land grabbings
-
పేదలను బెదిరించారు..‘అసైన్డ్’ కాజేశారు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బరితెగించి పాల్పడిన భారీ భూదోపిడీ బండారం బట్టబయలైంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు పక్కాగా అమలుచేసిన కుతంత్రం ఆధారాలతో సహా నిగ్గుతేలింది. ఏకంగా రూ.3,737.30 కోట్ల విలువైన 617.70 ఎకరాల అసైన్డ్ భూదోపిడీ విస్మయపరుస్తోంది. ఈ భూములకు పరిహారం ఇవ్వబోమని అప్పట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి వారి భూములను చంద్రబాబు, నారాయణ, తదితర టీడీపీపెద్దలు 814 మంది బినామీల ముసుగులో హస్తగతం చేసుకుని దేశ చరిత్రలోనే అత్యంత భారీ అసైన్డ్ భూకుంభకోణానికి తెగబడ్డారు. అనంతరం.. అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించి వారి కుతంత్రాన్ని చాటుకున్నారు. ఈ భూములను అన్యాక్రాంతం చేయడానికిగానీ దాన్ని అధికారికంగా గుర్తించడానికిగానీ వీల్లేదన్న ఉన్నతాధికారుల లిఖితపూర్వక అభ్యంతరాలను వారు బేఖాతరు చేశారు. పైగా.. రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను గల్లంతు చేసేసి.. అసలు 1954 నుంచి 2014 వరకు అమరావతి పరిధిలో పేదలకు భూ పంపిణీనే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్ని మోసంచేసిన తీరు వ్యవస్థలను మోసం చేయడంలో చంద్రబాబు తెగింపునకు అద్దంపడుతోంది. కానీ, ఇప్పుడు వీరి పాపం పండింది.. కథ అడ్డం తిరిగింది. చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌ల కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సాగిన ఈ అసైన్డ్ భూదోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూముల పంపిణీ రికార్డులు కూడా వెలుగులోకి రావడంతో పచ్చముఠా పన్నాగం బెడిసికొట్టినట్లయింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు ‘సాక్షి’ సేకరించింది. పచ్చ గద్దల అసైన్డ్ భూదోపిడీపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాల్లో మొదటి భాగం ఇది.. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో దోపిడీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు దేశ చరిత్రలో ఏ పాలకుడు కూడా పాల్పడని దారుణానికి తెగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి మరీ వారి అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ నంబరు 1ను జారీచేశారు. ఆ జీఓలో అమరావతిలోని ప్రైవేటు భూములకు మాత్రమే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. కాబట్టి తమకు ఆ భూములు విక్రయిస్తే ఎంతోకొంతైనా డబ్బులు వస్తాయని మభ్యపెట్టారు. అందుకోసం ఆర్కే హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతోపాటు తమ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి దుష్ప్రచారం చేయించారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు సేల్డీడ్ల ద్వారా తమ అసైన్డ్ భూములను విక్రయించారు. అలా.. ఆ ముఠా ఏడాదిపాటు తమ పన్నాగాన్ని పక్కగా అమలుచేసి అసైన్డ్ భూములన్నింటినీ తమ బినామీల పరం చేశారు. ఆ తరువాత చంద్రబాబు అసలు కుట్రను తెరపైకి తెచ్చారు. అసైన్డ్ భూములకు కూడా ఆరు కేటగిరీల కింద విభజించి 2016, ఫిబ్రవరి 17న జీఓ నంబరు 41 ద్వారా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. ఎంతగా అంటే.. ఎకరాలోపు ఉన్న భూమికి కూడా ఎకరా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. ఎందుకంటే అసైన్డ్ భూములను చిన్నచిన్న బిట్లుగానే తమ బినామీల పేరిట పచ్చ ముఠా చేజిక్కిచ్చుకుంది. తద్వారా ఎక్కువ ప్యాకేజీ వచ్చేలా కథ నడిపింది. ఆ మేరకు చంద్రబాబు, నారాయణ, టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూముల సమీకరణ ప్యాకేజీని సీఆర్డీఏ వర్తింపజేసింది. అలా చంద్రబాబు చట్ట ప్రకారం ఆ ప్యాకేజీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను దారుణంగా మోసగించారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతరు.. నిజానికి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. అలా చట్ట విరుద్ధంగా కొనుగోలు చేసిన వారికి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడానికే వీల్లేదు. చట్ట ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశముంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయడంగానీ విక్రయించడంగానీ చట్ట విరుద్ధం. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులు అసైన్డ్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్‌తోపాటు సీఆర్డీఏ, సీసీఎల్ఏ అధికారులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తంచేశారు. కానీ, అప్పటి మున్సిపల్–సీఆర్డీఏ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ ఉన్నతాధికారలుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అది మీకు సంబంధంలేని వ్యవహారం. మేం చెప్పినట్లు చేయండి. పైస్థాయిలో నేను మాట్లాడతాను’.. అని వారికి హుకుం జారీచేశారు. అప్పటి అడ్వకేట్ జనరల్ కూడా అసైన్డ్ భూముల అన్యాక్రాంతాన్ని గుర్తించడానికి చట్టం అనుమతించదని స్పష్టంచేశారు. ఈ మేరకు అప్పటి కలెక్టర్, సీఆర్డీఏ, రెవెన్యూ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ తమ అభ్యంతరాలను జీఓ–41 నోట్ ఫైళ్లలో లిఖితపూర్వకంగా తెలిపారు. కానీ, వారి అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేశారు. కోర్టును సైతం మోసం చేసి మరీ.. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేయడం విస్మయపరుస్తోంది. చట్ట ప్రకారం 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కానీ, తమ కుట్రను అమలుచేసేందుకు ఏకంగా అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను చంద్రబాబు, నారాయణ మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించారు. ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అంటే.. అమరావతి పరిధిలో ఉన్న అసైన్డ్ భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే తప్ప.. ఆ తరువాత 2015లోగా అసలు భూపంపిణీయే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్నే పక్కదారి పట్టించారు. కానీ, 1954 తరువాత చాలాసార్లు పేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా 2004–05లో అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. కానీ, ఆ రికార్డులన్నీ మాయం చేసేశారు. అమరావతిలో ఉన్న భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే అని చెబుతూ, వాటిని విక్రయించేందుకు.. కొనుగోలు చేసేందుకు చట్టం అనుమతిస్తుందని వక్ర భాష్యం చెబుతూ న్యాయస్థానాన్ని మోసగించిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుంది. పత్రాలు వెలుగులోకి.. పచ్చ కుట్ర బట్టబయలు ఇలా.. ఎంత మసిపూసి మారెడుకాయ చేయాలని చూసినా చంద్రబాబు భూదోపిడీ కుట్ర బట్టబయలైంది. అమరావతిలోని అసైన్డ్ భూములలో 1954కు తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నాయన్న రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1987, 2004–05లలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని తేలింది. దీనిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమగ్ర విచారణలో మొత్తం భూబాగోతం వెలుగుచూసింది. అమరావతి పరిధిలో 1954 తరువాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 2014–19 మధ్య జరిగిన అసైన్డ్ భూముల అన్యాక్రాంతం కుంభకోణంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కూడా లిఖితపూర్వకంగా నివేదించారు. సిట్ బృందాలు అమరావతి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సర్వే నిర్వహించడంతోపాటు సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాయి. దాంతో గణాంకాలతో సహా పూర్తి ఆధారాలతో అసైన్డ్ భూముల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లు, సీఆర్డీఏ ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీలోని అసైన్డ్ రైతుల పేర్లను సరిపోల్చి చూడగా అసలు బండారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లోని అసైన్డ్ భూముల రైతులకు, సీఆర్డీఏ ప్రకటించిన ప్యాకేజీలోని అసైన్డ్ భూముల రైతుల పేర్లకు ఏమాత్రం పొంతన లేనేలేదు. దాంతో చట్ట విరుద్ధంగా చంద్రబాబు, నారాయణ కొల్లగొట్టిన అసైన్డ్ భూముల చిట్టా బయటపడింది. ఏకంగా 617.70 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ ముఠా కొల్లగొట్టిందన్నది తేలిపోయింది. కేటగిరీలూ అనుకూలంగానే.. ఇక జీఓ–41 ప్రకారం ఆరు కేటగిరీల కింద నాటి ప్రభుత్వం ప్యాకేజిని ప్రకటించింది. వాటిలో నాలుగు కేటగిరీల కింద చంద్రబాబు, నారాయణ తమ బినామీల పేరిట అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. ఆ నాలుగు కేటగిరీలకు జరీబు భూములకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీ ఇలా ఉంది.. రూ.3,737.30 కోట్ల అసైన్డ్ భూదోపిడీ మరోవైపు.. నాలుగు కేటగిరీ కింద దోపిడీ చేసిన 617.70 ఎకరాల అసైన్డ్ భూములకు చంద్రబాబు, నారాయణ గ్యాంగ్ ప్యాకేజీ ద్వారా ఏకంగా రూ.3,737.30 కోట్లు దక్కించుకుంది. ఎందుకంటే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన తరువాత అమరావతిలో నివాస స్థలం చ.గజం మార్కెట్ ధర కనీసం రూ.30వేలు, వాణిజ్య స్థలం మార్కెట్ ధర చ.గజం కనీసం రూ.50వేలు చొప్పున విక్రయాలు సాగాయి. ఇక అమరావతి నిర్మించిన తరువాత వాటి విలువ మరింత భారీగా పెరుగుతుంది కూడా. ఇక భూసమీకరణ ప్యాకేజీలో కనీస విలువగా ఎకరా ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. ఎకరా లోపు భూమిని తీసుకున్నా సరే ఎకరాకు ప్యాకేజీ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు, నారాయణ తమ బినామీలు ఎక్కువ మంది ద్వారా చిన్న చిన్న కమతాలను చేజిక్కించుకున్నారు. తద్వారా ప్రతీ బినామీకి కనీసం ఎకరా ప్యాకేజీ వచ్చేలా చేశారు. -
పేదలను బెదిరించారు..‘అసైన్డ్’ కాజేశారు
(వడ్డాది శ్రీనివాస్/సాక్షి, అమరావతి): టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బరితెగించి పాల్పడిన భారీ భూదోపిడీ బండారం బట్టబయలైంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు పక్కాగా అమలుచేసిన కుతంత్రం ఆధారాలతో సహా నిగ్గుతేలింది. ఏకంగా రూ.3,737.30 కోట్ల విలువైన 617.70 ఎకరాల అసైన్డ్ భూదోపిడీ విస్మయపరుస్తోంది. ఈ భూములకు పరిహారం ఇవ్వబోమని అప్పట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి వారి భూములను చంద్రబాబు, నారాయణ, తదితర టీడీపీపెద్దలు 814 మంది బినామీల ముసుగులో హస్తగతం చేసుకుని దేశ చరిత్రలోనే అత్యంత భారీ అసైన్డ్ భూకుంభకోణానికి తెగబడ్డారు. అనంతరం.. అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించి వారి కుతంత్రాన్ని చాటుకున్నారు. ఈ భూములను అన్యాక్రాంతం చేయడానికిగానీ దాన్ని అధికారికంగా గుర్తించడానికిగానీ వీల్లేదన్న ఉన్నతాధికారుల లిఖితపూర్వక అభ్యంతరాలను వారు బేఖాతరు చేశారు. పైగా.. రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను గల్లంతు చేసేసి.. అసలు 1954 నుంచి 2014 వరకు అమరావతి పరిధిలో పేదలకు భూ పంపిణీనే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్ని మోసంచేసిన తీరు వ్యవస్థలను మోసం చేయడంలో చంద్రబాబు తెగింపునకు అద్దంపడుతోంది. కానీ, ఇప్పుడు వీరి పాపం పండింది.. కథ అడ్డం తిరిగింది. చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌ల కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సాగిన ఈ అసైన్డ్ భూదోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూముల పంపిణీ రికార్డులు కూడా వెలుగులోకి రావడంతో పచ్చముఠా పన్నాగం బెడిసికొట్టినట్లయింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు ‘సాక్షి’ సేకరించింది. పచ్చ గద్దల అసైన్డ్ భూదోపిడీపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాల్లో మొదటి భాగం ఇది.. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో దోపిడీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు దేశ చరిత్రలో ఏ పాలకుడు కూడా పాల్పడని దారుణానికి తెగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి మరీ వారి అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ నంబరు 1ను జారీచేశారు. ఆ జీఓలో అమరావతిలోని ప్రైవేటు భూములకు మాత్రమే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. కాబట్టి తమకు ఆ భూములు విక్రయిస్తే ఎంతోకొంతైనా డబ్బులు వస్తాయని మభ్యపెట్టారు. అందుకోసం ఆర్కే హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతోపాటు తమ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి దుష్ప్రచారం చేయించారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు సేల్డీడ్ల ద్వారా తమ అసైన్డ్ భూములను విక్రయించారు. అలా.. ఆ ముఠా ఏడాదిపాటు తమ పన్నాగాన్ని పక్కగా అమలుచేసి అసైన్డ్ భూములన్నింటినీ తమ బినామీల పరం చేశారు. ఆ తరువాత చంద్రబాబు అసలు కుట్రను తెరపైకి తెచ్చారు. అసైన్డ్ భూములకు కూడా ఆరు కేటగిరీల కింద విభజించి 2016, ఫిబ్రవరి 17న జీఓ నంబరు 41 ద్వారా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. ఎంతగా అంటే.. ఎకరాలోపు ఉన్న భూమికి కూడా ఎకరా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. ఎందుకంటే అసైన్డ్ భూములను చిన్నచిన్న బిట్లుగానే తమ బినామీల పేరిట పచ్చ ముఠా చేజిక్కిచ్చుకుంది. తద్వారా ఎక్కువ ప్యాకేజీ వచ్చేలా కథ నడిపింది. ఆ మేరకు చంద్రబాబు, నారాయణ, టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూముల సమీకరణ ప్యాకేజీని సీఆర్డీఏ వర్తింపజేసింది. అలా చంద్రబాబు చట్ట ప్రకారం ఆ ప్యాకేజీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను దారుణంగా మోసగించారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతరు.. నిజానికి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. అలా చట్ట విరుద్ధంగా కొనుగోలు చేసిన వారికి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడానికే వీల్లేదు. చట్ట ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశముంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయడంగానీ విక్రయించడంగానీ చట్ట విరుద్ధం. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులు అసైన్డ్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్‌తోపాటు సీఆర్డీఏ, సీసీఎల్ఏ అధికారులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తంచేశారు. కానీ, అప్పటి మున్సిపల్–సీఆర్డీఏ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ ఉన్నతాధికారలుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అది మీకు సంబంధంలేని వ్యవహారం. మేం చెప్పినట్లు చేయండి. పైస్థాయిలో నేను మాట్లాడతాను’.. అని వారికి హుకుం జారీచేశారు. అప్పటి అడ్వకేట్ జనరల్ కూడా అసైన్డ్ భూముల అన్యాక్రాంతాన్ని గుర్తించడానికి చట్టం అనుమతించదని స్పష్టంచేశారు. ఈ మేరకు అప్పటి కలెక్టర్, సీఆర్డీఏ, రెవెన్యూ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ తమ అభ్యంతరాలను జీఓ–41 నోట్ ఫైళ్లలో లిఖితపూర్వకంగా తెలిపారు. కానీ, వారి అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేశారు. కోర్టును సైతం మోసం చేసి మరీ.. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేయడం విస్మయపరుస్తోంది. చట్ట ప్రకారం 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కానీ, తమ కుట్రను అమలుచేసేందుకు ఏకంగా అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను చంద్రబాబు, నారాయణ మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించారు. ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అంటే.. అమరావతి పరిధిలో ఉన్న అసైన్డ్ భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే తప్ప.. ఆ తరువాత 2015లోగా అసలు భూపంపిణీయే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్నే పక్కదారి పట్టించారు. కానీ, 1954 తరువాత చాలాసార్లు పేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా 2004–05లో అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. కానీ, ఆ రికార్డులన్నీ మాయం చేసేశారు. అమరావతిలో ఉన్న భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే అని చెబుతూ, వాటిని విక్రయించేందుకు.. కొనుగోలు చేసేందుకు చట్టం అనుమతిస్తుందని వక్ర భాష్యం చెబుతూ న్యాయస్థానాన్ని మోసగించిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుంది. పత్రాలు వెలుగులోకి.. పచ్చ కుట్ర బట్టబయలు ఇలా.. ఎంత మసిపూసి మారెడుకాయ చేయాలని చూసినా చంద్రబాబు భూదోపిడీ కుట్ర బట్టబయలైంది. అమరావతిలోని అసైన్డ్ భూములలో 1954కు తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నాయన్న రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1987, 2004–05లలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని తేలింది. దీనిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమగ్ర విచారణలో మొత్తం భూబాగోతం వెలుగుచూసింది. అమరావతి పరిధిలో 1954 తరువాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 2014–19 మధ్య జరిగిన అసైన్డ్ భూముల అన్యాక్రాంతం కుంభకోణంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కూడా లిఖితపూర్వకంగా నివేదించారు. సిట్ బృందాలు అమరావతి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సర్వే నిర్వహించడంతోపాటు సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాయి. దాంతో గణాంకాలతో సహా పూర్తి ఆధారాలతో అసైన్డ్ భూముల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లు, సీఆర్డీఏ ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీలోని అసైన్డ్ రైతుల పేర్లను సరిపోల్చి చూడగా అసలు బండారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లోని అసైన్డ్ భూముల రైతులకు, సీఆర్డీఏ ప్రకటించిన ప్యాకేజీలోని అసైన్డ్ భూముల రైతుల పేర్లకు ఏమాత్రం పొంతన లేనేలేదు. దాంతో చట్ట విరుద్ధంగా చంద్రబాబు, నారాయణ కొల్లగొట్టిన అసైన్డ్ భూముల చిట్టా బయటపడింది. ఏకంగా 617.70 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ ముఠా కొల్లగొట్టిందన్నది తేలిపోయింది. కేటగిరీలూ అనుకూలంగానే.. ఇక జీఓ–41 ప్రకారం ఆరు కేటగిరీల కింద నాటి ప్రభుత్వం ప్యాకేజిని ప్రకటించింది. వాటిలో నాలుగు కేటగిరీల కింద చంద్రబాబు, నారాయణ తమ బినామీల పేరిట అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. ఆ నాలుగు కేటగిరీలకు జరీబు భూములకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీ ఇలా ఉంది.. రూ.3,737.30 కోట్ల అసైన్డ్ భూదోపిడీ మరోవైపు.. నాలుగు కేటగిరీ కింద దోపిడీ చేసిన 617.70 ఎకరాల అసైన్డ్ భూములకు చంద్రబాబు, నారాయణ గ్యాంగ్ ప్యాకేజీ ద్వారా ఏకంగా రూ.3,737.30 కోట్లు దక్కించుకుంది. ఎందుకంటే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన తరువాత అమరావతిలో నివాస స్థలం చ.గజం మార్కెట్ ధర కనీసం రూ.30వేలు, వాణిజ్య స్థలం మార్కెట్ ధర చ.గజం కనీసం రూ.50వేలు చొప్పున విక్రయాలు సాగాయి. ఇక అమరావతి నిర్మించిన తరువాత వాటి విలువ మరింత భారీగా పెరుగుతుంది కూడా. ఇక భూసమీకరణ ప్యాకేజీలో కనీస విలువగా ఎకరా ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. ఎకరా లోపు భూమిని తీసుకున్నా సరే ఎకరాకు ప్యాకేజీ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు, నారాయణ తమ బినామీలు ఎక్కువ మంది ద్వారా చిన్న చిన్న కమతాలను చేజిక్కించుకున్నారు. తద్వారా ప్రతీ బినామీకి కనీసం ఎకరా ప్యాకేజీ వచ్చేలా చేశారు. -
చంద్రబాబు టార్గెట్ అదే..!
సాక్షి, విజయవాడ : పేదల భూములు కొట్టేసి ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బెదిరించి 33 వేల ఎకరాల భూమిని లాక్కుని రైతులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. టీడీపీ నేతలు చాలా చోట్ల రికార్డులు తారుమారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘2017ను టీడీపీ భూకబ్జాల సంవత్సరం’గా అభివర్ణించారు. హుద్‌హుద్‌లో భూరికార్డులు హుష్‌కాకి.. : ‘‘రైతులు, కూలీలను ద్వేషించే చంద్రబాబు నాయుడు.. హుద్‌హుద్ తుఫాను తర్వాత రెవెన్యూ రికార్డులను మాయం చేసి, విశాఖ జిల్లాలో లక్షల ఎకరాలను కాజేశారు. ఆ కుంభకోణంపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగలేదు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని రైతులను బెదిరించి 33 వేల ఎకరాలను కాజేశారు. దాంతో లక్షల మంది రైతు కూలీలు, కౌలు రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని కోర్టులు మొట్టికాయలు వేసినా టీడీపీ సర్కారు తీరు మారలేదు. గడిచిన మూడున్నరేళ్లలో వేలమంది రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయే తప్ప రాజధానిలో శాశ్వత నిర్మాణమంటూ ఒక్కటీ జరగలేదు. అసలు రాజధానిని కట్టాలన్న ఆలోచనే చంద్రబాబుకు లేదు’’ అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ప్రతిపక్షం లేకుండా శాసనసభను నడిపడం సిగ్గుమాలిన చర్య అని వ్యాఖ్యానించిన ఆర్కే.. 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేసేందుకు బాబు విఫలయత్నం చేశారని గుర్తుచేశారు. ఇప్పటికైనా రైతుల పొట్టకొట్టే విధానాలకు చంద్రబాబు స్వస్తిపలకాలని హితవుచెప్పారు. -
నయీం అనుచరుడి అనుమానాస్పద మృతి
-
నయీం అనుచరుడి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ముఖ్య అనుచరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నయీం ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యుడు పుల్లరి మహేష్ అలియాస్ ప్రసాద్ బుధవారం సిద్దిపేటలోని ఓ ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో విగతజీవిగా కనిపించాడు. మహేష్ కోసం కొన్ని రోజులుగా సిట్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నాలుగు నెలలుగా పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నాడు. ఆరు హత్య కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు. నయీంతో కలసి పలు భూ దందాల్లో పాల్గొనట్లు తెలుస్తోంది. అనూహ్యంగా ఇతను మృతిచెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహేషే ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా అతన్ని హతమార్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నయీం గ్యాంగ్‌లో కీలక సభ్యుడు సామా సంజీవరెడ్డిని అరెస్టు చేసిన రోజే మరో అనుచరుడైన మహేష్ అనుమానాస్పదంగా మృతి చెందడం అనుమానాలకు దారితీస్తోంది. -
నయీం గ్యాంగ్‌పై బాధితురాలి ఫిర్యాదు
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీంపై మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఓ ఫిర్యాదు నమోదైంది. నయీం గ్యాంగ్ తమను బెదిరించి ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకున్నట్లు మేడ్చల్‌కు చెందిన వరలక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు వరలక్ష్మీ వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో వరలక్ష్మికి 8 ఎకరాల పొలం ఉంది. ఈ పొలాన్ని ఆమె భర్త బాలకృష్ణ 2003లో కొనుగోలు చేశాడు. అనారోగ్యంతో బాలకృష్ణ 2009లో చనిపోయాడు. అనంతరం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి మేడ్చల్‌లో ఉంటోంది. అప్పటికే ఈ భూమిపై ఓ కేసు పెండింగ్‌లో ఉండగా... దీనిపై నయీం అనుచరుల కన్ను పడింది. ఎనిమిది నెలల కిందట అంజయ్య అనే వ్యక్తి భువనగిరి రాజు, కృష్ణ అనే న్యాయవాది, మరికొందరు నయీం అనుచరులమని బెదిరించారని వరలక్ష్మీ వాపోయింది. తమ నుంచి ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకుని రూ.50 వేల నగదు చెల్లించి ఆ భూమిని వారికే ఇవ్వాలన్నారని చెప్పింది. ఆ తర్వాత భువనగిరి రాజు వరలక్ష్మి మామయ్యకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని బెదిరించాడని ఆమె తెలిపింది. ఈ విషయంలో తేడా వస్తే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'నయీం 28 ఎకరాలు కబ్జా చేసి..మా వాళ్లను చంపేశాడు'
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో నయీంపై ఆదివారం పెద్ద సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. 12 ఏళ్ల క్రితం తమ 28 ఎకరాల పొలాన్ని నయీం గ్యాంగ్ కబ్జా చేయడంతో పాటు తన భర్త, కొడుకును పొట్టన పెట్టుకున్నాడని బాధితురాలు మల్లమ్మ ఆరోపిస్తోంది. దీనిపై ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆదిభట్లలో తమ బంధువులను కూడా నయీం ముఠా బెదిరించి భూ కబ్జాకు పాల్పడినట్లు ఆమె చెబుతోంది. కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఇళ్లల్లో పాచిపని చేస్తూ జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వం ఆదుకోవాలని మల్లమ్మ కోరుతుంది. -
ఆదిభట్లలోనూ నయీం ఆగడాలు!
నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లను బెదిరించి కోట్ల విలువైన భూములను ఈ ముఠా కొట్టేసినట్లు బయటకు వస్తోంది. ఇటీవలి కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల ప్రాంతంలో కూడా నయీం ముఠా ఆగడాలకు పాల్పడింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదిభట్ల ప్రాంతంలో తనకున్న 41 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు నయీం ముఠా ప్రయత్నించిందని బాధితుడు లయన్ లింగారెడ్డి 'సాక్షి'కి తెలిపారు. భూమి అప్పగించాలంటూ తనను బెదిరించారని, తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఆ 41 ఎకరాలను కబ్జా చేసేందుకు వాళ్లు ప్రయత్నించారని చెప్పారు. వందలమంది రౌడీలను తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టించారని, దాంతో తాను పోలీసులను ఆశ్రయించగా.. ఆ తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని లింగారెడ్డి అన్నారు. తన భూమిని కబ్జా చేయడమే కాక, తనమీద తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. ప్రోత్సహించింది ప్రభుత్వం, పోలీసులే కాగా నయీంను గత ప్రభుత్వాలు, పోలీసులే ప్రోత్సహించారని నయీం చేతిలో హతమైన బెల్లి లలిత సోదరి కవిత ఆరోపించారు. నయీం అనుచరులను కూడా హతమార్చాలని ఆమె డిమాండ్ చేశారు. నయీంకు సహకరించిన రాజకీయ నేతల అంతు కూడా చూడాలన్నారు. -
యథేచ్ఛగా తమ్ముళ్ల భూ కబ్జాలు !!
దర్శి: తెలుగు తమ్ముళ్ల అక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కనిపించిన కాడికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమంగా దున్నుకోవడం, మేమున్నామంటూ భరోసా ఇచ్చి ఆ భూములను ఇంకొకరికి అమ్ముకోవడం మామూలైంది. ఫిర్యాదుదారులు వెళ్లి చెప్పినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామం 370 సర్వే నంబరులో 70 ఎకరాల పశువుల పోరంబోకు భూమిని ఆక్రమించుకోవడానికి తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేసుకున్నారు. సాగర్ కాలువ సమీపంలోనే ఆ భూమి ఉండటంలో దాని విలువ పెరిగింది. దీంతో ట్రాక్టర్లతో దున్నుకోవడం మొదలుపెట్టారు. వీటితో పాటు 357/2 సర్వే నంబర్లో 657 ఎకరాల భూమి ఉండగా అందులో ఎస్సీలకు 170, బీసీ లకు 124 ఎకరాలకు గతంలో పట్టాలు ఇచ్చారు. మిగిలిన 363 ఎకరాల్లో 70 ఎకరాలు 22 మంది పేర్లతో పట్టాలున్నాయంటూ ఆక్రమించుకుని అమ్ముకోవడానికి నకిలీ పత్రాలు సృష్టించి గతంలో రంగం సిద్ధం చేసుకున్నారు. ఆర్డీవోకు ఈ విషయం తెలిసి ఆ పత్రాలను రద్దు చేసి భూమి లేని పేదలకు అందజేయాలని అప్పటి తహశీల్దార్‌ను ఆదేశించారు. మిగతా 293 ఎకరాల్లో కొంత ఆక్రమణలకు గురికాగా, కొంత భూమి ఆక్రమణదారుల కనుసన్నల్లో ఉంది. బొట్లపాలెం గ్రామం ఆనుకుని గంగవరం వెళ్లే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న 612 సర్వే నంబరులో 90 ఎకరాలు భూమి ఉండగా ఇప్పటికి 80 ఎకరాలకు పైగా ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. 10 ఎకరాలు వాగులు, వంకలు మాత్రమే వదిలిపెట్టారు. 40 సర్వే నంబరులోని 140 ఎకరాల వాగు పోరంబోకు భూమిలో పంటలు వేసుకుని పండించుకుంటున్నారు. 416 సర్వే నంబరులోని బ్రహ్మంగారి గుడి వెనుక చీకటీగల దిన్నె గడ్డలోని 40 ఎకరాల భూమి కొంత ఆక్రమించుకుని సాగు చేసుకోగా కొంత బీడుగా ఉంది. ఈ భూమిని ఆనుకుని గార్లవాగుకు పడమర వైపు 40 ఎకరాలు ఆక్రమణలకు గురైంది. చెట్టు చెరువు తొట్టి వద్ద 70 ఎకరాల ప్రభుత్వ భూమిలో 40 ఎకరాలు ఆక్రమణల పాలైంది. 357/1 సర్వే నంబరులో 40 ఎకరాలు ప్రభుత్వ భూమి పూర్తిగా పరులపాలైంది. నకిలీ పత్రాలు సృష్టించారా..? గ్రామంలో తమకు పాస్‌పుస్తకాలు కూడా ఉన్నాయని కొందరు ఆక్రమణదారులు చెప్తున్నట్లు సమాచారం. అయితే నకిలీ పట్టాలు, నకిలీ దొంగ పాస్‌పుస్తకాలు సృష్టించినట్లు మరి కొందరు చర్చించుకుంటున్నారు. ఆ పత్రాలు ఆక్రమణ దారులకు ఇచ్చేందుకు భారీ మొత్తంలో రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించినట్లు సమాచారం. భూములపై చర్యలేవీ: ఈ ఆక్రమణలన్నీ అధికారులకు తెలియకుండానే జరుగుతున్నాయూ అనేది ప్రశ్నార్థకమైంది. ఆ గ్రామానికి చెందిన కొందరు తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం ఆక్రమణల విషయం మా దృష్టికి కూడా వచ్చింది. వీఆర్వోను తనిఖీ నిమిత్తం అక్కడికి పంపించాం. అక్కడ అలాంటిదేమీ లేదని వీఆర్వో చెప్పారు. మళ్లీ వెళ్లి తనిఖీ చేసి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. - మస్తాన్, ఇన్చార్జ్ తహశీల్దార్ -
125 గజాల లోపు ఉచితంగా క్రమబద్ధీకరణ: కేసీఆర్
హైదరాబాద్ నగరంలో 125 గజాల లోపు నివాసం ఉంటున్న పేదలకు ఉచితంగా ఆయా భూములను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 250-300 గజాలలోపు నివాసం ఉంటున్న మధ్యతరగతి వారికి కొద్దిపాటి ధరతో క్రమబద్ధీకరిస్తామన్నారు. 500 గజాలలోపు నివాసం ఉండేవారికి 100 గజాలకు చొప్పున ధర పెంచుతూ క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో భూకబ్జాల దుకాణం బంద్ కావాలని, పేదలకు నీడ కల్పించేందుకు ఉదారంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. భూముల క్రమబద్ధీకరణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీల ముందు పలు ప్రతిపాదనలను కేసీఆర్ పెట్టారు. 500 గజాలపైన నివాసం ఉండేవారికి భారీ మొత్తంలో ధర నిర్ణయించి క్రమబద్ధీకరిస్తామన్నారు. 15 నుంచి 50 గజాల లోపు స్థలంలో ఎవరైనా నివాసం ఉంటుంటే, వారికి అదేచోట ఇల్లు ఏర్పాటు చేస్తామన్నారు. భూముల క్రమబద్ధీకరణ కోసం అధికారులు, వివిధ పార్టీల నేతలతో కమిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. -
భూకబ్జాలు, అక్రమ సంపాదనే వారి దారి
తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ సంపాదనలపై అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ సంపాదన మీదే దృష్టి పెట్టరాని, జిల్లా వ్యాప్తంగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. పెనుకొండ, పుట్టపర్తిలో ఇసుక అక్రమరవాణా చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్‌నారాయణ, ఎర్రిస్వామిరెడ్డి తదితరులు కోరారు.