lightmen
-
గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మన్ కుటుంబానికి ఆర్థికసాయం
నటుడు సత్యరాజ్, వసంత రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వెపన్'. ఎంఎస్.మన్సూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర షూటింగ్లో ఓ దుర్ఘటన జరిగింది. ఎస్.కుమార్ అనే లైట్‌మన్ ప్రమాదవశాత్తూ మరణించాడు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్) దీంతో అతని కుటుంబానికి వెపన్ చిత్ర నిర్మాత ఎంఎస్. మన్సూర్ రూ.12 లక్షలు ఆర్ధిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని బుధవారం చెక్కు రూపంలో లైట్‌మన్ కుమార్ భార్య జూలియట్, పిల్లలకు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.పెల్వమణి, లైట్స్‌మన్ యూనియన్ అధ్యక్షుడు సెంథిల్, మేనేజర్ కందన్ల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ లైట్‌మన్ కుమార్ మృతి తన కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినట్లు బాధిస్తోందన్నారు. వృత్తి కోసం రేయింబవళ్లు శ్రమించిన వ్యక్తి మరణం మనసును కలచివేస్తోందన్నారు. కుమార్ లేని లోటు అతని కుటుంబానికి ఎవరూ తీర్చలేనిదన్నారు. అందుకే తాను ఓదార్పుగా చిన్న మొత్తాన్ని సాయం చేసినట్లు తెలిపారు. (ఇది చదవండి: దక్షిణాదిలో స్టార్ క్రేజ్.. అక్కడేమో ఒక్క హిట్ కోసం తంటాలు!) -
టాలీవుడ్లో మరో వివాదం
సాక్షి, హైదరాబాద్: ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం చల్లారకముందే తెలుగు సినిమా పరిశ్రమలో మరో గొడవ రేగింది. సినీ, టీవీ అవుట్డోర్ లైట్‌మెన్ యూనియన్ సభ్యులు ఆందోళనతో సినిమా షూటింగ్‌లకు అంతరాయం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. నిర్మాత డీవీవీ దానయ్య ఇతర రాష్ట్రాల నుంచి లైట్‌మెన్లను తీసుకురావడంతో వివాదం మొదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని లైట్‌మెన్ యూనియన్ నాయకులు గురువారం అడ్డుకున్నారు. వీరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు కనీస వేతనాలు ఇవ్వకుండా ఎక్కువసేపు పని చేయించుకుంటున్నారని, ఇతర రాష్ట్రాల వారిని రప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ లైట్‌మెన్ యూనియన్ సభ్యులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఆందోళనకు దిగారు. మూడేళ్లకు ఒకసారి కనీస వేతనాలు పెంచాలన్న నిబంధనను పట్టించుకోకుండా తమకు అన్యాయం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. తమ డిమాండ్ల సాధనకు షూటింగ్‌లను బహిష్కరించామని, తమకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. కనీస వేతనంపై రేపటిలోగా ప్రకటన చేయకుంటే నిరవధిక ఆందోళన దిగుతామని వారు హెచ్చరించారు. సినిమా పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు సినీ, టీవీ అవుట్డోర్ లైట్‌మెన్ యూనియన్ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్‌కు భారీగా తరలివస్తున్నారు.