇచ్చాడా అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చాడా పక్కా ఇళ్లు నిర్మించాడా ఏపీని సింగపూర్‌గా మార్చాడా ప్రతి నగరాన్ని హైటెక్‌సిటీ చేస్తానన్నాడు చేశాడా ఇప్పుడు మళ్లీ ఇంటింటికి బంగారం,ఇంటింటికి బెంజ్ కారంటూ వస్తున్నాడు చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే -
చంద్రబాబు దారి అడ్డదారి: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నారని కొనకనమిట్ల సభ వేదికగా ‘ఎల్లో బ్యాచ్’ కుట్రలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు దారి అడ్డదారి.. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ఎజెండాతో మనం.. జెండాలు కట్టి వాళ్లు.. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం.. ‘‘వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్దాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?. మన అడుగులు ముందుకా.. వెనక్కా అని తేల్చే ఎన్నికలివి. చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయి’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు ‘‘56 నెలలుగా అందుకున్న పెన్షన్లను అర్ధాంతరంగా నిలిపివేయించాడు. ఆదివారమైనా, సెలవురోజైనా వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారు. మండే ఎండలో పేదలను నడిరోడ్డుపై నిలబెట్టాడు. అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెత్తించింది. అందుకే వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్ర. తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటి?. పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని వాడే శాడిస్టు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబులో తగ్గని కడుపుమంట.. అవ్వాతాతలను చంపిన చంద్రబాబును శాడిస్టు అనాలి. దళితులను అవమానించని వాడిని శాడిస్టు అనాలా? వద్దా?. మన ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపం. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారు. 20 జెలొసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోంది. అసూయ, కుళ్లు, కడుపు మంటతో చంద్రబాబు బాధపడుతున్నాడు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకువస్తుందా?. మహిళల సాధికారితకు పెద్దపీట వేశాం. ఆక్వారైతులకు రూపాయిన్నరకే విద్యుత్ అందిచాం. వందేళ్ల తర్వాత భూముల్ని రీ సర్వే చేయిస్తున్నాం’’ సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసు.. ‘‘ప్రతీ ఇంటికీ మంచి కోసం మనం అధికారాన్ని ఉపయోగించాం. మేం చేసిన పనులన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. చంద్రబాబు మాత్రం దోచుకోవడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారు. చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బంది పెట్టారు. 2014లో ఈ ముగ్గురే కూటమిగా ఏర్పడ్డారు. ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు ఇంటింటికి కరపత్రాలు పంపించారు. 2014లో ఈ మూడు పార్టీలు ఏం హామీలిచ్చాయో అందరికి తెలుసు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు.. చేశారా?. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. నెలకు రూ.2వేలు ఇచ్చారా?’’ అంటూ సీఎం జగన్ నిలదీశారు. విప్లవాలు మీ బిడ్డ పాలనలో సాగాయి.. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క స్కీం కూడా తీసుకురాలేదు. గ్రామ, వార్డు, సచివాలయాలంటే మీ జగన్.. మీ బిడ్డ. గ్రామగ్రామాన విలేజ్ క్లీనిక్ అంటే.. మీ జగన్.. మీ బిడ్డ. ఇంటింటికి వాలంటీర్ల సేవలంటే.. మీ జగన్.. మీ బిడ్డ. అవ్వాతాతలకు పెన్షన్ అంటే మీ జగన్.. మీ బిడ్డ. విప్లవాలు మీ బిడ్డ పాలనలో సాగాయి. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చాం. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి’’ అని సీఎం జగన్ తెలిపారు. -
పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురాయె!
కొనకనమిట్ల: పెళ్లిలో ఠీవీగా కనిపించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెగా దర్శనమిచ్చాడు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్రబాబుకు ఆదివారం రాత్రి వివాహం జరిగింది. పెళ్లి కుమారుడు తమ వంశాచారం ప్రకారం ప్యాంటు, చొక్కాలకు బదులుగా చీర, జాకెట్ ధరించి బారెడు విగ్గు, తలనిండా పూలు పెట్టుకున్నాడు. బొట్టూ, కాటుక, గాజులు, దండలతో అచ్చం పెళ్లి కుమార్తెలా ముస్తాబయ్యాడు. వంశాచారం ప్రకారం పెళ్లి ముందు దేవుడికి ఎదురు నడిచే తతంగం ఉంది. అందులో భాగంగా తమ ఇలవేల్పు అయిన గురప్పడు స్వామికి కొలుపులు జరిపేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మేళతాళాలు, బొల్లావుతో ఉత్సవం చేసుకుంటూ ఎదురైన ముత్తయిదువులకు నుదుట బొట్టు పెట్టుకుంటూ వారి ఆశీర్వచనాలు అందుకున్నాడు. ఊరి చివరి ఉన్న జమ్మిచెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఇది తమ వంశాచారమని పెళ్లికి ముందుగా పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెగా..పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు చేస్తామని, అది తమ ఆనవాయితీ అని నాలి రామయ్య చెప్పారు. -
ఈత సరదా ప్రాణలు తీసింది
సాక్షి, ప్రకాశం : ఇటీవల మంచి వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం వాతావరణం అహ్లాదకరంగా ఉంది. ఐదుగురు స్నేహితులు సరదా అలా ఊరి బయటకు వెళ్లి కాసేపు కాలక్షేపం చేసి వద్దామనుకున్నారు. సమీపంలోని చెక్ డ్యాంలో నీరు పుష్కలంగా ఉండటం చూసి వారికి ఈత కొట్టాలనిపించింది. ఒకరి తరువాత ఒకరుగా ఈతకు దిగారు. అప్పటిదాకా ఉల్లాసంగా గడిపిన వారు ఒక్కసారిగా ప్రమాదంలో పడ్డారు. వారిలో ఇద్దరు నీట మునిగి మృతి చెందగా మిగిలిన ముగ్గురూ ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామానికి చెందిన సోమా రవి, మద్దూరి ఓబులకొండారెడ్డి, ఇళ్లూరి మహేంద్రరెడ్డి, మీనిగ నరేంద్ర, వసంతపురం బాలకృష్ణలు వీరంతా మంచి స్నేహితులు.. బుధవారం వాతావరణం చల్లగా ఉండటంతో సరదాగా గడుపుదామనుకొని స్నేహితులంతా ఊరి బయట పొలాల్లోకి వెళ్లారు. కొద్ది సేపు సరదాగా గడిపి కొండకు దగ్గర్లోని జంగమూడిశెల చెక్‌డ్యాం దగ్గరకు వెళ్లారు. చెక్‌డ్యాంలో పుష్కలంగా నీరు ఉండటంతో ఈత కొడదామనుకున్నారు. ఇళ్లూరి మహేంద్ర లోతుకు వెళ్లి మునిగి పోతున్నాడని గమనించిన మిగతా నలుగురు అతడిని కాపాడే యత్నం చేశారు. వీరిలో రవి(24), ఓబులకొండారెడ్డి(23) ఇద్దరు లోతుకు వెళ్లి నీట మునిగిపోయారు. మిగిలిన ముగ్గురూ ఒకరికొకరు చేయి అందించుకొని ఎలాగో బతికి బయట పడ్డారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు చెక్‌డ్యాం దగ్గరకు వెళ్లి రవి, కొండారెడ్డిల మృతదేహాలను వెలికితీసి గ్రామంలోకి తీసుకొచ్చారు. ఒంటరి అయిన చిన్నారులు.. ప్రమాదంలో మృతి చెందిన సోమా రవి గ్రామంలో వెల్డింగ్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. రవికి భార్య నాగలక్ష్మి, మూడేళ్ల పాప తేజశ్రీ, ఏడాదిలోపు బాబు నరేంద్రలు ఉన్నారు. రవి మృతితో నాగలక్ష్మి దిక్కుతోచని స్థితిలో ఉంది. నాన్న లేరని తెలియని చిన్నారులు ఏమి తెలియక అమాయకంగా చూస్తున్నారు. రవి తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఇటీవలే మృతి చెందడం, ఇప్పుడు రవి కూడా చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంభాన్ని పోషిస్తున్న ఓబులకొండారెడ్డి.. గ్రామానికి చెందిన మద్దూరి ఓబులరెడ్డి, తిరపతమ్మ దంపతుల ఏకైక కుమారుడు ఓబులకొండారెడ్డి కొద్దిగా చదువుకొని బేల్దారి పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కొన్నాళ్లు హైదరబాద్‌లో బేల్థారి పని చేసి ఇటీవల గ్రామానికి వచ్చి ఇంటి దగ్గర ఉంటూ బేల్దారి పని చేస్తున్నాడు. వివాహం చేద్దమనుకున్న సమయంలో సరదాగా వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఓబులకొండారెడ్డి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అదృష్టవంతులు వీరు.. తోటి స్నేహితులతో సరదాగా గడుపుదామని ఈతకు వెళ్లి ఇద్దరు స్నేహితులు కళ్లముందే మృత్యువడికి చేరటం, అదృష్ట వశాత్తు బతికి బయటపడిన ఇళ్లూరి మహేంద్రరెడ్డి, మీనిగ నరేంద్ర, వసంతపురం బాలకృష్ణలు అదృష్టవంతులు.. మహేంద్రరెడ్డి లారి డ్రైవర్‌గా పని చేస్తుండగా, నరేంద్ర బేల్థారి పని చేస్తుంటాడు. బాలకృష్ణ మాత్రం డిగ్రీ చదువుతున్నాడు. తమ కళ్ల ముందే తోటి స్నేహితులు మృతి చెందారని వారు విలపించటం కనిపించింది. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటావుటిన చెక్‌డ్యాం దగ్గరకు వెళ్లారు. లోపల ఉన్న మృత దేహాలను వెళికి తీసేందుకు గ్రామానికి చెందిన ఎదురు కొండారెడ్డి, బాపతు ఎర్రారెడ్డి మరికొంతమంది సాహసించి చెక్‌డ్యాంలోకి దిగారు. లోపల ఉన్న మృతదేహాలను వెళికి తీసి ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాలను గ్రామంలోని మృతుల నివాసాలకు చేర్చారు. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు యువకులు మృతి చెందటంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా జరిగిన సంఘటన తెలుసుకున్న కొనకనమిట్ల ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ తన సిబ్బందితో గ్రామంలోకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, మృతేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తామని ఎస్ఐ అన్నారు. -
వెబ్‌ల్యాండ్ మంచిది కాదు
పొదిలి/కొనకనమిట్ల : రెవెన్యూ వెబ్‌ల్యాండ్ ఆధారంగా భూముల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్‌లో లోపాల వల్ల రైతులు పడుతున్న కష్టాలు, రెవెన్యూ అధికారుల అక్రమాలతో వెబ్‌ల్యాంబ్ బాధిత రైతులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందకు ‘సాక్షి’ నడుంబిగించింది. మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి మండలం ఆముదాలపల్లి, కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో గురువారం అవగాహన సదస్సులు నిర్వహించింది. ‘వెబ్‌ల్యాండ్ అమలు చేయడం వల్ల అవకతవకలు, అక్రమాలు జరిగే అవకాశం ఉంది. భూమి క్రయ, విక్రయాల్లో తప్పులు జరుగుతున్నాయి. అసలు రికార్డులు సవరించకుండా వెబ్‌ల్యాండ్ అమలు చేయడం మంచిది కాదు’ అని పలువురు రైతులు సదస్సు దృష్టికి తెచ్చారు. గొట్లగట్టు పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సదస్సులో తహశీల్దార్ జ్వాలా నరసింహం మాట్లాడుతూ.. ‘వెబ్‌ల్యాండ్‌లో సమస్యలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. జీఓ నెం.271 వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పాత విధానమే బాగుందని రైతులు అంటున్నారు. ఈ–పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఒక పుస్తకం (ఈ పాస్) ద్వారానే బ్యాంక్‌ల్లో రుణ ం ఇస్తున్నారు. సహకార బ్యాంక్‌ల్లో రుణాలివ్వని విషయంతోపాటు మిగిలిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం’ అన్నారు. ఆముదాలపల్లిలో వెబ్ ల్యాంyŠ అవగాహన సదస్సులో తహశీల్దార్ విద్యాసాగరుడు మాట్లాడుతూ.. రైతుల రికార్డుల ప్రకారం సరిచూసుకుని, లోపాలను సవరించాకే వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. వివాదాలు వచ్చిన చోట ఇరువర్గాలతో మాట్లాడి ఆమోదయోగ్యమైతేనే వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. భూ యజమానుల హక్కులకు భంగం కలిగేతే వెంటనే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. రైతులు ముందుగా వారి భూములకు సంబంధించి విస్తీర్ణాలు, పాసు బుక్‌లో నమోదైన విస్తీర్ణాలు సరిచూసుకుని కంప్యూటరీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. -
వణికిస్తున్న విషజ్వరాలు
కొనకనమిట్ల, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల్లో జ్వరపీడితులు వణికిపోతున్నారు. నెలల తరబడి ప్రజలను జ్వరాలు వదలటం లేదు. ఒకరి తర్వాత మరొకరికి జ్వరం వస్తూనే ఉంది. వేలకు వేలు ఖర్చుపెట్టి ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. జ్వరం తగ్గిన వారం రోజులకు మళ్లీ తిరగబెడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మండలంలోని సిద్ధవరం, చేరెడ్డివారిపలిల్లో పలువురు విషజ్వరాలతో మంచంపట్టారు. వారం రోజులుగా జ్వరాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలువురు స్థానిక ఆర్ఎంపీ, పొదిలిలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. చికున్ గున్యాతో గంజి నారాయణ దంపతులు, హుసేన్బాబు బాధపడుతూ ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన మరియమ్మ చికున్‌గున్యాతో మంచంపట్టింది. చిన్నారులు సైతం జ్వరాలతో అల్లాడుతున్నారు. వృద్ధులు కీళ్ల నొప్పులతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. రోగాల బారిన పడిన కొంతమంది ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకోగా మరికొందరు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బిళ్లలు వేసుకుని సరిపెట్టు కుంటున్నారు. ఇటీవల కురిసిన అరకొర వ ర్షాలకు నీటిలో మార్పు రావటంతో పాటు పారిశుధ్యం అధ్వానంగా ఉండటం వల్లే ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఎక్కువగా టైఫాయిడ్, చికున్‌గున్యాతో అల్లాడుతున్నారు. దోమలు పగలు రాత్రి తేడా లేకుండా స్వైరవిహారం చేస్తున్నాయి. జ్వరాలతో పాటు శరీరంపై దద్దుర్లు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకుని వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాలికకు డెంగీ మండలంలోని వెలిగండ్లలో ఉండేలా శ్రావణి (9) అనే బాలిక డెంగీ లక్షణాలతో ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు బంధువులు తెలిపారు. శ్రావణి జ్వరంతో బాధపడుతుండటంతో ఒంగోలు తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ లక్షణాలు ఉన్నట్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్తున్నట్లు బంధువులు తెలిపారు. వెలిగండ్లలో కూడా జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.