తమ్ముళ్ల కీచులాటలు రోడ్డు పనులకు బ్రేకులు
రాజంపేట: అధికార పార్టీ నాయకులకు 14 గ్రామాల వాసులకు రోడ్డు సౌకర్యం కల్పించడం కంటే స్వప్రయోజనమే ఎక్కువైంది. తమ పంతమే ముఖ్యమైంది. ఫలితంగా వేలాది మందికి ఉపయోగపడాల్సిన రోడ్డు పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నారుు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గత అక్టోబరు 26న ప్రారంభించిన రోడ్డు నిర్మాణం ముందుకు సాగడంలేదు.
దాదాపు నాలుగుకోట్ల రూపాయిల విలువ చేసే రోడ్డు పనుల్లో వాటాల విషయం అధికార పార్టీ నేతల్లో విభేదాలకు దారితీసింది. ప్రధానంగా కమిషన్లు తెచ్చిన తంటాతోనే కొత్త.. పాత నాయకుల మధ్య వైషమ్యాలు రేపింది. దీంతో రోడ్డు పనులు ముందుకుసాగినివ్వమని ఓ వర్గం నాయకులు అడ్డుపడుతుండగా.. మరోవర్గం నాయకులు రాజీ ధోరణిలో మంతనాలు సాగిస్తున్నారు.
ఈ వ్యవహారం ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డికి ఇబ్బందిగా తయూరైంది. ఓవైపు పార్టీలో బాబుతో నేరుగా సంబంధాలున్న నాయకులను సముదాయించలేక.. మరోవైపు తనతో పార్టీలోకి వచ్చిన తన సామాజిక వర్గానికి చెందిన నాయకులకు చెప్పుకోలేక మదనపడుతున్నట్లు తెలిసింది. గత యేడాది నుంచి ప్రజలు ఈ రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. నిర్మాణం మొదలైందనకుంటే కమిషన్ల చిచ్చు ఇలా చేసిందని వాపోతున్నారు.
రోడ్డు నిర్మాణం ఇలా..
ఏళ్ల తరబడి 14గ్రామాలకు సరైన రహదారి లేని పరిస్ధితుల్లో ప్రధానమంత్రి సడక్యోజన కింద తాళ్లపాక ముఖద్వారం నుంచి రాయచోటి రోడ్డు వరకు లింక్ కలిపే విధంగా నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులను ఎస్ఎస్ఆర్ నిర్మాణ సంస్ధ చేజిక్కించుకుంది.
ఆ సంస్థ అధికారపార్టీకి చెందిన నలుగురికి అప్పగించినట్లు సమాచారం. బోయనపల్లె దళితవాడ, చెంచుకాలనీ, హెచ్.చెర్లోపల్లె, మిట్టపల్లె, దొమ్మరాజుపల్లె, హస్తివారిపల్లె, పెద్దకారంపల్లె, బాహ్మణపల్లె మీదుగా రాయచోటి రహదారికి లింక్ రోడ్డుగా 8 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటి వరకు 20శాతం పనులే అయ్యూరుు. బ్రహ్మణపల్లె వద్ద ఈ రోడు నిర్మాణానికి అభ్యంతరాలు పుట్టుకొచ్చాయి. అధికారపార్టీలో ఓ ప్రజాప్రతినిధికి రూ.18లక్షలు ఇవ్వాలనే విషయమై ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చారుు. రాజీకి కాంట్రాక్టర్లు చేసిన మంతనాలు ఫలించలేదు.
కొంతవరకైనా..
నిర్మాణ చేపట్టిన కాంట్రాక్టరు కొంతవరకు అయినా రోడ్డు పూర్తి చేయూలనే యోచనతో ఉన్నట్లు సమాచారం. పెద్ద కారంపల్లె వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత సెటిల్మెంట్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ప్రారంభించిన రోడ్డు నిర్మాణానికి కమిషన్లతో మొదలైన విభేదాలు చివరికి నిర్మాణానికే ఆటంకంగా మారారుు.
ఈ రోడ్డు వెంబడి అధికంగా దళితవాడలు ఉండటంతో వారి ద్వారా వివిధ కారణాలు చూపుతూ అడ్డుకునే విధంగా పార్టీలో ఓ వర్గం నేతలు పావులు కదుపుతున్నట్లు తాజా సమాచారం.