Kurney Prabhakar
-
సీఎం కేసీఆర్ సోషల్ ఇంజనీర్: కర్నె
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సోషల్ ఇంజనీర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. శనివారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ పోచంపాడు బహిరంగ సభకు భారీగా వచ్చిన ప్రజలను చూసి కాంగ్రెస్ నేతలు భయంతో ఇష్టమొచ్చి నట్టు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ఇంజ నీర్లా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని, ప్రాజెక్టుల రీడిజైన్కోసం ఇంజనీరుగానే పనిచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.కేసీఆర్‌కు తెలంగాణలో ప్రతీ అంశంపై సమగ్ర అవగాహన ఉందన్నారు. దక్షిణ తెలంగాణపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, ఫ్లోరోసిస్ పీడిత నల్లగొండ జిల్లాకు నీళ్లివ్వడం పాలమూరు కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. -
ఉత్తమ్‌వి చౌకబారు ఆరోపణలు: కర్నె
సాక్షి, హైదరాబాద్: పులిచింతల హైడల్ ప్రాజెక్టుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చౌకబారు ఆరోప ణలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన కొం దరు కాంగ్రెస్ రైతులను గాంధీభవన్‌కు తీసుకువచ్చి అన్నీ అసత్యాలే చెప్పించారన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు కింద 13 ముంపు గ్రామాల ప్రజలకు సరైన నష్ట పరిహారం ఇప్పిం చని ఉత్తమ్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.ముంపు పరిహారం విషయంలో నల్లగొండ జిల్లా రైతులకు ఉత్తమ్ అన్యాయం చేశారన్నారు. మాయ మాటలు చెప్పి తమ భూములు లాక్కున్నారని హుజూర్నగర్ రైతులు చెప్పారని కర్నె పేర్కొన్నారు. -
జైపాల్రెడ్డివి పగటి కలలే: కర్నె
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ 2019లో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పైనా జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 60 ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందన్నారు. కేసీఆర్ వచ్చి కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదని అనడం జైపాల్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేసీఆర్‌వి త్యాగాలు.. జైపాల్రెడ్డివి భోగాలు... తెలంగాణ కోసం 15 ఏళ్లు ప్రాణాలకు తెగించి పోరాడి రాష్ట్రం సాధించిన చరిత్ర సీఎం కేసీఆర్‌దని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. తెలంగాణలో లేకుండా ఎప్పుడూ ఢిల్లీలో కాలం గడిపే జైపాల్‌రెడ్డిది భోగాల చరిత్ర అని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రిగా ఒక్కరోజైనా తెలంగాణ గురించి పట్టించుకోలేదని, ఇప్పుడు అధికారం పోయిందనే బాధతో ప్రజలపై ప్రేమ నటిస్తున్నారని మండిపడ్డారు.