సాక్షి, హైదరాబాద్: పులిచింతల హైడల్ ప్రాజెక్టుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చౌకబారు ఆరోప ణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. హుజూర్‌నగర్ ప్రాంతానికి చెందిన కొం దరు కాంగ్రెస్ రైతులను గాంధీభవన్‌కు తీసుకువచ్చి అన్నీ అసత్యాలే చెప్పించారన్నారు.
గురువారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు కింద 13 ముంపు గ్రామాల ప్రజలకు సరైన నష్ట పరిహారం ఇప్పిం చని ఉత్తమ్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.ముంపు పరిహారం విషయంలో నల్లగొండ జిల్లా రైతులకు ఉత్తమ్ అన్యాయం చేశారన్నారు. మాయ మాటలు చెప్పి తమ భూములు లాక్కున్నారని హుజూర్‌నగర్ రైతులు చెప్పారని కర్నె పేర్కొన్నారు.