lack of facilities
-
కోవిడ్ దెబ్బకు కుదేలవుతున్న చైనా! చికిత్స అందిచేందుకు కూడా..
జీరో కోవిడ్ పాలసీని ఎత్తేశాక ఘోరంగా కేసులు పెరిగిపోవడంతో పాటు అదేరీతిలో ఘెరంగా మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాలో పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒకపక్క వైద్యులు నిరంతరం సేవలు అందిచంలేకపోతుంటే, మరోవైపు ఔషధాల కొరతతో గందరగోళంగా ఉంది. ఇంకోవైపు రోగుల సంఖ్య నానాటికి పెరుగుతూ..ఆస్పత్రులన్ని కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి క్లినిక్ రోగులతో నిండి పోయి..ఆఖరికి వైద్యం ఆరుబయటే అందిచాల్సినంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో తూర్పు చైనాలో అత్యంత పేద ప్రావిన్సులలో ఒకటైన అన్హుయ్ పట్టణం కరోనాతో విలవిలలాడుతోంది. గత కొద్ది నెలల నుంచి పెరుగుతున్న కేసుల కారణంగా అధిక సంఖ్యలో వృద్ధులు ఆస్పత్రుల పాలయ్యారు. దీనికి తీడు ఔషధాల కొరతతోపాటు, కరోనాను నిర్థారించే కిట్లు సైతం వేగంగా అయిపోయాయి. అందువల్ల అక్కడ ప్రస్తుతం కరోనా టెస్ట్‌లు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు అధికారులు. దీంతో అక్కడ ఎంతమందికి కరోనా పాజిటివ్ అన్నది కూడా తెలియనంత ఘోరంగా ఉంది. ప్రభుత్వం లాక్డౌన్ చేసినప్పుడే పరిస్థితులు బాగున్నాయని అక్కడి ప్రజలు చెబుతుండటం గమనార్హం. ఆ ప్రావిన్స్‌కి సమీపంలోని పట్టణంలో ఉన్న హెల్త్ సెంటర్ అధికారి మాట్లాడుతూ..మందుల కోరత ఘోరంగా ఉందని, అందువల్లే ప్రిస్క్రిప్షన్లను కూడా నిలిపేశామని చెప్పారు. అలాగే ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోవడంతో మెట్ల వద్ద, ఆస్పత్రి వెలుపల వైద్యం అందిచాల్సి వస్తుందని అన్నారు. పైగా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్న వృద్ధులను నగరంలోని పెద్ద ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో రోగులంతా నిరాశ నిస్ప్రుహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదనగా చెప్పారు. అందువల్ల తాము వారిని ఉత్సాహపరిచేలా..."ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దు, బ్రతికేందుకు ప్రయత్నిద్దాం, మిమ్మల్ని మీరు రక్షించుకోండి" అనే నినాదంతో కూడిన బ్యానర్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంతవరకు అక్కడి గ్రామాల్లో కరోనా బారిన పడిన వృద్ధులు అసులు కోలుకోలేదని, కనీవినీ ఎరుగని రీతిలో అధిక సంఖ్యలో వృద్ధులే చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐతే చైనా ప్రభుత్వం కూడా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య బహిర్గతం చేయకుండా గట్టి ఆదేశాలు జారీ చేసింది. అలాగే అక్కడ ఉన్నవారెవరూ కూడా అధికారికంగా ఈ విషయాలు వెల్లడించడం కూడా నిషిద్ధమే. దీంతో అక్కడి ప్రజలు వాటి గురించి చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. (చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు..) -
బాల్యం బడికి దూరం
సాక్షి, బెంగళూరు: అన్నెం పున్నెం ఎరుగని బాల్యంపై కరోనా భూతం పంజా విసిరింది. పాఠశాలల్లో అక్షరాలు నేరుస్తూ, ఆడుకోవాల్సిన చిన్నారులు పొలాల్లో, కార్ఖానాల్లో, దుకాణాల్లో పనివాళ్లుగా మారిపోయారు. రోజంతా పనిచేస్తే వచ్చే కూలీ తమతో పాటు ఇంట్లో వారి ఆకలి తీరుస్తుందన్న ధ్యాసే తప్ప చదువుకోవాలన్న ఆశ వారికి దూరమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయినా.. విద్యార్థుల చేరికలు తక్కువగా ఉన్నాయి. కరోనా వల్ల గత రెండేళ్లుగా వేలాదిమంది బాలలు బడికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన బాలలు చదువు మానేసి ఏదో ఒక పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కుటుంబ పెద్దను కరోనా వైరస్ కబళించగా అనేక కుటుంబాలు దీనావస్థలోకి జారుకున్నాయి. ఫలితంగా మళ్లీ బడి ముఖం చూసే అదృష్టానికి వేలాది బాలలు నోచుకోలేకపోతున్నారు. ఈ సమస్య ఉత్తర కర్ణాటకలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 వేల మందిలో 35 శాతం మంది పిల్లల డ్రాపవుట్లపై ఎన్ఎఫ్హెచ్ఎస్ (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) చేపట్టిన అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది విద్యార్థులు తమకు చదువుపై ఆసక్తి లేదని చెప్పారట. 20 వేల మంది బాలురను సంప్రదించగా అందులో 35.7 శాతం మంది ఇదే మాట అన్నారు. బాధాకరమైన కారణాలు 21 వేల మంది బాలికలను ఈ ప్రశ్న అడగ్గా 21.4 శాతం మంది చదువు వద్దని చెప్పారు. బాధాకరమైన కారణాలు చదువుకునేందుకు పాఠశాలల్లో ఫీజులు చెల్లించేంత డబ్బు లేదు చదువుకు బదులు ఏదైనా పని చేసుకుంటే ఇల్లు గడుస్తుంది పాఠశాలలు దూర ప్రాంతాల్లో ఉండడంతో వెళ్లలేని పరిస్థితి బాలికలకు సరైన వసతులు లేకపోవడంతో చదువంటే అనాసక్తి ప్రభుత్వ బడుల్లో సరైన బోధన లేదు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు చెల్లించి చదవలేం (చదవండి: ‘నాకీ భార్య వద్దు’ .. మ్యాగీ వండిపెట్టిందని విడాకులిచ్చాడు) -
వరంగల్: గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన దుస్థితి
చారిత్రక, వారసత్వ సంపద, వైద్య, విద్య, సాంస్కృతిక రెండో రాజధాని.. ఘన కీర్తి కలిగిన ఓరుగల్లు స్మార్ట్‌సిటీలో చెబితే ఇంతేనా అనిపించినా వాస్తవంగా ఇదో పెద్ద సమస్య. ఆదేనండి కనీస సదుపాయమైన మూత్రశాలలు లేకపోవడం. మూత్ర విసర్జన కోసం పురుషులు రహదారుల వెంబడి అటు ఇటు తిరుగుతూ ఎక్కడ మరుగు దొరికితే అక్కడే కానిచ్చేస్తున్నారు. మహిళల పరిస్థితి దయనీయం. బయటికి వెళ్లిన వారు మరుగుదొడ్డి దొరికితేనో లేక తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన పరిస్థితి. – వరంగల్ అర్బన్ చాటు దొరికితే చాలు.... పురుషులు మూత్రశాలలు దొరకక గత్యంతరం లేక చాటు దొరికితే చాలు కళ్లు మూసుకొని కానిచ్చేస్తున్నారు. ఆ సమయంలో మహిళలు సిగ్గుతో తలవంచుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. నగరంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ చాలా వాటికి మరుగుదొడ్లు కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్ నిబంధనల ప్రకారం ప్రతి అంతస్తుకు సాముహిక మూత్రశాల ఉండాలి.. అలా ఉంటేనే అనుమతులు ఇస్తారు. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. రహదారుల్లో అక్కడక్కడ, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, కూరగాయల, పండ్ల, మార్కెట్లలో పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. పది లక్షల యాబై వేల జనాభా ఉండగా, నిత్యం చుట్టుపక్కల జిల్లాలనుంచి 2లక్షల పైచిలుకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మహా నగరంలో కనీస సదుపాయాలు కల్పించడంలో గ్రేటర్ వరంగల్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్‌లో భాగంగా వరంగల్ నగరం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. కానీ బహిరంగ మూత్ర విసర్జనను నివారించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బల్దియా బదిలీ కమిషనర్లు వీపీ గౌతమ్, పమేలా సత్పతిలు ప్రత్యేక చొరవ తీసుకొని నగరంలో ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఉండే విధంగా చేపట్టిన చర్యల్లో ఇప్పటివరకు 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో 888 మంది మరుగుదొడ్డి ఉపయోగించుకునేలా ప్రజా, కమ్యూనిటీ, లగ్జరీలు, కేఫ్‌లను నిర్మించారు. కొన్ని మరుగుదొడ్లలోనే మూత్రశాలలు నిర్మించారు. పబ్లిక్ టాయిలెట్లు ప్రజలు రద్దీగా ఉన్న రహదారుల్లో లేవు. స్థల లేమితో బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, అక్కడక్కడ రహదారుల్లో నిర్మించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, కాలనీల్లో, ప్రధాన రహదారుల్లో మూత్రశాలలు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మూత్రవిసర్జనకు డబ్బులు వసూలు మహా నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వాటిలో చాలామేరకు మూత్రశాలలు లేవు. పబ్లిక్ టాయిలెట్లలో మూత్రశాల ఉంటే ఉపయోగించినందుకు ఒక్కరినుంచి రూ.3 నుంచి 5 చొప్పన చొప్పన వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మూత్రశాల ఉపయోగించినందుకు డబ్బులు తీసుకోకూడదు. కానీ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహకులు అడ్డంగా బాదేస్తున్నారు. దీంతో ప్రజలు వాటిలోకి వేళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఎక్కడైనా ఖాళీ స్థలం, సందు దొరికితే చాలు బహిరంగంగా మూత్ర విసర్జన అనివార్యమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల కిందట ఆస్కీ ఆధ్వర్యంలో మూత్రశాలలపై ప్రణాళికలు రూపొందించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా పాలక వర్గం పెద్దలు, అధికారులు బహిరంగ మూత్ర విసర్జనపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి విరివిగా మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు.. -
బాలయ్యా.. రోగుల గోడు వినవయ్యా !
సాక్షి, హిందూపురం: ‘ప్రభుత్వాస్పత్రిని కార్పొరేట్ స్థాయిగా తీర్చిదిద్దుతాం. ఆస్పత్రిలో సకల సౌకర్యాలు కల్పిస్తాం. వైద్యులను పూర్తిస్థాయిలో నియమించడం ద్వారా రోగులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం.’ ఇదీ ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ఇచ్చిన హామీ. అయితే ఆస్పత్రి ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా సౌకర్యాల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక ఆస్పత్రి స్థాయి పెరిగినా అందుకు అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించలేదు. దీంతో రోగులు అసౌకర్యాల నడుమ అరొకర సేవలతో అల్లాడాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఏరోజూ అసెంబ్లీలో తన వాణిని వినిపించిన దాఖలాలు లేవు. రెండోసారి ఎమ్మెల్యే అయినా ప్రభుత్వాస్పత్రి సమస్య గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయినా ప్రభుత్వాసుపత్రిలో ఇంకా పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. వాస్తవంగా 250 పడకల ఆసుపత్రికి 146 వైద్యులు ఉండాలి. ప్రస్తుతం 31 మంది రెగ్యులర్ వైద్యులకు గాను కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. స్టాఫ్ నర్సులు 48 పోస్టులకు 9 మంది రెగ్యులర్‌గా ఉంటే 39 మంది కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. హెడ్‌నర్సులు 8 మందికిగాను నలుగురు మాత్రమే ఉన్నారు. ఇక ఆసుపత్రి వైద్య సేవల్లో కీలకంగా వ్యవహరించే క్లాస్ ఫ్లోర్ సిబ్బంది ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు 15 కావాల్సి ఉండగా ముగ్గురు రెగ్యులర్, ముగ్గురు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. రోగులతో ప్రభుత్వాస్పత్రి కిటకిట ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలతో అధికంగా ఆసుపత్రికి తరలివస్తున్నారు. వైరల్ ఫీవర్స్, డెంగీ లక్షణాలతో రోజూ వందల సంఖ్యలో చిన్నారులూ చికిత్స పొందుతున్నారు. దీంతో జనరల్ వార్డుల్లో మంచాలు దొరకని పరిస్థితి నెలకొంది. కొందరు మంచాలు లేక నెలపైనే పడుకుని చికిత్స చేయించుకుంటున్నారు. ఆస్పత్రిలో స్థలంలో లేక రోగులతోపాటు వారి వెంటవచ్చిన పర్యవేక్షులు వరండాల్లో పడుకుంటున్నారు. ఆసుపత్రి ఉదయం, సాయంత్రం రోగులతో కిక్కిరిసిపోతోంది. ఇక ఆస్పత్రిలో సౌకర్యాలు కొరవడడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కిటకిటలాడుతున్న ప్రయివేట్ ఆసుపత్రులు.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మంచాలు కూడా దొరకని పరిస్థితి నెలకోనడంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో ప్రయివేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రయివేట్ ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. రూ.వందలు ఇచ్చి టోకన్లు చేతపట్టుకుని ఆసుపత్రుల బయట రోగులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. చిన్నపాటి జర్వానికైనా ప్రయివేట్ వైద్యులు రక్త, మూత్ర పరీక్షలు దీనికి తోడు రూ.వందల మందులు, సిరప్లు ఇచ్చి ప్రజలు దోచుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జ్వరమొచ్చిందా రూ.వేయి ఖర్చు కావాల్సిందనే పరిస్థితి నెలకొన్నట్లు రోగులు వాపోతున్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి : హిందూపురం రోజు వారీ ఓపీ సంఖ్య :1200 ఇన్‌పేషెంట్స్ : 300 పడకలు : 250 మంచం లేదన్నారు రాత్రి నుంచి కడుపునొప్పితో అల్లాడిపోయాను. ఉదయానే ఆసుపత్రికి వస్తే డాక్టర్ వచ్చే వరకూ వేచి ఉండాలన్నారు. డాక్టర్ వచ్చి పరీక్షలు చేసి ఆడ్మిట్ కావాలని రాసి ఇచ్చారు. కేస్ షీట్ ఇచ్చిన అడ్మిషన్ చేర్చుకోవాలంటే మంచాలు లేవు కిందపడుకోవాలన్నారు. ఇప్పటికే కడుపునొప్పి తట్టుకోలేకపోతున్నా. కిందపడుకుంటే భరించలేనని ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లడానికి బయటకు వచ్చేశాను. – రామకృష్ణ, చీపులేటి ఆసుపత్రిలో సరైన వైద్యం లేదు జ్వరం, వాంతులతో ఆసుపత్రిలో చేరాను. రెండురోజులైంది. వాం తులు తగ్గాయి. జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మంచంపై పరుచుకోడానికి దుప్పట్లు కాని బెడ్షీట్లు కానీ లేవు. ఆసుపత్రిలో సిబ్బంది తక్కువగా ఉండటంతో ఉన్న వారు రోగులపై చిర్రుబుర్రులాడుతున్నారు. –మమత, పరిగి సీజనల్ వ్యాధులు ప్రబలడంతో సమస్య సీజనల్ వ్యాధులు అధికం అవుతుండటంతో మంచాల కొరత వస్తోంది. సాధారణ సమయంలో ఈ సమస్య ఉండదు. అయినా వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నాం. వైద్యసిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. వైద్యచికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదు. – డాక్టర్ కేశవులు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ -
మాకొద్దీ.. పుష్పుల్
సాక్షి, ఓదెల: భద్రాచలం రోడ్డు నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య నడిచే పుష్పుల్ రైలుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని సింగరేణి కార్మికుల సౌకర్యార్థం ప్రారంభించిన సింగరేణి రైలు బోగీలను మార్చి ప్రస్తుతం పుష్పుల్ రైలును నడపుతున్నారు. రెండునెలలుగా సింగరేణి రైలు బోగీలను మార్చి ఎలాంటి సౌకర్యాలు లేని పుష్‌పుల్‌ను ఏర్పాటు చేయటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. భద్రాచలం నుంచి సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌ల మధ్య అనేక మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. మూత్రశాలలు, మరగుదొడ్లులేని పుష్పుల్ బోగీలను ఏర్పాటు చేయటంతో రైలులో ప్రయాణించేవారు ఒంటికి రెంటికి వస్తే రైలు దిగాల్సివస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దారుణం. సింగరేణి రైలుకు బోగీలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు సులువుగా గమ్యం చేరేవారు. ప్రస్తుతం 12 బోగీలు మాత్రమే ఏర్పాటు చేయటంతో ప్రయాణికులు ప్రయాణం చేయలేకపోతున్నారు. ఒకవైపు మరుగుదొడ్ల లేమి, మరోవైపు బోగీలు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రయాణం చేయటానికి బెంబేలెత్తుతున్నారు. మాకొద్దీ రైలు.. ఓదెల, పెద్దపల్లి, పొత్కపల్లి, కొలనూర్, మంచిర్యాల, జమ్మికుంట రైల్వేస్టేషన్లలో ఎక్కే ప్రయాణికులు ‘మాకొద్దు ఈ పుష్పుల్ రైలు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దపల్లి, రాంగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలో సింగరేణి కార్మికులు సింగరేణి రైలును యధావిధిగా నడపాలని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. 50 ఏళ్లుగా నడస్తున్న సింగరేణి రైలును మార్చటం ఏంటని విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాత బోగీలతో సింగరేణి రైలును పునరుద్ధరించాలని ప్రయాణికులు కొరుతున్నారు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు. రెండునెలల నుంచి నడస్తున్న ఎలాంటి సౌకర్యాలు లేని పుష్‌పుల్‌ను రద్దు చేయాలని ప్రయాణికులు, సింగరేణి కార్మికులు కోరుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కావున ప్రజాప్రతినిధులు దృష్టిసారించి సింగరేణి రైలును పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. -
విద్యా‘వ్యాపారం’..!
సాక్షి, వత్సవాయి : విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తామని ప్రకటనలు గుప్పించి విద్యార్థులకు వల వేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో అంతా వ్యాపారమే సాగుతుంది. పుస్తకాల దగ్గర నుంచి విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువులను పాఠశాలల్లోనే ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. టెస్టు, నోట్ పుస్తకాల ధరలతో విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేతెత్తుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ సంబంధిత పాఠశాలల్లోనే పుస్తకాలు కొనాలని షరతులు పెట్టడంతో ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల వ్యాపారం జోరుగా సాగుతుంది. పాఠశాలల్లో చదివే విద్యార్థులు బహిరంగ మార్కెట్లో పుస్తకాలు కొనుగోలు చేయరాదని పాఠశాల యాజమాన్యం ఆదేశాలు జారీచేస్తున్నారని తల్లితండ్రులు చెబుతున్నారు. చేసిదిలేక రెట్టింపు రేట్లకే పాఠశాలల్లో పుస్తకాలు కొనుగోలు చేయవల్సివస్తుంది. పాఠ్య పుస్తకాల విక్రయాలకు పాఠశాలలు అడ్డాగా మారాయి. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న టెస్టు, నోట్ పుస్తకాలకు పాఠశాలల్లో విక్రయిస్తున్న వాటికి పొంతన ఉండడం లేదు. ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ శాతానికి పాఠశాలల్లో విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. నోట్ పుస్తకాలపై సంబంధిత పాఠశాల పేరు ఉంటుందని బహిరంగ మార్కెట్లో లభించే నోట్ పుస్తకాలను వినియోగించరాదని ఆంక్షలు విధిస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనే.. విద్యార్థులు వేసుకునే యూనిఫాం నుంచి టైలు, బెల్టులు, ఐడెండిటీ కార్డులు, టెస్టు, నోట్ పుస్తకాలు అన్ని పాఠశాలలోనే కొనాలని షరతులు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కొన్న యూనిఫాంను, పుస్తకాలను అనుమతించేదిలేదని పాఠశాల యాజమాన్యం తల్లితండ్రులకు చెబుతున్నారు. మరికొన్ని పాఠశాలల నిర్వాహకులు మార్కెట్లో తమకు అనుకూలంగా ఉన్న షాపులను సిఫారసు చేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు నోట్, టెస్టు పుస్తకాలు 2 వేల నుంచి 5 వేల వరకు ఖర్చువుతున్నాయి. ఇక ఫీజులు, యూనిఫాం, తదితరలు ఖర్చులు కళ్లు బైర్లు కమ్మేటట్లు ఉన్నాయి. పట్టించుకోని అధికారులు ప్రైవేటు పాఠశాలల్లో వసతులు లేకపోయినా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడంలేదు. పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులతోపాటు గాలి వెలుతురు సక్రమంగా వచ్చేటట్లు ఉండాలి. ప్యాన్లు, లైట్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఆహాద్లకరమైన క్రీడాప్రాంగణం వంటి వసతులు ఉండాలి. కానీ ఇటువంటి వసతులు ఎక్కడా కనపడడంలేదు. ఇరుకుగదులు, రేకులషెడ్లు, చిన్నపాటి భవనాల్లో నడుస్తున్నాయి. ఇక క్రీడాప్రాంగణం ఎక్కడ ఉంటుందో కూడా విద్యార్థులకు తెలియదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరుకుగదుల్లోనే ఉంటున్నారు. కానీ ఫీజులు విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడరు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకే సంవత్సరానికి రూ. 15 వేల వరకు ఖర్చు చేయవల్సివస్తుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలోను పేద విద్యార్థులకు 25 శాతం మేర సీట్లు కేటాయించాల్సి ఉండగా అది ఏ పాఠశాలలలోను కనపడడంలేదు. విద్యాశాఖాధికారులు సమగ్రం గా తనిఖీలు నిర్వహిస్తే చాలా పాఠశాలలలు మూ సివేయాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. -
'చెప్పు'కోలేని కష్టాలు
-
వైద్యం మిథ్య..!
► పీహెచ్‌సీల్లో ఖాళీల జాతర ► ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి.. ► ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్న రోగులు ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో పేదలకు సర్కార్ వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక.. వైద్యులు, సిబ్బంది కొరతతో నాణ్యమైన వైద్యం అందని దుస్థితి నెలకొంది. దీంతో రోగులు అప్పు చేసి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రాణాలు దక్కితే అదే పది వేలుగా భావిస్తూ సామాన్యులు ఉన్న ఆస్తులను అమ్ముకుని వైద్యం చేయించుకుంటున్నారు. ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. వైద్యుల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటిస్తున్నా నియామకాలు జరగకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెయ్యి జనాభాకు ఒక పడక ఉండాలి.. కానీ జిల్లాలో ఏ పీహెచ్‌సీలోనూ ఐదారు పడకలకు మించి లేవు. దీంతో వైద్యం కోసం వచ్చిన వారు వెనుదిరగాల్సి వస్తోంది. మైదాన ప్రాంతంలో 20 వేల జనాభాకు, ఏజెన్సీ ప్రాంతంలో 15 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి. కానీ ఏ మండలంలో కూడా జనాభా ప్రాతిపదికన పీహెచ్‌సీలు లేవు. దీంతో ప్రజా వైద్యం బహుదూరంగా మారింది. జిల్లాలో సర్కార్ వైద్యం తీరిదీ.. ఆదిలాబాద్ జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు, ముగ్గురేసి వైద్యులు ఉండాల్సి ఉండగా పలు చోట్ల ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 52 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు గాను ప్రస్తుతం 37 మంది మెడికల్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. వీరిలో 16 మంది మాత్రమే రెగ్యులర్ వైద్యులు ఉన్నారు. 21 మంది కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. 34 స్టాఫ్‌నర్సు పోస్టులకు గాను 26 మంది పని చేస్తుండగా, 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొదటి ఏఎన్ఎం పోస్టులు 139 ఉండాల్సి ఉండగా.. 110 మంది పనిచేస్తున్నారు. 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండ్ ఏఎన్ఎం పోస్టులు 129కి గాను 122 మంది పని చేస్తున్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులతోపాటు హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నీషియన్లు, హెచ్‌ఈవో, ఇతర పోస్టులు సగం కంటే ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. దీంతో ప్రజలు సర్కార్ వైద్యానికి నోచుకోవడం లేదు. పడకలు లేక ప్రైవేటుకు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పడకలు లేకపోవడంతో ప్రైవేటు వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. కనీసం రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పీహెచ్సీలలో ఐదారు పడకలు ఉండడంతో రోగులకు సరిపోవడం లేదు. ఆయా పీహెచ్‌సీల్లో 15 నుంచి 20 పడకలు ఉంటే రోగులకు వైద్య సేవలు అందుతాయని మెడికల్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కాగా రోగులు వెళ్లినప్పుడు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో జనం సర్కార్ వైద్యం పొందేందకు ఇష్టపడడం లేదు. పెరుగతున్న మాతాశిశు మరణాలు మాతాశిశు సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్పప్పటికీ జిల్లాలో ఫలితం కానరావడం లేదు. ఏడాదికేడాది మాతాశిశు మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రసవ సమయంలో మాతాశిశు మరణాలు లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ జిల్లాలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మాత శిశు మరణాలు సంభవించిన జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లా ముందు వరుసలో ఉండడం ఈ పరిస్థితికి అద్దంపడుతోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణలన్నట్లు జిల్లాలో మాతాశిశు మరణాలకు పౌష్టికాహార లోపం, మూఢనమ్మకాలు, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏజెన్సీలోనూ ఇదే తీరు.. ఏజెన్సీ ప్రాంతంలో ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ఉన్నాయి. ఈ పీహెచ్‌సీలోనూ వైద్య సేవలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు ఆర్ఎంపీ, పీ ఎంపీలు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో గిరిజనులు సైతం వారినే ఆశ్రయిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులకు వైద్యం అందడం లేదు. వ్యాధులపై అవగాహన కల్పించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గిరిజనులు రోగాల బారి న పడి వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. త్వరలో వైద్యుల పోస్టుల భర్తీ జిల్లాలో 16 మంది మెడికల్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ నెలలో పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ అయితే రోగులకు మరింతగా వైద్య సేవలు అందతాయి. ప్రస్తుతం ప్రతీ పీహెచ్‌సీకి ఒక వైద్యుడు ఉన్నారు. – డాక్టర్ తోడసం చందు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి -
పండుగ ఏర్పాట్లు నిష్ఫలం
కమిషనర్‌పై చర్యకు మంత్రి ఆదేశం జిల్లా కలెక్టర్, ఈఎండీతో మంత్రి సమీక్ష విధుల్లో అలసత్వం వహించిన ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ పండుగ తర్వాత మరింత మందిపై చర్యలకు అవకాశం సాక్షి ప్రతినిధి–ఽనెల్లూరు : రొట్టెల పండుగను బ్రహ్మాండంగా నిర్వహించి భేష్ అనిపించుకోవాలనుకున్న ప్రభుత్వం అంచనాలు తల్లకిందులయ్యాయి. మున్సిపల్ మంత్రి నారాయణ నెలరోజులుగా దీనిపై దృష్టిపెట్టినా చివరికొచ్చే సరికి ఏర్పాట్లు అసంతృప్తిని మిగిల్చాయి. దీనికి తోడు గత ఏడాదితో పోల్చితే భక్తుల సంఖ్య కూడా పలుచగా కనిపించడంతో మంత్రికి ఆగ్రహం రెట్టింపైంది. కార్పొరేషన్ కమిషనర్ మీద చర్యలకు ఆయన మున్సిపల్ పరిపాలన విభాగం డైరెక్టర్‌ను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రొట్టెల పండుగ సందర్భంగా ఈ సారి 15 లక్షల మంది భక్తులు హాజరు కావచ్చని అధికారులు అంచనా వేశారు. ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి నారాయణ ప్రయత్నించారు. మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులతో కూడా ఆయన సమీక్ష జరిపారు. పండుగ ప్రారంభానికి ముందు దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాట్లు ఎలా ఉండాలనే విషయం గురించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ నాటికి పనులన్నీ పూర్తి కావాలని మంత్రి ఆదేశించినా పండుగ ప్రారంభమైన 12వ తేదీ నాటికి కూడా కొన్ని పనులు మిగిలిపోయాయి. ఇక పారిశుద్ధ్యం విషయానికి వస్తే తొలిరోజు అపరిశుభ్రవాతావరణం కనిపించింది. కొత్తగా నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తమై భక్తులు ఇబ్బంది పడ్డారు. దర్గా, చెరువు ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. ఎండ వేడిమి తట్టుకోలేని భక్తులు సేద తీరడానికి సరైన షెడ్లు కూడా నిర్మించలేదు. రూ.కోటికి పైగా ఖర్చు చేసినా సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల మంత్రి నారాయణ అధికారులతో పాటు మేయర్ మీద కూడా అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారి నియామకం కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది వైఫల్యం మీద ఆగ్రహించిన మంత్రి నారాయణ గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన మూర్తిని రొట్టెల పండుగ ప్రత్యేకాధికారిగా నియమింప చేశారు. సూళ్లూరుపేట, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, గూడూరు మున్సిపల్ కమిషనర్లను ఇక్కడకు రప్పించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి 365 మంది పారిశుధ్య సిబ్బందిని రప్పించారు. గురువారం నాటికి మున్సిపల్ పరిపాలనా డైరెక్టర్ కన్నబాబును నెల్లూరు రప్పించారు. ఏర్పాట్లలో కార్పొరేషన్ వైఫల్యం వల్ల మహిళా భక్తులు పర్యాటక శాఖ కార్యాలయం ఆవరణలోని మూత్రశాలల వద్ద క్యూ కట్టిన తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే విషయం మంత్రి గ్రహించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, డీఎంఈ కన్నబాబుతో రొట్టెల పండుగ ఏర్పాట్ల గురించి సమావేశమయ్యారు. పండుగ ఏర్పాట్లను కమిషనర్ సీరియస్‌గా తీసుకోలేదని, మేయర్ కూడా సిబ్బందిని అదుపులో ఉంచుకుని వేగంగా పనులు జరిపించలేక పోయారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని డీఎంఈని ఆదేశించినట్లు తెలిసింది. మంత్రి ఆగ్రహం నేపథ్యంలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మీద శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా పండుగ ముగిసిన అనంతరం మరింత మంది మీద చర్యలు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
ఇంజనీరింగ్ కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
3 కళాశాలల్లో శుక్ర, శనివారాల్లో తనిఖీలు నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణపై టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు పెంచాలన్న యాజమాన్యాల డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 5 మంది సభ్యులతో కూడిన బృందం ఆయా కళాశాలల్లో మౌలిక వసతులపై తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపధ్యంలో బృందం గతనెల 29, 30 తేదీల్లో జిల్లాలోని మూడు ప్రధాన ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించింది. అకౌంట్స్, ఫ్యాకల్టీ, విద్యార్థుల సంఖ్య, ల్యాబ్‌ల నిర్వహణ, కంప్యూటర్స్ తదితర వాటిని పరిశీలించారు. ఆయా కళాశాలల్లో లోపాలను గుర్తించి, నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. దీంతో మిగిలిన కళాశాలల యాజమాన్యం ఆందోళన పడుతోంది. మౌలిక వసతులు అంతంత మాత్రమే: జిల్లాలోని ఒకటి రెండు కళాశాలలు తప్ప మిగిలిన కళాశాలల్లో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని కళాశాలలు ల్యాబ్‌ల కోసం పొరుగున ఉన్న చిత్తూరు జిల్లాలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలపై ఆధారపడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. బీటñ క్ పూర్తి చేసిన వారిని ఫ్యాకల్టీగా నియమించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కేవలం ఒక కళాశాలలో మాత్రమే 100శాతం సీట్లు భర్తీ అయ్యాయంటే కళాశాలల నిర్వహణ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఇంజినీరింగ్ కళాశాలలు, టాస్క్‌ఫోర్స్, వసతుల లేమి -
ఐదునెలలుగా కారిడార్లోనే పాఠాలు..
న్యూఢిల్లీ: నగరంలోని సోనియా విహార్ ప్రభుత్వ సెకండరీ పాఠశాల దుస్థితి మాటల్లో చెప్పేది కాదు. గత ఐదు నెలలుగా పాఠశాల కోసం కొత్త భవనాలను నిర్మిస్తుండగా కనీసం చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేయకుండా ఉంచడంతో పాఠశాల ఆవరణం మురికివాడలా మారిపోయింది. టాయిలెట్స్ కూడా నిర్మాణ దశలోనే ఉండటంతో పిల్లలు బహిరంగంగా మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు. దీంతో స్కూల్ ఆవరణ మొత్తం కంపు కొడుతోంది. పాఠశాలలో ఉన్న మొత్తం 150 మంది విద్యార్ధులకు చదువు చెప్పేందుకు వేరే సదుపాయాలు ఏమీ కల్పించకపోవడంతో కారిడార్లలోనే ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. చాలా కొద్ది ప్రాంతంలోనే 95 మందికి పైగా విద్యార్థులను చిన్న ప్రాంతంలో కూర్చొబెట్టి పాఠాలు బోధించడం ఇబ్బందికరంగా ఉంటోందని ఓ టీచర్ చెప్పారు. భవనాలు నిర్మాణంలో ఉండటంతో అక్కడి నుంచి వచ్చే శబ్దాల కారణంగా క్లాసులు సజావుగా సాగడం లేదని తెలిపారు. తరగతులు సజావుగా సాగేందుకు పాఠశాలలో గదులు లేనందున రోజు విడిచి రోజు క్లాసులను నడుపుతున్నట్లు చెప్పారు. గత గురువారం రోజు విడిచి రోజు నిర్వహిస్తున్న క్లాసులను నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనీ, సోనియా విహార్ కు ఆరు కిలో మీటర్ల విస్తీర్ణంలో మరో ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేదని తెలిపారు. కొత్త బిల్డింగ్ నిర్మాణం స్కూల్ కు ఉన్న ప్లే గ్రౌండ్ కూడా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో టీచర్ల కొరత కూడా అధికంగా ఉందని చెప్పారు. మొత్తం 45 రెగ్యులర్ టీచర్లు, 35 గెస్ట్ టీచర్లు పాఠశాలకు అందుబాటు ఉండాలని తెలిపారు. కానీ టీచర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో మధ్యాహ్నం 03.30 నిమిషాలకే పిల్లలందరూ రోడ్ల మీదకు వెళ్లిపోతున్నట్లు వివరించారు. దీంతో పాఠశాలకు పిల్లల్ని పంపాలంటే వారి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పారు. ఈ విషయంపై కొద్దిమంది తల్లిదండ్రులు హైకోర్టులో కేసు వేయగా.. కోర్టు ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణపనులు పూర్తయితే అన్నీ సర్దుకుంటాయని డీఈవో తెలిపారు. -
వెంటిలేటర్‌పై రుయా!
రుయా ఆస్పత్రిలో యంత్రాలకు జబ్బు చేసింది. అత్యవసర సేవలు అందడం లేదు. అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా, ఉపయోగించుకోలేని దీనస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే ఆస్పత్రిలో కోట్ల విలువైన పరికరాలు మూలన పడుతున్నాయి. వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి. ఇక్కడి వాతావరణం చూస్తే అసలు అత్యవసర విభాగం ఉన్నా లేనట్టుగా తయారైంది. తిరుపతి కార్పొరేషన్: ‘వైద్యోనారాయణ’గా పేరుగాంచిన రుయాలో విలువైన వైద్య పరికరాలు చూస్తే ఆసుపత్రికి జబ్బు చేసిందా అన్న సందేహం వస్తోంది. అత్యవసర విభాగంలో అడ్మిట్ అవుతున్న వారు, రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారు, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం వస్తున్న వారే అధిక భాగం ఉన్నారు. వీరికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు వెంటిలేటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఏఎంసీ విభాగంలో ఆర్ఐసీ(రెస్పిరేటరి ఇంటెన్సివ్ కేర్)లో రోగులకు వైద్య సేవలు అంది స్తారు. ప్రస్తుతం ఈ విభాగంలో దాదాపు 18 వెంటిలేటర్లు మూలన పడ్డాయి. కేవలం రెండు మాత్రమే సేవలందిస్తున్నాయి. అవికూడా తరచూ మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నమ్ముకుని డాక్టర్లు మెరుగైన సేవలు అందించలేక పోతున్నారు. రోగుల సహాయకులు బతిమిలాడితే వేలూరు సీఎంసీకి వెల్లండి అని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇక అత్యవసర విభాగంలోని ఎక్స్‌రే మిషన్ ఆరు నెలలుగా పనిచేయడం లేదు. యాక్సిడెంట్ కేసుల్లో వచ్చే వారికి ముందుగా ఎక్స్‌రే తీయడం వలన ప్రమాద స్థాయిని గుర్తించి తక్షణ వైద్య సహాయం అందించవచ్చు. ఎక్స్‌రే మిషన్ పనిచే యక పోవడంతో ఆసుపత్రి ప్రధాన భవనంలోని ఎక్స్‌రే భవనానికి తీసుకెళ్లాల్సి వస్తోంది. కాళ్లు, చేతులు విరిగిన వారు అంతదూరం వెళ్లాలంటే ప్రాణం మీదకొస్తోంది. గాలిలో దీపంలా ప్రాణాలు రూ.5 నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేసి వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకుంటున్న రుయా ఆసుపత్రికి వాటి నిర్వహణ భారంగా మారింది. మరమ్మతులకు గురైన వాటిని సరిచే సేందుకు సాంకేతిక నిపుణులు లేరు. రోజుల తరబడి పరికరాలు మూలనపడ్డంతో అత్యవసర సేవలకు వచ్చే వారి ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ప్రాణాప్రాయ స్థితిలో రోజూ పదుల సంఖ్యలో ఇక్కడికి వస్తుండ గా వెంటిలేటర్లు లేని కారణంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క అక్టోబర్ నెలలోనే 29 మంది అత్యవసర సేవల కోసం వస్తే వెంటి లేటర్ లేని కారణంగా 9 మంది మృత్యువాత పడ్డట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని ఆసుపత్రి వర్గాలు చర్చించుకుంటున్నాయి. రుయాలో వెంటిలేటర్లు లేక పోవడంతో రోగులను ఇక్కడి డాక్టర్లే దగ్గరుండి ప్రయివేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీంతో రోగి అవసరాన్ని బట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో గంటకు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లలేని పేదవారు వైద్యుల కాళ్లపై పడి ఎలాగైనా బతి కించమని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో వెంటలేటర్లు పనిచేయడం లేదని, సరే పంప్ ఏర్పాటు చేస్తాం, వాటిని మీరే చేతులతో పంపింగ్ చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ పద్ధతిలో చేయి ఒక్క క్షణం ఆగినా రోగి ప్రాణాలకే ప్రమాదం. ఇక ఆరోగ్యశ్రీ పేషేంట్ల పరిస్థితి మరీ దారుణం. వీరికి వైద్య సేవలు అందిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో వెంటిలేటర్లు పని చేయకున్నా, ముఖానికి పైపులు పెట్టి ఫొటోలు తీసుకుం టూ ‘షో’ చే స్తున్నారన్న విమర్శలు వినపిస్తున్నాయి. పనిచేయక పోవడం వాస్తవమే... అత్యవసర వార్డుల్లో వెంటిలేటర్లు పనిచేయక పోవడం వాస్తవమే. ఉన్నతాధికారులకు లెటరు రాశాం. ప్రభుత్వం ఐదు వెంటిలేటర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. వాటిని త్వరగా ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభిస్తాం. -డాక్టర్ వీరాస్వామి, సూపరింటెండెంట్, రుయా ఆసుపత్రి, తిరుపతి -
కరెంటు ఉండదు.. నీళ్లు రావు!
అమేథీ, రాయ్‌బరేలీ.. ఈ రెండు నియోజకవర్గాలు కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. ఉత్తరప్రదేశ్‌లో అధికారానికి దూరమైనా కూడా ఈ రెండు నియోజకవర్గాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటూనే ఉంది. గాంధీ కుటుంబ సభ్యులే నేరుగా ఈ రెండు లోక్‌సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో పెద్ద నాయకులు ఉన్నారని, తమకు అండదండలు ఉంటాయని ఇన్నాళ్ల నుంచి వాళ్లను గెలిపిస్తూనే ఉన్నారు. అయితే.. ఇందిరాగాంధీ లాంటి అగ్రనేతలు ప్రాతినిధ్యం వహించిన అమేథీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండాలి? అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన సదుపాయాలతో ఊరంటే ఇదీ అని అందరూ అనుకునేలా ఉండాలి. ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, రోజంతా కరెంటు, అన్ని ప్రాంతాలకు, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతిరోజూ మంచినీళ్లు, హేమమాలిని బుగ్గలంత నున్నగా రోడ్లు.. ఇవన్నీ ఉంటాయని ఊహిస్తాం, ఆశిస్తాం. కానీ అమేథీ పరిస్థితి వాస్తవంగా చూస్తే మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గ పరిధిలో ఎక్కడా సరైన నీటి సరఫరా అన్నది కూడా లేదు. రైతులకు కేవలం 3- 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నా, స్వయంగా పార్టీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఇక్కడ రోడ్లు కూడా ఏమంత గొప్పగా లేవు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, రాహుల్ గాంధీ తన ఎంపీ నిధులలో కేవలం 51 శాతాన్ని మాత్రమే వినియోగించారు. అభివృద్ధి పనులు చేయించడం కోసం కేటాయించిన నిధులనుకూడా పూర్తిగా ఖర్చుపెట్టకపోతే ఇక అక్కడి రోడ్లు, వంతెనలు, ఇతర సౌకర్యాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కదా!! ఇన్నాళ్లుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో ఇప్పుడు ముక్కోణపు పోరు ఉంది. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ రంగంలో ఉండగా, ఆయనకు తోడుగా సోదరి ప్రియాంక ప్రచారం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కుమార్ విశ్వాస్, బీజేపీ నుంచి నటి స్మృతి ఇరానీ ఇక్కడ బరిలో ఉన్నారు.