lakshmamma
-
ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, కర్నూలు: ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్‌ను విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమెకు సీసీయూలో చికిత్స కొనసాగుతుందన్నారు. అల్ట్రా స్కాన్‌లో పరీక్షలో పురోగతి కనిపించింది. లక్ష్మమ్మను సాధారణ రూమ్‌కు షిఫ్ట్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. కాగా, పులివెందుల భాకరాపురంలోని తమ నివాసంలో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ ఛాతీలో నొప్పి రావడంతో సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికంగా ఉన్న దినేశ్ నర్సింగ్ హోంలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రత్యేక అంబులెన్స్‌లో బయలుదేరగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాక్ నిపుణుడు హితేశ్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రవికళాధర్‌రెడ్డి పర్యవేక్షణలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. చదవండి: ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు? -
‘సాక్షి’ ఎడిటర్ వర్దెల్లి మురళికి మాతృ వియోగం
-
మాఅమ్మగారు
కష్టం చూసి పరుగెత్తుకొచ్చేస్తుంది అమ్మ. మనసు బాగుండకపోతే మలాం రాస్తుంది అమ్మ. కనకపోయినా.. అమ్మ అనిపిస్తుంది అమ్మ.అమ్మ లాంటి ఈ మామ్మగారైతే... విధి చిన్నచూపు చూసినా.. ఈ చిన్నారిని ‘మన–వరాలు’ అనే అనుకుంది. ఇంచుమించు ప్రతి ఇంట్లోను భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్తున్నారు. అటువంటి వారి కోసం చైల్డ్ కేర్ సెంటర్లు మొదలయ్యాయి. ఈ సెంటర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీరు పిల్లలను బాధ్యతగానే చూస్తున్నప్పటికీ అడపాదడపా వారి మీద చెయ్యి చేసుకుంటున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలను చూడటం ఉద్యోగంలో భాగంగా భావిస్తారు వీరు. అరవై ఏళ్ల క్రితమే శిశు సంరక్షణం ఇందుకు భిన్నంగా ఆరు దశాబ్దాల క్రితమే శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించారు సీతారామలక్ష్మమ్మ, సీతారామాంజనేయ శర్మ దంపతులు. బాపట్ల దగ్గర వల్లూరుకి చెందిన వీరు వివాహమైన కొత్తల్లో ఉద్యోగరీత్యా గుంటూరు చేరారు. ‘‘పెళ్లినాటికి నాకు పదకొండేళ్లు, ఆయనకు ఇరవై సంవత్సరాలు. మావారు గుంటూరు పొగాకు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. కొన్ని సంవత్సరాల తరవాత విజయవాడలో ఒక వ్యాపారి దగ్గర రోజుకి రూపా యి పావలా జీతానికి అకౌంట్లు రాసేవారు. చాలీచాలని జీతంతో కావడంతో, కిరాణా షాపులలో పొట్లాలు కట్టేదాన్ని నేను’’ అంటారు లక్ష్మమ్మ. మొదట.. పెద్దవాళ్లకు సేవ విజయవాడలోని కుర్తాళం ఆశ్రమంలో ఈ దంపతులిద్దరూ ఆరేళ్లపాటు పెద్దవారికి సేవలు చేశారు. తరవాత ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి పదహారు సంవత్సరాలపాటు ఆశ్రమాలలో జీవనం సాగించారు. ఈ దంపతులకు ఒకే ఒక ఆడపిల్ల. అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన నాటì నుంచి ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని నష్టానికి అమ్మేశారు. ‘‘మా వారు రిటైరయ్యారు. పెన్షన్ ఏమీ లేదు. మా తిండి మేం తినడానికి ఏదో ఒక పనిచేయాలని నిశ్చయించుకున్నాం. విజయవాడ సత్యనారాయణ పురంలో చైల్డ్ కేర్ సెంటర్ ప్రారంభించాం. ఇద్దరు పిల్లలతో ప్రారంభమైన ఈ సెంటర్ అతి వేగంగా పాతికమందికి చేరుకుంది. సుమారు 20 ఏళ్ల పాటు పిల్లలతో ఆడుతూ పాడుతూ హాయిగా నడిపాం. వారిని మా సొంత మనవలుగానే భావించాం’’ అని గతం గుర్తు చేసుకుంటారు సీతారామలక్ష్మమ్మ. వాళ్లమ్మాయే.. ఈ అమ్మాయి ఆ స్కూల్లోనే అందరితో పాటు జయరామ్, రమ దంపతులు వాళ్ల అబ్బాయిని చేర్పించారు. రోజూ ఉదయాన్నే అబ్బాయిని మామ్మ గారి దగ్గర వదిలి, సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేవారు. అలా వారి కుటుంబంతో వీరికి సాన్నిహిత్యం ఏర్పడింది. ‘‘ఈ అబ్బాయి తరవాత వాళ్లకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి మానసిక దివ్యాంగురాలు. అందువల్ల మిగిలినవారి కంటె జాగ్రత్తగా చూడాలి. దేవుడు ఆ పిల్లకు ‘చెప్పిన మాట వినే లక్షణం’ ప్రసాదించాడు. నేను ఏది చెప్పినా తుచ తప్పక ఆచరించేది’’ అంటారు లక్ష్మమ్మ. సంరక్షణతో పాటు సంస్కారం ఈ శిశు సంరక్షణ కేంద్రంలో రైమ్స్‌తో పాటు సంస్కారం కూడా నేర్పారు. శర్మ, లక్ష్మమ్మ.. వాళ్ల చిన్నతనంలో నేర్చుకున్న, చదువుకున్న నీతి కథలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేవారు. పిల్లలతో అనుబంధం పెంచుకుంటూ, జీవితం హాయిగా, ఆనందంగా గడిపేశారు. వయోభారం మీద పడుతుండటంతో ఇరవై ఏళ్ల తరవాత శిశుసంరక్షణ కేంద్రానికి స్వస్తి పలికి, వడియాలు, అప్పడాల వంటివి తయారు చేసి అమ్మడం మొదలుపెట్టామని చెప్పారు లక్ష్మమ్మ. అనూహ్యంగా.. ఆ రోజు..! రెండేళ్ల క్రితం సీతారామాంజనేయశర్మ గతించారు. అప్పటికి ఆయనకు వంద సంవత్సరాలు నిండాయి. ‘‘మా వారు ఏదో పని ఉందని బయటకు వెళ్లి, వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ‘కాఫీ కావాలా’ అని పిలిస్తే పలకలేదు. ఇక ఎన్నడూ కాఫీ తాగరని అర్థం కావడంతో, నా చేతిలో కప్పు చేతిలోనే ఉండిపోయింది’’ అంటూ కళ్లు తుడుచుకున్నారు లక్ష్మమ్మ. ఇరుగు పొరుగువారు ఆయన అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు. ‘‘నేను కన్ను మూస్తే, నా బాధ్యత ఎవరు తీసుకుంటారనే సంశయంతో నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి చాలామంది నిరాకరించారు. భగవంతుడు పరీక్షలు పెడుతూనే, పరిష్కారాలూ చూపిస్తాడు. ఎట్టకేలకు ఒక ఇల్లు అద్దెకు దొరికింది. ఇప్పుడు నేను ఏ ఇంట్లో ఉంటున్నానో, ఆ ఇంటావిడ తాతగారికి గతంలో నేను ఆశ్రమంలో ఉన్న రోజుల్లో సేవ చేశానట. ఆ కృతజ్ఞతతో వారి మనుమరాలు నాకు ఇల్లు అద్దెకు ఇచ్చి, నన్ను సొంత అమ్మమ్మలా చూసుకుంటున్నారు’’ అని చెప్పారు లక్ష్మమ్మ. మామ్మగారికి ఇటీవల కొద్దిగా అనారోగ్యం చేయడంతో ఆవిడను ఆసుపత్రికి తీసుకువెళ్లి, చూపించి, ‘మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు ఇంటి ఓనరు, లక్ష్మీప్రియ తల్లిదండ్రులు. జన్మజన్మల అనుబంధం ‘‘మాది ఏ జన్మ బంధమో ఈ ఇద్దరు పిల్లలతోపాటు, వారి తల్లిదండ్రులు కూడా ఆత్మీయులు అయిపోయారు. నన్ను సొంత మామ్మగా చూసుకుంటున్నారు. నెలనెలా ఎంతో కొంత డబ్బు ఇస్తుంటారు. ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్నా నా సలహా తీసుకుంటారు’’ అంటున్న మామ్మగారిని చూస్తే అపురూపంగా అనిపిస్తుంది. నా చెయ్యి మంచిదని.. క్రేన్ వక్కపొడి వారు నేటికీ నెలకు నాలుగు వేల రూపాయలు ఒక కొడుకు తల్లికి పంపుతున్నట్టుగానే పంపుతున్నారు. వారు క్రేన్ వక్కపొడి వ్యాపారం ప్రారంభించకముందు వాళ్ల ఇంటి పక్కనే పదిహేను సంవత్సరాలు అద్దెకున్నాం. క్రేన్ వక్కపొడి ప్రారంభోత్సవం సందర్భంగా, వక్కలు తెచ్చి నా చేత దంపించి, బోణీ చేయించారు. అలా మొదలుపెట్టాక కోటీశ్వరులయ్యారనే భావనతో ఇప్పటికీ నాకు నెలకు నాలుగు వేల రూపాయలు పంపుతున్నారు. – సీతారామలక్ష్మమ్మ మా అమ్మాయిని తీర్చిదిద్దారు మాకు ఈ మామ్మగారు భగవంతుడు ఇచ్చిన వరం. మా అమ్మాయిని సొంత మనవరాలి కంటె ఎక్కువగా చూసుకుంటారు. ఇంటికి వచ్చిన వాళ్లకి మంచి నీళ్లు అవ్వడం, కాళ్లు చేతులు కడుక్కుని భోజనం చేయడం, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం, ఇంటికి ఎవరైనా వస్తే మంచినీళ్లు ఇమ్మని తల్లికి చెప్పడం వంటివన్నీ మామ్మగారి దగ్గరే నేర్చుకుంది. ఇల్లు తుడుస్తుంది, ఇంటికి వచ్చిన వారు వెళ్లేటప్పుడు వారికి పండు, బొట్టు ఇచ్చేవరకు ఊరుకోదు. పదిహేనేళ్లుగా మామ్మగారు మా పిల్లను సాకుతున్నారు. మా పిల్ల ఆవిడను ‘మామ్మగారు’ అనే పిలుస్తుంది. ఇంట్లో ఏదైనా తినే పదార్థాలు ఉంటే మామ్మగారికి ఇచ్చేవరకు ఊరుకోదు. – రమ, జయరామ్ దంపతులు, విజయవాడ – డా. వైజయంతి పురాణపండ -
ఆ పేదింటి పునాదిలో 435 బంగారు నాణేలు
-
ఆ పేదింటి పునాదిలో 435 బంగారు నాణేలు
బెంగళూరు: ఆమె అనుకుంటే ధనవంతురాలై పోవచ్చు.. రోజుకో బంగారు నాణాన్ని డబ్బుగా మార్చుకొని దర్జాగా బతికేయొచ్చు. తన పేదరికం మొత్తాన్ని పెకిలించి పారేయొచ్చు. కానీ, పేరుకు పేదళ్లం అయినా తమలో నిజాయితీ తప్పకుండా ఉంటుందని ఓ మారుమూల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే 55 ఏళ్ల మహిళ నిరూపించింది. తన ఇంటికోసం తీస్తున్న పునాదిలో దాదాపు 435 పురాతన బంగారు నాణేలు బయటపడినా వాటిల్లో ఏ ఒక్కటి తను ఉంచుకోకుండా గ్రామస్తులు ఇచ్చే సలహాను పట్టించుకోకుండా నేరుగా పోలీసులకు అందించి మన్ననలు పొందింది. అందుకు పోలీసులు ఆమెను పలువిధాలుగా మెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగ్గా బెంగళూరుకు 100 కిలో మీటర్ల దూరంలోని బాణ సముద్ర అనే గ్రామంలో లక్ష్మమ్మ అనే 55 ఏళ్ల మహిళ ఉంది. ఆమె తనకు ఓ ఇంటిని నిర్మించుకునేందుకు శంఖుస్థాపన కోసం గుంట తవ్వడం ప్రారంభించింది. కొంతమంది కూలీవాల్లను పెట్టుకొని ఆ పనిలో నిమగ్నం కాగా అందులో నుంచి తొలుత కొన్ని నాణేల మాదిరిగా బయటకొచ్చాయి. అవన్నీ బురదమయమై ఉన్నాయి. అలాగే, ఇంకొంచెం తవ్వగా ఏకంగా 400కు పైగా నాణేలు బయటకొచ్చాయి. వీటిని అనంతరం శుభ్రం చేయగా అవి బంగారు నాణేలు అని దాదాపు గుర్తించారు. ఆ విషయం ఆమెకు కూడా అర్థమైంది. అయితే, గ్రామస్తుల్లో కొందరు వాటిని స్వర్ణకారులకు చూపించమని, ఎవరికీ చెప్పకుండా ఆమెతోనే ఉంచుకొమ్మని సలహా ఇచ్చారు. కానీ, అవన్నీ పట్టించుకోకుండా నేరుగా వెళ్లి పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి వాటని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో ద్వారా ప్రభుత్వానికి అప్పగించగా వాటిని పురావస్తు శాస్త్రవేత్తలకు పరిశీలన కోసం అప్పగించారు. -
పోలీసుల అత్యుత్సాహం
► సీఎం బందోబస్తు పేరుతో వాహనాల నిలిపివేత ► కారులోనే గుండెపోటుతో వృద్ధురాలి మృత్యువాత సాక్షి సూర్యాపేట: పోలీసుల అత్యుత్సాహానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన సూర్యాపేటలో మంగళవారం జరిగింది. పట్ట ణంలోని శ్రీరాంనగర్‌లో సోమా అంజయ్య, లక్ష్మమ్మ(65) కుటుంబం నివాసం ఉంటోంది. లక్ష్మమ్మ ఉదయం 11 గంటలకు గుండెపో టు, ఆస్తమాతో బాధపడుతుండగా.. స్థానిక గాయత్రి నర్సింగ్ హోంలో చికిత్స చేయించేందుకు కారులో బయలుదేరారు. అయితే మంగళవారం ఖమ్మం జిల్లాలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభో త్సవానికి బయలుదేరిన సీఎం కేసీఆర్ మార్గ మధ్యలో సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటి వద్ద మధ్యాహ్న భోజనం కోసం ఆగా రు. అదే సమయంలో అటుగా వస్తున్న లక్ష్మమ్మ కారును పోలీసులు ఆపేశారు. ముందుగా ఫ్లై ఓవర్ కింది నుంచి ఆస్పత్రికి వస్తుండగా.. అటుకాదు మరోవైపు నుంచి వెళ్లాలని పోలీసులు కారును మళ్లించారు. అనంతరం 60 ఫీట్ల రోడ్డు నుంచి వస్తుండగా అక్కడ ఉన్న పోలీసులు నిలిపి వేశారు. తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, గుండెపోటుతో ఉన్న ఆమెకు వైద్యం అంద కపోతే ఇబ్బంది అవుతుందని పోలీసులను బతిమిలాడినా స్పందించలేదని అంజయ్య వాపోయారు. దీంతో తన భార్యను బతికిం చమని డాక్టర్ వద్దకు పరుగు పెట్టానని, డాక్టర్ కారు వద్దకు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారని బోరున విలపించాడు. పోలీసులు ఆటంకం కలిగించలేదు.. సోమా లక్ష్మమ్మ వస్తున్న వాహనానికి పోలీసులు ఆటంకం కలిగంచలేదని సూర్యాపేట ఎస్పీ పరిమళ హననూతన్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కాన్వాయ్ వస్తున్నప్పటికీ లక్ష్మమ్మ వాహనాన్ని అడ్డుకోవద్దని సెట్లో చెప్పి వైద్య సేవలు అందించేలా ప్రయత్నించామని ఎస్పీ పేర్కొన్నారు. లక్ష్మమ్మకు వైద్యసేవలు అందించాలని డాక్టర్ రామ్మూర్తిని తీసుకెళ్లింది కూడా పోలీసులే అని తెలిపారు. లక్ష్మమ్మ పదేళ్లుగా పేషెంట్‌గా ఉంటూ వైద్య సేవలు పొందుతున్నారని వివరించారు. -
పక్కింటివారు తిట్టారని ఆత్మహత్య
యాదాద్రి: పక్కింటి వారు తిట్టారనే మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంగళవారం జరిగింది. స్థానికంగా ఉండే లక్ష్మమ్మ అనే మహిళకు పక్కింటి వారికి విబేధాలు వచ్చాయి. దీంతో పక్కింటి వారు తిట్టడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ముగ్గురికి తీవ్రగాయాలు సురక్షితంగా బయటపడ్డ చిన్నారులు ఓడీ చెరువు: ఓడీచెరువు మండలంలోని కదిరి– హిందూపురం రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం మధుగిరికి చెందిన లక్ష్మమ్మ(70)మృతి చెందింది. నరసింగప్ప, గీత, రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయట పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మధుగిరికి చెందిన దంపతులు రమేష్, గీత తమ ఇద్దరు పిల్లలు పావని, చిన్నికి పుట్టెంట్రుకలు తీయించేందుకు రమేష్ తండ్రి నరసింగప్ప, అమ్మ లక్ష్మమ్మతో కలసి కదిరికి బయలు దేరారు. తమ ఇంటి ఇలవేల్పు దేవుడు లక్ష్మినరసింహస్వామికి తలనీలాలు అర్పించి మొక్కుబడి తీర్చుకునేందుకు రమేష్ స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తూ వచ్చారు. జేసీబీని ఓవర్టేక్ చేయబోయి.. ఓడీ చెరువు మండలంలోని వేమారెడ్డిపల్లి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న జేసీబీని ఓవర్టేక్ చేయబోయి వెనకువైపు ఢీ కొట్టాడు. దీంతో కారు కుడివైపు పొలంలోకి దూసుకెళ్లి బండరాâýæ్లను ఢీ కొట్టింది. ప్రమాదంలో లక్ష్మమ్మ, నరసింగప్ప తీవ్రంగా గాయపడ్డారు. గీత, రమేష్ స్వల్పంగా గాయపడ్డారు. పిల్లలు చిన్న గాయం కూడా లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ముందు సీట్లులో కూర్చున్న రమేష్, గీత సీట్ బెల్టు పెట్టుకోవడంతో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని 108 కు సమాచారం చేరవేశారు. క్షతగా>త్రులను 108 ద్వారా కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మమ్మ మృతి చెందినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎల్బీనగర్లో చైన్ స్నాచింగ్..
3.5 తులాల బంగారు గొలుసు అపహరణ హైదరాబాద్‌సిటీ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాధవ నగర్ కాలనీలో చైన్‌స్నాచింగ్ జరిగింది. గుర్తుతెలియని దుండగులు లక్ష్మమ్మ అనే వృద్ధురాలి మెడలోని 3.5 తులాల బంగారు గొలుసును తస్కరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంగళసూత్రాన్ని తెంపుకెళ్లిన దుండగలు
బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ మహిళ మెడలోంచి మంగళసూత్రాన్ని తెంపుకుపోయారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన లక్ష్మమ్మ (51) ఆదివారం ఉదయం నడుచుకుంటూ వెళుతుండగా... వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమె మెడలో ఉన్న మూడు తులాల మంగళ సూత్రాన్ని తెంపుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. -
వెట్టి నుంచి ఐదేళ్ల బాలికకు విముక్తి
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం చెన్నాయిపాళెం గ్రామం వద్ద ఒక ఇటుక బట్టీ యజమాని నిర్బంధించిన బాలికకు కలెక్టర్ జోక్యంతో విముక్తి లభించింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. చెన్నాయిపాళెం శివారులో కుండా దయాకర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ ఇటుకల బట్టీలు నిర్వహిస్తున్నాడు. అక్కడ ఎంకమ్మ, శీనయ్య అనే దంపతులు వలస కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే వారి కుమార్తె లక్ష్మమ్మ(5)ను ఇటుకల బట్టీల యజమాని అక్రమంగా నిర్బంధించాడు. తన వద్ద తీసుకున్న అప్పు తీర్చేవరకూ బాలిక నిర్బంధంలో ఉంటుందని హెచ్చరించాడు. దిక్కుతోచని తల్లిదండ్రులు నెల్లూరు వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి స్థానిక ఎస్ఐ, తహశీల్దార్, ఐసీడీఎస్ సీపీడీవో, ఏఆర్ఓ స్వచ్ఛందసంస్థ ప్రతినిధులను ఆదేశించారు. వారు మంగళవారం మధ్యాహ్నం ఇటుకబట్టీల వద్దకు వెళ్లి లక్ష్మమ్మ(5)ను దయాకర్‌రెడ్డి చెర నుంచి విడిపించారు. అతనిపై కేసు నమోదుచేశారు. -
వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య!
మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోడుప్పల్‌కు చెందిన లక్ష్మమ్మ (50) అనే మహిళ గత అర్థరాత్రి దారుణ హత్యకు గురైంది. దీంతో స్థానికులు మంగళవారం ఉదయం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మమ్మ మృతికి గల కారణాలపై పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మమ్మపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.