
జైపాల్‌రెడ్డివి పగటి కలలే: కర్నె
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ 2019లో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పైనా జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 60 ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందన్నారు. కేసీఆర్ వచ్చి కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదని అనడం జైపాల్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
కేసీఆర్‌వి త్యాగాలు.. జైపాల్‌రెడ్డివి భోగాలు...
తెలంగాణ కోసం 15 ఏళ్లు ప్రాణాలకు తెగించి పోరాడి రాష్ట్రం సాధించిన చరిత్ర సీఎం కేసీఆర్‌దని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. తెలంగాణలో లేకుండా ఎప్పుడూ ఢిల్లీలో కాలం గడిపే జైపాల్‌రెడ్డిది భోగాల చరిత్ర అని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రిగా ఒక్కరోజైనా తెలంగాణ గురించి పట్టించుకోలేదని, ఇప్పుడు అధికారం పోయిందనే బాధతో ప్రజలపై ప్రేమ నటిస్తున్నారని మండిపడ్డారు.