Kulgam Encounter
-
జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. టెర్రరిస్టులు లష్కర్ ఎ తొయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. J-K: Five Lashkar terrorists gunned down in ongoing Kulgam encounter Read @ANI Story | https://t.co/6qRrP7HdiL#JammuAndKashmir #Kulgamencounter pic.twitter.com/X0hL5Dkcjg — ANI Digital (@ani_digital) November 17, 2023 జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కుల్గాంలోని దమ్హాల్ హంజి పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే ముందస్తు సమాచారంతో బలగాలు రెక్కీ నిర్వహించాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిదాడికి దిగిన బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. గత అక్టోబర్‌లోనే కుల్గాం జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇదీ చదవండి: యెమెన్‌లో కేరళ నర్సుకు నిరాశ.. మరణశిక్ష అప్పీల్‌ను తోసిపుచ్చిన కోర్టు -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. నలుగురు హతం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో మరోసారి తుపాకుల మోతమోగింది. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో నాలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లాలోని గుద్దర్ గ్రామ సమీప దేవ్సర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు కుల్గాం పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. దేవ్సర్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందటంతో భద్రత దళాలు, స్థానిక పోలీసులు వారి కోసం గాలించారు. ఈ క్రమంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నాలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో దక్షిణ కశ్మీర్లో ఇది నాలుగో ఎన్కౌంటర్ కావటం గమనార్హం. ఇక ఈ నాలుగు ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఏప్రిల్ మాసంలో చోటుచేసుకున్న అన్ని ఎన్కౌంటర్లలో 26 మంది మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తంగా 58 మంది ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. -
కుల్గమ్ ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
సాక్షి, కుల్గమ్: జమ్ము కశ్మీర్ సరిహద్దులో భద్రతా దళాలు మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. కుల్గమ్ ప్రాంతంలో గత అర్థరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద్రులను మట్టుపెట్టాయి. మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కుల్గమ్ జిల్లాలోని కుద్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్చన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగాయి. దీంతో ప్రతిదాడికి దిగిన సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపేసింది. మృతులు హిజ్బుల్ ముజాహిదీన్ చెందిన దావూద్ అహ్మద్ అలీ, షయియార్ అహ్మద్ వానీగా గుర్తించారు. అరెస్టయిన అరీఫ్ సోఫీ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు భద్రతా బలగాలు యత్నిస్తున్నాయి. ఉగ్రవాద శిబిరం నుంచి ఓ AK-47, ఐఎన్ఎస్ఏఎస్ తుపాకులను అధికారులు స్వాధీన పరుచుకున్నారు. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రమూక హతం
-
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రమూక హతం
జమ్మూకశ్మీర్‌లో చొరబడేందుకు మరోసారి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దీంతో కుల్గాం జిల్లాలోని యారిపుర-ఫ్రిజల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుడు కూడా ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందండంతో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. యారిపుర-ఫ్రిజల్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆపరేషన్ ప్రారంభించాయి. మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా గాయపడ్డారని, వారు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి. -
కుల్గాం ఎన్కౌంటర్లో లష్కరే చీఫ్ హతం
-
కుల్గాం ఎన్కౌంటర్లో లష్కరే చీఫ్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది అబూ ఖాసిం హతమయ్యాడు. గురువారం ఉదయం భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన ఖాసిం లష్కరే కమాండర్ అని సమాచారం. గతంలో జరిగిన ఉధంపూర్ కాల్పుల ఘటనకు అబూ ఖాసిం ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ చీఫ్‌గా ఖాసిం కొనసాగుతున్న విషయం విదితమే.