left home
-
లోకం తెలియని చిన్నారులు.. రోజూ నరకమే.. అందుకే వచ్చేశాం..
సాక్షి, అమరావతి బ్యూరో: లోకం తెలియని చిన్నారులు వాళ్లు. తాగుబోతు నాన్న పెట్టే బాధలు భరించలేకపోయారు. రోజూ తాగి వచ్చి అమ్మను, తమను కొట్టడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంకా అక్కడ ఉంటే తమకు రోజూ నరకమేనన్న భావనకొచ్చారు. ఎలాగోలా అక్కడ నుంచి బయట పడాలనుకున్నారు. ఏదో రైలెక్కి విజయవాడ వచ్చేశారు. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై దీనంగా ఉన్న వీరిని క్లీనింగ్ సిబ్బంది చూసి చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగించారు. చదవండి: ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో.. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వేంకటేశ్వరస్వామి గుడి ప్రాంతానికి చెందిన వీరు తమ పేర్లు మస్తానీ (9), మౌలాలీ (7) గా చెబుతున్నారు. తండ్రి ఎల్లప్ప కూలింగ్ నీళ్లు అమ్మే పని చేస్తుంటాడని, తల్లి శ్యామల కుర్చీలకు వైర్లు అల్లుతుందని అంటున్నారు. ‘నాన్న ఇంట్లో డబ్బులివ్వడు. ఇవ్వకపోగా రోజూ మందు (మద్యం) తాగడానికి అమ్మను డబ్బుల కోసం సతాయిస్తుంటాడు. ఇవ్వకపోతే కొడతాడు. ఇచ్చాక తాగి వచ్చాక అమ్మను, మమ్మల్ని కొడుతూ ఉంటాడు. అందుకే తమ్ముడు, నేను, ఇల్లు వదిలి నాన్నకు దూరంగా వచ్చేశాం. ఇక మార్కాపురం నాన్న దగ్గరకు వెళ్లం.’ అని మస్తానీ చెబుతోంది. పోలీసులకు సమాచారం ఇచ్చాం ఈ చిన్నారులు గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్లో ఉండగా అక్కడ క్లీనింగ్ సిబ్బంది మాకు అప్పగించారు. వెంటనే మైక్‌లో అనౌన్స్మెంట్ చేయించాం. వారి కోసం ఎవరూ రాలేదు. తదుపరి సంరక్షణ కోసం జీఆర్పీ స్టేషన్లో హాజరు పరిచాం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో బాలుడిని విజయవాడ ఎస్కేసీవీ చి్రల్డన్ ట్రస్టు వసతి గృహంలోను, బాలికను ప్రజ్వల బాలికల వసతి గృహంలోనూ తాత్కాలికంగా ఉంచాం. పిల్లలు చెప్పిన వివరాలతో ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చాం. – కళ్లేపల్లి శ్రీకాంత్, కో–ఆర్డినేటర్, రైల్వే చైల్డ్‌లైన్, విజయవాడ -
చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు!
సాక్షి, జడ్చర్ల టౌన్: ఇంటినుంచి వెళ్లిపోయిన వ్యక్తి చనిపోయాడకుని కుటుంబ సభ్యులు అతడిపై ఆశలు వదులుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత బతికే ఉన్నాడని తెలిసిన ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జడ్చర్ల సీఐ బాలరాజు సమక్షంలో సత్యేశ్వర ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా.. గద్వాలకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడు చనిపోయాడని భావించి ఆశలు వదులుకున్నారు. అయితే బాదేపల్లి పాతబజార్‌లో మహాలక్ష్మి సేవాట్రస్టు నిర్వాహకులు ఈశ్వర్, రామకృష్ణ ఏడాదిక్రితం ప్రారంభించిన సత్యేశ్వర ఆశ్రమంలో మతిస్థిమితం తప్పిన వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో గతేడాది ఏప్రిల్‌లో జాతీయ రహదారిపై మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఇబ్రహీం ఆశ్రమ నిర్వాహకుల కంటపడటంతో చేరదీశారు. ఆశ్రమంలో చేసిన సేవలు, సఫర్యలు, చికిత్సల కారణంగా ఇబ్రహీం కోలుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వివరాలను ఆశ్రమ నిర్వాహకులకు తెలియజేయడంతో జడ్చర్ల పోలీసుల సహకారంతో గద్వాలలోని అతడి కుటుంబ సభ్యుల సమాచారం సేకరించారు. వారిని పిలిపించి ఆదివారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఇబ్రహింను అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సీఐ బాలరాజు ఆశ్రమ నిర్వాహకుల సేవలను ప్రత్యేకంగా అభినందించారు. -
అమ్మ, నాన్న క్షమించండి..
► మీ కలలు నెరవేర్చలేక పోతున్నా..! ► ఇల్లు వదిలి వెళ్లిపోయిన పీయూసీ విద్యార్థిని ► లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం బనశంకరి : ద్వితీయ పీయూసీ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో ఓ విద్యార్థిని తీవ్రమనస్తాపంతో లేఖ రాసి ఇళ్లు వదిలి వెళ్లిపోయిన ఘటన విద్యారణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు... విద్యారణ్యపురలోని పీయూ కళాశాల సైన్స్ విభాగంలో చదువుతున్న వాసవి రెండు రోజుల క్రితం విడుదలైన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గణితం మినహా అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం మార్కులు సాధించింది. గణితంలో కేవలం 30 మార్కులు రావడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆమె తల్లిదండ్రులకు లేఖరాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి విధుల నుంచి ఇంటికి చేరుకున్న వాసవి తల్లిదండ్రులు ఇంట్లో టేబుల్‌పై లేఖ చూసి ఆందోళనతో వాసవి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇళ్లు వదిలివెళ్లిన వాసవి తన లేఖలో తల్లిదండ్రులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేస్తూ... మీ కలలను నెరవేర్చడానికి నాకు సాధ్యం కాలేదు దయచేసి క్షమిం చండి, నా కోసం బాధపడొద్దు, మీకు న్యాయం చేయలేకపోతున్నాను, ఆత్మహత్యే నాకు శరణ్యం, లవ్యూ డ్యాడ్, అండ్ మమ్. అంటూ లేఖలో పేర్కొంది.