life Sentenced
-
మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు
సాక్షి, శివాజీనగర: డబ్బు కోసం స్నేహితున్ని హత్య చేసిన కేసులో ముంబైకి చెందిన ఇద్దరు యువతులతో పాటు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అర్జీని హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పును రద్దు చేయాలని, లేదా సవరించాలని దోషులు రోహిత్ కుమార్– జార్ఖండ్, శివానీ ఠాకూర్, ప్రీతి రాజ్ – ముంబై, వారీస్– బిహార్.. వేసుకున్న అప్పీల్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ వీ.వీరప్ప ధర్మాసనం కొట్టివేసింది. హత్య కేసు వివరాలు.. వివరాలు.. వారిస్, తుషార్ రాజస్థాన్‌లో కలసి చదువుతుండేవారు. ఇంజనీరింగ్ చదివేందుకు తుషార్ బెంగళూరుకు వచ్చాడు. ధనవంతుల కుటుంబానికి చెందిన తుషార్‌ను కిడ్నాప్ చేయాలని వారిస్ కూడా బెంగళూరులో మకాం వేశాడు. ఇక్కడే ఉద్యోగం చేస్తున్న తన బంధువైన ప్రీతి, శివానిని తుషార్‌కు పరిచయం చేశాడు. నిందితులు 2011 జనవరి 14న తుషార్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసి వీరసాగర రోడ్డు నీలగిరి తోపులో పడేశారు. జనవరి 16న అతని తండ్రికి కాల్ చేసి మీ కుమారుడిని కిడ్నాప్ చేశాం. రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తుషార్ తండ్రి బిహార్ నుంచి బెంగళూరుకు వచ్చి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. రైల్వేస్టేషన్ వద్ద డబ్బు ఇస్తామని పిలిపించగా రెండో నిందితుడు రోహిత్ వచ్చాడు. అతన్ని పట్టుకుని మిగతావారినీ అరెస్టు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ లో నేరం రుజువు కావడంతో 2014 నవంబరులో నలుగురికీ జీవిత ఖైదుని విధించింది. హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పుని సమర్థించింది. (చదవండి: భార్య నుంచి కాపాడాలని మొర ) -
భార్యా హంతకునికి జీవితఖైదు రద్దు: హైకోర్టు సంచలన తీర్పు
బనశంకరి: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో 2016లో వినాయక చవితి రోజున భార్య రాధ వంట చేయకుండా మద్యం తాగి పడుకుంది. కోపోద్రిక్తుడైన భర్త సురేశ్ కట్టెతో దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. 2017లో స్థానిక కోర్టు అతనికి యావజ్జీవిత ఖైదు శిక్ష విధించగా అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. అతడు ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేశాడు. హైకోర్టు ఏం చెప్పిందంటే మంగళవారం కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే.సోమశేఖర్, టీజీ శివశంకరేగౌడల ధర్మాసనం.. అతడు చేసింది ఉద్దేశపూర్వక హత్యగా పరిగణించలేమని పేర్కొన్నారు. ఈ నేరాన్ని హత్యగా భావించలేమని, కాబట్టి హత్యానేరం సెక్షన్‌ను తొలగించాలని స్పష్టంచేశారు. ఇప్పటికే 6 ఏళ్లు జైలుశిక్ష అనుభవించడంతో, అతనిపై ఎలాంటి కేసులు లేకపోవడంతో తక్షణం జైలు నుంచి విడుద చేయాలని ఆదేశించారు. (చదవండి: ప్రేమిస్తే చంపేస్తారు!) -
నటి హత్య కేసులో దంపతులకు జీవితఖైదు
చెన్నై కోడంబాక్కానికి చెందిన సహాయ నటి హత్య కేసులో నిందితులైన దంతులను అదనపు సెసెన్స్ కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. కోడంబాక్కంకు చెందిన రమేష్ భార్య ఆదిలక్ష్మి(50). పలు చిత్రాలలో సహాయ నటిగా నటించారు. వీరి బంధువు ప్రభావతి (35). ఈమె భర్త ఎడ్వర్డ్ జయకుమార్. బిడ్డ చదువుకు, ఇంటి బాడుగకు తరచూ ఆదిలక్ష్మి వద్ద డబ్బులు కావాలని ప్రభావతి వేధించేది. ఆదిలక్ష్మి, ప్రభావతికి నగదు ఇవ్వడానికి తిరస్కరించేది. దీంతో ఆగ్రహం చెందిన ప్రభావతి దంపతులు 2010, అక్టోబర్ 15వ తేదీ ఆదిలక్ష్మిని హత్య చేశారు. బీరువాలో ఉన్న 4 సవర్ల నగలు, రెండు పట్టు చీరలు, ఒక కెమెరా తీసుకుని పారిపోయారు. దీనిపై పోలీసులు ప్రభావతి, జయకుమార్‌లను 18వ తేదీ అరెస్టు చేశారు. ఈ హత్య కేసుపై హైకోర్టు మొదటి అదనపు సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి మాలతి సమక్షంలో శుక్రవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ సెల్వరాజ్ హాజరయ్యారు. సాక్షుల విచారణ తరువాత నిందితులు ప్రభావతి, జయకుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు ఇచ్చారు. ప్రభావతికి *22 వేలు, ఎడ్వర్డ్ జయకుమార్‌కు రూ.11 వేలు జరిమానా విధించారు.