
'ఫుడ్ ప్రాజెక్టులను నిర్మిస్తే తీవ్రపరిణామాలు'
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందురులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. ఫుడ్ పార్క్ నిర్మాణం అంశంపై శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడారు. తుందురు గ్రామస్తులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ప్రాజెక్టులను నిర్మిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కొత్తపల్లి సుబ్బారాయుడు హెచ్చరించారు.