Lakshmi Narasimha temple
-
అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం
-
అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదం చోటుచేసుకుంది. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. మంత్రి వెల్లంపల్లి దిగ్భ్రాంతి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన.. దేవదాయ కమిషనర్ పి.అర్జునరావు, జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడారు. సహయక చర్యులు చేపడుతున్న దేవదాయ, పోలీస్, పైరింజన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశిస్తూ.. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను విచారణ అధికారిగా నియమించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున: నిర్మాణానికి చర్యులు చేపట్టాలని దేవదాయ కమిషనర్‌కు మంత్రి సూచించారు. అంతర్వేదిలో నర్శింహస్వామి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండన అంతర్వేది ఘటన దురదృష్టకరం -స్వరూపానందేంద్ర రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి -స్వరూపానందేంద్ర దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి -స్వరూపానందేంద్ర హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిది -స్వరూపానందేంద్ర నర్శింహస్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి -స్వరూపానందేంద్ర -
యాదాద్రి గోశాలలో గడ్డి కుంభకోణం
-
ప్రేక్షకులు మెచ్చుకునే సినిమాలు తీస్తా..
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ప్రేక్షకులు మెచ్చుకునే సినిమాలు తీయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తెలిపారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఆరు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామన్నారు. ప్రేక్షకులు వాటిని ఆదరించారు. కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యాయని అన్నారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. ఈ ఏడాది కూడా నాలుగు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా ప్రారంభించామని ఆయన తెలిపారు. అలాగే నితిన్ హీరోగా శ్రీనివాస కల్యాణం, రామ్ హీరోగా ఒక సినిమా, మరో సినిమా కూడా తీస్తున్నామన్నామని చెప్పారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈసందర్భంగా ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ఉత్తరరాజగోపురంలో జరిగిన శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమాన్ని తిలకించి స్వామిని దర్శించుకున్నారు. శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమంలో రావడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. చిరంజీవి సేవాసమితి అధ్యక్షుడు లంక సూరిబాబు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
విషాదం మిగిల్చిన విహార యాత్ర
కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మిత్రులు పెనుకొండ: విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. పట్టణంలోని పెనుకొండ కొండపై పర్యాటక అందాలను తిలకించాలని వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో ప్రమాదవశాత్తు ఇద్దరు కోనేరులో పడి మృతి చెందారు. మరొకరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కొండపైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలోని కోనేరులో గురువారం మధ్యాహ్నం ఈ ఘోరం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. హిందూపురం సమీపంలోని సంతేబిదనూరుకు చెందిన మహబూబ్ బాషా (26) వృత్తిరీత్యా బెంగళూరులో బేకరిలో పని చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. హిందూపురం పట్టణానికి చెందిన యూసుఫ్ (19) పట్టణంలో ద్రాక్ష వ్యాపారం చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అదే పట్టణానికి చెందిన ఖలీద్ చిల్లర వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పర్యాటక అందాలను చూడడానికి వెళ్లి.. గురువారం మధ్యాహ్నం వారు పెనుకొండ కొండపైన పర్యాటక అందాలు చూడడానికి ఒకే ద్విచక్ర వాహనంలో వెళ్లారు. కొండపై కోనేరు వద్దకు వచ్చి ముఖాలు కడుక్కుంటూ నీటిలో చేపలు ఉన్నాయేమోనని ముందుకు వంగగా పాచి కారణంతో మహబూబ్ బాషా నీటిలోకి జారిపోయాడు. బాషాను పట్టుకోబోయిన ఖలీద్ సైతం నీటిలోకి జారిపోయాడు. వీరిని రక్షించడానికి ప్రయత్నించిన యూసుఫ్ సైతం నీటిలోకి జారిపోయాడు. ఖలీద్‌కు చెట్టు వేరు దొరకడంతో బయటకు చేరుకున్నాడు. మిగిలిన ఇద్దరు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందారు. అక్కడున్న ఇతర ప్రాంతాల వ్యక్తులు వీరిని రక్షించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఖలీద్ ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ లింగన్న, అగ్నిమాపక అధికారి ఆంజనేయులు సిబ్బందితో వెళ్లి కోనేరులో మృతదేహాలను వెలికితీశారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు పెనుకొండకు చేరుకుని మృత దేహాలను చూసి బోరున విలపించారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈతకు వెళ్లి మరొకరు.. ధర్మవరం అర్బన్ : పట్టణంలోని సూర్యప్రతాప్‌రెడ్డి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ప్రతాప్(34) స్విమ్మింగ్‌పూల్‌కు ఈతకెళ్లి మృతి చెందాడు. అతడికి భార్య లక్ష్మి, కుమారులు ఉదయ్‌కిరణ్, జస్వంత్ ఉన్నారు. గురువారం కుమారులిద్దరినీ తీసుకుని ఈతకెళ్లాడు. అతడికి ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెంచలకోన లో చదలవాడ
టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణ మూర్తి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలోని లక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు శాలువా కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు కరుణామయి ఆశ్రమంలో జరుగుతున్న జ్ఞాన శిబిరంలో పాల్గొన్నారు.