ladde worm
-
'ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతారు'.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..
అనంతపురం అగ్రికల్చర్: రెండు మూడు రోజులుగా వాట్రాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఫొటోలు, సందేశాలు నిరాధారమైనవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.మల్లీశ్వరి తెలిపారు. “పత్తి పంటలో ఒక పురుగు ఉంది. ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతున్నారు... జాగ్రత్తగా ఉండండి’ అంటూ అందరూ ఆందోళనకు గురయ్యేలా పురుగు ఫొటోలు, చనిపోయిన మనుషుల ఫొటోలు, ఆడియో సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ పూర్తీగా అవాస్తవమని పేర్కొన్నారు. అలాంటి పురుగు పత్తి పంటకు అసలు ఆశించదని, అది ఎక్కువగా చెరకు, పండ్ల తోటల్లో కనిపిస్తుందన్నారు. లద్దె పురుగు ఆకారంలో శరీరంపై వెంట్రుకలు కలిగి ఉంటుందన్నారు. వెంట్రుకల చివరి భాగంలో స్వల్ప విషపూరిత పదార్థం ఉంటుందన్నారు. ఒకవేళ ఆ పురుగు మనిషి శరీరాన్ని తాకినా కేవలం తగిలిన చోట దురద , లేదంటే చిన్నగా వాపు వస్తుందని, ఒకట్రెండు రోజుల్లో తగ్గిపోతుందని స్పష్టం చేశారు. రైతులు, ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. చదవండి: (AP: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ) -
‘మక్క లద్దెపురుగు’ నోట్లో మట్టి!
మిత్రపురుగులే రైతు సైన్యం. మిత్రపురుగులకు హాని చేసే రసాయనిక పురుగుమందుల కంటే.. ప్రకృతికి అనుగుణమైన పద్ధతుల్లోనే చీడపీడలను అరికట్టడం అన్నివిధాలా మేలు. మొక్కజొన్న మొక్క ఆకు సుడుల్లో పొలంలోని మట్టిని వేస్తే చాలు, నూటికి నూరు శాతం దీన్ని అరికట్టగలమని మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కేవీకే తెలిపింది. మట్టిని సుడుల్లో వేసిన తెల్లారి నుంచే పురుగు చురుకుదనాన్ని, ఆకలిని కోల్పోయింది. పంటకు నష్టం జరగటం ఆగిపోతుంది. నాలుగైదు రోజుల్లోనే పురుగు చనిపోయిందని కేవీకే అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి ‘సాగుబడి’కి వెల్లడించారు. మొక్కజొన్న రైతులు భయభ్రాంతులకు గురికావాల్సిన పని లేదని, రసాయనిక పురుగుమందుల ఖర్చు లేకుండానే రైతులు ఈ పురుగు బెడద నుంచి పంటను నిస్సందేహంగా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క లద్దెపురుగు తీరుతెన్నులు, నియంత్రణ మార్గాలపై ‘సాగుబడి’ ప్రత్యేక కథనం.. మక్క(మొక్కజొన్న) లద్దెపురుగు.. ఇటీవల కొత్తగా కనిపిస్తున్న విదేశీ జాతి విధ్వంసక లద్దెపురుగు ఇది. మొక్కజొన్న చేలల్లో లేత ఆకులను, మొవ్వు(ఆకు సుడు)లను, కండెలను ఆవురావురుమంటూ కరకరా నమిలేయడం, అత్యంత వేగంగా కొత్త ప్రాంతాలకు పాకటం దీనికున్న అత్యంత ప్రమాదకర లక్షణాలు. ఖరీఫ్ మొక్కజొన్న పంటను నమిలేస్తున్నది. మూడు నెలల్లోనే.. మన దేశంలో తొలిసారి కర్ణాటకలో మేలో కనిపించి కలకలం రేపింది. ఆగస్టు తొలివారంలో తెలుగురాష్ట్రాల్లో వర్షాభావ వాతావరణ పరిస్థితుల్లో బయటపడింది. ఖరీఫ్ మొక్కజొన్న సాగవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జిల్లాల్లో మక్క లద్దెపురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నట్లు రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆశించిన కొద్ది రోజుల్లోనే పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పురుగు కావడంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐ.సి.ఎ.ఆర్.) అప్రమత్తమైంది. తక్కువ ప్రమాదకరమైన రసాయనిక పురుగుమందులు వాడమని సూచిస్తోంది. ఏక పంటలకే ముప్పు ఎక్కువ! రెక్కల పురుగు రోజుకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని, ఆడ రెక్కల పురుగు వెయ్యి వరకూ గుడ్లు పెట్టడం ద్వారా సంతతిని వ్యాపింపజేస్తుందని ఎఫ్.ఎ.ఓ. తెలిపింది. పొలం అంతా ఒక మొక్కజొన్న పంట(మోనోకల్చర్)ను మాత్రమే సాగు చేసే పొలాలకే ఇతర చీడపీడల మాదిరిగా మక్క లద్దెపురుగు బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నతోపాటు (పప్పుధాన్యాలు, నూనెగింజ, చిరుధాన్యాల) ఇతర పంటలను కలిపి సాగు చేసే పొలాల్లో ఇది వేగంగా వ్యాప్తి చెందదని గుర్తించారు. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఏక పంటల సాగుకు ప్రసిద్ధి పొందిన అమెరికా ఖండంలోని కెనడా(దక్షిణ ప్రాంతం), చిలి, అర్జెంటీనా వంటి వివిధ దేశాల్లో కొన్ని ఏళ్ల నుంచి ఇది వివిధ పంటలను ఆశిస్తూ నష్టపరుస్తున్నది. రెండేళ్ల క్రితం ఆఫ్రికా ఖండంలోకి పాకి చాలా దేశాలను చుట్టుముట్టింది. ఈ పురుగు మొక్కజొన్నతోపాటు వరి, జొన్న, చెరకు, గోధుమ, పత్తి, కొన్ని రకాల కూరగాయలు సహా 80 రకాల పంటలను ఆశించి ఆహార భద్రతకు ముప్పు తెచ్చే ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. మక్క లద్దెపురుగు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో మొక్కజొన్న పొలాలను గుల్ల చేస్తున్నది. అయితే, రైతుకు ఖర్చులేని, సులువైన, ప్రకృతికి అనుగుణమైన మట్టితో పురుగు నిర్మూలన పద్ధతులు ఉన్నాయి. మొక్కజొన్న రైతులు ఈ పురుగుకు భయపడాల్సిన పని లేదు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో 5 రకాల పద్ధతుల్లో మక్క లద్దెపురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చని అనుభవపూర్వకంగా గుర్తించాం.. 1. మట్టి 100% అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది! మాది ఎర్రమట్టి పొలం. ఆ మట్టినే చేతితో తీసి లద్దెపురుగు ఉండే ఆకు సుడుల్లో వేశాం. మట్టి వేసిన తెల్లారికి మక్క లద్దెపురుగు ఆకులను తినటం, లద్దెలు(విసర్జితాలు) వేయటం ఆగిపోయింది. మూడో రోజుకు పురుగు నశించడం ప్రారంభమైంది. 4–5 రోజులకు పురుగు చనిపోయింది. వర్షం పడుతున్నందు వల్ల లొట్టపీచు కషాయాలు అంతగా పనిచేయలేదు. నేల మీద మట్టినే తీసి నేరుగా సుడుల్లో వేశాం. మట్టి పెళ్లలు సుడుల్లో వేసిన తర్వాత వర్షం కురవకపోతే, ఆ మట్టి పెళ్లలపై నీరు పిచికారీ చేశాం. దీన్ని బట్టి మాకు అర్థమైందేమిటంటే.. రైతు రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏ పురుగుమందూ పిచికారీ చేయకుండా.. మట్టిని తీసుకొని సుడిలో వేస్తే చాలు. పురుగు ఆకలి తగ్గి, కృశించి 4–5 రోజుల్లో చనిపోతుంది. 2. మట్టి వేయకుండా.. రాతి పొడిని సుడుల్లో చల్లాం. ఇది 98% ఫలితం కనిపించింది. 3. బొగ్గు పొడిని సుడుల్లో చల్లాం. పురుగును అరికట్టడంలో దీని ప్రభావం 90% ఉంది. 4. కర్ర బూడిద చల్లాం. 86% ప్రభావం ఉంది. 5. లొట్టపీచు కషాయం(లీ. నీటికి 100 ఎం.ఎల్. కషాయం) పిచికారీ చేశాం. వర్షం లేనప్పుడు దీని ప్రభావం 80% ఉంది. వీటన్నిటిలోకీ ఎర్రమట్టి అద్భుతమైన ప్రభావం చూపింది. నల్ల రేగడి లేదా బంకమన్ను ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించి చూడాల్సి ఉంది. మక్క లద్దెపురుగును ప్రకృతిసిద్ధంగా అదుపు చేసే బదనికలు మన వాతావరణంలో అభివృద్ధి చెందేవరకు కొన్ని సీజన్లు గడుస్తాయి. ఈ లోగా రసాయనిక పురుగుమందులు వాడితే మిత్రపురుగులు చనిపోయే ప్రమాదం ఉంది. మేము అనుసరించిన పద్ధతుల వల్ల గండు చీమలు, సాలెపురుగులు, తూనీగలు వంటి మిత్రపురుగులకు హాని కలగదు. కాబట్టి, ఈ మిత్రపురుగుల సహాయం తీసుకొని పదింతలు శక్తితో కొత్త పురుగుపై పోరాడే శక్తి మనకు చేకూరుతుంది. ప్రకృతి సహకారం మనకు తోడవుతుంది. మట్టి సుడుల్లో వేసి ఎదిగిన లద్దెపురుగులను మొక్కజొన్న రైతులంతా నాశనం చేయగలిగితే.. ఈ పురుగు సంతతి వృద్ధిని సమర్థవంతంగా అరికట్టవచ్చన్న గట్టి విశ్వాసం మాకుంది. ఇతర దేశాల్లో రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల దీని వ్యాప్తిని నిలువరించలేకపోయిన విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. – డా. జి. శ్యాంసుందర్ రెడ్డి (99082 24649), సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి, డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కేవీకే, తునికి, కౌడిపల్లి, మెదక్, తెలంగాణ–502316 వివరాలకు: శాస్త్రవేత్త నరేశ్ (9290615952) ‘కత్తెర పురుగు’ కాదు ‘మక్క లద్దెపురుగు’ అంతర్జాతీయంగా ఈ లద్దెపురుగు ఇంగ్లిష్ పేరు ‘ఫాల్ ఆర్మీవార్మ్’ (ఊఅఔఔ అఖM్గగిఅఖM టఞౌఛీౌp్ట్ఛట్చ జటuజజీp్ఛటఛ్చీ). మొక్కజొన్న పంట అందుబాటులో ఉంటే ఇది ఇతర పంటల జోలికి పోదు. అందుకే దీన్ని ‘మక్క (మొక్కజొన్న) లద్దెపురుగు’ అని మనం పిలుచుకోవచ్చు. పొగాకు లద్దెపురుగు, రాగి లద్దెపురుగుల మాదిరిగా తొలుత ఏ పంట మీద కొత్త పురుగు కనిపిస్తే.. ఆ పంట పేరుతో పిలవటం ఆనవాయితీ. అందువల్ల మొక్కజొన్నను ఆశిస్తున్న ‘ఫాల్ ఆర్మీవార్మ్’ ను కొందరు పిలుస్తున్నట్లుగా ‘కత్తెర పురుగు’ అనటం కన్నా.. ‘మక్క లద్దెపురుగు’ అని పిలవటమే సులువు అని అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుడిలో మట్టి వేసిన ఐదవ రోజుకు చనిపోయిన మక్క లద్దె పురుగు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
వరికి ఆకుముడత, లద్దెపురుగు
అనకాపల్లి: వరిపై పురుగు, తెగుళ్ల దాడి మొదలైంది. జిల్లాలో ఉన్న అధిక శాతం వరిలో భాగంగా సాంబమసూరి, ఆర్జీల్ 2537 రకాలపై ఆకుముడత, లద్దెపురుగు, గోదుమరంగు మచ్చ తెగులు విజృంభిస్తున్నాయి. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. జమున, డాక్టర్ ఎన్. రాజ్‌కుమార్‌లు బుధవారం అనకాపల్లి, మునగపాక మండలాల సరిహద్దుల్లోని వరి పొలాలను పరిశీలించి ఈ తెగుళ్లను గుర్తించారు. ప్రస్తుత వరి పొలాలు ఈనిక దశ నుంచి పాలు దశలో ఉన్నాయి. కాండం తొలుచు పురుగు యొక్క తల్లి రెక్కలు పురుగులు ఎక్కువుగా తిరగడం వల్ల వరికి నష్టం వాటిల్లితున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి గుడ్లు పెట్టి లార్వాలుగా మారిన వెంటనే వరి పంటపై తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ కారణంగానే తెల్ల కంకులు ఏర్పడుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గమనించి వాటి సంతతి వృద్ధి చెందకుండా ముందు జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనిక దశలో ఉన్న వరి పొలాల్లో ఆకుముడత, లద్దెపురుగు, గోదమ రంగు మచ్చ తెగుళ్లు ఆశిస్తున్నందువల్ల ఆకుముడత పురుగు ఆకులను ముడత చేసుకొని లోపల దాగి ఉండి ఆకుల పత్రహరితాన్ని గోకి తింటుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆకులు ఈ కారణంగా చారలు చారలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. లద్దె పురుగు వల్ల ఆకులు కత్తిరించబడడం, ఆకులు తినివేయడం తరువాత గింజగట్టి పడే దశలో వెన్నెలు కొరికి నష్టాన్ని కలుగు జేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు రకాల పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు, ఒక మిల్లీలీటరు నువాన్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. లద్దె పురుగులు దుబ్బుల అడుగున దాగి వుండడం వల్ల పొలం నీరు నిలబెట్టి పిచికారీ చేసినట్లయితే దాగి వున్న పురుగులు పైకి వచ్చి చనిపోతాయి. గోదమ మచ్చ తెగులు ఎక్కువుగా ఉన్నచోట లీటరు నీటికి ఒక గ్రాము కార్బన్డిజం కలిపి పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. ఇదిలావుండగా తుపాను నేపధ్యంలో ఎలుకలు వాటి సంతతిని ఎక్కువుగా చేసుకొని పాలు పోసుకున్న కంకులను కొరికివేయడం వల్ల ఎక్కువుగా నష్టం వాటిల్లుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు విషపు ఎరలను పెట్టాలని సూచించారు. 96 పాళ్ల బియ్యపు నూకను, రెండుపాళ్ల నూనె, రెండుపాళ్ల గ్రోమోర్ డయోలిన్ చొప్పున కలిపి విషపు ఎరను తయారు చేసినట్లయితే ఎలుకుల నివారణకు సాధ్యపడుతుందని తెలిపారు. ఇలా తయారైన మిశ్రమాన్ని 20 గ్రాములు చొప్పున చిన్న చిన్న పొట్లాలను కలిపి పొలం గట్ల మీద ఉన్న ఎలక కన్నాలలో వేస్తే వాటి నివారణ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మినుము, పెసర సాగులో మెలకువలు యలమంచిలి : సాధారణంగా ఎర్రనేలల్లో మినుము, పెసర రబీ పంటగా చేపట్టవచ్చని, అడపాదడపా కురుస్తున్న వర్షాలు అనుకూలమని వ్యవసాయాధికారులు తెలిపారు. మురుగునీరు నిలవని ఎర్ర, నల్ల రేగడి నేలల్లో ఈ పంట సాగు లాభదాయకంగా ఉంటుందని వివరించారు. రకాలు: మినుము సాగుకు ఎల్.బి.జి. 752, 709 (పంటకాలం 75-85 రోజులు) రకాలను ఎంపిక చేసుకోవచ్చు. పెసర సాగుకు ఎల్.జి.జి 407 ఎం.ఎల్ - 267 (పంటకాలం 60-70 రోజులు) రకాలను విత్తుకోవచ్చు. విత్తే విధానం: ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం అవసరం. విత్తే ముందు విత్తనాలను మూడు రకాలుగా శుద్ధి చేయడం ద్వారా తొలి దశలో పైరుకు చీడపీడల బెడద ఉండదు. కీటకాల నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ కలిపి ఆరబెట్టాలి. అనంతరం తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెట్ కలపాలి. భూమిలోని నత్రజనిని మొక్కలు సులువుగా తీసుకునేందుకు వీలుగా 200 గ్రాముల రైజోబియం కల్చరును చల్లార్చిన బెల్లం పాకంలో కలిపి ఎనిమిది కిలోల విత్తనాలకు పట్టించాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేలా విత్తుకోవాలి. రాళ్లు ఎక్కువగా ఉన్న ఎర్ర నేలల్లో వెదజల్లే పద్ధతిని విశాఖజిల్లా రైతులు పాటిస్తున్నారు. మినుము, పెసర చేలకు చుట్టూ కంచె పంటగా జొన్న, ఆవాలు, బంతిమొక్కలను పెంచితే కాయతొలిచే పురుగు, పచ్చపురుగు తెల్లదోమ వ్యాప్తి తగ్గుతుంది. ఎరువుల యాజమాన్యం: ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువుతో పాటు ఎనిమిది కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అందించే ఎరువులను విత్తడానికి ముందుగా భూమిలో వేయాలి. కలుపు నివారణకు పప్పుధాన్యపు పైర్లను విత్తిన 24 గంటల్లోపు 500 మిల్లీలీటర్లు పెండిమిథాలిన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా తడినేలపై పిచికారీ చేస్తే నెలరోజుల పాటు కలుపు బెడద ఉండదు. సస్యరక్షణ: ఆకులను జల్లెడలా మార్చే చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు చొప్పున క్లోరిపైరిఫాస్ కలిపి మొక్కలు తడిచేలా చల్లాలి. పల్లాకు తెగులు సోకితే, ఈ తెగులును వ్యాప్తిచేసే తెల్లదోమ నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున థయోఫానేట్ మిథైల్ కలిపిన ద్రావణాన్ని మొక్కలు తడిచేలా చల్లాలి. చేలో పల్లాకు తెగులు మొక్కలు ఎక్కువగా ఉంటే, వాటిని పీకి పొలానికి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. కాయతొలిచే మచ్చల పురుగు నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్, ఒక మిల్లీలీటర్లు డైక్లోరోవాస్ కలిపి పిచికారీ చేయాలి. చోడవరం : సుడిదోమ బెడద నుంచి వరి పంటను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. హుద్‌హుద్ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో వరికి వివిధ చీడపీడలు ఆశించాయి. వేలాధి ఎకరాల్లో పంట నాశనమవుతోంది. దోమ కారణంగా పంట పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉన్న పంటను రక్షించుకునేందుకు నానా యాతన పడుతున్నారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచన మేరకు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. చోడవరం,మాడుగుల నియోజకవర్గాల్లో సుమారు 80వేల ఎకరాల్లో వరి సాగులో ఉంది. ఇందులో సుమారు 30వేల ఎకరాలకు దోమ సోకింది. పక్కపొలాలకు విస్తరిస్తోంది. ఆకుల ఆడుగు భాగాన ఆశించడంతో అవి ఎండిపోయి పంట మాడిపోతోంది. సందట్లో సడేమియాలా నివారణకు వినియోగించే మందుల్లో నకిలీలు ఉంటున్నాయి. కొన్ని రకాల మందులు పనిచేయడం లేదని వ్యవసాయాధికారులే చెబుతున్నప్పటికీ వాటి విక్రయాలను నిలిపివేయకపోవడంతో రైతులు చాలా నష్టపోతున్నారు. పంటల పరిరక్షణకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ఏడీ బి.మోహనరావు సూచించారు. వరిపంటను ఆవరించిన సుడిదోమ తెగుళు నివారణకు మోనోక్రోటోపాస్ రె ండు గ్రాములు, నివానోక్రాన్ ఒక గ్రాము కలిపి లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఇలా కలిపిన ద్రావణాన్ని ఎకరాకు 200లీటరు మందును ఆకు తడిసే వరకు పిచికారీ చేయాలని సూచించారు.