Liberty
-
వ్యక్తిగత స్వేచ్ఛే... సుప్రీమ్!
భారత సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పులు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని తేల్చి చెప్పాయి. పీఎమ్ఎల్ఏ, ఉపా వంటి చట్టాల అమలులో వ్యక్తమవుతున్న ఆందోళనల వెలుగులో ప్రాథమిక హక్కుల రక్షణ, సరైన చట్ట ప్రక్రియ ఆవశ్యకతను ఇవి నొక్కిచెప్పాయి. అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియపర్చడం కీలకమైన రాజ్యాంగ భద్రత అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టును రద్దు చేస్తూనే, విధానపరమైన న్యాయ ప్రాముఖ్యాన్నీ, ఉపా కింద అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియజేసే హక్కునూ ఎత్తిపట్టింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగ హక్కులకు మినహాయింపు ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.భారత సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పులు... మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎమ్ఎల్ఏ), చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ– ఉపా) వంటి కఠినమైన చట్టాల అమలు సందర్భంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని గట్టిగా నొక్కి వక్కాణించాయి. ఆర్థిక నేరాలను, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రూపొందించిన ఈ చట్టాలు ఎలా వ్యవహరిస్తున్నాయి అనే విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి. చట్టాన్ని అమలు చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య ప్రమాణాలను సమతుల్యం చేయడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను తెలియజేసేలా, మే నెలలో వారంలోపు వ్యవధిలో ఈ తీర్పులు వెలువడ్డాయి. న్యాయబద్ధత, నిర్బంధంలోకి తీసుకునే అధికారాలను ఉపయోగించడంపై వ్యక్తమవుతున్న తీవ్రమైన ఆందోళనల వెలుగులో ప్రాథమిక హక్కుల రక్షణ, సరైన చట్ట ప్రక్రియ ఆవశ్యకతను ఇవి నొక్కిచెప్పాయి.పీఎమ్ఎల్ఏ కింద దాఖలు చేసిన చార్జిషీట్‌పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టిన తర్వాత మే 16న వెలువరించిన కీలకమైన తీర్పులో, వ్యక్తులను అరెస్టు చేసే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఉన్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం కుదించింది. న్యాయస్థానం విచారణ చేపట్టిన తర్వాత, ఫిర్యాదులో పేర్కొన్న నిందితులను ఈడీ అరెస్టు చేయలేదని న్యాయమూర్తులు ఏఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్ ప్రకటించారు. విచారణ సమయంలో అరెస్టు చేయని నిందితులకు వారెంటుకు బదులుగా ప్రత్యేక కోర్టులు సమన్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం ఏకపక్ష నిర్బంధాలను నిరోధిస్తుంది. కోర్టుకు హాజరయ్యే వారిని మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం కఠినమైన బెయిల్ ప్రక్రియలోకి నెట్టకుండా హామీనిస్తుంది. నిందితుడి బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అవకాశం ఇవ్వాలని సెక్షన్ 45 నిర్దేశిస్తుంది. అంతేకాకుండా, నిందితుడు నిర్దోషి అనీ, బెయిల్‌పై ఉన్నప్పుడు ఎలాంటి నేరం చేసే అవకాశం లేదనీ విశ్వసించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని ట్రయల్ కోర్టుకు నమ్మకం కలిగించడం అవసరం. ఈ పరిస్థితులు సాధారణంగా మనీ లాండరింగ్ కేసులో నిందితుడు బెయిల్ పొందడాన్ని సవాలుగా మారుస్తాయి. సమన్లు పంపిన తర్వాత హాజరయ్యే నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినట్లయితే, అది సంబంధిత ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నేరాన్ని గుర్తించిన తర్వాత ఈడీ చేసే అరెస్ట్ అధికారాలను పరిమితం చేయడం ద్వారా, కోర్టు సమన్లను పాటించిన నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, అయోమయం కలిగించే, కఠినమైన పీఎంఎల్ఏ బెయిల్ ప్రక్రియలో జరిగే దుర్వినియోగాలను పరిష్కరించడం ఈ తీర్పు లక్ష్యం.అదేవిధంగా, ఈడీ అరెస్టులు చేసే ముందు నేరాలను అంచనా వేయవలసిన అవసరాన్ని మే 17న సుప్రీంకోర్టు చేసిన న్యాయపరమైన ఉత్తర్వు నొక్కి చెప్పింది. పీఎమ్ఎల్ఏ కింద నమోదయ్యే నేరాలు ‘పరాన్నజీవి‘ స్వభావంతో కూడి ఉన్నాయనీ, ముందస్తు నేరాల ఉనికి అవసరమనీ ఆ తీర్పు నొక్కి చెప్పింది. ముందస్తు నేరం లేకుండా, పీఎంఎల్ఏ ఆరోపణలు స్వతంత్రంగా నిలబడలేవని న్యాయమూర్తులు సూర్యకాంత్, కేవీ విశ్వనాథన్ నొక్కి చెప్పారు. ముందస్తు నేరంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నిందితుల పేర్లు లేకపోయినా, ఒక కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలను విచారించే ముందుగా ఈడీ ఆ కేసులో అంతర్లీనంగా ఉండే ముందస్తు నేరాలను క్షుణ్ణంగా నిర్ధారించాలని పేర్కొంది. ఆర్థిక నేర పరిశోధనల్లో బలమైన చట్టపరమైన ఆధారం అవసరమని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.ఈ దృక్పథం ఆర్థిక నేర పరిశోధనలలో బలమైన చట్టపరమైన పునాది అవసరాన్ని బలపరిచింది, పవన దిబ్బూర్ కేసులో సుప్రీంకోర్టు 2023 నవంబర్‌లో ఇచ్చిన తీర్పు హేతుబద్ధతను ఇది ముందుకు తీసుకువెళ్లింది. 2023లో కోర్టు నిర్ణయం ప్రకారం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బి కింద శిక్షార్హమైన నేరపూరిత కుట్ర, మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించినంత మాత్రమే అది నేరం కాకూడదు. ఆ కుట్ర పీఎమ్ఎల్ఏ కింద తప్పనిసరిగా షెడ్యూల్ చేసిన నేరంగా నమోదు చేసిన నేరానికి సంబంధించినదై ఉండాలి. మే 15న సుప్రీంకోర్టు తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టును రద్దు చేస్తూనే, విధానపరమైన న్యాయ ప్రాముఖ్యతను, ఉపా కింద అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియజేసే హక్కును ఎత్తిపట్టింది. ఢిల్లీ పోలీసుల విధానపరమైన లోపాలను న్యాయమూర్తులు బీఆర్ గవయీ, సందీప్ మెహతా విమర్శించారు. ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని చెబుతున్న రాజ్యాంగ ఆదేశాన్ని నొక్కిచెప్పారు.భారతదేశ స్థిరత్వం, సమగ్రతకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో చైనా సంస్థల ద్వారా విదేశీ నిధులను స్వీకరించిన ఆరోపణలపై 2023 అక్టోబర్‌లో పుర్కాయస్థను అరెస్టు చేసిన తరువాత ఉపా కింద పోలీసు కస్టడీకి పంపిన తీరుపై సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా విమర్శించింది. ఆయన అరెస్టు, రిమాండ్‌ను ‘రహస్యంగా‘ నిర్వహించారని కోర్టు పేర్కొంది. ‘ఇది చట్టబద్ధమైన ప్రక్రియను తప్పించుకునే కఠోరమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు; నిందితుడిని అరెస్టు చేసిన కారణాలను తెలియజేయకుండా పోలీసు కస్టడీకి పరిమితం చేశారు. న్యాయవాదుల సేవలను పొందే అవకాశాన్ని నిందితుడికి హరించారు. బెయిల్ కోరడం అనేది నిందితుడి ఎంపిక’ అని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నప్పుడు రాజ్యాంగ హక్కులకు మినహాయింపు ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనీ లాండరింగ్ చట్టం, ఉపా చట్టం రెండింటిలోనూ అరెస్టుకు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా తెలియజేయాలని కోరడమైనదనీ, ఈ అవసరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1)లో వేళ్లూనుకుని ఉందనీ కోర్టు పేర్కొంది. ఇది తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే అంశంపై ప్రజల హక్కును పరిరక్షిస్తుంది. పంకజ్ బన్సాల్ కేసులో 2023 అక్టోబరు 3 నాటి తీర్పులో ఉపా కేసులకు వర్తించదంటూ ఢిల్లీ పోలీసుల వాదనకు ప్రతిస్పందనగా న్యాయస్థానం ఈవిధంగా ప్రకటించింది. దీని ప్రకారం నిందితులను అరెస్టు చేసేటప్పుడు ఈడీ పత్రబద్ధమైన ఆధారాలను అందించాలి. అరెస్టు చేయడానికి గల కారణాలను తెలియపర్చడం అనేది కీలకమైన రాజ్యాంగ భద్రత అనీ, పారదర్శకతను, న్యాయాన్ని నిర్ధారించడానికి ఏకరీతిగా దీనిని వర్తింపజేయాలని న్యాయస్థానం నొక్కి చెప్పింది. చట్టాలను అమలు చేసే సంస్థలకు విస్తృతమైన అధికారాలను కల్పించే విధానాలలోని పారదర్శకత, న్యాయమైన ఆవశ్యకతను ఈ తీర్పు పునరుద్ఘాటించింది.వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడానికి, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు తగిన ప్రక్రియకు, న్యాయానికి కట్టుబడి ఉండేలా చేయడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను ఈ తీర్పులు సమష్టిగా సూచిస్తాయి. ఈ నిర్ణయాలు చట్ట నియమాన్ని పటిష్ఠం చేస్తాయి. ఈడీ వంటి ఏజెన్సీలు వ్యక్తిగత స్వేచ్ఛలను గౌరవిస్తూ చట్టపరమైన సరిహద్దుల్లో పని చేసేలా చూస్తాయి. ఈ విధానం ప్రజల హక్కులను పరిరక్షిస్తుంది. ఉగ్రవాదం, ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో కీలకమైన విధులను అందించే చట్టాల అమలు సంస్థల విశ్వసనీయతను, జవాబుదారీతనాన్ని ఏకకాలంలో ఇది పెంచుతుంది.ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం..
మనలో చాలా మంది పక్షులను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువశాతం తమ ఆహ్లాదం కోసమే. నిజానికి పక్షులను ఆదరించాల్సింది మన ఆహ్లాదం కోసం కాదు, వాటి ఆనందం కోసం దగ్గరకు తీయాలి. వాటి రెక్కలు విరిచి పంజరంలో పెట్టి మనం చూస్తూ ఆనందించడం హేయమైన చర్య. స్వేచ్ఛగా ఎగరడం వాటి సహజ లక్షణం. అది వాటికి ప్రకృతి ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం మనకు లేదు... అంటున్నారు మహారాష్ట్ర, పుణేలో నివసిస్తున్న రాధికా సోనావానే. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న రాధిక పక్షి సంరక్షకురాలిగా మారిన క్రమాన్ని ఆమె చాలా ఇష్టంగా వివరిస్తారు.‘‘ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా పూనాలో ఉన్నాం. మా స్వస్థలం ఔరంగాబాద్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కచెప్పలేను. పక్షుల మీద మమకారం ఏర్పడింది. నేను బర్డ్ లవర్ని బర్డ్ వాచర్‌ని మాత్రమే అనుకున్నాను. కానీ ఏ మాత్రం ముందస్తు ప్రణాళికలు లేకుండా అనుకోకుండా పక్షి సంరక్షకురాలినయ్యాను. పెళ్లి తర్వాత నా నివాసం ఔరంగాబాద్‌లోనే ఒక ఫ్లాట్‌లోకి మారింది.మా పొరుగింట్లో ఓ పెద్దాయన బాల్కనీలో బర్డ్ ఫీడర్, ఒక గిన్నెలో నీరు పెట్టడం చూసిన తర్వాత నాకూ ఆలాగే చేయాలనిపించింది. పుణేకి బదిలీ అయిన తర్వాత కూడా కొనసాగింది. ఇప్పుడు మా ఇంటి గార్డెన్ పక్షుల విహార కేంద్రమైంది. నాకు తోచిన గింజలు పెట్టి సరిపెట్టకుండా ఏ పక్షికి ఏమిఇష్టమో తెలుసుకోవడానికి పక్షుల జీవనశైలిని అధ్యయనం చేశాను. రామ చిలుకలకు వేరుశనగ పప్పులు ఇష్టం. గోరువంకలు అరటి పండు తింటాయి. రామ చిలుక ముక్కు పెద్దది.గోరువంక, పిచ్చుకల ముక్కులు చిన్నవి. ఆ సంగతి దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్సులు డిజైన్ చేయించాను. నేను పెట్టిన ఆహారాన్ని అవి ఇష్టంగా తింటున్నాయా లేదా, నేను చదివింది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి బాల్కనీలో కూర్చుని శ్రద్ధగా గమనించేదాన్ని. అరటి పండు ముక్కలను చూడగానే గోరువంకలు సంతోషంగా పాటలు పాడడం మొదలుపెడతాయి. పాట పూర్తయిన తర్వాత తింటాయి. టైయిలర్ బర్డ్ అయితే పత్తి దూదిని చూడగానే రాగాలు మొదలుపెడుతుంది.గూడు కట్టుకోవడానికి పత్తి కనిపిస్తే దాని ఆనందానికి అవధులు ఉండవు. మనం సాధారణంగా కాకులను ఇష్టపడం. కానీ అవి చాలా హుందాగా వ్యవహరిస్తాయి. కాకులు, పిచుకలు, చిలుకలు, గోరువంకలు ఇతరులకు హాని కలిగించవు. పావురాలు అలా కాదు. వాటి ఆహారపు అలవాట్లు కూడా అంత సున్నితంగా ఏమీ ఉండవు. తమ ఆహారంలో ఇతరులను ముక్కు పెట్టనివ్వవు, ఇతరుల ఆహారాన్ని కూడా తామే తినేయాలన్నంత అత్యాశ వాటిది. పక్షి స్వేచ్ఛాజీవి..పెట్ డాగ్‌లాగా యజమానితో అనుబంధం పెంచుకోవడం పక్షుల్లో ఉండదు. స్వేచ్ఛగా విహరిస్తూ అనేక ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఒక ప్రదేశంతో కానీ వ్యక్తితో కానీ అనుబంధం పెంచుకోవు. మా ఇంటికి వచ్చే నా అతిథుల్లో చిలుకలే ఎక్కువ. అలెగ్జాండ్రియన్ ΄్యారట్, ఇండియన్ రింగ్నెక్ ΄్యారట్లు తరచూ కనిపిస్తుంటాయి. సన్‌బర్డ్, వీవర్ బర్డ్ కూడా వస్తుంటాయి. కాలం మారేకొద్దీ అవి అప్పటి వరకు ఉన్న ప్రదేశాలను వదిలి తమకు అనువైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటాయి.వాయు కాలుష్యం, వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా పక్షుల వలసలకు కారణమే. సెల్ ఫోన్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పక్షులు కంటి చూపును కోల్పోతున్నాయి. దాంతో అవి తమకు సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఎటుపోతున్నాయో తెలియడం లేదు. కరవు, అధిక వర్షాలు, యాసిడ్ వర్షాలు, అడవులలో చెట్లు నరకడం, మంటలు వ్యాప్తించడం... వాటికి ఎదురయ్యే ప్రమాదాలు. పక్షులు అడవిలో జీవించినంత ధైర్యంగా మనుషుల మధ్య జీవించలేవు.వాటికి మనుషులంటే భయం. ఆ భయాన్ని వదిలించి మచ్చిక చేసుకోవాలంటే వాటికి ఆహారాన్ని అందుబాటులో ఉంచడం ఒక్కటే మార్గం. ఆహారం కోసం ధైర్యం చేస్తాయి, క్రమంగా మన మీద నమ్మకం కలిగిన తర్వాత మన ఇంటిని తమ ఇంటిలాగా భావిస్తాయి. మా గార్డెన్‌కి రోజూ నలభై నుంచి యాభై పక్షుల వరకు వస్తుంటాయి. వాటి కోసం ఇంట్లో వంటగది, హాలు, బాల్కనీల్లో పక్షుల కోసం నీటి పాత్రలు పెట్టాను. దాహం వేసినప్పుడు నేరుగా దగ్గరలో ఉన్న నీటి పాత్ర దగ్గరకు వెళ్లిపోతాయి. పక్షులు మనతో మాట్లాడతాయి.రోజూ మా ఇంటి ఆవరణలో వినిపించే కిచకిచలన్నీ అవి నాకు చెప్పే కబుర్లే. కరోనా సమయంలో నా టైమ్ అంతా వీటి కోసమే కేటాయించాను. నన్ను నిత్య చైతన్యంగా ఉంచాయవి. నిజానికి పక్షి ప్రేమికులెవ్వరూ పక్షులను పంజరంలో బంధించరు. తమ సంతోషం కోసం పక్షులను పెంచే స్వార్థజీవులే ఆ పని చేస్తారు. దయచేసి పక్షులను బంధించవద్దు. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. చేతనైతే రోజుకు గుప్పెడు గింజలు, ఒక పండు పెట్టండి’’ అంటూ పక్షుల గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతారు రాధిక.ఇవి చదవండి: ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్‌గా..! -
వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే... మేమున్నది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అది రాజ్యాంగమే గుర్తించిన అత్యంత అమూల్యమైన, విస్మరించేందుకు వీల్లేని హక్కు. దానికి విఘాతం కలిగిందంటూ వచ్చే విన్నపాలను ఆలకించడం మా రాజ్యాంగపరమైన విధి. అది మా బాధ్యత కూడా’’ అని స్పష్టం చేసింది. యూపీకి చెందిన ఓ వ్యక్తికి రాష్ట్ర విద్యుత్ శాఖ పరికరాలు దొంగిలించిన కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించింది. నిందితునికి 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 9 అభియోగాల్లో ఒక్కోదానికి రెండేళ్ల చొప్పున అతనికి విధించిన జైలు శిక్షను మొత్తంగా రెండేళ్లకు కుదించింది. ‘‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విన్నపాలను ఆలకించి న్యాయం చేయని పక్షంలో మేమిక్కడ కూర్చుని ఇంకేం చేస్తున్నట్టు? మేమున్నదే అలాంటి పిటిషనర్ల ఆక్రందనను విని ఆదుకునేందుకు! అలాంటి కేసులను విచారణకు స్వీకరించకపోవడమంటే న్యాయ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగించడమే. చూసేందుకు అప్రాధాన్యమైనవిగా కనిపించే ఇలాంటి చిన్న కేసుల విచారణ సమయంలోనే న్యాయ, రాజ్యాంగపరమైన కీలక ప్రశ్నలు, అంశాలు తెరపైకి వస్తుంటాయి. సుప్రీంకోర్టు చరిత్రే ఇందుకు రుజువు. పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సుప్రీంకోర్టు జోక్యానికి ఆర్టికల్ 136లో పేర్కొన్న రాజ్యాంగ సూత్రాలే స్ఫూర్తి’’ అంటూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అందుకే ఏ కేసు కూడా సుప్రీంకోర్టు విచారించకూడనంత చిన్నది కాదు, కాబోదు’’ అని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులు కొండంత పేరుకుపోయిన నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని ప్రజాప్రయోజన వ్యాజ్యాల వంటివాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించొద్దని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు రెండు రోజుల క్రితం అభిప్రాయపడటం తెలిసిందే. అంతేగాక కొలీజియం వ్యవస్థ విషయంలో కేంద్రానికి, సుప్రీంకోర్టు మధ్య కొంతకాలంగా ఉప్పూనిప్పు మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీజేఐ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
‘ట్యాంక్‌బండ్‌పై విహారం’ రేపటి నుంచే.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్ ఈ ఆదివారం సాయంత్రం నుంచే పెడ్రస్టియన్ జోన్‌గా మారుస్తున్నారు. ఆ రోజుల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దీనిపైకి కేవలం సందర్శకుల్ని మాత్రమే అనుమతిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం జారీ చేశారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్ మీదుగా ప్రయాణించాల్సిన వాహనాలకు మళ్లింపులు విధించారు. గతంలో పేర్కొన్న వాటికి అదనంగా మరికొన్ని పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సాధారణ వాహన చోదకులు ఆ సమయంలో ట్యాంక్‌బండ్ మార్గంలో రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. చదవండి: హుస్సేన్‌సాగర్‌ని డంపింగ్ సాగర్‌గా మార్చారు.. ► లిబర్టీ వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ మీదుగా మళ్లిస్తారు. ►తెలుగుతల్లి వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం నుంచి లిబర్టీ, హిమాయత్‌నగర్ మీదుగా పంపిస్తారు. ► కర్బాలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు ప్రయాణించే వాహనాలు సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి. ► ఇక్బాల్ మినార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు పాత సెక్రటేరియేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే సందర్శకుల కోసం ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం నుంచి లేపాక్షి వరకు, డాక్టర్ కార్స్ వద్ద, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, ఆంధ్రా సెక్రటేరియేట్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ► కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వారికి ట్యాంక్‌బండ్‌పై సెయిలింగ్ క్లబ్ నుంచి చిల్డ్రన్ పార్క్ వరకు, బుద్ధభవన్ వెనుక ఉన్న నెక్లెస్ రోడ్లో, ఎనీ్టఆర్ గ్రౌండ్స్‌లో పార్కింగ్ కల్పించారు. -
ఎగిరే కారు వచ్చేసిందోచ్..!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఎగిరే కారు వచ్చేసిందోచ్.. నెదర్లాండ్‌కు చెందిన పాల్–వీ అనే కంపెనీ తొలి కారును సిద్ధం చేసింది. యూరప్‌లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను పొందింది. ఇప్పుడు ఎవరైనా ఈ కారు కొనుక్కుని ఎంచక్కా ఎగిరేయొచ్చు. ఎగిరే కారు ఆలోచనలు ఇప్పటివి కావు. కానీ ఈ కల సాకారం కాలేదు. అంతెందుకు ఈ పాల్–వీ కారు తయారీకి కూడా 20 ఏళ్లు పట్టింది. ఈ ఎగిరే కారు పేరు ‘ది లిబర్టీ’. వాహనం బరువు తగ్గించేందుకు మూడు చక్రాలతో తయారు చేశారు. నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే 3 చక్రాల వాహనానికి లైసెన్సు కూడా సులువుగా లభిస్తుందట. రోడ్డుపై వెళ్లేటప్పుడు ద లిబర్టీ రెక్కలు పైభాగంలో ముడుచుకుని ఉంటాయి. విమానంగా మారేటప్పుడు రెక్కలు విచ్చుకుంటాయి. 100 హెచ్‌పీ గల ఇంజిన్‌తో ఇది తొమ్మిది సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 180 కి.మీ. వేగంతో.. రెండు సీట్లు మాత్రమే ఈ కారులో ఉంటాయి. గాలిలో ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ కోసం వెయ్యి అడుగుల రన్‌వే అవసరం కాగా.. ల్యాండ్ అయ్యేందుకు వంద అడుగుల దారి సరిపోతుంది. ఇంధన ట్యాంకులో వంద లీటర్ల ఇంధనాన్ని నింపుకొంటే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. అదనంగా మరో అరగంట పాటు నడిచేందుకు రిజర్వ్ ట్యాంకు కూడా ఉంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు మైలేజీ లీటర్‌కు 13 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడే దీన్ని కొని గాల్లో ఎగిరేందుకు తహతహలాడకండి. ఎందు కంటే ఈ కారు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేందుకు 2022 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఈలోపు విమానంగా ఉపయోగించేందుకు అవసరమైన అనుమతులు సాధించే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. చదవండి: చైనాకి మరిన్ని వందేభారత్ విమానాలు -
‘గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా?’
న్యూఢిల్లీ: జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతియుడిని శ్వేత జాతి పోలీసు అధికారి కాలితో తొక్కి చంపిన నేపథ్యంలో అమెరికాలో తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌వద్ద భారీ స్థాయిలో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక తాజాగా జాత్యహంకారంపై క్రీడా లోకం కూడా మండిపడుతోంది. ఇప్పటికే ఫార్ములావన్ రేసర్లు, క్రికెట్, గోల్ఫ్ ఆటగాళ్లు వర్ణ వివక్ష హత్యపై మండిపడ్డారు. తాజాగా ఫ్లాయిడ్ మరణంపై అమెరికన్ ఫుట్ బాలర్ డీఅండ్రీ ఎడ్లిన్ స్పందించాడు. (క్రికెట్ ప్రపంచం గళం విప్పాల్సిందే) ‘జార్జ్ ఫ్లాయిడ్ మరణం అనంతరం మా తాత ఒక సందేశం పంపారు. అమెరికాలో నివసించనందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే నాకు ఏమైనా అవుతుందో అనే భయం ఆయనలో నెలకొంది. ఎందుకంటే నేను కూడా నల్లజాతీయుడినే కదా. చిన్నప్పుడు స్కూళ్లో చేసిన ప్రతిజ్ఞ గుర్తుతెచ్చుకుంటే.. అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, న్యాయం అంటూ చివర్లో చదువుతాం. ఇప్పుడు అమెరికన్లు అందరూ గుండెలపై చేతులు వేసుకొని ఇక్కడ అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, న్యాయం ఉందా అని చెప్పగలారా?’ అంటూ ఓ భావోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) -
మన దేశం పేరును రాజ్యాంగంలో ఎలా చేర్చారు?
రాజ్యాంగ ప్రవేశిక - ఉన్నత ఆదర్శాలు స్వేచ్ఛ (Liberty): నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అనివార్యం. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ప్రతి పౌరునికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండాలి. ఉదా: మత స్వేచ్ఛ లౌకిక రాజ్య స్థాపనకు పునాది. సమానత్వం (Liberty): ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఆదర్శం. సమానత్వం అంటే అన్ని రకాల అసమానత్వాలను, వివక్షతలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి తనకు తాను పూర్తిగా వికాస పర్చుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడం. సౌభ్రాతృత్వం (Fraternity): సౌభ్రాతృత్వం అంటే సోదరభావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షత లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్ధిల్లుతుంది. ఐక్యత, సమగ్రత (Unity & Integrity): దేశ ప్రజలందరూ కలిసి ఉండటానికి ఐక్యతాభావం దోహదపడుతుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychological Emotion). మత, కుల, ప్రాంత అనే సంకుచిత ఆలోచనకు అతీతమైన ఆదర్శం. ‘సమగ్రత’ అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. సమగ్రత ప్రజల మధ్య జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. 1970 తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో, ప్రాంతీయవాదం, వేర్పాటు వాదం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా తీవ్ర పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ‘సమగ్రత’ అనే పదాన్ని చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ప్రవేశిక సవరణకు అతీతం కాదు ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ప్రకరణ 368 ప్రకారం ఉంటుందని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. అయితే ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనంలోకి వస్తుంది కాబట్టి, దాని సారాంశం (ఞజీటజ్టీ) మార్చకుండా ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలను చేయవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత’ అనే పదాలను చేర్చారు. ఇదే మొదటి, చివరి సవరణ కూడా. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమా? రాజ్యాంగ సారాంశమంతా ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఇది రాజ్యాంగ అంతర్భాగమా? కాదా? అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులను వెలువరించింది. 1960లో బెరుబారి యూనియన్ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రకరణ 143 ప్రకారం సలహా పూర్వకమైన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే 1973లో కేశవానంద భారతి వివాదంలో పూర్తి భిన్నమైన తీర్పు చెబుతూ ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమేనని వ్యాఖ్యానించింది. 1995లో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసులోనూ ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికను ఓటింగ్‌కు పెట్టినప్పుడు కూడా డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది. ప్రవేశిక ప్రయోజనం - ప్రాముఖ్యత ప్రవేశిక రాజ్యాంగ ఆధారాన్ని పేర్కొంటుంది. ఇది రాజ్యాంగ ఆమోద తేదీని తెలియజేస్తుంది. రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపరమైన సహాయకారిగా ఉపయోగపడుతుంది. విమర్శలు: ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఇందులో పేర్కొన్న ఆశయాలను అమలు చేయకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఇందులో పేర్కొన్న భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు. హక్కుల ప్రస్థావన లేదు. శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు. అదేవిధంగా పరిమితికాదు. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిది. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ప్రవేశికలో రాజ్యాంగ తాత్విక పునాదులు ఉన్నాయి. మాదిరి ప్రశ్నలు 1. భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించాల్సిన లక్ష్యం? 1) సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. సమానహోదా, అవకాశం 2) ఆలోచన, భావప్రకటన, నమ్మకం, ఆరాధన విషయాల్లో స్వేచ్ఛ 3) వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పెంపొందించే సౌభ్రాతృత్వాన్ని సాధించాలి 4) పైవన్నీ 2. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర స్వభావాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? 1) ఫ్రెంచి 2) బ్రిటిష్ 3) ఐర్లాండ్ 4) రష్యా 3. కిందివాటిలో సరికాని జత ఏది? 1) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు - గోలక్‌నాథ్ కేసు 2) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే - కేశవానంద భారతీ కేసు 3) లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపమే - ఎన్.ఆర్. బొమ్మయ్ కేసు 4) పైవన్నీ సరైనవే 4. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో చేర్చిన పదం? ఎ) సామ్యవాదం బి) లౌకిక సి) సమగ్రత డి) సార్వభౌమ 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి 5. మనదేశం పేరును రాజ్యాంగంలో ఎలా పొందుపర్చారు? 1) ఇండియా - భారత్ 2) హిందూస్థాన్ 3) అఖండ్ భారత్ 4) సింధూస్థాన్ 6. భారతదేశం ఏ రాజకీయ తరహా వ్యవస్థను ఆచరిస్తుంది? 1) ప్రజాస్వామిక వ్యవస్థ 2) పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ 3) అధ్యక్ష తరహా వ్యవస్థ 4) సమాఖ్య తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ 7. భారత రిపబ్లిక్ రాజ్యాంగం అనేది? 1) రాజ్యాంగ సభ ద్వారా నిర్మితమై, గవర్నర్ జనరల్ ద్వారా ఆమోదం పొందింది. 2) బ్రిటిష్ పార్లమెంట్ ప్రతిపాదించగా, రాజ్యాంగసభ ఆమోదించింది. 3) భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్తావించగా, రాజ్యాంగ సభ ఆమో దించింది. 4) రాజ్యాంగ పరిషత్తు రచించి, స్వీకరించింది. 8. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా వర్ణించింది ఎవరు? 1) మహాత్మాగాంధీ 2) అంబేద్కర్ 3) వల్లభాయ్ పటేల్ 4) ఠాకూర్‌దాస్ భార్గవ 9. రాజ్యాంగ ప్రవేశిక? 1) సూచనాత్మకమైంది. 2) విషయ సూచిక లాంటిది 3) 1, 2 4) ఏదీకాదు 10. ప్రవేశిక నుంచి దేన్ని తెలుసుకోవచ్చు? 1) రాజ్యాంగ ఆమోద తేది 2) రాజ్యాంగ ఆధారాలు 3) రాజ్యాంగ ఆశయాలు 4) పైవన్నీ 11. ప్రవేశికకు సంబంధించి సరైంది? 1) రాజ్యాంగంలోని ప్రకరణలతో సంబంధం ఉంటుంది 2) ప్రత్యేకంగా ప్రవేశికకు ఉనికి ఉండదు 3) సవరణకు అతీతం కాదు 4) పైవన్నీ సరైనవే సమాధానాలు 1) 4; 2) 1; 3) 4; 4) 3; 5) 1; 6) 4; 7) 4; 8) 4; 9) 1; 10) 4; 11) 4. -
నేడు ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, సిటీబ్యూరో: శనివారం ఎల్బీస్టేడియంలో జరగనున్న సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. చోటుచేసుకోనున్న మార్పులివే.. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్టేడియం చుట్టుపక్కల ఆంక్షలు ఏఆర్పెట్రోల్ పంప్, పీజేఆర్ విగ్రహం చౌరస్తా మధ్య వాహనాలను అనుమతించరు అబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను పీజేఆర్ విగ్రహం వైపు కాక ఎస్బీహెచ్ మీదుగా మళ్లిస్తారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా మళ్లిస్తారు రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలను సిమెట్రీ జంక్షన్ నుంచి మళ్లిస్తారు కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను కింగ్‌కోఠి క్రాస్‌రోడ్డు నుంచి తాజ్‌మహల్ మీదుగా పంపిస్తారు లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ మీదుగా పంపిస్తారు పోలీస్ కంట్రోల్‌రూమ్ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వాహనాలను అనుమతించరు పీవీ విగ్రహం, తెలుగుతల్లి, అప్పర్‌ట్యాంక్‌బండ్ మార్గాల మీదుగా పాస్ ఉన్నవారినే స్టేడియానికి అనుమతిస్తారు. మిగతా వారి రాకపోకలపై నిషేధం.