kurnol district
-
దమ్ముంటే కర్నూలు నుంచి పోటీ చెయ్!
కర్నూలు(రాజ్‌విహార్): జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్ అన్నారు. ఆదివారం కర్నూలు పాతబస్తీలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన పవన్‌కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదన్నారు. ఆయన ఉనికిని కాపాడుకునేందుకే పర్యటనలు చేస్తున్నారని, నిజంగా ప్రజాబలం ఉంటే కర్నూలులో పోటీ చేయాలన్నారు. గోదావరి జిల్లాల కంటే ఇక్కడ ఘోరంగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ పర్యటనలు చేస్తున్నారు తప్ప ప్రజా మేలు కోసం కాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీల్లో 95 శాతానికి పైగా అమలు చేశారని, అందులో అత్యధిక శాతం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు మేలు చేసేవి ఉన్నాయన్నారు. పవన్ ఒకవైపు బీజేపీతో కాపురం చేస్తూ.. మరోవైపు టీడీపీతో జత కట్టేందుకు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. కర్నూలుకు వచ్చిన ఆయన రైతుల గురంచి మాట్లాడడం కాదని.. గతంలో చంద్రబాబు కర్నూలుకు ఇచ్చిన హామీలపై మాట్లాడి ఉంటే ప్రజలు వినేందుకు బాగుండేదన్నారు. వాస్తవానికి రైతుల వ్యతిరేకి అయిన చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు అన్నదాతల మేలు కోరి మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. నటుడు పవన్ కల్యాణ్‌కు స్క్రిప్ట్ ఇచ్చి పంపించారని, ఆయన పర్యటనల్లో దానిని చదువుతూ బాబు మెప్పు పొందుతున్నారని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోరి తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచాయన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, రుణాల పంపిణీ, విత్తన సరఫరాతో పాటు ఎన్నో రకాల మేలు చేస్తున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా వైఎస్ఆర్సీపీని ఏమీ చేయలేరని అన్నారు. సమావేశంలో పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
బీకాం చదివి..దొంగగా మారి
కర్నూలు: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి 107.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకుని నేరానికి ఉపయోగించిన పల్సర్ వాహనాన్ని సీజ్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సీఐలు కంబగిరి రాముడు, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ తదితరులతో కలిసి డీఎస్పీ కేవీ మహేష్ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి దొంగల వివరాలు వెల్లడించారు. బీకాం చదివి..దొంగగా మారి: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ప్రధాన నిందితుడు మాచర్ల శ్రీకాంంత్ బీకాం కంప్యూటర్స్ చదువుకుని బట్టల వ్యాపారం చేసేవాడు. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బు పేకాట, క్రికెట్ బెట్టింగులో పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. జల్సాల కోసం ఇంటి దొంగతనానికి పాల్పడి మొదటిసారిగా ఆదోని సబ్ జైలుకు వెళ్లాడు. అప్పటికే తల్లి హత్య కేసులో అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న రెండవ నిందితుడు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన బోయ వీరేష్‌తో పరిచయం పెరిగింది. బెయిల్‌పై బయటికి వచ్చిన తరువాత ఇరువురు కలిసి భారీ దొంగతనాలు చేయడం ప్రారంభించారు. అంతకు ముందు వీరేష్ చిల్లర దొంగతనాలు చేసేవాడు. ఇద్దరూ కలిసి పగలు రెక్కి నిర్వహించి తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని రాత్రిపూట ఇళ్లల్లో చొరబడి అందినకాడికి మూటగట్టుకుని ఉడాయించేవారు. తాళాలు వేసిన ఇళ్లను దోచుకోవడంలో వీరు సిద్ధహస్తులు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించి విలాసవంతమైన జీవితం గడిపేవారు. పోలీసులకు చిక్కారు ఇలా: శ్రీకాంత్, వీరేష్‌పై ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్లో పలు దొంగతనాల కేసులతోపాటు సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి. దీంతో వారిపై అక్కడి పోలీసుల నిఘా పెరగడంతో కర్నూలులోని ముజఫర్ నగర్లో శ్రీకాంత్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా వీరేష్‌తో కలిసి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవారు. ఈ నెల 2వ తేదీన కర్నూలు బాలాజీ నగర్లో నివాసముంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమాని పాటిల్ హనుమంతరెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉంచిన లాకర్‌ను ఎత్తుకెళ్లి ముజఫర్ నగర్‌లోని ఇంట్లో దాచి ఉంచారు. లాకర్‌ను తెరవడానికి సాధ్యం కాక మరో దొంగ సాయం కోరారు. లాకర్‌ను గ్యాస్ కట్టర్‌తో తెరిస్తే వాటా ఇస్తామని ఆశ పెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు నిఘాపెట్టి కర్నూలు శివారు సుంకేసుల రోడ్డులోని వై–జంక్షన్(తిప్పమ్మ కొట్టాల) వద్ద ఉండగా పట్టుకున్నారు. విచారణలో మరికొన్ని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు బయట పడింది. నేరాల చిట్టా ఇదీ.. కర్నూలు 4వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని ఉద్యోగనగర్‌లో నివాసముంటున్న డాక్టర్ ప్రదీప్, సమీపంలో నివాసముంటున్న ఆనంద్ ఇళ్లల్లో జూలై 15వ తేదీన చోరీలకు పాల్పడ్డారు. అలాగే జనవరి 27వ తేదీన కోడుమూరులోని రాజశేఖర్ రెడ్డి ఇంట్లో 76 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండితో పాటు నగదును లూటీ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఆరు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తమ ప్రతిభను చూపి దొంగలను అరెస్ట్ చేయడమేగాక వారి వద్ద నుంచి భారీగా బంగారు నగలను రికవరీ చేసినందుకు ఏఎస్ఐలు కరీం, నబి, దేవరాజు, శ్రీనివాసులు, యల్లా శివుడు, తిక్కస్వామి తదితరులను డీఎస్పీ అభినందించారు. -
స్థలం ఒకరిది..రిజిస్ట్రేషన్ మరొకరిది
ఈ చిత్రంలో ఉన్న పెద్ద మనిషి పేరు కె.పుల్లయ్య. ఇతనిది వెల్దుర్తి మండలం ఎన్.వెంకటాపురం గ్రామం. ఇతను కర్నూలు సమీపంలోని 40వ జాతీయ రహదారి పక్కన వెంగన్న బావి వద్ద 98, 99, 116 సర్వే నంబర్లలో వేసిన వెంచర్లో 2000వ సంవత్సరంలో ప్లాట్ నంబర్ 99ఏ కొనుగోలు చేశాడు. ఏటా ఒకటి, రెండు సార్లు ప్లాటు వద్దకు వచ్చి చూసుకొని వెళ్లేవాడు. అయినా ఇటీవల తన ప్లాటు కర్నూలుకు చెందిన చిట్టిబాబు పేరుతో ఉందని తెలుసుకుని అతన్ని నిలదీశాడు. తాను కూడా కురువ మధు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశానని చిట్టిబాబు వివరణ ఇవ్వడంతో ఈసీ తీశాడు. అప్పటికే 15 మంది చేతులు మారిందని తెలుసుకొని నోరెళ్లబెట్టాడు. ‘నేనెవరికీ ప్లాటు విక్రయించకున్నా ఇలా ఎందుకు జరిగిందని రిజిస్ట్రేషన్ అధికారులను, వెంచర్ వేసిన వారిని అడిగినా వారు సమాధానం చెప్పడం లేదు’ అ బాధితుడు వాపోతున్నాడు. సాక్షి,కర్నూలు(సెంట్రల్): మన పొలమో, ప్లాటో, ఇల్లో ఎక్కడికి పోతుందిలే అనుకుంటే పొరపాటే. డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయని, భూములు, స్థలాలు మన కళ్లెదుటే ఉన్నాయనుకొని ఇంట్లో కూర్చుంటే అక్రమార్కులు బరి తెగించి కొత్త మోసాలతో మాయ చేసేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇతరుల పేరుతో సొంతం చేసుకుంటున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు రిజిస్ట్రేషన్ అధికారుల వ్యవహారంతో ఆస్తులు కోల్పోయి బాధితులు రోడ్డున పడుతున్నారు. పదే పదే రిజిస్ట్రేషన్.. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కొందరు మాఫియాగా ఏర్పడి భూములు, స్థలాలు, ఇళ్లను రాత్రికి రాత్రే ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వీరికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటున్నట్లు సమాచారం. ముందుగా భూమాయగాళ్లు ప్లాటు, స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా రిజిస్ట్రేషన్ అధికారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని తమ పేరుతో గానీ, తమకు తెలిసిన వారి పేర్లతో గానీ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఆ తరువాత అదే స్థలాన్ని పదే పదే రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ పోతారు. రిజిసే్ర్టషన్ సమయంలో స్థలం/పొలం/ఇంటి వద్దకు వెళ్లరు. మొదటి సారి ఆ ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్లు లింకు డాక్యుమెంట్ అడగకుండా మేనేజ్ చేస్తారు. తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించుకుంటూ పోతారు. ఈ ప్రక్రియలో ఎవరైనా ఆస్తిదారులు అప్రమత్తమైతే పంచాయితీకి రమ్మంటారు. ఏదో పొరపాటున జరిగి పోయిందని ఎంతో కొంత చెల్లిస్తే వెనక్కి ఇస్తామని, లేదంటే రిజిస్ట్రేషన్ చార్జీలను అయినా చెల్లించాలని కోరతారు. కె.పుల్లయ్య విషయంలోనూ ప్రస్తుతం అదే జరుగుతోంది. ‘సెటిల్ చేసుకుందామని పంచాయితీకి పిలుస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు’ అంటూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. వెయ్యికి పైగా కేసులు.. జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో డబుల్ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం, పదే పదే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటి కేసులు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. విష యం తెలుసుకున్న లబ్ధిదారులు కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఐదేళ్లలో దాదాపు 1,000కి పైగా కేసులు వచ్చాయి. వీటిపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తరువాత దానిని రద్దు చేసే అధికారం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో కేసులు కోర్టులకు ఎక్కుతున్నాయి. ఫలితంగా దీర్ఘకాలికంగా కొన్ని వందల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కొందరు ఫిర్యాదు దారులు పంచాయితీల ద్వారా కేసులను పరిష్కరించుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. -
వివాహేతర సంబంధం: తరచూ ఫోన్ బిజీ వస్తుండటంతో..
సాక్షి, కర్నూలు(ఎమ్మిగనూరురూరల్): నెల రోజుల క్రితం బంధువుల పెళ్లికి బయలుదేరి అదృశ్యమైన మహిళ కేసు మిస్టరీ వీడింది. అనుమానంతోనే ఆమె ప్రియుడు అంతమొందించినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఆదివారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసు స్టేషన్లో సీఐ బీఏ. మంజునాథ్ హత్య కేసు వివరాలను వివరించారు. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన హరిజన లక్ష్మికి ఆదోని చెందిన నాగరాజుతో 11 ఏళ్ల క్రితంవివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. నాగరాజు 9 ఏళ్ల క్రితం చనిపోవటంతో అప్పటి నుంచి పిల్లలతో లక్ష్మి పుట్టినింట్లో ఉంటోంది. అప్పుడప్పుడు ఆదోనికి వెళ్లివచ్చేది. ఇదే క్రమంలో ఆస్పరి మండలం బి. ఆగ్రహారం గ్రామానికి చెందిన అంద్రి దేవదాస్‌తో పరిచయం ఏర్పడింది. ఇతను ములుగుందం సచివాలయంలో లైన్‌మన్‌గా పని చేస్తున్నాడు. లక్ష్మితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కాగా కొన్ని నెలల నుంచి లక్ష్మిపై దేవదాస్ అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమె ఫోన్ బిజీ వస్తుండటంతో తనతోనే కాకుండా మరి కొందరితో పరిచయం ఉందని పలుమార్లు ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో లక్ష్మిని హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఆదోనిలో తన భర్త తరుపు బంధువుల పెళ్లికి వెళ్లిన లక్ష్మి తిరిగి రాలేదు. బంధువులను విచారించినా ఆచూకీ లేకపోవటంతో గోనెగండ్ల పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. హత్యకు గురైన లక్ష్మి (ఫైల్) చర్చికి వెళ్దామని తీసుకెళ్లి.. లక్ష్మిపై అనుమానం పెంచుకున్న అంద్రి దేవదాస్ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అంతమొందించాలని కుట్ర పన్నాడు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్ మేరీమాత చర్చికి వెళ్లివద్దామని, ఇక నుంచి ఇద్దరం బాగుందామని ఫోన్లో నమ్మించాడు. ఆ మాటలు నమ్మి జూన్ 7వ తేదీన లక్ష్మి అతనితో బైక్‌పై వెళ్లింది. పథకం ప్రకారం అంద్రి దేవదాస్ కసాపురం సమీపంలోని జీఎన్ఎస్ఎస్ కాల్వ దగ్గర పొలాల్లోకి తీసుకెళ్లాడు. తనను మోసం చేశావంటూ ఆవేశంతో లక్ష్మి గొంతు నులిమి చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకున్నారు. ఆ తర్వాత బైక్‌లో పెట్రోల్ తీసి మృతదేహంపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. లక్ష్మీ కుటుంబ సభ్యులు లైన్మెన్పై అనుమానం వ్యక్తం చేయటంతో కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ మేరకు లైన్మెన్ అంద్రి దేవదాస్‌ను శనివారం అదుపులో తీసుకొని విచారించగా తానే హత్యచేసినట్టు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేశారు. హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడ పుర్రె, ఎముకలు కనిపించాయి. నిందితుడి నుంచి బైక్, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. సమావేశంలో గోనెగండ్ల ఎస్ఐ సురేష్, రూరల్ ఎస్ఐ సునీల్‌కుమార్, రూరల్ ఏఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆట బంతి అనుకుని నాటు బాంబును..
కర్నూలు: జిల్లాలోని అవుకు మండలం చెన్నంపల్లెలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన నాటు బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన మాదిగ వరకుమార్(12) అనే విద్యార్థి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరకుమార్ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా, ఆట బంతిగా భావించి నాటు బాంబును చేతిలోకి తీసుకున్నాడు. అది ఒక్కసారిగా ఆ బాలుడి చేతిలోనే పేలిపోవడంతో వరకుమార్ రెండు చేతులు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా.. ఫ్యాక్షన్ గ్రామంలో నాటుబాంబు పేలడం, ఒక విద్యార్థి మృతి చెందడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, ఫ్యాక్షన్ జోన్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ సోమ్లానాయక్, బనగానపల్లె సీఐ సురేష్ కుమార్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి పోలీసు జాగిలాలు, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. నాటు బాంబు పేలుడు ఘటనపై భిన్న కోణాల్లో విచారణ చేపట్టామని, అనుమానితుల వివరాలను కూడా సేకరిస్తున్నామని బనగానపల్లె సీఐ సురేష్‌కుమార్ రెడ్డి తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం వివరాలను వెల్లడిస్తామన్నారు. చెన్నంపల్లె గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. -
వివాహేతర సంబంధం: భార్య ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం నంద్యాల పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.నంద్యాల టూటౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన గండ్ర పుల్లయ్య వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన కీర్తి (33)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ విద్యావంతులు కావటంతో పెళ్లి అనంతరం ఉద్యోగం కోసం నంద్యాల పట్టణానికి వచ్చి ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు. స్థానిక నాగార్జున ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పుల్లయ్య, గుడ్‌షెప్పర్డ్ స్కూల్లో టీచర్‌గా కీర్తి ఉద్యోగంలో చేరారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. సంతోషంగా సాగుతున్న వీరి సంసార జీవితంలో ఓ యువతి చిచ్చురేపింది. నాగార్జున కాలేజీలో చదువుకున్న సుభాషిణి ప్రస్తుతం నంద్యాల తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ క్లర్క్‌గా పనిచేస్తోంది. ఈ యువతి పుల్లయ్య స్టూడెంట్. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో పుల్లయ్య, కీర్తి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఏకంగా సుభాషిణిని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను కీర్తి సెల్‌కు పంపి వేధించేవారు.తమకు అడ్డుగా ఉన్నావంటూ సుభాషిణి తరచూ ఆమె ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టడం, మరోవైపు భర్త కూడా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో జీవితంపై విరక్తి చెందిన కీర్తి శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కీర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేస్తూ పుల్లయ్యకు దేహశుద్ధి చేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో భార్య సుభాషిణి కూడా ఇంటికి తాళం వేసి వెళ్లింది. కాగా తన కుమార్తె చావుకు అల్లుడు, అతని రెండో భార్య సుభాషిణే కారణమని మృతురాలి తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ కంబగిరిరాముడు తెలిపారు. -
పర్యాటకుల మదిలో చిరస్థాయిలో నిలిచేలా..
కర్నూలు/కొలిమిగుండ్ల: భారతీయ సంస్కృతిలో గుహలు దేవుళ్లకు నివాసమనే నమ్మకం ఉండటంతో అవి పవిత్ర స్థలాలుగా విరాజిల్లుతున్నాయి. సాధారణంగా గుహలు కొండచరియల్లో, అడువుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాని గుహల ప్రవేశ ద్వారం చేరే వరకు తెలియనంత సమతల ప్రదేశంగా, వ్యవసాయం చేసుకునే సాగు భూమి కింద సమాంతరంగా గుహలు ఏర్పడి ఉండటం ఓ అద్భుతం. అలాంటి అద్భుతాన్ని కనులారా వీక్షించాలంటే బెలుం గుహలను సందర్శించాల్సిందే. (ఇక్కడ చదవండి: భళా బెలుం) ప్రపంచంలోనే రెండొవదిగా.. భారత్‌లోనే పొడవైన అంతర్ భూభాగ గుహలుగా ఖ్యాతి పొందిన బెలుం ఆవరణలో భారీ స్థాయిలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పర్యాటకుల మదిలో చిరస్థాయిలో నిలిచేలా ‘రారండో వేడుక చూద్దామంటూ’ ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో బెలుం గుహల విశిష్టతలు, వేడుక ఏర్పాట్లపై ప్రత్యేక కథనం. సొరంగ మార్గాల్లో ఒకటిన్నర కిలోమీటరు పొడవున మట్టి దిబ్బలను తొలగించి నాపరాళ్లు పరచి నడకదారిని ఏర్పరిచారు, 150 విద్యుద్దీపాలతో గుహలో వెలుగులు ఏర్పాటు చేశారు. గుహలలోపలికి గాలిని పంపే బ్లోయర్లు ఏర్పాటు చేయడం విశేషం. 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల లోతు వరకు ఉన్న ఈ సొరంగాలు కొన్ని చోట్ల ఇరుకు, కొన్ని చోట్ల విశాలమైన గదులుగా ఉండటం, కొన్ని చోట్ల స్టాలక్ టైట్లు, స్టాలగ్మైట్లు అనబడే స్పటికాకృతులు ఏర్పడి ఉండటం విశేషం. ఈ కృత్రిమ శిలల ఆకృతిలను బట్టి కొన్ని ప్రదేశాలకు వేయిపడగలు, కోటిలింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం వంటి పేర్లు పెట్టారు. ఇవిగాక ధ్యాన మందిరం, మండలం కూడా ఉన్నాయి. ఈ గుహల చివరి వరకు పోతే పాతాళ గంగ అనే నీటి మడుగు, అక్కడే రాతిలో మలిచిన శివలింగం కూడ కనిపిస్తోంది. విద్యుద్దీప కాంతులతో ఈ సొరంగాలు సోయగాలను తిలకిస్తూ.. పయనిస్తూ ఉంటే మరో ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. గుహలలోపల ఏడాది పొడవున 33 డిగ్రీల స్థిరమైన ఉష్ణోగ్రత ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వెలుగులోకి వచ్చింది ఇలా... 1884లో హెచ్‌బీ పూటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా గుహలను గుర్తించారు. 1982, 1984 శీతాకాలాల్లో హెచ్డీ గేబర్ అనే జర్మన్ దేశస్తుడు తన సహచరులతో కలసి 3,225 మీటర్లు శోధించి ఒక పటాన్ని తయారు చేశారు. వీరికి స్థానికులు రిటైర్డ్ ఎస్పీ చలపతిరెడ్డి, పి.రామసుబ్బారెడ్డి సహకారం అందించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ పురాతత్వశాఖ వీటిని రక్షణ స్థలంగా ప్రకటించి కాపలాదారులను నియమించింది. 1999లో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ బెలుం గుహలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ అధీనంలోకి తీసుకొని అభివృద్ధి చేసింది. పురాతన కాలంలో గుహలను ప్రాచీన మానవులు నివాసంగా మార్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. క్రీ.పూ. 450 సంవత్సరాల నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు, ఒక రాతి కత్తి లభ్యం కావడం విశేషం. ఒకప్పుడు బిలంగా పిలువబడుతుండగా క్రమేణా బెలుం గుహలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి నెల 20 నుంచి 50 మంది వరకు విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఏటా విదేశీయులతో కలిపి 2 లక్షల మంది పర్యాటకులు బెలుం గుహల అద్భుతాలను చూసి మైమరిచిపోతారు. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ప్రపంచంలోనే బెలుం గుహలకు ప్రత్యేక స్థానం ఉందని జాయింట్ కలెక్టర్–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ అన్నారు.ప్రఖ్యాతి గాంచిన బెలుం గుహలు కర్నూలు జిల్లాలో ఉండడం అదృష్టమన్నారు. శని, ఆదివారాల్లో నిర్వహించే బెలుం ఉత్సవాలను సందర్భంగా శుక్రవారం కొండారెడ్డి బురుజు నుంచి కిడ్స్ వరల్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి బురుజు సమీపంలో ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచంలోనే భారత్‌కు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే బెలూం ఉత్సవాల్లో పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పర్యాటక రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన మనదేశంలో బెలూం గుహలు అద్భుతమైనవన్నారు. అనంతరం డీఆర్డీఏ పీడీ ఎంకేవీ శ్రీనివాసులు, పౌరసంబంధాల శాఖ డీడీ పి.తిమ్మప్ప బెలుం గుహల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, స్వ యం సహాయక సంఘాల మహిళలు, పాల్గొన్నారు. సర్వం సిద్ధం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెలుం ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. 8, 9వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేడుకలు కనువిందుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జేసీ రవిపట్టన్‌శెట్టి, జేసీ–2 ఖాజామోహిద్దీన్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి్ద సంస్థ డీవీఎం ఈశ్వరయ్య ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే పర్యాటకులను అలరించేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సందర్శకులకు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో 23 రకాల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖల ప్రగతిని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పశుసంవర్ధకశాఖ అధికారులు ఒంగోలు కోడెలు, మేలు జాతి విత్తనపు పొట్టేళ్లు, అరుదైన పుష్పాలతో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, డీఆర్డీఏ విద్యశాఖ తదితర శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. రాయలసీమ రుచుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఫుడ్ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. గ్రామీణ క్రీడల్లో భాగంగా కబడ్డీ, ఖోఖో, కర్రసాము, గుండు ఎత్తడం తదితర పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఉత్సవాలకు హజరయ్యే ప్రజలు పర్యాటకులను ఉర్రూతలూగించేందుకు పలువురు సెలబ్రిటీలు రానున్నారు. జిల్లాకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గొరువయ్యల నృత్యాలు, కోలాటం, శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, బీరప్పడోళ్లు తదితర వాటిని ప్రదర్శిస్తారు. సాయంత్రం 4.30 నుంచి సెలబ్రిటీల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. సింగర్ సింహ, అనుదీప్, గీతాభగత్ తదితరులు తమ పాటలతో అలరించనున్నారు. క్లాసికల్ డాన్స్‌లు, వెస్టర్న్ డాన్స్‌లు, లేజర్ షోలు తదితర ఎన్నో కార్యక్రమాలు అలరించనున్నాయి. తాగునీరు, టాయ్లెట్లు తదితర సౌకర్యాలు సిద్ధం చేశారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు, పది మంది ఎస్ఐలతో కలిపి మొత్తం 150 మందికి పైగానే పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. గుహలను తిలకించేందుకు రెండు రోజుల పాటు విద్యార్థులకు సాధారణ రోజుల్లో వసూలు చేసే టికెట్ ధరలో రాయితీ కల్పించనున్నారు. ఇలా చేరుకోవాలి.. కొలిమిగుండ్ల మండలం పరిధిలోని బెలుం గుహలు ఇటు బనగానపల్లె నుంచి 30 కి.మీ., అటు తాడిపత్రి నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. కర్నూలు నుంచి చేరుకోవాలంటే 110 కి.మీ., అనంతపురం నుంచి 80 కి.మీ., చెన్నై నుంచి 420 కి.మీ., బెంగళూరు నుంచి 280 కి.మీ., తిరుపతి నుంచి 275 కి.మీ. ప్రయాణించాల్సి ఉంది. కర్నూలు–తాడిపత్రి, విజయవాడ– బెంగళూరు, నంద్యాల, అవుకు( బనగానపల్లి మీదుగా) చేరుకోవచ్చు. కొలిమిగుండ్ల గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో ఉంటుంది. -
నారాయణా.. అనుమతి ఉందా!
కర్నూలు సిటీ: కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలను, అధికారుల సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నా బోర్డు అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇందుకు గాయత్రి ఏస్టేట్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తుండటమే నిదర్శనం. దీంతో పాటు లక్ష్మీనగర్‌లోని ఓ నూతన భవనంలోకి ఇటీవల కోచింగ్ తరగతులను మార్చారు. అలాగే ఈద్గా సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ కూడా తరగతులు నిర్వహిస్తోంది. మిగిలిన కార్పొరేట్ కాలేజీల్లో తరగతులతో పాటే పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు పట్టనట్ల వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. నామ మాత్రపు తనిఖీలు.. జిల్లాలో ఇంటర్మీడియట్ కాలేజీలు 266 ఉండగా వీటిలో 226 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో ప్రైవేటు కాలేజీలు 105, కార్పొరేట్ కాలేజీలు 18 ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లో కేవలం ఇంటర్మీడియట్ విద్య అందించాలి. పోటీ పరీక్షల తరగతులు నిర్వహించకూడదని, ప్రతి కాలేజీని తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడంలేదు. స్థానిక గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ క్లాస్‌లు నిర్వహిస్తున్నా యాజమాన్యానికి నోటీస్‌లు ఇవ్వలేదు. నీట్, జేఈఈ లాంగ్‌టర్మ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.70 వేల నుంచి లక్ష వరకు ఫీజులు వస్తున్నా ఆ విషయం తమ దృష్టికి రాలేందంటున్నారు. శ్రీచైతన్యలో తరగతులతో పాటే కోచింగ్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు నగరంలోని మరికొన్ని ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే తంతు జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. తనిఖీలు చేస్తున్నాం.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీలను తనిఖీ చేస్తున్నాం. కాలేజీల్లో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నట్లు తెలిసి తనిఖీ చేసి విద్యార్థులను అడిగితే లేదని చెబుతున్నారు. గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో కోచింగ్ ఇస్తున్నట్లు తెలియడంతో తనిఖీలు చేసి తరగతులు నిర్వహించకూడదని ఆదేశించాం. అయితే వారు మరో భవనంలోకి మార్చినట్లు తెలిసింది. కొన్ని కాలేజీల్లో తరగుతులతో పాటు కోచింగ్ క్లాస్‌లు ఇస్తున్న మాట వాస్తవమే. విషయం బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – సాలబాయి, ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ ►రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ గుప్పిట్లో పెట్టుకొని నిబంధలకు విరుద్ధంగా కాలేజీలను నిర్వహిస్తున్నారని, ఏ కాలేజీలో కూడా కోచింగ్ పేరుతో తరగతులు నిర్వహించకూడదని, బోర్డు అధికారులు తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ►ప్రభుత్వ గుర్తింపు ఉన్న కాలేజీ దగ్గర విద్యార్థుల ఫొటోలతో ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి కాలేజీలో కేవలం తరగతులు మాత్రమే నిర్వహించాలి. పోటీ పరీక్షలకు తరగతులు నిర్వహించకూడదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు తీరు మార్చుకోవాలి. అక్టోబర్ 22న ప్రైవేటు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ సాలబాయి సూచించారు. -
సచివాలయ పరీక్షలు.. క్షణం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, కర్నూలు: గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలకు ఒక్క క్షణం ఆలస్యమైనా అనుమతించబోమని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కె.ఫక్కీరప్ప, ట్రైనీ కలెక్టర్ విధేకరే, డీఆర్వో వెంకటేశంతో కలసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయం 10 నుంచి 12.30 గంటల మధ్య, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల మధ్య ప్రతీ రోజూ రెండు పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలో 881 గ్రామ, 300 వార్డు సచివాలయాల్లో 9,597 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసిందన్నారు. మొత్తం 19 రకాల పోస్టుల కోసం 2,01,886 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరందరికీ సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీవరకు 444 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాను 12 క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని, ఒక్కోదానికి ఒక్కో జిల్లా అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. మొత్తం 12,104 మంది సిబ్బందిని పరీక్షల నిర్వహణ కోసం నియమించినట్లు వివరించారు. 25 నుంచి హాల్ టిక్కెట్ల డౌన్లోడ్ అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ అర్ధరాత్రి నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. హాల్‌టిక్కెట్‌లో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి కలెక్టరేట్లో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేసి సరి చేసుకోవచ్చని సూచించారు. అలా కానిపక్షంలో తెల్ల కాగితంపై హాల్ టిక్కెట్లో ఉండే వివరాలు రాసుకొని మూడు ఫొటోలు తీసుకొని వాటిపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకొని తీసుకొని రావచ్చని సూచించారు. మొదటి రోజు పరీక్షకే అధిక సంఖ్యలో హాజరు.. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే పరీక్షల్లో మొదటి రోజు నిర్వహించే పరీక్షనే కీలకమని, ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 44 మండలాల్లో 444 కేంద్రాల్లో 1.15 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన పరీక్షలను కేవలం కర్నూలులో మాత్రమే నిర్వహిస్తామని, అయితే ఆయా పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు లేరన్నారు. మూడో తేదీ పరీక్షకు 18 వేలు, 4వ తేదీ పరీక్షకు 4,631 మంది, ఆరో తేదీ పరీక్షకు 1,574, ఏడో తేదీ పరీక్షకు 10,638 మంది, 8వ తేదీ పరీక్షకు21,856 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష పూర్తి అయిన తరువాత అభ్యర్థులకు కార్బన్‌తో కూడిన ఓఎంఆర్ సీటులో కార్బన్ పేపర్‌ను అభ్యర్థులకే ఇస్తారని తెలిపారు. పరీక్షలు ముగిసిన తరువాత జిల్లా వ్యాప్తంగా ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి అన్సర్ షీట్లు, ఓఎంఆర్ షీట్లను జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో ఉంచనున్నట్లు తెలిపారు. మూడంచెల భద్రత.. గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. అడిషినల్ ఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు డీఎస్పీలు, 44 మంది సీఐలు, 109 మంది ఎస్ఐలు, 1334 మంది పోలీసు కానిస్టేబుళ్లుతో కలసి మొత్తం 1500 మంది సిబ్బంది భద్రత సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. వీరంతా రూట్లతోపాటు పరీక్ష కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లు, వాహనాల తరలింపు విభాగాల్లో ఉంటారన్నారు. కర్నూలులో అభ్యర్థులకు రూట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆరు డెస్కులను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు వెళ్లడానికి ఆర్టీసీ తగిన బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దు... సచివాలయ ఉద్యోగాలను పూర్తిగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే భర్తీ చేస్తారని, ఇందులో ఎలాంటి మోసాలకు తావులేదని జిల్లా కలెక్టర్, ఎస్పీ అన్నారు. ఈ పోస్టులు ఇప్పిస్తామని కొందరు దళారులు రంగ ప్రవేశం చేసినట్లు తమకు సమాచారం వస్తోందని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎక్కడైనా దళారులు డబ్బులు డిమాండ్ చేసి పోస్టులు ఇప్పిస్తామని చెప్పితే కమాండ్ కంట్రోల్ రూమ్/ స్థానిక పోలీసు స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓలకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలపై ఉన్న సందేహాలకు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. నేరుగావచ్చి లేదా 08518–277305/9059477167 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాక rtfrkurnool@fmail.com మెయిల్ చేసినా కూడా సందేహాలను నివృత్తి చేస్తారని వివరించారు. -
కర్నూలులో పోలీసుల తనిఖీలు
-
కర్నూలు రేవ్ పార్టీలో ఘర్షణ
-
రేవ్ పార్టీ.. డ్యాన్లర్లతో ఏజెంట్ల ఘర్షణ
సాక్షి, కర్నూలు : దీపావళి సందర్భంగా నగరంలో ఏర్పాటుచేసిన రేవ్ పార్టీలో ఘర్షణ చోటుచేసుకుంది. ఓ ఫర్టిలైజర్ కంపెనీకి చెందిన డీలర్లు కల్లూరులోని ఫంక్షన్హాల్లో రేవ్‌పార్టీ నిర్వహించారు. పార్టీలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారు. మద్యం మత్తులో ఏజెంట్లు డ్యానర్లతో ఘర్షణకు దిగారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ఆటో, బైక్ ఢీ... ఇద్దరి దుర్మరణం
బనగానపల్లి : కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. బేతంచర్ల మండలం గొర్లగుట్టకు చెందిన వెంకటస్వామి(45), మద్దులేటి రెడ్డి(40) బైక్‌పై బనగానపల్లికి వెళ్తున్నారు. తలుకూరు క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే వేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.