large amount of money
-
పెద్ద మొత్తంలో డిపాజిట్ చేశారా? అయితే...
సాక్షి, న్యూఢిల్లీ : పాత నోట్ల రద్దు తర్వాత డిపాజిట్ చేసిన పెద్ద మొత్తాల నగదుపై ఆదాయపు పన్ను శాఖ మరోసారి హెచ్చరికలు జారీచేసింది. నోట్ల రద్దు తర్వాత డిపాజిట్ చేసిన ఈ మొత్తాలతో మార్చి 31 వరకు రిటర్నులు దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ రిటర్నులు దాఖలు చేయకపోతే, జరిమానాలు, న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అర్హులైన ట్రస్ట్‌లు, రాజకీయ పార్టీలు, అసోసియేషన్లు ఈ తుది డెడ్‌లైన్ వరకు ఆదాయపు పన్ను రిటర్నలు దాఖలు చేసి, క్లీన్‌చీట్ పొందాలని పేర్కొంది. ప్రముఖ దినపత్రికల్లో ప్రజా ప్రకటనల ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఈ ఆదేశాలను జారీచేసింది. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు గాను ఐటీఆర్‌లను సమీక్షించుకోవడానికి, పెండింగ్‌లో ఉన్న రిటర్నులు దాఖలు చేయడానికి ఇదే తుది ఆదేశంగా పేర్కొంది. ఒకవేళ మీరు బ్యాంకు అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తే.. ఐటీఆర్‌లను ఫైల్ చేయాలని, లేదంటే పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ అడ్వయిజరీ కూడా హెచ్చరించింది. అన్ని కంపెనీలు, సంస్థలు, బాధ్యతాయుత భాగస్వామ్య సంస్థలు, ట్రస్టులు, అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు ఎవరూ కూడా దీనికి మినహాయింపు కాదని, అందరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయమున్న వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, రూ.3 లక్షలకు పైన, రూ.5 లక్షలకు పైన ఉన్నఆదాయమున్న సీనియర్ సిటిజన్లందరూ ఈ ఆర్థిక సంవత్సరాలకు గాను రిటర్నులు దాఖలు చేయాలని ప్రకటించింది. -
పోలీసుల తనిఖీల్లో భారీమొత్తంలో నగదు స్వాధీనం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా తరలిస్తున్న నగదును ప్రతిరోజూ భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోలనే ఇప్పటి వరకు మూడు కోట్ల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల బంగారం, వెండిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఓ వ్యక్తి నుంచి పోలీసులు 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మరో వ్యక్తి నుంచి లక్షా ఆరు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. కారులో తరలిస్తున్న 7లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు బైపాస్ రోడ్డుపై కారులో తరలిస్తున్న రెండు లక్షల 70ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో గత ఆదివారం ఆటోలో తరలిస్తున్న 9 లక్షల 50 వేల రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హవలి చెక్‌పోస్ట్ వద్ద ఒక వ్యక్తి నుంచి లక్షా 10 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ జిల్లాలోని పరిగి చెక్‌పోస్ట్ వద్ద గత ఆదివారం కారులో తరలిస్తున్న 9 లక్షల రూపాయిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.