Lakshmi Priya
-
ప్రియుడి మోజులో.. భర్తనే కడతేర్చింది..
ఒంగోలు టౌన్: ప్రియుడి మోజులో పడి ఆమె ఏకంగా భర్తనే హతమార్చింది. తన వ్యవహారం బయట పడేసరికి భర్త మందలించడం.. భర్త బతికుంటే తమ ‘బంధం’ కష్ట మని భావించిన ఆ మహిళ.. కిరాయి ముఠా, ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే దారుణంగా కడతేర్చింది.. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎఫ్ ఇన్స్పెక్టర్ చల్లా వెంకటనరేంద్రబాబు హత్య కేసులో మృతుడి భార్యతో సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆ యువకుడికి అలా దగ్గరైంది.. ఒంగోలులోని పీఎఫ్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పనిచేసే చల్లా వెంకటనరేంద్రబాబు పొదిలిలోని పీఎన్ఆర్ కాలనీ మూడో లైనులో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లలు. వారి ఇంటి ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్న కొండ శశికుమార్ అనే యువకుడికి లక్ష్మీప్రియ దగ్గరైంది. వారి వ్యవహారం తెలిసిన నరేంద్ర.. ఇద్దరినీ తీవ్రంగా మందలిస్తూ వస్తున్నాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శశితో కలిసి పథకం రచించింది. ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నరేంద్ర గాఢ నిద్రలో ఉన్న సమయంలో శశితో పాటు.. నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన నలుగురు యువకులు కలిసి నరేంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి తాడుతో వేలాడ దీశారు. భార్యభర్తల గొడవలతో విసిగివేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు యత్నించారు. ఇదిలా ఉండగా, కిరాయి ముఠా తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన డబ్బు కోసం వారు ఫోన్లు చేస్తుండటంతో భయపడిపోయిన శశిపోలీసులకు లొంగిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితులు.. లక్ష్మీప్రియతో పాటుగా ఆమె ప్రియుడు కొండ శశికుమార్, నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన షేక్ నహీద్, షేక్ ఫజ్లూ, సయ్యద్ సిద్దిక్, షేక్ ముబారక్‌లను అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్ వివరించారు. -
ట్రెండ్ ఆమె స్వరం... అక్షరాలకు బలం
చెవులకు హెడ్‌ఫోన్ ధరించి, కళ్లు మూసుకొని, శ్రద్ధగా వింటున్న ఆమెను చూస్తుంటే ధ్యానస్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇంతకీ ఆమె వింటున్నది ఏమిటి? అది తెలుసుకునేముందు.... ప్రియా వసంత్ చెన్నైలోని సాధారణ గృహిణి. ఇంటిపనులు పూర్తి కాగానే టీవిలో సీరియల్స్, వోటీటీలో సినిమాలు చూడడంలో ఎక్కువ టైమ్ గడిపేది. రాను రాను ఆమెకు ఇది విసుగనిపించింది. మార్పు కావాలనిపించింది. ‘ఏంచేయాలి?’ అని ఆలోచిస్తున్నప్పుడు అరల్లోని పుస్తకాలు ఆమెను ఆకర్షించాయి. కాలేజి రోజుల్లో ప్రియ పుస్తకాల పురుగు. కానీ విజువల్ మీడియా విస్తృతమయ్యాక చాలామందిలాగే తనలోనూ పఠనాసక్తి వెనకబడింది. ఎక్కడో విన్న ‘ఆడియోబుక్’ అనే మాట గుర్తుకు వచ్చింది. ఈ అనుభవం ఎలా ఉంటుందో చూద్దామనుకుంది. తాను వింటున్నది కల్కి క్రిష్టమూర్తి ‘పోన్నియన్ సెల్వన్’ ఆడియో పుస్తకం. ఆ పుస్తకంలో వినిపించే గొంతు ఆమెను కొత్త లోకాల్లోకి తీసుకెళ్లింది. మరిన్ని ఆడియో పుస్తకాలను వినే ఆసక్తిని కలిగించింది. ఆ స్వరం... కీర్తనది. ‘ఆడియో పుస్తకాలను నెరేట్ చేయడం ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. అయితే అది చిన్న విషయం. కొత్త ఉత్సాహం అనేది పెద్ద విషయం’ అంటుంది కీర్తన. ఆడియోబుక్స్ మార్కెట్ పెరిగి, వరల్డ్ ట్రెండ్‌గా మారుతున్న ఈ దశలో నెరేటర్‌గా మంచి పేరు తెచ్చుకుంటుంది దీపిక అరుణ్. ‘ఏదో అవకాశం వచ్చింది. చెప్పాం. అయిపోయింది అనుకుంటే కుదరదు. ఏ మేరకు శ్రోతలను ఆకట్టుకున్నామన్నది ముఖ్యం. నెరేటర్కు ఉచ్ఛారణ, మాడ్యులేషన్ అనేవి చాలా ముఖ్యం’ అంటుంది దీపిక. ‘తన్నీర్’ అనే తమిళ పుస్తకానికి తన స్వరాన్ని ఇచ్చిన లక్ష్మీ ప్రియాకు వచ్చిన ప్రశంసలు ఇన్నీ అన్నీ కావు. కాలేజి స్టూడెంట్స్ నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్ల వరకు ఆమె అభిమాన గణంలో ఉన్నారు. ‘నాటకాలు, సినిమాలకు సంబంధించి శిక్షణ సంస్థలు ఎన్నో ఉండవచ్చు. అయితే స్వరాన్ని ఏ సందర్భంలో, ఏ పాత్రకు ఎలా ఉపయోగించాలనే విషయంలో మాత్రం ఎవరికి వారే గురువులు. ప్రతి పుస్తకం ఎన్నో కొత్త పాఠాలు నేర్పుతుంది. ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది’ అంటుంది లక్ష్మీ ప్రియా. ఇవి దక్షిణాదికి సంబంధించి కొన్ని ఉదాహరణ మాత్రమే. ఇక జాతీయస్థాయిలో ఎన్నో ఆంగ్లపుస్తకాలకు మహిళల గొంతు బలమైన మాధ్యమంగా మారుతుంది. బెస్ట్ సెల్లర్‌గా పేరు తెచ్చుకున్న కవిత కనే ‘కర్నాస్ వైఫ్’ ఆడియో బుక్‌ను షాహీన్ఖాన్ అందంగా నెరేట్ చేసింది. ‘అద్భుతమైన పుస్తకాలను అంతకంటే అద్భుతంగా నెరేట్ చేసినప్పుడే మనం విజయం సాధించినట్లు అనుకోవాలి’ అంటుంది షాహీన్ఖాన్. అమెజాన్ కంపెనీ వారి ‘ఆడిబుల్’ శ్రోతలకు చిరపరిచితమైన పేరు....ఇక్రూప్ కౌర్ చంబా. రకరకాల జానర్లలో వచ్చే ఆడియో పుస్తకాలకు గొంతు ఇచ్చి ‘ఆహా’ అనిపించుకుంటుంది. దేవాన్షిశర్మ ‘ఐ థింక్ ఐయామ్ ఇన్ లవ్’ పుస్తకాన్ని నెరేట్ చేయడం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అరుణ్ అంజు హిందీలోకి డబ్ అయ్యే హాలివుడ్ సినిమాలలోని పాత్రలకు గొంతు ఇచ్చే ఆల్కాశర్మ తాజాగా ఆడియోబుక్స్ నెరేటింగ్ పనుల్లో బిజీ అయింది. ‘రకరకాల జానర్స్ గురించి అవగాహన రావడంతో పాటు, పుస్తకం గొప్పతనం తెలిసింది’ అంటుంది ఆల్కా. ఫిక్షన్‌తో పాటు విద్యార్థుల కోసం చరిత్ర నుంచి భౌగోళికం వరకు ఆడియో పుస్తకాలను నెరేట్ చేస్తూ భేష్ అనిపించుకుంటుంది అంజు పణిక్కర్....ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది ఉన్నారు. పుస్తకం హస్తభూషణం అంటారు.గళభాషణం కూడా అంటే కాదనేదేముంది! -
లక్ష్మీప్రియ మృతదేహం వెలికితీత
తిరుమల : చిత్తూరు జిల్లా తిరుచానూరు ఈతమాకుల వీధిలో మేనమమ చేతిలో దారుణహత్యకు గురైన చిన్నారి లక్ష్మీప్రియ మృతదేహాన్ని పోలీసులు మంగళవారం బయటకు తీశారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డబ్బులు కారణంగానే లక్ష్మీప్రియను హతమార్చడటం దారుణమని, ఇంకా రెండింతలు డబ్బులు ఇస్తామని.. తమ చిన్నారిని ప్రాణాలతో తిరిగి తెచ్చివ్వమంటూ అర్థిస్తున్నారు. కాగా లక్ష్మీప్రియను దారుణంగా హతమార్చిన శ్రీనివాసులు రెడ్డిని వెంటనే ఉరేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
లక్ష్మీప్రియను హతమార్చింది మేనమామే..
*ఐదేళ్ల చిన్నారి హత్య *తిరుచానూరులో విషాదం *పోలీస్‌స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన అభం శుభం తెలియని ఆ చిన్నారి పాలిట మామే కాలయముడయ్యాడు. మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని కానరాని లోకాలకు పంపాడు. కర్కశంగా నీళ్లలో ముంచేసి ప్రాణాలు తీసేశాడు. ఈ ఘటన సోమవారం తిరుచానూరులో కలకలాన్ని సృష్టించింది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. బంధువుల రోదనలు మిన్నంటాయి. బంగారంలాంటి బిడ్డ ప్రాణాలు తీసిన రాక్షసుడ్ని చంపేయాలంటూ ఆందోళనకు దిగారు.. తిరుచానూరు: ఐదేళ్ల చిన్నారి లక్ష్మీప్రియను వరుసకు మేనమామ హత్య చేయడం తిరుచానూరులో విషాదం నెలకొంది. తిరుచానూరు ఈతమాకుల వీధిలో నివాసముంటున్న పెంచల్‌రెడ్డి, మల్లీశ్వరి దంపతులకు లక్ష్మీప్రియ(5) ఒక్కటే కుమార్తె. స్థానిక వైష్ణవి విద్యాలయంలో యూకేజీ చదువుతోంది. ప్రతి రోజులానే సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్కూల్ వ్యానులో నుంచి లక్ష్మీప్రియతో పాటు ఇద్దరు పిల్లలు ఇంటి సమీపంలోని రేణిగుంట రోడ్డులో దిగారు. అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి అమ్మ భజనగుడివీధిలోని పెద్దమ్మ ఇంట్లో ఉందని చెప్పి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ఆ విషయాన్ని అక్కడున్న వారు మల్లీశ్వరికి చెప్పారు. పాపను తీసుకెళ్లిన వ్యక్తి దాదాపు నలభై ఏళ్ల వయసు కలిగి, నల్లగా, పొట్టిగా ఉన్నాడని, ఎరుపు రంగు టీషర్టు ధరించి ఉన్నాడని పాపతో పాటు బస్సు దిగిన లక్ష్మీప్రియ అక్క కొడుకులు జయసూర్య, యోగానంద తెలిపారు. దీంతో పాపానాయుడుపేటలోని వరుసకు అన్న అయిన శ్రీనివాసులురెడ్డే పాపను తీసుకెళ్లాడని మల్లీశ్వరి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుటాహుటిన ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐ సురేంద్రనాయుడు, ఎస్ఐలు మల్లేష్‌యాదవ్, చిరంజీవి, చిన్నారులు జయసూర్య, యోగానందను వెంటబెట్టుకుని పాపానాయుడుపేటకు వెళ్లారు. మార్గమధ్యంలో వికృతమాలకు వెళ్లేదారి వద్ద శ్రీనివాసులు రెడ్డి కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ వెనుక వికృతమాల గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న నీటి గుంతలో పాపను ముంచి హత్య చేసి, గుంత తీసి పూడ్చిపెట్టినట్టు అతను అంగీకరించాడు. అప్పటికే చీకటి కావడంతో మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారుల సమక్షంలో చిన్నారి మృతదేహాన్ని వెలికి తీయనున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన సోమవారం రాత్రి లక్ష్మీప్రియ హత్య వార్త వెలుగు చూడ్డంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడుని చంపేయాలని డిమాండ్ చేశారు. లేదా నిందితుడి కాళ్లు చేతులు తీసేయాలని, మరొకరు ఇలాంటి దారుణానికి పాల్పడకుండా ఉంటారని చెప్పారు. నిందితుడిని తమకు అప్పగించాల్సిందే అని పట్టుబట్టారు. డీఎస్పీ సర్ది చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. డబ్బు తగాదాలే హత్యకు కారణం..? చిన్నారి హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గతంలో లక్ష్మీప్రియ నాన్న పెంచల్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. -
ఐదేళ్ళ చిన్నారిని చంపేసిన మేనమామ
-
‘కళం’ కథేంటి?
కళం ఈ పేరుతో ఒక వైవిధ్యభరిత చిత్రం తెరకెక్కుతోంది. ఇది హారర్ కోవలో చేరే చిత్రమే. అయితే ఇది దెయ్యం ఇతి వృత్తమా? అన్న ప్రశ్నకు చిత్ర దర్శక నిర్మాతల నుంచి అవుననీ, కాదనీ కానీ సమాధానం రావడం లేదు. ఆ విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్న దర్శకుడు రాబర్ట్. ఎస్.రాజ్‌కు ఇది తొలి చిత్రం. సుభీష్ చంద్రన్ కథా, కథనం, సంభాషణలు రాసిన ఈ చిత్రాన్ని అరుళ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత పీకే చంద్రన్ నిర్మిస్తున్నారు. శ్రీనివాసన్ ఎన్ఎల్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం చుట్టకదై చిత్రం ఫేమ్ లక్ష్మీప్రియ హీరోయిన్గా నటిస్తున్నారు. మధుసూదన్‌రావు, అంజాద్, బేబి హిమ, రేఖ సురేష్, ఎస్ఎస్ మ్యూజిక్ ఫేమ్ పూజ, కణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రకాష్ నిక్కి సంగీతాన్ని ముఖేష్ జి ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. చిత్ర కథేంటన్న ప్రశ్నకు దర్శకుడు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన సంఘటనల ఇతివృత్తమే కళం చిత్రం అన్నారు. చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకొందని దర్శకుడు తెలిపారు.