Krishna River anagement Board
-
కృష్ణా బోర్డులో అంత జీతాలా?.. కేంద్రం ఆగ్రహం
కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 25శాతం అధికంగా చెల్లిస్తుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అధిక వేతనం చెల్లింపులను నిలుపుదల చేయాలని, ఇప్పటిదాకా అదనంగా చెల్లించిన వేతనాలను తిరిగి వసూలు చేయాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవి కేంద్ర పాలన పరిధిలోనే.. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖలోని అంతర్రాష్ట విభాగం ఇంజనీర్లకు మూలవేతనంపై 25శాతం అధికంగా చెల్లిస్తుండగా, సమానంగా తమ ఉద్యోగులకు సైతం 25శాతం మూలవేతనాన్ని అధికంగా చెల్లించాలని 2020 అక్టోబర్ 20న కృష్ణా బోర్డు తీర్మానం చేసింది. దాదాపు రెండేళ్ల నుంచి అధిక వేతనాలు చెల్లిస్తూ వస్తోంది. గోదావరి బోర్డు సైతం తమ ఉద్యోగులకు ఇదే తరహాలో అధిక వేతనాలను చెల్లిస్తామని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపగా, ఈ విషయం కేంద్రం దృష్టికి వచ్చింది. అధిక వేతనాలను నిలిపేయాలని 2021 జూలైలో కృష్ణా బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం లేదని కృష్ణా బోర్డు కేంద్రానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(3)ను ప్రయోగిస్తూ తక్షణమే అధిక వేతనాల చెల్లింపులను నిలుపుదల చేయాలని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డును ఆదేశించింది. -
కృష్ణా బోర్డు సమావేశం 30కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఈనెల 24న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్టు సమావేశం 30వ తేదీకి వాయిదా పడింది. బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్ చేస్తున్న క్షేత్రస్థాయి పర్యటనలు ముగియకపోవడం, సీలేరు విద్యుత్‌పై సదరల్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ఇంకా నివేదిక అందకపోవడం తదితర కారణాలరీత్యా ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఎంఎస్ అగర్వాల్ మంగళవారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. రేడియల్ క్రస్ట్ గేట్లు ఎక్కి దిగువ కృష్ణానదిని పరిశీలించారు. డ్యాం మీదుగా వెళ్లి లిప్టుద్వారా 390,420 గ్యాలరీలలోకి దిగి పరిశీలించారు.