kothapally subbarayudu
-
'ఫుడ్ ప్రాజెక్టులను నిర్మిస్తే తీవ్రపరిణామాలు'
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందురులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. ఫుడ్ పార్క్ నిర్మాణం అంశంపై శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడారు. తుందురు గ్రామస్తులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ప్రాజెక్టులను నిర్మిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కొత్తపల్లి సుబ్బారాయుడు హెచ్చరించారు. -
ఇళ్ల తొలగింపు.. తీవ్ర ఉద్రిక్తత
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్రమ నిర్మాణాలంటూ ప్రభుత్వ అధికారులు స్థానికంగా ఉన్న ఇళ్లను శనివారం ఉదయం తొలగిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల తొలగింపు చేపడుతున్న అధికారులను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రక్తత నెలకొంది. నిర్వాసితులకు ప్రత్యామ్నయం చూపాలని సుబ్బారాయుడు అధికార పార్టీని డిమాండ్ చేశారు. -
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ‘పాలమూరు’ను ఆపించండి
* రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ నేతలు * ఎంతసేపూ ‘ఓటుకు కోట్లు’ నుంచి బయటపడడంపైనే సీఎం దృష్టి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా శంకుస్థాపన చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తక్షణం ఆపించాలని వైఎస్సార్సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, అనంత వెంకటరామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం నుంచి బయటపడటానికి నిత్యం కృషిచేస్తున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. పాలమూరు కారణంగా రాయలసీమ, నాగార్జునసాగర్ కింద ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు నష్టపోతారని ఆందోళన వెలిబుచ్చారు. సాగునీటి మంత్రి దేవినేని ఉమా ఈ ప్రాజెక్టుపై ఒకే ఒక్కసారి విలేకరుల భేటీలో అభ్యంతరం తెలిపి వదిలేశారని, సీఎం ఇంతవరకూ దీనిపై నోరువిప్పిన పాపానపోలేదని తప్పుపట్టారు. ఉమ్మ డి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు అనుమతులొచ్చాయని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పి పక్కదోవ పట్టించారని, ఆయన చెప్పింది నిజం కానేకాదని వారు స్పష్టం చేశారు. ‘పాలమూరు’పై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేయలేదని వారు విమర్శించారు. తెలంగాణలో టీడీపీని కాపాడుకోవడంకోసం చంద్రబాబు ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు. జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడమేంటి? ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోతే జగన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడమేమిటని సుబ్బారాయుడు ప్ర శ్నించారు. రాజకీయ దొంగతనం చేస్తూ పట్టుబడిన చంద్రబాబు దాన్నుంచి తప్పించుకోవడానికి ఏపీప్రజల్ని అడ్డం పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. -
‘చేతనైతే పాలమూరు ఎత్తిపోతల ఆపండి’
హైదరాబాద్: ఎలాంటి అనుమతుల్లేకుండా శంకుస్థాపన చేసిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తక్షణమే నిలిపి వేయించాలని వైఎస్సార్సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో వారిద్దరూ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారం నుంచి బయట పడటానికి అష్టకష్టాలు పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎత్తిపోతల ప్రాజెక్టు కారణంగా రాయలసీమ, నాగార్జునసాగర్ కింద ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడే ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి పక్కదోవ పట్టిస్తున్నారని, వాస్తవానికి ఆయన చెప్పింది నిజం కాదని వారు ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తన విషయం మాట్లాడుకుంటున్నారే తప్ప ఎత్తిపోతల పథకం గురించి కేంద్రానికి ఫిర్యాదు కూడా చేయలేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని ప్రజల, రైతుల సమస్యలు అసలు పట్టించుకోవడం లేదన్నారు. నాలుగేళ్లలో పూర్తి చే యాల్సిన పోలవరం పనులు పూర్తిగా నిలిచి పోయాయని అక్కడ ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో దోషులపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కోరితే తప్పవుతుందా! అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.