కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు.
బనగానపల్లి : కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. బేతంచర్ల మండలం గొర్లగుట్టకు చెందిన వెంకటస్వామి(45), మద్దులేటి రెడ్డి(40) బైక్‌పై బనగానపల్లికి వెళ్తున్నారు.
తలుకూరు క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే వేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.