Krishna Karthik
-
తగిన వరుడు
కథలు చెప్పుకుందాం పూర్వం హేలాపురి అనే గ్రామంలో విశ్వగుప్తుడు అనే వస్త్ర వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా సంపన్నుడు. బోలెడన్ని ఆస్తిపాస్తులు గడించాడు. అతని ఏకైక కుమార్తె విశ్వరూప. ఆమె గొప్ప అందగత్తె. విశ్వగుప్తుడికి మగ పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆమెను చేసుకున్నవారికే అతని ఆస్తిపాస్తులు దక్కుతాయి. దాంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది వరుస కట్టసాగారు. అయితే విశ్వగుప్తుడు సంపదకు, అంతస్తులకు విలువ ఇచ్చే మనిషి కాదు. అందుకే తన కుమార్తెను కేవలం డబ్బున్నవాడికి కాకుండా... నిజాయితీపరుడికి, స్వయంకృషిని నమ్ముకున్నవాడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి వాడయితే తన కుమార్తెను సుఖపెట్టడమే కాక... తన వార సుడిగా తర్వాత తన వ్యాపారం అతనే చేపట్టి, మరింత బాగా అభివృద్ధి చేస్తాడన్నది విశ్వగుప్తుడి ఆలోచన. ఎట్టకేలకు పెళ్లిళ్లల పేరయ్య ద్వారా అందమైన, తెలివైన ఇద్దరు యువకుల వివరాలు లభించాయి విశ్వగుప్తుడికి. వెంటనే వీరా, ధర్మ అనే ఆ ఇద్దరు యువకులకూ కబురంపాడు. ఆ ఇద్దరూ బాగా చదువుకున్నవారు. చూడటానికి కూడా ఎంతో చక్కగా ఉన్నారు. ఇద్దరినీ రకరకాల ప్రశ్నలు వేశాడు విశ్వగుప్తుడు. అన్నింటిలోనూ సమ ఉజ్జీలుగా ఉన్నారు ఆ ఇద్దరూ. అయితే వారిలో ఎక్కువ సమర్థుడు ఎవరో కనిపెడితే కానీ, విశ్వగుప్తుడు తన కుమార్తెకు పెళ్లి చేయలేడు. కాబట్టి చిట్టచివరగా ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఒకరోజు ఇద్దరినీ పిలిపించి, చెరొక పదివేల రూపాయలూ ఇచ్చి, పట్నం వెళ్లి తన కూతురికి బాగా నచ్చేవి కొనుక్కురండి అని చెప్పాడు విశ్వగుప్తుడు. ఆ డబ్బు తీసుకుని ఇద్దరూ పట్నం బయలుదేరారు. వీరా నేరుగా పట్నం వెళ్లి ఏం కొందామా అని ఆలోచించాడు. సహజంగా ఆడవారికి చీరలపై మక్కువ ఎక్కువ కాబట్టి, అవే కొందామను కున్నాడు. దాంతో పది వేలూ ఖర్చు చేసి విలువైన చీరలు కొనుక్కుని మధ్యాహ్నానికే ఊరికి తిరిగి వచ్చేశాడు. తను తెచ్చిన చీరలు విశ్వగుప్తుడికి చూపించాడు. అతడు సంతోషించాడు కానీ అంతగా తృప్తి కలగలేదు. దాంతో తర్వాత కబురు చేస్తానని చెప్పి పంపేశాడు. ధర్మ ఎప్పుడో చీకటి పడ్డాక తిరిగి వచ్చాడు. పదివేల రూపాయలతో కొన్న చీరలతో పాటు మరో పదివేల రూపాయల్ని విశ్వగుప్తుడి చేతిలో పెట్టాడు. ఆశ్చర్యపోయిన విశ్వగుప్తుడు ఆ డబ్బు ఎక్కడిదని అడిగాడు. దాంతో తాను చేసిన పని గురించి చెప్పాడు ధర్మ. అతడు మొదట విశ్వగుప్తుడు ఇచ్చిన డబ్బుతో కొన్ని అందమైన రంగు రంగుల చీరలు కొన్నాడు. సాయంత్రం వరకూ వీధుల్లో తిరిగి వాటిని రెట్టింపు ధరకు అమ్మాడు. తర్వాత పదివేల రూపాయలతో చీరలు కొని ఊరికి తిరిగి వచ్చాడు. తనకు కాబోయే భార్యకు తన డబ్బుతోనే చీరలు కొనాలనిపించిందని, అందుకే అలా చేశానని చెప్పాడు. ధర్మ తెలివి తేటలకు మురిసిపోయాడు విశ్వగుప్తుడు. అతనే తన కుమార్తెకు తగిన వరుడనీ, తన తదనంతరం తన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయగల తెలివితేటలు అతనికి సమృద్ధిగా ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. అయినా, ఎందుకయినా మంచిదని కూతురితో వరుడి విషయంలో తాను పెట్టిన పరీక్షను, దానికి వారి స్పందనను వివరించాడు. తన నిర్ణయాన్ని ఆమెకు తెలియజెప్పి, ఆమె అభిప్రాయాన్ని కోరాడు. తండ్రి ఇచ్చిన డబ్బుతో గాక తన సొంత తెలివితేటలతో తన కోసం చీరలు కొని తెచ్చిన ధర్మ ఆమెకు బాగా నచ్చాడు. దాంతో ఆమె తండ్రి నిర్ణయాన్ని మనసులోనే బాగా మెచ్చుకుంది. పైకి మాత్రం ‘‘ నాదేముంది నాన్నా! ఏమి చేసినా మీరు నా మంచి కోసమే చేస్తారు కదా, అయినా మీ ఆలోచన చాలా బాగుంది నాన్నా’’ అంటూ సిగ్గుతో తలవంచుకుంది. కూతురి మనసు కనిపెట్టిన విశ్వగుప్తుడు తన నిర్ణయం సరైనదే అయినందుకు మిక్కిలి సంతోషించాడు. వెంటనే మంచి ముహూర్తం చూసి తన కుమార్తె విశ్వరూపను అతనికిచ్చి వివాహం చేసి, వీరాను తన వద్ద సహాయకునిగా నియమించుకున్నాడు. నీతి: ఒకరిపై ఆధారపడకుండా... తన సొంత తెలివితేటలను, కృషిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ విజయమే లభిస్తుంది. - కృష్ణకార్తీక -
నేల విడిచి సాగు
పూలు పూసే మొక్కలంటే అందరికీ ఇష్టమే. ఉదయం లేవగానే బాల్కనీలో ఉన్న గులాబీ మొక్కకు ఓ పువ్వు కనిపిస్తే... ఓ ఆనందం. టై పైకి పాకిన మల్లెతీగను చూస్తే ఓ సంతోషం. అయితే మక్కువతో మొక్కలు పెంచాలనుకున్న వారికి మెట్రో సిటీలో స్థలాభావం ప్రధాన ఇబ్బంది. అపార్ట్మెంట్లలో మట్టి లభించడం మరో సవుస్య. అనువుగాని చోట మొక్కలెందుకని హోమ్ గార్డెనింగ్‌కు దూరమవుతున్న వారికి ‘పాటింగ్ మిక్స్’ వరంగా మారింది. దీనివల్ల వుట్టి లేకుండానే ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకునే అవకాశం కలుగుతుంది. విరబూసిన పూలతో ఉన్న మొక్కలను ఎంత సేపరుునా చూస్తూ ఉండిపోవచ్చు. పల్లెవాసికి ఇవి పాత అందాలే అరుునా, మెట్రో నగరాల్లో.. అందునా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లలో ఉంటున్న వారికి వూత్రం ఆ భాగ్యం లేకుండా పోతోంది. ప్రకృతి అందాలకు చోటు ఇవ్వలేక.. పూబాలల సోయుగాన్ని మిస్ అవుతున్నారు. ఇరుకుగా ఉన్న బాల్కనీనే చిన్నపాటి ఉద్యానంగా వూర్చుకునే వారూ ఉన్నారు. అరుుతే వుట్టి కుండీలను మెరుుంటేన్ చేయులేక.. మొక్కల పెంపకానికి దూరం అవుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ‘మహాగ్రో’ అనే కంపెనీ తయారు చేసిందే పాటింగ్ మిక్స్. మట్టి లేకుండా మొక్కలను పెంచే ఈ మిక్స్ ఎందరినో ఆకర్షిస్తోంది. డిమాండ్ ఎందుకంటే... తక్కువ స్థలం ఉండే అపార్ట్మెంట్లలో మట్టితో పని లేకుండా పాటింగ్ మిక్స్‌తో మొక్కలు పెంచవచ్చు. మార్బుల్, ఖరీదైన ఫ్లోరింగ్‌పై ఎలాంటి మరకలు పడకపోవడంతో ఈ మిక్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మట్టితో పోలిస్తే ఇది ఐదు రెట్లు తేలికగా కూడా ఉంటుంది. దీంతో కుండీలను ఒక చోటు నుంచి మరో చోటికి తరలించడం సులభమవుతుంది. అందుకే పాటింగ్‌మిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇక్రిశాట్లో జొన్నపంట కోసం పాంటింగ్ మిక్స్‌నే వాడుతున్నారు. డీఆర్డీవో, మోన్శాంటో, నేషనల్ పోలీసు అకాడమీ, గౌతమ్ మోడల్ స్కూల్స్ కూడా ఈ మిక్స్‌నే వాడుతున్నాయి. ఈ సాగు చేయాలనుకునేవారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సురభి ఎన్‌క్లేవ్‌లోని మహాగ్రో హార్టిటెక్‌ను సంప్రదించవచ్చు. ఏమిటీ పాటింగ్ మిక్స్! కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్ (మొక్కల వేళ్లకు గాలి బాగా అందేలా చేస్తుంది) మిశ్రమమే ఈ పాట్ మిక్స్. వారానికి ఒకసారి నీళ్లు పోస్తే చాలు. మొక్కలకు తెగుళ్లు వచ్చే అవకాశాలూ చాలా తక్కువ. ఎరువుల అవసరం కూడా ఉండదు. ఏడాదిన్నర తర్వాత మొక్క కుండీ పరిమితిని దాటి పెరుగుతుంది. అప్పుడు దానిని వేరే దానిలోకి మార్చుకుంటే సరిపోతుంది. అందరీ సమస్య అనుకున్నాం... మాది బందరు. మా అమ్మ గిరిజ లక్ష్మికి మొక్కలంటే ప్రాణం. హైదరాబాద్ వచ్చాక అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. చిన్న బాల్కనీలో, మా అమ్మ మట్టి కుండీలు తెప్పించి మొక్కలు పెట్టింది. వాటికి నీళ్లు పోస్తే ఇల్లంతా బురదే! పైగా నీళ్లు కింది ఇంటి బాల్కనీలోకి వెళ్తే వాళ్లతో తగాదా. నాలుగు రోజులు ఊరికి వెళ్తే మొక్కలన్నీ తోటకూర కాడల్లా వాడిపోయేవి. అపార్ట్మెంట్లలో ఉండే ప్రతి ఒక్కరిదీ ఇదే సమస్య అని భావించిన మా అమ్మ.. దీని పరిష్కారం ఆలోచించింది. అదే పాటింగ్ మిక్స్ తయారీకి కారణమైంది. కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్ వివిధ పాళ్లలో కలిపి వాటితో మొక్కలు పెంచాం. మొదట్లో లోపాలు కనిపించాయి. నిపుణుల సలహాలు తీసుకున్నాం. 170 ప్రయోగాల తర్వాత మా ప్రయత్నం ఫలించింది. 2012లో పాటింగ్ మిక్స్‌కు అంకురార్పణ జరిగింది. దీన్ని ల్యాబ్ టెస్ట్‌కి పంపిస్తే.., మొక్కల పెంపకానికి ఉపయోగపడే పాట్ మిక్సింగ్‌గా గుర్తించారు. అనతి కాలంలోనే మా మిక్స్‌కు మంచి ఆదరణ లభించింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. అమ్మ ఇప్పటికీ అమెరికాకు వెళ్లి మొక్కల పెంపకం సులభతరం చేయడంపై అధ్యయనం చేస్తోంది. మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నా. - మహాగ్రో సీఈవో కృష్ణకార్తీక్ - వాంకె శ్రీనివాస్