Lasenjelis
-
ఆస్కార్-2019: విజేతలు వీరే
లాస్ఏంజెల్స్: చలనచిత్ర పరిశ్రమలో ప్రపంచ అత్యున్నత అవార్డు ఆస్కార్ 2019ను ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ స్టేడియంలో 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఉత్తమ సహాయనటిగా రెజినా కింగ్‌ను ఈ ఏడాది ఆస్కార్ వరించింది. ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ అనే చిత్రంలో అత్యుత్తమ నటన కనబర్చినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్ ఉత్తమ దర్శకుడు: అల్ఫోన్సో క్యురాన్ (రోమా) రామి మాలిక్(బెహమానియా రాస్పోడీ) ఉత్తమ నటి: ఓల్వియా కోల్మెన్(ది ఫేవరెట్) ఉతమ క్యాస్టుమ్ డిజైనర్: రూత్ కార్టర్ (బ్లాక్ పాంతర్) ఉతమ విదేశీ చిత్రం: రోమ (మెక్సికో) ఉత్తమ స్క్రీన్‌ప్లే: గ్రీన్‌బుక్ ఉత్తమ సహాయనటుడు: మహేర్షేలా అలీ (గ్రీన్ బుక్) ఉతమ డాక్యుమెంటరీ మూవీ: ఫ్రీ సోలో ఉతమ సినీమాటోగఫ్రీ: అల్ఫాన్సోరోన్ (రోమ) ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, సౌండ్ ఎడిటింగ్-బెహమైన్ రాప్పోడి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్-‘స్పైడర్ మ్యాన్ (ఇన్‌టూ ది స్పైడర్ వెర్స్) (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కంపు భరించలేక.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఇంతవరకూ రకరకాల కారణాల వల్ల విమానాలను అత్యవసరంగా దింపిన సందర్భాలున్నాయి. కానీ అమెరికాకు చెందిన ఓ విమానాన్ని మాత్రం ఓ కుక్క మలవిసర్జన చేయడం వల్లే అత్యవసరంగా దింపేయాల్సి వచ్చింది. విచిత్రమైన ఈ సంఘటన లాస్ఏంజెలిస్ నుంచి ఫిలడెల్ఫియా వెళుతున్న యూఎస్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానంలో ఇటీవల చోటుచేసుకుంది. తొలుత లాస్‌ఏంజెలిస్‌లో విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. విమానం బయలుదేరడంతో కాస్త తెరిపిన పడ్డ ప్రయాణికులు తమ సీట్లలో కునుకులో పడ్డారు. అకస్మాత్తుగా భరించలేనంత దుర్వాసన రావడంతో మెలకువ వచ్చి అందరూ గగ్గోలుపెట్టారు. తీరా చూస్తే.. ఓ పెద్ద కుక్క విమానంలోనే పనికానిచ్చేసిందని అర్థమైంది. వెంటనే సిబ్బంది దానిని తుడిచేశారు. అయితే కాసేపటికే మరోసారి.. దానినీ తుడిచేశాక మరికొద్దిసేపటికే ఇంకోసారీ ఆ కుక్క అక్కడే పనికానిచ్చేసింది. ఎంత శుభ్రం చేసినా వాసన మాత్రం పోలేదు. దీంతో విమానాన్ని కాన్సాస్ సిటీ విమానాశ్రయంలో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. తర్వాత మొత్తం శుభ్రం చే శాక విమానం తిరిగి బయలుదేరింది. ఆ కుక్కను, దాని యజమానిని మాత్రం తర్వాత వేరే విమానంలో పంపారట. అయితే తన కుక్క చేసిన పనికి దాని యజమాని సిగ్గుతో తలవంచుకోగా.. ఇంత పనికి కారణమైన ఆ కుక్కను ఫొటో తీసి ఒకరు ట్విట్టర్లో పెట్టారట.