labour charge
-
ఎకరాకు రూ. 6 వేలు
జోగిపేట (అందోల్): వానాకాలం సీజన్ ఊపందు కోవ డంతో వ్యవసాయ కూలీలకు డిమాండ్ బాగా పెరిగింది. గతంలో రూ.300, రూ.400కే రోజంతా పనిచేసే కూలీలు.. ఇప్పుడు ఏకంగా ఎకరాకు రూ.5 వేలు నుంచి రూ.6 వేలు డిమాండ్ చేస్తున్నారు. నాట్లు వేయడానికి కూలీలు కావాలంటూ రైతులు ఊరూరా తిరగడం.. నెల రోజుల ముందే బుకింగ్ చేసుకోవడం.. వారి కోసం వాహన సౌకర్యం ఏర్పాటు చేయ డం చూస్తుంటే ఏ మేరకు డిమాండ్ ఉందో ఇట్టే అర్థమవుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్లో 6,38,814 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 13,909 ఎకరాల్లో వరి పంటలు పండిస్తున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి. సకా లంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండ టంతో వ్యవసాయ పనులు ఊపందు కున్నాయి. ఫలితంగా కూలీల కొరత ఏర్పడింది. దీంతో రేటును ఒక్కసారిగా పెంచేశారు. ఎకరాకు రూ.5 నుంచి రూ.6 వేల చొప్పున గుత్తగా మాట్లాడుకుంటు న్నారు. కొన్ని చోట్ల అదనంగా పెట్టె కల్లును కూడా ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఐదు నుంచి ఎనిమిది మంది ఒక గ్రూపుగా ఏర్పడి కొన్ని గంటల్లోనే నాట్లు వేసి మరో చోటికి వెళ్తున్నారు. ఇలా ఒక్కో రోజు మూడు, నాలుగు చోట్లకు వెళ్లి నాట్లు వేస్తున్నారు. నెల రోజుల ముందే బుకింగ్ వరి నాట్ల కోసం రైతులు గ్రామాలకు వెళ్లి అడ్వాన్సుగా కొంత మొత్తం చెల్లించి కూలీలను బుకింగ్ చేసుకుంటున్నారు. మధ్యవర్తులు ఉండి కూలీలను మాట్లా డిస్తున్నారు. ఈ సమయంలో వారికి కూడా కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సదరు కూలీలు కావాలనుకున్న రైతు.. ఆటోలో తీసుకువెళ్లాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. కూలీల కోసం ఊరూరా తిరుగుతున్నా దొరడకం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ రంగానికి కూలీల కొరత తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. గుత్త పట్టుకుంటున్నాం రోజు లెక్క కాకుండా, గుత్త లెక్కన పట్టుకుంటున్నం. 5 నుంచి 8 మందిమి నాట్లు వేయడానికి చుట్టు పక్క గ్రామాలకు వెళ్తాం. ఆటో చార్జీలు వారే కట్టిస్తరు. ఎకరాకు రూ.5 నుంచి రూ.6వేల వరకు తీసుకుంటున్నాం. ఒక్కొక్కరికి ఒక సీసా కల్లు కూడా ఇస్తారు. – కాల్వ మీది లక్ష్మి, కూలీ, కన్సాన్పల్లి -
పనిచేసినా పైసలేవీ?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం(ఐహెచ్ఎస్ఎల్)లో పనిచేసిన కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా రూ.1.20 కోట్లు కూలీ డబ్బులు చెల్లించాలి. 2007 నుంచి ఇప్పటివరకు డబ్బుల చెల్లింపు సక్రమంగా జరగకపోవడంలో పనిచేసిన కూలీలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ స్మార్ట్ కార్డ్ ఏజెన్సీలు కూడా ముఖం చాటేస్తున్నాయి. జనవరి రెండో తేదీలోగా చెల్లింపులు జరపని ఏజెన్సీలపై కేసులు నమోదు చేయనున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ నిర్మాణ పనిలో పాల్గొనే లబ్ధిదారు లేదా కూలీలకు డబ్బులు చెల్లించాలనే నిబంధన విధించారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణ వ్యయం రూ.9,100 కాగా, ఇందులో కూలీలకు రూ.2,235 చెల్లించాల్సి వుంటుంది. పని చేసిన 15 రోజుల్లో కూలీలకు డబ్బులు చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. లేనిపక్షంలో కూలీలు అధికారులపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. అయితే జిల్లాలో 2007 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.1.20 కోట్ల మేర కూలీ డబ్బుల చెల్లింపు నిలిచిపోయింది. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీసం సమీక్ష జరిపిన నాథుడు కూడా లేకపోవడంతో ఏళ్ల తరబడి డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అనామతు ఖాతా(సస్పెండెడ్ అకౌంట్)లో ఉన్న డబ్బును కూలీలకు అందజేయాల్సిన ఈజీఎస్ అధికారులు సమస్య పరిష్కరించే దిశలో ప్రయత్నించిన దాఖలా లేదు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు జిల్లాలో ఫినో, జీరోమాస్, ఏపీ ఆన్లైన్ అనే స్మార్ట్కార్డ్ ఏజెన్సీల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. కూలీల వివరాలను బయోమాస్ పద్ధతిలో నమోదు చేసి, వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంది. జిల్లాలో ఏడు వేలకు పైగా కూలీలకు సంబంధించిన డబ్బులు ప్రస్తుతం అనామిక ఖాతాలో వున్నాయి. వీరిని బయోమాస్ పద్ధతిలో నమోదు చేయాల్సిన ఏజెన్సీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. వలసలు, మరణాలు తదితరాలను సాకుగా చూపుతూ ఏళ్ల తరబడి కూలీ డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కొరవడిన సమన్వయం ఈజీఎస్ అధికారులు, స్మార్ట్కార్డ్ ఏజెన్సీల నడుమ సమన్వయం కొర వడటంతో బయోమాస్ పద్ధతిలో వివరాలు నమోదు కావడం లేదు. జాయింట్ కలెక్టర్ శరత్ ఇటీవల జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీగా అదనపు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. సుమారు 3,400 కూలీల వివరాలు నమోదు చేసి ఖాతాలు తెరిచినట్లు స్మార్ట్కార్డ్ ఏజెన్సీలు లెక్కలు చూపుతున్నాయి. జనవరి రెండో తేదీ లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకంలో పనిచేసిన కూలీలకు డబ్బులు చెల్లించాల్సిందిగా జేసీ శరత్ గడువు విధించారు. ఏపీ ఆన్లైన్ మినహా జీరోమాస్, ఫినో ఏజెన్సీలు మాత్రం ఇంకా బయోమాస్ పద్ధతిలో వివరాల నమోదు కూడా పూర్తి చేయలేదని సమాచారం. క్రిమినల్ కేసులు: నిర్దేశిత గడువులోగా కూలీలకు డబ్బు చెల్లించని ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మండల స్థాయిలో లబ్ధిదారులను గుర్తించి తక్షణమే చెల్లింపులు పూర్తి చేయాలి. ఈ నెల 31న చెల్లింపులపై పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతాం. భవిష్యత్తులో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం కింద మంజూరయ్యే పనులకు తక్షణమే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. -జేసీ శరత్