ఆర్ధికశాస్త్రంలో ముగ్గురు అమెరికన్లకు నోబెల్
స్టాక్హోమ్: ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు అమెరికన్లను వరించింది. అమెరికా ఆర్థికవేత్తలు యూజీన్ ఫామా, లార్స్ పీటర్ హన్సెన్, రాబర్ట్ షిల్లర్కు 2013గానూ నోబెల్ పురస్కారం దక్కింది. అనుభావిక విశ్లేషణతో ఆస్తుల ధరల మదింపులో విశేష ప్రతిభ చూపినందుకు వారిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది.
1968 నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నారు. గతేడాది కూడా ఇద్దరు అమెరికన్లు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ దక్కించుకోవడం విశేషం. 2011లోనూ ఇద్దరు అమెరికన్లు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ సాధించారు.