- 3 కళాశాలల్లో శుక్ర, శనివారాల్లో తనిఖీలు
ఇంజనీరింగ్ కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
Published Mon, Aug 1 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
నెల్లూరు (టౌన్):
జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణపై టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు పెంచాలన్న యాజమాన్యాల డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 5 మంది సభ్యులతో కూడిన బృందం ఆయా కళాశాలల్లో మౌలిక వసతులపై తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపధ్యంలో బృందం గతనెల 29, 30 తేదీల్లో జిల్లాలోని మూడు ప్రధాన ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించింది. అకౌంట్స్, ఫ్యాకల్టీ, విద్యార్థుల సంఖ్య, ల్యాబ్‌ల నిర్వహణ, కంప్యూటర్స్ తదితర వాటిని పరిశీలించారు. ఆయా కళాశాలల్లో లోపాలను గుర్తించి, నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. దీంతో మిగిలిన కళాశాలల యాజమాన్యం ఆందోళన పడుతోంది.
మౌలిక వసతులు అంతంత మాత్రమే:
జిల్లాలోని ఒకటి రెండు కళాశాలలు తప్ప మిగిలిన కళాశాలల్లో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని కళాశాలలు ల్యాబ్‌ల కోసం పొరుగున ఉన్న చిత్తూరు జిల్లాలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలపై ఆధారపడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. బీటñ క్ పూర్తి చేసిన వారిని ఫ్యాకల్టీగా నియమించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కేవలం ఒక కళాశాలలో మాత్రమే 100శాతం సీట్లు భర్తీ అయ్యాయంటే కళాశాలల నిర్వహణ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.
ఇంజినీరింగ్ కళాశాలలు, టాస్క్‌ఫోర్స్, వసతుల లేమి
Advertisement
Advertisement