koti reddy
-
వికారాబాద్: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్!
సాక్షి, క్రైమ్: వికారాబాద్ మోమిన్ పేట్ లచ్చానాయక్ తండాలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలను పోలీసులు వెల్లడించారు. తమ ఆధిపత్యానికి అడ్డు రావడమే కాకుండా.. పొలం విషయంలో అడ్డుపడుతున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు ఈ కేసును చేధించినట్లు జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియాకు గురువారం ఆ వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం లచ్చానాయక్ తాండకు చెందిన విఠల్ ఈ నెల(జులై) 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే.. మృతుడి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తూ మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆ తాండాకే చెందిన అన్నదమ్ములు మేఘావత్ పవన్, మోతిలాల్, నరేందర్ లు మరో ఐదు మంది కలిసి ఈ నెల 2న సదాశివ పేట్ నుంచి వస్తుండగా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి సమీపంలో తుపాన్ వాహనంతో గుద్ది హత్య చేశారు. సదరు వాహనం కర్నాటక రిజిస్ట్రేషన్ నెంబర్ గలదని ఎస్పీ వెల్లడించారు. ఇక విచారణలో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ హత్య కోసం కందికి చెందిన మహ్మద్ సల్మాన్ కు లక్ష రూపాయల సుఫారి ఇచ్చారని, ఈ నేరంలో పాల్గొన్న మేఘావత్ రాంచందర్, మేఘావత్ మోతిలాల్, మేఘావత్ నరేందర్, మహ్మద్ సల్మాన్, బానోవత్ జైపాల్, జంజు రాజు, మంగలి నరేష్, దేవాసు రమేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారాయన. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలిపి.. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్లనే ఈ కేసు సాల్వ్ అయ్యిందని వెల్లడించారాయన. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పిందని సజీవ సమాధి చేశాడు -
కేసీఆర్ చెప్పినా కూడా ఎమ్మెల్యేల కాళ్లులాగే ప్రయత్నాలు.. ఇలాగైతే కష్టమే!
ఎన్నికలు దగ్గరపడేకొద్దీ బీఆర్ఎస్ పార్టీలో లొల్లి ఎక్కువవుతోంది. టిక్కెట్ల పోరు తీవ్రమవుతోంది. సిటింగ్‌లకే సీట్లని కేసీఆర్ ప్రకటించాక కూడా ఎమ్మెల్యేల కాళ్ళులాగే ప్రయత్నాలు ఆగడంలేదు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. అక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తలనొప్పులు పెరిగాయట. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు వర్గపోరుతో పాటు.. కొత్త తలనొప్పులు మొదలయ్యాయని టాక్. సొంత వర్గం నేతలు కూడా ఎమ్మెల్యే మాటల్ని పెడచెవిన పెడుతూ బహిరంగంగా కయ్యానికి కాలు దువ్వుతున్నారట. ఇప్పటికే సాగర్ బీఆర్ఎస్ పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో అక్కడ పార్టీ శ్రేణులు కూడా రెండు వర్గాలుగా విడిపోయాయి. రెండు గ్రూపులకు తోడు మధ్యలో మరో నేత రావడంతో ఇప్పుడు మూడు ముక్కలాట సాగుతోంది. ఈ పరిస్థితుల్లో సొంత వర్గాన్ని కాపాడుకుంటూ.. ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఎమ్మెల్యేలకు సమయం సరిపోవడంలేదట. అంతా గందరగోళంగా మారడంతో సొంత వర్గం నుంచి కూడా ఎమ్మెల్యే భగత్‌కు సమస్యలు ఎదురవుతున్నాయట. ఇవన్నీ చూసి ఎమ్మెల్యేకు తలబొప్పి కడుతోందని టాక్. చదవండి: తేరా చిన్నపరెడ్డి రాజకీయ అదృష్టమెంత? కారులో సీటుందా? ప్రచారంతో వివాదం ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పంచాయితీ కొనసాగుతున్న తరుణంలోనే.. సొంత వర్గానికి చెందిన చోటా నేతలు చేస్తున్న హంగామా ఎమ్మెల్యేను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే బజారుకెక్కి బట్టలు చింపుకుంటుండటంతో ఏం చేయాలో అర్థం కావడంలేదట. సొంతవర్గంలోని గొడవలు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఎమ్మెల్యే ఆందోళన పడుతున్నారని ఆయన అనుచరులే చెప్పుకుంటున్నారు. తాజాగా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పెద్ద హీరో సినిమా విడుదల సమయంలో అభిమానులు పెట్టినట్లుగా ఫ్లెక్సీలను ఊరంతా నింపేశారట. వాటిలో ఒకచోట నిడుమనూరు ఎంపీపీ జయమ్మ ఫోటో పెట్టలేదట. దీంతో ఆమె అనుచరులు కొందరు అక్కడకు చేరుకుని నానా హంగామా చేశారు. తమ నేత ఫోటో లేకుండా ఫెక్సీలు పెడతారా? మీకెంత ధైర్యం అంటూ అందులో తమ నాయకుడు భగత్ ఫోటో ఉందన్న విషయం కూడా మర్చిపోయి వాటిని చించేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయట. సోషల్ మీడియాలో వైరల్ అసలు ఏం జరుగుతుందో అర్థంకాక కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి సర్ధిచెప్తున్నా ఎంపీపీ అనుచరుడు వినిపించుకోకుండా రోడ్డుపైనే గొడవకు దిగారట. దాదాపు గంట పాటు ఈ గొడవ జరగడంతో పార్టీ పరువు పోతుందని అక్కడే ఉన్న ఓ నాయకుడు ఎమ్మెల్యేకు విషయం చేరవేశాడట. దీంతో ఎమ్మెల్యే సీరియస్ అయి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా సదరు నేత వెనక్కి తగ్గలేదట. మరోవైపు ఇదే అవకాశమని వైరి వర్గం ఆ వీడియోను విస్తృతంగా వైరల్ చేసేసిందట. దీంతో ఒక్కసారిగా నాగార్జున సాగర్ లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఇది మీడియాలో కూడా రావడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఎమ్మెల్యే ఎంపీపీతో వివరణ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇన్నాళ్లు అక్కడ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా నువ్వా నేనా అన్నట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య రాజకీయాలు సాగుతున్నాయి. వీరి పోరుతోనే పార్టీ పరువు సాగర్‌లో కలుస్తోందని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ తాజాగా ఎమ్మెల్యే వర్గానికి చెందినవారే రొడ్కెక్కడంతో ఏంటీ కొత్త గోల అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. అసలే భగత్ ఎక్కడ దొరుకుతాడా కసి తీర్చుకుందాం అని ఎదురుచూస్తోన్న ఎమ్మెల్సీ వర్గానికి ఎమ్మెల్యే సొంత వర్గమే వారికి ఇప్పుడో ఆయధం ఇచ్చినట్లు అయిందట. మొత్తానికి అందరూ కలిసి పార్టీ పరువును సాగర్‌లో కలిపేస్తున్నారంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
దీక్షిత్ హత్య : ఆ దురాశతోనే కిడ్నాప్ చేసి..
సాక్షి, మహబూబాబాద్ : అతి తొందరగా డబ్బులు సంపాదించాలనే దురాశతోనే మంద సాగర్ అనే వ్యక్తి దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత గుర్తుపడుతాడనే భయంతో బాలుడిని గొంతునులిమి చంపాడని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే దీక్షిత్‌ని హత్యచేచేశాడని చెప్పారు. గురువారం ఆయన దీక్షిత్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘మహబూబాబాద్ పట్టణానికి చెందిన రంజిత్ రెడ్డి ఓ టీవీ చానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు ఆయన పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి(9)ని ఎవరో గుర్తితెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఇట్టి కిడ్నాప్ గురించి బాలుని తల్లిదండ్రులు మహబూబాబాద్ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దర్యాప్తు చేయగా.. మంద సాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించాం. నిందితుడు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతి తొందరలో డబ్బులు సంపాదించాలనే దురాశతోనే కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల నుంచి బాలుడిని తీసుకెళ్లాడు. తాళ్లపూసలపల్లి పరిసరాల్లోకి తీసుకెళ్లి కొద్దిసేపు గడిపాడు. బాలుడిని కంట్రోల్ చేయడం మంద సాగర్‌కు కష్టంగా మారింది. దొరికిపోతాననే భయంతో దీక్షిత్‌ను గొంతు నులిమి చంపాడు. అనంతరం రూ.45లక్షలు డిమాండ్ చేశాడు. చంపిన తర్వాత రెండు రోజుల పాటు ఫోన్లు చేస్తునే ఉన్నాడు. సాంకేతిక ఆధారాలతో కిడ్నాపర్ కోసం గాలించాం. 30 మంది అనుమానితులను ప్రశ్నించాం. కిడ్నాపర్ వాడిన టెక్నాలజీతోనే నిందితుడిని పట్టుకున్నాం. మంద సాగర్ ఒక్కడే దీక్షిత్‌ను హత్య చేశాడు. నిందితుడిని పూర్తిగా విచారిస్తే మరిన్ని నిజాలు బయటపడొచ్చు’అని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. -
కడప జిల్లా ముఖచిత్రం
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప 1807లోనే జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,61,539 మంది జనాభా ఉన్నారు. ఇందులో 1,79,666 మంది పురుషులు, 1,81,873 మంది మహిళలు ఉన్నారు. ఓటర్ల విషయానికి వస్తే 116248 మంది పురుషులు, 120884 మంది మహిళలు, వంద మంది ఇతరులు కలిపి మొత్తం 2,37,232 మంది ఉన్నారు. నియోజకవర్గంలో 273 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గతాన్ని ఓమారు విశ్లేషిస్తే... ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కె.కోటిరెడ్డి 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయనకు 13742 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన పుల్లగూర శేషయ్యశ్రేష్టికి 13702 ఓట్లు లభించాయి. కేవలం 40 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన కోటిరెడ్డి రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1955లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోటిరెడ్డి లక్కిరెడ్డిపల్లె నియోకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి నాళ్లలో కడప మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన రహమతుల్లా 1955 ఎన్నికల్లో, ఆ తర్వాత 1967 ఎన్నికల్లో రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. అప్పటి ప్రధాని నెహ్రూ కుటుంబంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన కుమారుడు అయిన అహ్మదుల్లా మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. 2004, 2009లో ఆయన కడప ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అహ్మదుల్లాకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పదవి లభించింది. ఇటీవల ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి కుటుంబాన్ని ‘కాల్టాక్స్’ వారుగా ప్రజలు పిలుస్తుంటారు. గజ్జెల రంగారెడ్డి 1972, 1978లలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ పార్టీ తరుపున 1989లో కందుల శివానందరెడ్డి ఓమారు గెలుపొందారు. ఆయన తండ్రి కందుల ఓబుల్‌రెడ్డి రెండు పర్యాయాలు కడప లోక్‌సభ సభ్యునిగా పనిచేశారు.శివానందరెడ్డి ఓమారు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. రాజకీయ పరిణామాల్లో ఆయన టీడీపీలోకి వెళ్లారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మొదటి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేదని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీ తరుపున గెలుపొందిన ఎస్.రామమునిరెడ్డి, సి.రామచంద్రయ్య, డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాషా ముగ్గురు కలిపి నాలుగు పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వీరు ముగ్గురికి మంత్రి పదవులు లభించడం గమనార్హం. ఎన్టీఆర్ క్యాబినెట్లో రామమునిరెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, సి.రామచంద్రయ్య ఇరవై సూత్రాల అమలుశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే ఎస్ఎఫ్సీ చైర్మన్‌గా సేవలు అందించారు. చంద్రబాబు హయాంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆ తర్వాత చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ తరుపున మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఖలీల్‌బాషా చంద్రబాబు క్యాబినెట్లో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలోకి వెళ్లారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజద్‌బాషా 45,205 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ తిరుగుబాటు అభ్యర్థిగా దుర్గాప్రసాద్ పోటీ చేశారు. పొత్తు ఖరారు కావడానికి ముందే ఆయనకు బి.ఫారం ఇవ్వడంతో పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆ తర్వాత విరమించుకోవడానికి నిరాకరించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ అల్లపురెడ్డి హరినాథరెడ్డికి కేవలం 5350 ఓట్లు మాత్రమే రావడంతో ధరావత్తు కోల్పోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున లోక్‌సభకు పోటీ చేసిన వైఎస్ అవినాష్‌రెడ్డికి కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 42,508 ఓట్ల మెజార్టీ లభించింది. ఈ ఎన్నికల్లో 450 ఓట్లు నోటాకు వచ్చాయి. -
స్పెషల్ కిడ్స్‌కు ‘పినాకిల్ బ్లూమ్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానసికంగా సరైన ఎదుగుదల లేని పిల్లలే... స్పెషల్ కిడ్స్. దేశంలో ఇలాంటివారి సంఖ్య 5 లక్షలకుపైనే. సరిపల్లి కోటిరెడ్డి కుమారుడికీ ఇలాంటి సమస్యే వచ్చింది. వైద్యుల దగ్గరికి తీసుకెళితే ఆటిజం (బుద్ధి మాంద్యం) అని చెప్పారు. అయితే కోటిరెడ్డి దానిపై పూర్తిస్థాయిలో శోధించారు. రుగ్మతేంటో తెలుసుకున్నారు. చికిత్సతో కొంతవరకూ నయం చేయగలిగారు. అలాగని అక్కడితో ఆగిపోలేదు!! అలాంటి పిల్లలకు తగిన విద్య, ఇతర సేవలు అందించడానికి ‘పినాకిల్ బ్లూమ్స్’ను ఏర్పాటు చేశారు. ఇపుడు దాన్ని విస్తరించే పనిలో పడ్డారు. కంపెనీ గురించి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే... ‘‘మా బాబుకి 20 నెలలున్నప్పుడు ఆటిజం అని డాక్టర్ చెప్పారు. ఆ బాధ నుంచి కొద్ది రోజుల్లోనే తేరుకుని నిజంగా ఆటిజం ఉందా అని అధ్యయనం చేశాను. చివరకది సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (వినికిడి సమస్య) అని తేలింది. పిల్లాడికి కాక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించాం. ఇప్పటికీ బాబుకి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అయితే ఆటిజం, డాల్ ఫేస్, మానసిక రుగ్మత, ప్రవర్తన సమస్యలతో దేశంలో 5 లక్షల పైచిలుకు మంది పిల్లలు బాధపడుతున్నారు. పిల్లలు పెరిగేంత వరకు సమస్య బయటపడదు. వీరికోసం ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. పరిశోధన ఆధారంగా.. స్పెషల్ కిడ్స్‌కు ఎటువంటి థెరపీ ఇవ్వాలో లోతైన అధ్యయనం చేశాం. ఇందుకు రూ.4 కోట్ల వరకు ఖర్చయింది. సెంటర్ల ఏర్పాటు, కంపెనీ ఏర్పాటుకు రూ.1.5 కోట్లు వెచ్చించాం. మా సెంటర్ల ద్వారా స్పెషల్ కిడ్స్‌కు స్పీచ్, స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఆడియాలజీ సేవలు అందిస్తున్నాం. ఇందుకు తొలిసారిగా మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా టెక్నాలజీని ఆసరాగా చేసుకున్నాం. ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, స్పీచ్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, లాంగ్వేజ్ పాత్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్టులతో కూడిన 40 మంది నిపు ణులు ప్రస్తుతం పూర్తిస్థాయి సేవలందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్తో కలిసి సైకాలజీలో పరిశోధన చేస్తున్నాం. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా.. పిల్లలు, తల్లిదండ్రులు, సిబ్బందిపై కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ పర్యవేక్షణ ఉంటుంది. బాబు, పాప తల్లిదండ్రులకు ప్రతిరోజు 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ ఉంటుంది. ప్రతి సెషన్లో పిల్లలకు అందిన సేవలపై తల్లిదండ్రులు పినాకిల్ కనెక్ట్ యాప్‌లో రేటింగ్ ద్వారా తమ స్పందనను తెలియజేయాలి. ఇంట్లో పిల్లల ప్రవర్తన సమాచారాన్ని పొందుపరచాలి. ఈ అంశాల ఆధారంగా థెరపీలో మార్పు ఉంటుంది. అలాగే బాబు, పాప గురించి, వారితో ఎలా మెలగాలో నిపుణులు యాప్ ద్వారా చెప్తారు. సమస్య స్థాయినిబట్టి 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు థెరపీ అవసరం. విదేశాల్లోనూ అడుగుపెడతాం.. హైదరాబాద్‌లో కూకట్పల్లి, మాదాపూర్, సుచిత్ర, వెస్ట్ మారేడ్‌పల్లిలో పినాకిల్ బ్లూమ్స్ కేంద్రాలున్నాయి. రెండు నెలల్లో హైదరాబాద్‌లోనే మరో 7 కేంద్రాలు వస్తున్నాయి. విస్తరణకు రూ.9 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏపీలో ఫ్రాంచైజీ విధానంలో 30 సెంటర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. భారత్‌లో అన్ని రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ విస్తరిస్తాం. ఫ్రాంచైజీకి ప్లే స్కూళ్లు, చిల్డ్రన్ హాస్పిటల్స్, న్యూరాలజిస్టులకు ప్రాధాన్యమిస్తాం. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం, రూ.2–3 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వం అనుమతిస్తే ప్రతి జిల్లా కేంద్రంలో ఏదైనా గవర్నమెంటు స్కూల్లో పినాకిల్ బ్లూమ్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధం. ఈ సెంటర్లలో ఉచితంగా సేవలు అందిస్తాం, -
రాష్ట్రంలో పలువురు అదనపు ఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న పలువురు అధికారులను ఇన్చార్జ్ డీసీపీ, ఇన్చార్జ్ ఎస్పీలుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మహబుబాబాద్ ఎస్పీగా ఎన్.కోటి రెడ్డి, వికారాబాద్ ఎస్పీగా అన్నపూర్ణా రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీగా ఎం.వెంకటేశ్వరరావు, సైబరాబాద్ క్రైం డీసీపీ గా జానకి శర్మ, వరంగల్ పోలీస్ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్‌గా వెంకటే శ్వర్లు, మల్కాజ్గిరి డీసీపీగా ఉమా మహేశ్వర శర్మలను నియమించింది. -
రికార్డు బ్రేక్
భద్రాచలం : భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన రికార్డు నమోదైంది. ఇక్కడ సెప్టెంబర్ నెలలో 356 ప్రసవాలు జరిగాయి. భద్రాచలం ఏరియా ఆసుపత్రి నెలకొల్పిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒకే నెలలో ఈ స్థాయిలో ప్రసవాలు జరగటం ఇదే ప్రథమం. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంవీ కోటిరెడ్డికి ఈ ఘనత దక్కినట్లైంది. కాగా కోటిరెడ్డి సూపరింటెండెంగ్గా పనిచేసిన కాలంలోనే గతంలో ఒకే నెలలో 350 ప్రసవాలు జరగగా, అప్పట్లో అది రికార్డుగా నమోదైంది. తిరిగి తన రికార్డును తన హయాంలోనే అధిగమించటం గమనార్హం. వంద పడకలున్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి జిల్లాలోని ఏజెన్సీ మండలాల నుంచే కాకుండా పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా వైద్యం కోసం వస్తుంటారు. ఎక్కువగా గిరిజనులే ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రులను మినహాయిస్తే, ఈ స్థాయిలో డెలివరీలు నమోదైంది మరెక్కడా లేదు. మంగళవారంతో సెప్టెంబర్ నెల ముగియగా, మరో రెండుమూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఆసుపత్రుల నుంచి జనన, మరణాల నివేదికలు వచ్చే అవకాశం ఉంది. ఇలా నివేదికలు వచ్చిన తరువాత భద్రాచలం ఏరియా ఆసుపత్రి డెలవరీల రికార్డును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏజెన్సీకి ప్రధాన కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఈ స్థాయిలో ప్రసవాలు జరగడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఇక్కడి వైద్యులను అభినందించారు. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డిని సాక్షి పలుకరించగా, ఇంత ఎక్కువగా ప్రసవాలు చేయటంలో డాక్టర్ పుల్లయ్య, గైనకాలజిస్టు విప్లవ కృషి ఎంతో ఉందన్నారు. డాక్టర్ పుల్లయ్య అదనపు డీఎంహెచ్‌వోగా ఏజెన్సీ ఆసుపత్రులను పర్యవేక్షిస్తూనే ఏరియా ఆసుపత్రి పరిస్థితి దృష్ట్యా ప్రసవాలను చేసేందుకు రావటం ద్వారానే అరుదైన రికార్డు లభించిందని, ఇది వారిద్దరికే దక్కుతుందని అన్నారు. అలాగే సిబ్బంది కృషి కూడా ఉందని, బుధవారం ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందికి అభినందన సభ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక్కడే ఉంటారా..? సూపరింటెండెంట్‌గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కోటిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయినందున కీలకమైన పోస్టులో ఉండేందుకు వీల్లేదని, కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్థానంలో మరొకరికి నియమించేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. నేడో, రేపో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అయితే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న అధికారిని కొనసాగించేలా జిల్లా ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
గొల్లుమన్న కంభంపాడు
కంభాలపాడు (పొదిలి), న్యూస్‌లైన్ : భార్యతో విభేదాల కారణంగా కన్నతండ్రే తన ఇద్దరు చిన్నారులను బావిలోపడేసి చంపేసిన సంఘటనతో మండలంలోని కంభంపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరగ్గా, బుధవారం ఉదయం బావిలో నుంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. నిందితుడు కోటిరెడ్డి గ్రామం సమీపంలోని అటవీభూముల అవతలివైపు ఉన్న బావిలో తన ఇద్దరు బాలురైన రామాంజనేయులరెడ్డి (7), తిరుపతిరెడ్డి (6)లను పడేశాడు. అప్పటికే రాత్రి కావడంతో బుధవారం ఉదయం దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పొదిలి సీఐ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మృతదేహాలను బయటకు తీయించడంతో తల్లి సుజాత, ఇతర బంధువులు తట్టుకోలేక భోరున విలపించారు. వారితో పాటు అధిక సంఖ్యలో గ్రామస్తులు బావి వద్దకు చేరుకున్నారు. నిందితుడు కోటిరెడ్డి చూపించిన దారి ప్రకారం...చెట్లు, పుట్టలు దాటుకుంటూ అష్టకష్టాలుపడి బావివద్దకు చేరుకున్నారు. అక్కడ బావిలోకి దిగేందుకు వీలుగా చెట్లు తొలగించి ఎంతో కష్టపడి మృతదేహాలను బయటకు తీసి గ్రామంలోని ఇంటివద్దకు తరలించారు. బావివద్దే శవపంచనామాతో పాటు పోస్టుమార్టం కూడా చేయించిన పోలీసులు.. మృతదేహాలను బంధువులకు అప్పగించారు. తల్లి, బంధువుల రోదనలతో గ్రామస్తులంతా కంటతడి పెట్టుకున్నారు. ముందుగా డీఎస్పీ, సీఐలు గ్రామంలోని ఇంటివద్ద బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని విచారించి వివరాలు సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు సీఐ తెలిపారు. స్థానిక సర్పంచ్ పి.శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ ఆవులూరి కోటేశ్వరరావు, పెద్దలు అంబటి సీతారామిరెడ్డి, కోవెలకుంట్ల నరసింహారావు తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత తల్లిని ఓదార్చారు. దేవుడిదగ్గరకని చెప్పి... రోజూ తమను పట్టించుకోని నాన్న.. సైకిల్‌పై వచ్చి దేవుడిదగ్గరకని చెప్పి తీసుకెళ్తుండటంతో ఆ చిన్నారులు ఆనందపడ్డారు. నాన్నా.. దేవుడెక్కడున్నాడు..ఇంకెంత దూరం వెళ్లాలి... అంటూ మధ్యమధ్యలో అడుగుతూ ఉన్నారు. మధ్యలో బడ్డీబంకు వద్ద సైకిల్ ఆపి పిల్లలకు తినుబండారాలు కొనిపించిన ఆ తండ్రి.. నిజంగానే మధ్యలో కొండపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి గుడికి తీసుకెళ్లి పిల్లలకు దేవుడిని చూపించాడు. ఆ తర్వాత కాసేపటికి నిజంగానే దేవుడిదగ్గరకు పంపించాడు. కన్నబిడ్డలను ఎంతో కఠినంగా బావిలో పడేసి చంపేశాడు. ముందుగా పెద్ద కుమారుడిని, ఆ వెంటనే రెండో కుమారుడిని బావిలో వేసి చనిపోయిందాకా అక్కడే ఉండి ఆ తర్వాత గ్రామానికి వచ్చాడు. భార్యమీద కోపంతో పిల్లలను చంపేసి మానవత్వాన్ని మంటకలిపాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. -
లైంగిక దాడి ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్టు
=అంతా గోప్యమే.. = ప్రధాన నిందితుడు పాత ముద్దాయే విజయవాడ, న్యూస్‌లైన్ : వించిపేట రైల్వే ఆఫ్ యార్డులో ప్రయాణికురాలిపై జరిగిన లైంగిక దాడి కేసులో కొత్తపేట పోలీసులు ముగ్గురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చూపడంలో పోలీసులు అంతా గోప్యంగానే ఉంచడం విమర్శలకు దారి తీసింది. కేసులో ముగ్గురు నిందితులను శనివారం సాయంత్రం కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో వెస్ట్ ఏసీపీ టీ హరికృష్ణ, సీఐ వెంకటేశ్వర్లు, సాహేరా బేగంలు అరెస్టు చూపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గుంటూరు జిల్లా నర్సరావుపేట జొన్నలగడ్డ గ్రామానికి చెందిన దెడ్డుకుంట కోటిరెడ్డి(30)తో పాటు కేఎల్‌రావునగర్ బొగ్గులైన్ క్వార్టర్స్‌కు చెందిన కొనపాల రాజు (37), విశాఖపట్నానికి చెందిన శేర గోపి (28)లను శనివారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండపేటకు చెందిన ఓ వివాహితపై ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున కొంతమంది యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు అదేరోజు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతిపై లైంగిక దాడి చేసిన వారిలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉన్నారంటూ పుకార్లు రావడంతో కేసును కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు కొత్తపేట పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను శనివారం రాత్రి అరెస్టు చూపడంతో కేసు చిక్కుముడి వీడింది. ప్రధాన నిందితుడైన కోటిరెడ్డి గుంటూరు, విజయవాడ రైల్వే పోలీస్స్టేషన్లలో పలు కేసులలో ముద్దాయి. ఆరోజేం జరిగిందంటే... నిందితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం... ఘటన జరిగిన రోజు మూడో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న డీఎంఈలో వివాహిత రాజమండ్రి వెళ్లేందుకు రెలైక్కింది. డీఎంఈని శుభ్రం చేయాల్సి ఉండటంతో రైలు వించిపేట రైల్వే ఆఫ్ యార్డులోకి చేరింది. అదే సమయంలో రైలులో ఒంటరిగా ఉన్న వివాహితను కోటిరెడ్డి గమనించాడు. రైల్వేస్టేషన్ నుంచి యార్డులోకి వెళ్లే రైళ్లలో నిద్రపోతున్న వ్యక్తులను బెదిరించి డబ్బులు, వస్తువులు లాక్కోవడం అతని వృత్తి. ఒంటరిగా ఉన్న వివాహితను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో రైల్వేలో ప్రైవేటు స్వీపర్‌గా పనిచేసే కొనపోల రాజు (37) వివాహితపై లైంగిక దాడికి పాల్పడటాన్ని గమనించాడు. కోటిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత అతను కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో శేర గోపి అక్కడే ఉండి ఘటనను ప్రత్యక్షంగా తిలకించాడు. ఈ వ్యవహారం గురించి పోలీసులకు గాని, రైల్వే అధికారులకు గాని తెలియజేయకపోవడంతో ఈ కేసులో గోపిని మూడో నిందితుడిగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.