Kumbing operation
-
కమాండో రాకేశ్వర్ సురక్షితం
-
మావోయిస్టుల అదుపులోని కమాండో రాకేశ్వర్ సురక్షితం
ఛత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ ఘటనలో కనిపించకుండా పోయిన కోబ్రా బెటాలియన్ కమాండో రాకేశ్వర్‌సింగ్ మావోయిస్టుల అదుపులో సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. అయితే రాకేశ్వర్ విడుదలపై ఇప్పటి వరకు మావోయిస్టులు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు. మరోవైపు రాకేశ్వర్‌ను విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ‘అంకుల్.. ప్లీజ్.. మా నాన్నను విడిచిపెట్టండి’ అంటూ కమాండో రాకేశ్వర్‌సింగ్ కుమార్తె మావోయిస్టులను వేడుకున్న విషయం తెలిసిందే. తన తండ్రిని తల్చుకుని ఏడుస్తూ.. విడిచిపెట్టాలని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొత్తంగా జవాన్ రాకేశ్వర్‌సింగ్ క్షేమంగా బయటపడాలని ఇటు కుటుంబ సభ్యులు, అటు పోలీసులు, అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. జవాన్ల కోసం ముమ్మర గాలింపు బీజాపూర్ జిల్లాలోని తెర్రాం ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై శనివారం మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మావోల దాడితో అలర్ట్ అయిన జవాన్లు.. ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 22 మంది జవాన్లు మృతి చెందగా.. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మరికొంతమంది జవాన్లు అదృశ్యమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. అదృశ్యమైన జవాన్ల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యను తీవ్రతరం చేశాయి. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. మావోయిస్టుల కోసం భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సుక్మా, దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల అడవులను క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు. చదవండి: ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు: అమిత్ షా 'ప్లీజ్ అంకుల్.. మా నాన్నను విడిచిపెట్టండి' -
ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు: అమిత్ షా
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: బీజాపూర్ ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయికి వెళ్లి మావోయిస్టులను హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 23 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. బలగాల్లో ఆత్మ స్థైర్యం పెంచేందుకు అమిత్‌షా సోమవారం జగదల్పూర్, బీజాపూర్ జిల్లాల్లో పర్యటించారు. ఉదయం 10 గంటలకు జగదల్పూర్ వచ్చిన అమిత్‌షా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి 10.45 గంటలకు అమర జవాన్లకు నివాళులర్పించారు. 11.20 గంటలకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్, సీఆర్పీఎఫ్ డీజీ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బీజాపూర్ జిల్లా బాసగూడ సీఆర్పీఎఫ్ క్యాంపునకు వెళ్లి సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులతో మాట్లాడారు. రాయ్‌పూర్‌లో చికిత్స పొందుతున్న జవాన్లను సాయంత్రం 3.30 గంటలకు పరామర్శించారు. అనంతరం నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఘటనపై జగదల్పూర్లో కేంద్రహోంమంత్రి అమిత్ షాతో మాట్లాడుతూ మావోయిస్టులపై పోరులో జవాన్లు చూపిన ధైర్యసాహసాలు మరువలేనివని, వారి అమరత్వాన్ని దేశం ఎన్నటికీ మరవదని కొనియాడారు. ‘ఆపరేషన్ ప్రహార్–3’చేపట్టి మావోయిస్టులను సమూలంగా ఏరివేస్తామన్నారు. బలగాలను, బెటాలియన్లను మరింత పెంచి, పోరును ఉధృతం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మావోలపై ప్రతీకారం తీర్చుకుంటామని, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దండకారణ్య బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మాతోపాటు మరో ఎనిమిది మంది మావో యిస్టు పార్టీ అగ్రనేతలను మట్టుబెడతామన్నా రు. హోంమంత్రి ఏకంగా క్షేత్రస్థాయికి వచ్చి హెచ్చరిక చేయడంతో కేంద్రం ఈ ఘటనను ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలుస్తోంది. సరిహద్దు తెలంగాణలో మరింత కూంబింగ్.. గోదావరి పరీవాహక తెలంగాణ జిల్లాల్లో ప్రస్తు తం అలజడి నెలకొంది. బీజాపూర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు, యాక్షన్ టీముల కదలికలపై పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో గత జూలైలో కమిటీలు వేసుకున్న మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లు కూడా చేస్తోంది. మరోవైపు సింగరేణి కార్మిక సమాఖ్యను, రైతు విభాగాన్ని, జననాట్య మండలిని పునరుద్ధరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. వెనక్కి వెళ్లకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు బీజాపూర్, జగదల్పూర్ జిల్లాల్లో ఒకవైపు అమిత్‌షా పర్యటన సాగుతుండగానే మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరిట లేఖ విడుదల చేసింది. భారతదేశ దోపిడీ వర్గం రక్షణలో పనిచేసే భద్రతాదళాల్లో ఉద్యోగాలు చేయడం మానేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2020 నుంచి దోపిడీదారుల దాడులు తీవ్రమయ్యాయని, ఈ క్రమంలో దండకారణ్యంలో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుండటంతోపాటు అనేక త్యాగాలు చేస్తున్నారని అన్నారు. పీఎల్జీఏ నిరంతర పోరాటం చేస్తోందన్నారు. పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లు చేస్తుండడంతోపాటు ప్రజలను, మహిళలను హింసిస్తున్నారని ఆరోపించారు. కిసాన్ ఆందోళనలో 300 మంది రైతులు త్యాగాలు చేశారన్నారు. జై జవాన్–జై కిసాన్ అంటూ పాలకవర్గాలు ఇచ్చే నినాదం మోసపూరితమైనదని, గత 75 ఏళ్లలో ఇది నిరూపితమైందని పేర్కొన్నారు. విద్యార్థులు, రైతులు, కూలీలు, గిరిజనులు, నిరుద్యోగులు ఉద్యమించాలని లేఖలో కోరారు. ఈ నెల 26న భారత్‌బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. చదవండి: మా అధీనంలోనే కోబ్రా కమాండో -
తుపాకీ మిస్‌ఫైర్..తోటి ఉద్యోగుల చేయూత
సాక్షి, హైదరాబాద్ : తుపాకీ మిస్‌ఫైర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆర్ఎస్ఐ ఆదిత్య సాయి కుమార్ కుటుంబానికి తోటి ఉద్యోగులు ఆర్థిక సహాయం అందించారు. వివరాల ప్రకారం.. ఈనెల 16న ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా టీఎస్ఎస్పీ బెటాలియన్‌కు చెందిన ఆదిత్య సాయి చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో తోటి ఉద్యోగులు ఆదిత్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అందరూ కలిసి జమచేసిన 27,50,000 రూపాయల చెక్కును ఆదిత్య సాయి కటుంబానికి అందజేశారు. బెటాలియన్ అదనపు డిజిపి అభిలాష్ భిష్తి స్వయంగా చెక్కును అందించారు. కష్టకాలంలో ఆదిత్య కటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆదిత్య కటుంబానికి మరింత అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక కారుణ్య నియామకం కింద ఆదిత్య సోదరుడిని పోలీసు ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?) -
జల్లెడ పడుతున్న బలగాలు
- ఏజెన్సీలో మావో అగ్రనేతలు చలపతి, రవి - వరుసగా రెండు రోజులు ఎదురు కాల్పులు - పక్కా సమాచారంతో కదులుతున్న పోలీసులు సాక్షి,విశాఖపట్నం: మావోయిస్టు అగ్రనేతలు లక్ష్యంగా మన్యంలో పోలీసు బలగాలు ఉధృతంగా కూంబింగ్ జరుపుతున్నాయి. వరుసగా రెండు రోజులు దళసభ్యులు, గ్రేహౌండ్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కేంద్రకమిటీ సభ్యుల కదలికలపై పక్కా సమాచారంతో పోలీసులు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ప్రత్యేక బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమ కమిటీల ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలల విరామం తర్వాత మన్యం మరోసారి వేడెక్కింది. ఇటీవల మావోయిస్టుల ఉద్యమానికి ఎదురు దెబ్బలు, బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం యత్నాలతో మన్యంలోకి మావోయిస్టు అగ్రనేతలు అడుగుపెట్టారు. గ్రామాల్లో సభల ద్వారా బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పక్కాసమాచారంతో ప్రత్యేక బలగాలు మన్యాన్ని చుట్టుముట్టాయి. బ్యాంకుల వద్ద, సంతల్లో డేగ కళ్లతో పరిశీలిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని రహస్యంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వారిచ్చే సమాచారంతో దళసభ్యులకు అతి సమీపంగా పోలీసు బలగాలు వెళుతున్నాయి. ఇందులో భాగంగానే ఇరువర్గాలకు మధ్య బుధ, గురు వారాల్లో ఎరుదు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు చెబుతున్నారు. అగ్ర నేతలే లక్ష్యం? ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్చార్జ్ చలపతి, మావోయిస్టు మొదటి కేంద్ర ప్రాంతీయ (సీఆర్సీ) కమాండర్ కుడుముల వెంకట్రావు అలియాస్ రవి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబళ్లకేశవరావు అలియాస్ గంగన్నలతో పాటు దళం ముఖ్య సభ్యులు సరిత, ఆజాద్, ఆనంద్‌లు మన్యంలో సంచరిస్తున్నట్లు పోలీసులు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎలాగైనా అగ్ర నేతలను పట్టుకోవడమో లేక మట్టుబెట్టడమో చేయాలని వ్యూహాత్మకంగా కూంబింగ్ చేపడుతున్నారు. బుధవారం కొయ్యూరు మండలం కునుకూరులో కాల్పుల అనంతరం దళసభ్యులు వెళ్లి ఉంటారనే అంచనాతో గురువారం ఆ దిశగా బలగాలను కదిలించారు. వారి వ్యూహం ఫలించి దళం ఆచూకీ లభించింది. ఆపై చకచకా కాల్పులు జరిగిపోయాయి. -
శేషాచలంలో కూంబింగ్
♦ ఫారెస్ట్, టాస్క్ఫోర్సు భద్రతా దళాల తనిఖీలు ♦ ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల కోసం వేట సాక్షి, తిరుమల : శేషాచలం అడవుల్లో కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈనెల 7వ తేదీన శేషాచల పరిధిలోని శ్రీవారిమెట్టు ప్రాంతంలో టాస్క్ఫోర్సు కాల్పుల్లో 20 మంది కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది కూలీలు తప్పించుకుని పారిపోయినట్టు టాస్క్ఫోర్సు దళాలు చెబుతున్నాయి. అంతకుముందే 2 వేల మంది దాకా ఎర్రచందనం చెట్లను నరికే కూలీలు శేషాచలం నలుమూలలా తిష్టవేసినట్టు టాస్క్ఫోర్సు, ఫారెస్ట్ విభాగాలకు సమాచారం ఉంది. ఈ మేరకు టాస్క్ఫోర్సు, అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా విడిపోయి తూర్పు కనుమల్లో భాగమైన చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని శేషాచలంతో పాటు సరిహద్దు జిల్లాలైన నెల్లూరు, కర్నూలు జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత చిత్తూరు రేంజ్, తిరుపతి రేంజ్, మామండూరు రేంజ్ పరిధిలో భారీగా ఎర్రకూలీలతో పాటు ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. కొందరు స్మగ్లర్లపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఎన్కౌంటర్ ఘటనతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కూంబింగ్‌లో రోజువారీగా పట్టుబడుతున్న కూలీలు, స్మగ్లర్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు చేరవేస్తూ వారి ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. శేషాచలంలో మరికొన్ని రోజులపాటు కూంబింగ్ నిర్వహించాలని రాజధాని నుంచి ఫారెస్ట్, టాస్క్ఫోర్సుకు ఆదేశాలందాయి. -
సరిహద్దుకు భారీగా బలగాలు
చర్ల : సత్యనారాయణపురంలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకున్న కాల్పుల ఘటనతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. సరిహద్దులోని అటవీప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. సోమ, మంగళవారాల్లో సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న గ్రేహౌండ్స్, డిస్ట్రిక్ట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. ఒక్కసారిగా భారీగా బలగాలు చేరుకోవడంతో సరిహద్దుల్లోని ఆదివాసీ గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. సత్యనారాయణపురం కాల్పుల ఘటనలో పాల్గొన్న మావోయిస్టులు, మిలిటెంట్లు, మిలీషియా సభ్యుల ఆచూకీ కోసం తీవ్రంగా బలగాలు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సరిహద్దు ప్రాంతాల్లోని ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినపల్లి, కుర్నపల్లి, ఎర్రబోరు, బోదనెల్లి, కురకట్‌పాడు, డోకుపాడు, తిప్పాపురం తదితర గ్రామాలలోని ఆదివాసీలను వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు ఆదివాసీలు సహకరించవద్దని, ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కల్గించే వారికి సహకరించి ఇబ్బందులు తెచ్చుకోవద్దంటూ ఆదివాసీలకు పోలీసులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివాసీ గ్రామాల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.