
అక్రమ కాలేజీలపై కొరడా
నల్లగొండ/ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలపై అధికారులు దృష్టి సారించారు. దీనిలో భాగంగా పలు ఇంజనీరింగ్ కాలేజీలపై అధికారులు గురువారం కొరడా ఝుళిపించారు. నల్లగొండ జిల్లా కోదాలోని కీట్స్ ఇంజనీరింగ్ కాలేజీపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. కోట్లాది రూపాయల స్కాలర్ షిప్ లు స్వాహా చేసినట్టు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఖమ్మం జిల్లా పాల్వంచలో ఆడమ్స్ ఇంజినీరింగ్ కాలేజీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో కాలేజీలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
మరోవైపు జేఎన్టీయూ రిజిస్ట్రార్ రమణారావు ఫిర్యాదు మేరకు రంగారెడ్డి ఘట్ కేసర్ లోని పలు ఇంజినీరింగ్ కాలేజీలపై చీటింగ్ కేసు నమోదు చేశారు. సరైన సౌకర్యాలు, సిబ్బంది లేకుండా కాలేజీలు నడుపుతున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.