వెబ్‌ల్యాండ్‌పై నేడు ‘సాక్షి’ అవగాహన సదస్సు | webland ..sakshi | Sakshi
Sakshi News home page

వెబ్‌ల్యాండ్‌పై నేడు ‘సాక్షి’ అవగాహన సదస్సు

Published Tue, Aug 30 2016 11:36 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

webland ..sakshi

అమలాపురం :
ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తున్న వెబ్‌ల్యాండ్‌ విధానంలో నెలకొన్న అస్పష్టత పరిస్థితులు, లోపాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు అమలాపురంలో ‘సాక్షి’ దినపత్రిక బుధవారం ఉదయం 10 గంటలకు సదస్సు నిర్వహిస్తోంది. అమలాపురం సావరం బైపాస్‌ రోడ్డులోని గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాలలో జరిగే ఈ అవగాహన సదస్సుకు ఆర్డీవో జి.గణేష్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు వెబ్‌ల్యాండ్‌పై అవగాహన కల్పిస్తారు. ఆయనతో తహసీల్దార్, అమలాపురం డివిజన్‌ సర్వే ఇన్‌స్పెక్టర్‌ సత్తి నాగేశ్వరరావు, వీఆర్వోలు పాల్గొంటారు. కోనసీమ స్థాయిలో జరిగే ఈ సదస్సుకు రైతులు హాజరై వెబ్‌ల్యాండ్‌పై తమ అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వెబ్‌ల్యాండ్‌ విధానంలో నెలకొన్న తికమకలను ఎలా సరిదిద్దుకోవాలి... ఆ ప్రక్రియలో రైతుల భూములు ఎలా భద్రంగా కాపాడుకోవాలి.. అందుకు ఎలా దరఖాస్తు చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవచ్చు తదితర అంశాలపై ఈ సదస్సులో రెవెన్యూ అధికారులు అవగాహన కల్పిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement