వెబ్‌ల్యాండ్ మంచిది కాదు
పొదిలి/కొనకనమిట్ల :
రెవెన్యూ వెబ్‌ల్యాండ్ ఆధారంగా భూముల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్‌లో లోపాల వల్ల రైతులు పడుతున్న కష్టాలు, రెవెన్యూ అధికారుల అక్రమాలతో వెబ్‌ల్యాంబ్ బాధిత రైతులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందకు ‘సాక్షి’ నడుంబిగించింది.
మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి మండలం ఆముదాలపల్లి, కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో గురువారం అవగాహన సదస్సులు నిర్వహించింది. ‘వెబ్‌ల్యాండ్ అమలు చేయడం వల్ల అవకతవకలు, అక్రమాలు జరిగే అవకాశం ఉంది. భూమి క్రయ, విక్రయాల్లో తప్పులు జరుగుతున్నాయి. అసలు రికార్డులు సవరించకుండా వెబ్‌ల్యాండ్ అమలు చేయడం మంచిది కాదు’ అని పలువురు రైతులు సదస్సు దృష్టికి తెచ్చారు.
గొట్లగట్టు పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సదస్సులో తహశీల్దార్ జ్వాలా నరసింహం మాట్లాడుతూ.. ‘వెబ్‌ల్యాండ్‌లో సమస్యలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. జీఓ నెం.271 వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పాత విధానమే బాగుందని రైతులు అంటున్నారు. ఈ–పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఒక పుస్తకం (ఈ పాస్) ద్వారానే బ్యాంక్‌ల్లో రుణ ం ఇస్తున్నారు. సహకార బ్యాంక్‌ల్లో రుణాలివ్వని విషయంతోపాటు మిగిలిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం’ అన్నారు.
ఆముదాలపల్లిలో వెబ్ ల్యాంyŠ అవగాహన సదస్సులో తహశీల్దార్ విద్యాసాగరుడు మాట్లాడుతూ.. రైతుల రికార్డుల ప్రకారం సరిచూసుకుని, లోపాలను సవరించాకే వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. వివాదాలు వచ్చిన చోట ఇరువర్గాలతో మాట్లాడి ఆమోదయోగ్యమైతేనే వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. భూ యజమానుల హక్కులకు భంగం కలిగేతే వెంటనే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. రైతులు ముందుగా వారి భూములకు సంబంధించి విస్తీర్ణాలు, పాసు బుక్‌లో నమోదైన విస్తీర్ణాలు సరిచూసుకుని కంప్యూటరీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.