life insurance business
-
నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రేషియో క్షీణత
న్యూఢిల్లీ: నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంలో నికర చెల్లింపులు (క్లెయిమ్ రేషియో) 2023–24లో స్వల్పంగా తగ్గి 82.52 శాతంగా ఉన్నట్టు బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నివేదిక ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 82.95 శాతంగా ఉంది. నాన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కలసి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్ల ప్రీమియాన్ని నమోదు చేశాయి. 12.76 శాతం పెరిగింది. ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం 9 శాతం వరకు పెరిగి రూ.82,891 కోట్ల నుంచి రూ.90,252 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ప్రీమియం రూ.1.88 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.58 లక్షల కోట్లుగానే ఉంది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల లాభం రూ.10,119 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రూ.2,556 కోట్ల మేర నష్టాలను నమోదు చేయడం గమనార్హం. నివేదికలోని వివరాలు..2023–24లో నెట్ ఇన్కర్డ్ (నికర) క్లెయిమ్‌లు 15.39 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వరంగ బీమా సంస్థల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 99.02 శాతంగా ఉంటే, 2023–24లో 97.23 శాతానికి తగ్గింది.ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 76.49 శాతానికి మెరుగుపడింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 75.13 శాతంగా ఉంది.స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 61.44 శాతంగా ఉంటే, 2023–24లో 63.63 శాతానికి మెరుగుపడింది.స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 66.58 శాతంగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 73.71 శాతంగా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్జీవిత బీమా కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.77 లక్షల కోట్లను పాలసీదారులకు చెల్లించాయి. పాలసీదారుల నుంచి వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో చెల్లింపులు 70.22 శాతంగా ఉన్నాయి. పాలసీల సరెండర్లు/ఉపసంహరణలకు సంబంధించిన ప్రయోజనాలు 15 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల వాటా 58 శాతంగా ఉంది.2023–24లో 18 జీవిత బీమా కంపెనీలు నికర లాభాలను నమోదు చేశాయి. జీవిత బీమా కంపెనీల ఉమ్మడి లాభం 11 శాతం పెరిగి రూ.47,407 కోట్లకు చేరింది.ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్ఐసీ) లాభం 11.75 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా కంపెనీల లాభంలో 5 శాతం వృద్ధి నమోదైంది.మొత్తం బీమా వ్యాప్తి 2022–23లో 4 శాతంగా ఉంటే 2023–24లో 3.7 శాతానికి పరిమితమైంది. జీవిత బీమా వ్యాప్తి 3 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గగా.. సాధారణ బీమా వ్యాప్తి (ఆరోగ్య బీమా సహా) ఒక శాతం వద్దే స్థిరంగా ఉంది. -
హెచ్డీఎఫ్సీ నికర లాభం రూ. 2,107 కోట్లు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 2 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ2లో రూ.2,064 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.2,107 కోట్లకు ఎగసిందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.11,608 కోట్ల నుంచి రూ.12,521 కోట్లకు పెరిగిందని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిస్త్రీ చెప్పారు. జీవిత బీమా వ్యాపారం జోరు కారణంగా నికర లాభంలో వృద్ధి సాధించామని వివరించారు. స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.1,358 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.1,605 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.6,671 కోట్ల నుంచి రూ.7,480 కోట్లకు ఎగసిందని తెలిపారు. వచ్చే ఏడాది హెచ్డీఎఫ్సీ లైఫ్ ఐపీఓ గత క్యూ2లో రూ.184 కోట్లుగా ఉన్న జీవీత బీమా వ్యాపార విభాగం నికర లాభం రూ.215 కోట్లకు వృద్ధి చెందిందని మిస్త్రీ వివరించారు. సాధారణ బీమా వ్యాపార నికర లాభం రూ.36 కోట్ల నుంచి రూ.61 కోట్లకు పెరిగిందని, రూ.719 కోట్లు పన్నుల కోసం కేటాయించామని చెప్పారు. నికర వడ్డీ మార్జిన్ 4% నుంచి 3.95 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం (డివిడెండ్‌తో కలుపుకొని) రూ.2,059 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.2,501 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డివిడెండ్ కారణంగా నికర వడ్డీ ఆదాయం పెరిగిందని వివరించారు. స్థూల మొండి బకాయిలు 0.71%గా ఉన్నాయని, వ్యక్తుల మొండి బకాయిలు 0.53 %గా, సంస్థల మొండి బకాయిలు 1.12 %గా ఉన్నాయని తెలిపారు. లోన్‌బుక్ రూ.2,12,344కోట్ల నుంచి రూ.2,37,991 కోట్లకు పెరిగిందని వివరించారు. ఏడాది కాలంలో రూ.12,969 కోట్ల రుణాలు విక్రయించామని తెలిపారు. విదేశాల్లో రూపీ బాండ్ల ద్వారా 75 కోట్ల డాలర్ల నిధులు సమీకరించడానికి వాటాదారుల ఆమోదం పొందామని తెలిపారు. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఐపీఓ వచ్చే ఏడాది మధ్యన ఉండొచ్చని తెలిపారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 2 శాతం నష్టంతో రూ.1,313 వద్ద ముగిసింది. -
పాత బీమా పాలసీలకు గడువు పొడిగించం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతమున్న జీవిత బీమా పాలసీలను విక్రయించడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే అనుమతిస్తామని, వచ్చే జనవరి 1 నుంచి కొత్త మార్గదర్శకాలతో కూడిన పాలసీలనే విక్రయించాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా పథకాలను విక్రయించడానికి అన్ని బీమా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, ఈ గడువును ఇక పెంచేది లేదని ఐఆర్డీఏ మెంబర్ (లైఫ్) సుధీన్ రాయ్ చౌదరి తెలిపారు. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా సుమారు 460 కొత్త పథకాలు అనుమతి కోసం రాగా ఇప్పటికే 400 పథకాలకు ఓకే చెప్పినట్లు ఆయన తెలిపారు. తొలుత అక్టోబర్ 1లోపు పాత పథకాల స్థానే కొత్త మార్గదర్శకాలతో కూడిన ప్రోడక్టులను ప్రవేశపెట్టాలని ఐఆర్డీఏ నిబంధన విధించినా, బీమా కంపెనీల కోరిక మేరకు ఈ గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతూ ఐఆర్డీఏ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే పాలసీదారులకు అధిక బీమా రక్షణతో పాటు, పాలసీలను మధ్యలో ఆపేస్తే వచ్చే సరెండర్ వేల్యూ కూడా పెరుగుతుంది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐఐఆర్ఎం-ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఏడవ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్న చౌదరి మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత జీవిత బీమా రంగం తిరిగి ఈ ఏడాది వృద్ధిని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐఆర్ఎం మేనేజింగ్ డెరైక్టర్ టి.నరసింహారావు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎండీ, సీఈవో సందీప్ బక్షి తదితరులు పాల్గొన్నారు.