late fees
-
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ ఆఫర్
హైదరాబాద్: వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ మరో విడత కల్పించింది. కరోనాతో జీవిత బీమా కవరేజీకి ప్రాధాన్యం పెరిగిన క్రమంలో పాలసీదారుల ప్రయోజనాల కోణంలో ఎల్ఐసీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు పాలసీ పునరుద్ధరణ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. లేట్ఫీజులో తగ్గింపును ఇస్తున్నట్టు తెలిపింది. వైద్య పరీక్షలకు సంబంధించి ఎటువంటి రాయితీలు ఉండవు. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఇస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాలసీదారులు చివరిగా ప్రీమియం కట్టిన తేదీ నుంచి ఐదేళ్లకు మించకుండా ఉంటే పునరుద్ధరించుకునేందుకు అర్హత ఉంటుంది. రూ.లక్ష వరకు బీమాతో కూడిన ప్లాన్ల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంలో 20 శాతం (గరిష్టంగా రూ.2,000) తగ్గింపు పొందొచ్చు. రూ.1– 3 లక్షల మధ్య పాలసీలకు ఆలస్యపు రుసుంలో 25 శాతం (గరిష్టంగా రూ.2,500), రూ.3లక్షలకు పైన రిస్క్ కవర్‌తో కూడిన పాలసీలకు ఆలస్యపు రుసుంలో 30 శాతం (గరిష్టంగా రూ.3,000) తగ్గింపునిస్తోంది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు అయితే ఆలస్యపు రుసుంలో పూర్తి రాయితీ ఇస్తోంది. అధిక రిస్క్ కవర్‌తో ఉంటే టర్మ్ ప్లాన ఆలస్యపు రుసుంలో తగ్గింపు ఉండదు. -
కేరళ వరదలు: దిగ్గజ బ్యాంకు ఉదారత
సాక్షి, ముంబై: ప్రైవేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది.ముఖ్యమంత్రి సహాయ నిధికి 10కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన అన్నిలేట్ ఫీజులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. గృహ, వాహన, వ్యక్తిగత లోన్లపై కస్టమర్లు చెల్లించాల్సిన నెలవారీ వాయిదాల చెల్లింపుల లేట్ ఫీజును వసూలు చేయమని స్పష్టం చేసింది. అలాగే క్రెడిట్‌కార్డు బిల్లులపై చెల్లింపులపై లేట్ ఫీజును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. రూ.10 కోట్లు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఐసిఐసిఐ బ్యాంకు అందివ్వనుందని కేరళ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ టొమ్ జోస్ వెల్లడించారు. రూ .8 కోట్లు విరాళంగాను, మరో రెండు కోట్ల రూపాయలు వరదల్లో దెబ్బతిన్న 14 జిల్లాల్లో రిలీఫ్ మెటీరియల్ కొనుగోలుకు వెచ్చించనుందని తెలిపారు. ప్రకృతి బీభత్సానికి కేరళ ఇంకా విలవిల్లాడుతూనే ఉంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లక్షలాది ప్రజలు సహాయక శిబిరాల్లో బిక్కు బిక్కు మంటూ రోజులు గడుపుతున్నారు. అనేక జిల్లాల్లో రవాణా వ్యవస్థ భారీగా ప్రభావితమైంది. అనేక రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. కేరళ ప్రజలకు సహాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ విజ్ఞప్తి చేశారు. దీనికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్పందించాయి. మరోవైపు కేరళ వరద పరిస్థితిని పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళకు బయలు దేరి వెళ్లారు. రేపు (శనివారం) ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. -
రిటర్నులపై ఆలస్య రుసుం రద్దు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రిటర్నులను గడువులోగా దాఖలు చేయని వారికి ఆలస్య రుసుమును రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దాఖలు చేసిన జీఎస్టీఆర్ 3బీ రిటర్నుల్లో ఉన్న లోపాలను సరిచేసుకుని ఫైనల్ రిటర్నులను దాఖలు చేసేందుకు వ్యాపారులకు ఐదో∙తేదీ వరకు గడువిచ్చింది. జూలైకి సంబంధించిన తొలి జీఎస్టీ రిటర్నులను దాఖలు చేసి పన్నుల చెల్లింపును ఆగస్టు 25 నాటికి వ్యాపారులు పూర్తి చేయాలి. జూలై నెల అమ్మకాలకు సంబంధించిన తుది రిటర్నులను ఈ నెల 5వ తేదీ నాటికి కొనుగోళ్లకు సంబంధించిన రిటర్నులను ఈ నెల 10వ తేదీ నాటికి దాఖలు చేయాలి. జూలై నెలకుగానూ జీఎస్టీఆర్ 3బీ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులందరికీ ఆలస్య రుసుమును రద్దు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీని మాత్రం పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది.