Length
-
ఎత్తు పెరగాలని ఏకంగా రెండుసార్లు సర్జరీలు..రీజన్ వింటే షాక్ అవుతారు!
ఇటీవల వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీనికి సాంకేతికత కూడా తోడవ్వడంతో పలు వ్యాధులను సులభంగా నయం చేయగల చికిత్స విధానాలు చాలామటుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మనషుల్లో కొంత వికృతమైన ఆలోచనల తో వెర్రీ పనులు చేస్తున్నారునే చెప్పాలి. రూపు రేఖలు దగ్గర నుంచి ప్రతీది మనకు నచ్చినట్లుగా మార్చుకునేలా కాస్మోటిక్ శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో యువత ఆ సర్జరీలు ఎంత ఖరీదైనవైనా..లెక్క చేయకుండా చేయించుకోవడానికి రెడీ అయ్యిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎత్తు పెరిగేందుకు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయించుకున్నాడు. దీని వల్ల పల దుష్పరిణామాలు ఉన్నా కూడా చేయించుకునేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ఎందుకోసం అంత రిస్క్‌తో కూడిన శస్త్ర చికిత్స చేయించుకుంటున్నోడో వింటే ఆశ్చర్య పోవడం ఖాయం. వివరాల్లోకెళ్తే...అమెరికాకు చెందిన 41 ఏళ్ల గిబ్సన్ తన ఎత్తు విషయమై చాలా బాధపడుతుండేవాడు. అతను ఐదు అడుగుల ఐదు అంగుళాలు. ఆ ఎత్తు కారణంగానే తనకు గర్లఫ్రెండ్స్ లేరని తెగ బాధపడుతుండేవాడు. అందుకోసం అని తన ఘూస్లో కొని రకాల వస్తువలు పెట్టుకుని హైట్‌గా కనిపించేందుకు తెగ ప్రయత్నించేవాడు. ఎత్తు పెరిగేలా మందులు వాడటం దగ్గర నుంచి యోగ వరకు అని రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఐతే అవన్నీ ఫెయిల్ అవ్వడంతో ఇక ఎత్తు పెరిగేలా కాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. వాస్తవానికి గిబ్సన్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. శస్త్ర చికిత్స కోసం అని తనసంపాదనలో కొంత డబ్బును ఆదా చేయడమే గాక ఉబర్ డ్రైవర్ కూడా పార్ట్ టైం జాబ్ చేసి మరికొంత డబ్బును కూడబెట్టాడు. గిబ్సన్ తాను అనుకున్నట్లుగానే 2016లో మొదటి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత మూడు అంగుళాలు పెరిగాడు. దీంతో అతని ఎత్తు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు పెరిగాడు. అయినప్పటికి ఇంకా ఎక్కువ పెరగాలని రెండోసారి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. మొదటి శస్త్ర చికిత్స మాదిరిగా రెండో ఆపరేషన్ ప్రక్రియ అంత సజావుగా జరగలేదు. మరింత ఎత్తు పెరగడం కోసం వైద్యులు అతని ఎముకలు విరిచి దానిపై అయస్కాంత స్క్రూలు వంటి కొన్ని పరికరాలు అమర్చాల్సి రావడమే గాక విపరీతమైన బాధను కూడా అనుభవించాల్సి వచ్చింది. పైగా మొదటి ఆపరేషన్‌కి రూ. 60 లక్షలు ఖర్చు పెట్టగా రెండోదానికి ఏకంగా రూ. 80 లక్షల దాక ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక పక్క విపరీతమైన బాధలు మరోవైపు అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ బాధపడక పోగా తాను జూన్ నాటికి 5 అడుగులు పది అంగుళాలు పెరుగుతానని ఆనందంగా చెబుతున్నాడు. అతనికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కూడా గిబ్సన్ చాలా ఆనందంగా ఉన్నాడని, ప్రస్తుతం అతనికో గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉందని చెబుతుండటం విశేషం. ఏదీఏమైనా ఈ ఎత్తు పెంచే శస్త్ర చికిత్స వల్ల భవిష్యత్తులో పలు దుష్పరిణామాలే గాక కొన్ని రకాల రుగ్మతల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటం గమనార్హం. Moses Gibson spent 170k on 2 height lengthening surgery after being subjected heightism for being 5’5! He said he long struggled to get a girlfriend due to his 5-foot-5-inch frame, initially turning to medication and a “spiritual healer” to try to increase his height… He… pic.twitter.com/HqoTcUyCZR — The Cosmetic Lane (@TheCosmeticLane) April 12, 2023 (చదవండి: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాపై బాంబు దాడి.. భయంతో పరుగులు.. క్షణాల ముందు వీడియో..) -
ఈ సినిమా నిడివి 30 రోజులు..!
ఒక సినిమా నిడివి ఎంతుంటుంది. రెండు నుంచి రెండున్నర గంటలు. అరుదుగా కొన్ని సినిమాలు మూడు గంటలు, అంతకుమించినవి కూడా ఉన్నాయి. కానీ, ఇంత ఎక్కువ నిడివిగల సినిమాలు ఇటీవలి కాలంలో రావట్లేదు. ఎందుకంటే ప్రేక్షకులకు అంతసేపు కూర్చుని సినిమా చూసే ఓపిక ఉండట్లేదు. రెండున్నర గంటల నిడివి గల సినిమా చూడడమే భారంగా ఫీలవుతున్న ఈ రోజుల్లో 720 గంటలు (30 రోజులు) నిడివి గల సినిమాను చూడగలరా..? ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తారో లేదో తెలీదుకానీ, ఇంత నిడివి గల సినిమాను తీసేందుకు సిద్ధమయ్యాడో దర్శకుడు. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. దాని విశేషాలేంటో తెలుసుకుందామా.. స్వీడిష్ డైరెక్టర్ ఆలోచన.. స్వీడన్‌కు చెందిన దర్శకుడు ఆండర్స్ వెబెర్గ్. విజువల్ ఎఫెక్టŠస్తోపాటు ఇతర సినీ విభాగాలపైనా అతడికి పట్టుంది. అతడు 2020లో సినీ రంగం నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు. ఈలోగా ఏదో ఒక రకంగా తన ప్రత్యేకత చాటుకోవాలనుకున్నాడు. దీనిలో భాగంగా ప్రపంచంలో అత్యంత నిడివిగల సినిమాను రూపొందించాలనుకున్నాడు. అలా 30 రోజుల నిడివిగల సినిమాకు శ్రీకారం చుట్టాడు. యాంబియెన్స్.. 30 రోజుల నిడివితో రూపొందుతున్న ఈ సినిమా పేరు యాంబియెన్స్. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తైంది. మూడునాలుగేళ్ల క్రితం నుంచే ఈ సినిమాను సొంత నిర్మాణంలో ఆండర్స్ తెరకెక్కిస్తున్నాడు. దీనిలో దాదాపు వంద మంది నటీనటులు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ప్రత్యేకంగా కథ, సంభాషణలు అంటూ ఏమీ లేవు. అసలు సినిమాలో డైలాగులే ఉండవు. కేవలం దృశ్యాల్ని మాత్రమే చిత్రీకరించి, వాటికి ఎక్కువగా విజువల్ ఎఫెక్టŠస్ జోడించి సినిమాను రూపొందిస్తున్నాడు. నిరంతరం యాంబియెన్స్కి సంబంధించిన పని కొనసాగుతోంది. ట్రైలర్ నిడివి 72 గంటలు.. ప్రతి సినిమాకూ ట్రైలర్ ఉన్నట్లే దీనికీ ట్రైలర్లను విడుదల చేశారు. 2014లో ఏడు నిమిషాల నిడివితో తొలి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక రెండో ట్రైలర్‌ను గతేడాది విడుదల చేశారు. దీని నిడివి ఏడు గంటలు. 720 గంటల సినిమా కాబట్టి, దర్శకుడు ఏడు గంటల ట్రైలర్‌ను రూపొందించాడు. వచ్చే ఏడాది చివరి ట్రైలర్ విడుదల కానుంది. దీని నిడివి 72 గంటలు ఉండనున్నట్లు ఆండర్స్ తెలిపాడు. పూర్తి సినిమా 2020లో వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారే ప్రదర్శన.. చిత్రీకరణ పూర్తయ్యాక సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఆండర్స్ భావిస్తున్నాడు. అన్ని దేశాల్లోనూ ఒకే సమయంలో ప్రదర్శించాలనుకుంటున్నాడు. 30 రోజులపాటు నిరంతరంగా ఈ సినిమా పద్రర్శిస్తారు. ఒక్కసారి ప్రదర్శన పూర్తయ్యాక మళ్లీ ఈ సినిమాను చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రదర్శన పూర్తైన తర్వాత ఈ సినిమాను ఎవరికీ చిక్కకుండా నాశనం చేయాలని ఆండర్స్ ఆలోచన. ఇక ఆ తర్వాత ఈ సినిమాను మళ్లీ ఎవరూ చూసే అవకాశం లేదు.– సాక్షి, స్కూల్ ఎడిషన్ -
మీరు మరీ పొడుగా?
బ్యూటిప్స్ సాధారణంగా పొడవుగా ఉండాలని, పొడవు లేకున్నా వేసుకునే డ్రస్ ద్వారానైనా పొడవుగాకనిపించాలని కోరుకోవడం సహజం. కానీ ఎక్కువ పొడవుగా ఉండడమే కొందరికి సమస్య అవుతుంది. అలాంటి సమస్యను ఎదుర్కొంటూ, నార్మల్‌గా కనిపించాలని ప్రయత్నిస్తుంటే ఇలా చేయండి... భుజాల నుంచి మోకాళ్ల వరకు ఉండే టాప్స్ వేస్తే మరీ పొడవుగా కనిపిస్తారు. చుడీదార్, సల్వార్ కమీజ్, జీన్స్ మీద టాప్... సింగిల్ కట్‌తో ఉన్నవి కాకుండా నడుము వరకు- నడుము నుంచి రెండు భాగాలుగా విడగొట్టినట్లుంటే బాగుంటాయి. సన్నగా, టైట్‌గా ఉండే బెల్టులను ధరించకూడదు. వెడల్పుగా ఉండి నడుమును వదులుగా చుట్టినట్లుండే మోడల్స్ బాగుంటాయి. వీలు అయినంత వరకు మిక్స్ అండ్ మ్యాచ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. అలా మ్యాచ్ చేసేటప్పుడు ఒకటి డార్క్ కలర్ ఉండే రెండవది తప్పని సరిగా లైట్ కలర్ ఉండేటట్లు చూడాలి. -
మీ ఉంగరం వేలు చూపుడువేలు కంటే పొడవుగా ఉంటే...
ఫింగర్ ఫ్యాక్ట్స్ వేళ్లు మనుషుల స్వభావాన్ని చెబుతాయా? అవుననే అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ముఖ్యంగా చూపుడువేలు, ఉంగరం వేలు పొడవును బట్టి మనుషులను మూడు వర్గాలుగా విభజించారు. ఆ వర్గాలేమిటో తెలుసుకునే ముందు మీ చేయి బల్ల మీద పెట్టి ఒకసారి పరిశీలించుకోండి. మీ ఉంగరం వేలు చూపుడువేలు కంటే పొడవుగా ఉందా పొట్టిగా ఉందా లేదంటే రెండు సమానమైన పొడవుగా ఉన్నాయా చూసుకోండి. ఆ తర్వాత ఇది చదవండి. ఎ. మీ ఉంగరం వేలు చూపుడు వేలుకంటే పొడవుగా ఉంటే ఇలాంటి వాళ్లు చూడటానికి బాగుంటారు. మాటలతో ఆకట్టుకుంటారు. ఇతరులకు ఎంతదూరమైనా వెళ్లి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రియుడు/ప్రియురాలిని అనుక్షణం మైమరిపిస్తారు. ఒక్కోసారి దూకుడుగా ఉంటారు. ఉంగరం వేలు పొడవుగా ఉన్నవారు డబ్బు కూడా బాగానే సంపాదిస్తారని పరిశీలన. సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో వీళ్లు ముందుంటారు. ఇంజనీరింగ్ రంగంలో ఇలాంటివాళ్లు బాగా రాణిస్తారు. బి. మీ చూపుడు వేలు ఉంగరం వేలు కంటే పొడవుగా ఉంటే వీళ్లు అతి విశ్వాసంతో ఉంటారు. అది ఎదుటివారికి అహంభావంగా కనిపిస్తుంది. అంతర్ముఖులు కాకపోవచ్చుగాని ఇలాంటివాళ్లు తమతో తాము గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీళ్లకు ఎప్పుడూ దృష్టి లక్ష్యంపైనే ఉంటుంది. అయితే చొరవగా స్నేహహస్తాన్ని చాచలేరు. ప్రేమను వ్యక్తపరచలేరు. కనుక తమకు ఎదుటివారి నుంచి ఎంత దక్కితే అంతతోనే సర్దుకోవాల్సి వస్తుంది. సి. చూపుడు వేలు ఉంగరం వేలు ఒకే పొడవులో ఉంటే ఇలాంటి వారికి గొడవలంటే అస్సలు పడవు. ఈ జీవితం ఏదో ఇలా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారు. అలాగని ఎవరైనా తమను గొడవకు అనివార్యం చేస్తే గనుక ఎదుటివారికి చుక్కలు చూపిస్తారు. చూపుడువేలు ఉంగరం వేలు ఒకే పొడవులో ఉన్న వారు తమ భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారు. ఇంటా బయటా ఏదైనా వ్యవహారాన్ని చక్కపెట్టడంలో వీరు సమర్థులు. -
కోరుకున్న కురులు
బ్యూటిప్స్ జుట్టు పట్టుకుచ్చులా, అందంగా పొడవుగా ఉండాలని ఎవరికి ఉండదు? కానీ అలా కావాలంటే కొద్దిగా ఓపిక తెచ్చుకోక తప్పదు. వారానికి మూడుసార్లు కొబ్బరినూనె కానీ ఆలివ్ ఆయిల్‌తో కానీ రాత్రిపూట మాడుకు మసాజ్ చేయాలి. జుట్టుకు కూడా నూనె బాగా రాయాలి. తర్వాత వెడల్పు పళ్ల బ్రష్‌తో ఒక నిమిషంపాటు తలను దువ్వాలి. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో తల స్నానం చేసి, వెంటనే చల్లటి నీటితో జుట్టును కండీషనింగ్ చేసుకుంటే చాలు. మీరు కోరుకున్నట్టు జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారింది. అందుకు ఈ చిట్కా వాడి చూడండి. కాకరకాయ రసంలో కొద్దిగా పంచదార కలిపి ఓ 15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత దాన్ని పొడిగా ఉన్న మాడుకు అప్లై చేయండి. 5-6 నిమిషాల పాటు ఆ మిశ్రమంతో మాడుకు మర్దన చేసి చల్లటి నీటితో తలను కడిగేసుకోండి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య దూరమవుతుంది. ఎండలో బాగా తిరగటం కారణంగా ముఖం, చేతులు సన్‌టాన్‌తో నల్లగా, నిర్జీవంగా మారుతుంటాయి. అది సబ్బు పెట్టి రుద్దినంత మాత్రాన వెంటనే పోదు. ఇంటికి చేరుకోగానే శనగపిండితో చర్మాన్ని స్క్రబ్ చేయాలి. తర్వాత కొబ్బరి నీళ్లు, నిమ్మరసం కలిపిన మిశ్రమంతో మర్దన చేసుకుంటూ కడిగేసుకుంటే సన్‌టాన్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా అవుతుంది, ఈ చిట్కాతో మునుపటి సౌందర్యం మీ సొంతమవుతుంది.