రక్తదాతలను అభినందించిన ఎంపీ అవినాష్ రెడ్డి
లింగాల (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని లీలావతి చారిటబుల్ ట్రస్ట్ ఆరో వార్షికోత్సవంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు.
కొందరు యువకులతో పాటు ఏఎస్పీ అన్బురాజన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులను ఎంపీ అవినాష్ అభినందించారు. కార్యక్రమంలో లీలావతి ట్రస్ట్ చైర్మన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ కలెక్టర్ చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి కుమారుడు నాని పాల్గొన్నారు.