lilly singh
-
Lilly Singh: సూపర్ ఉమన్ లిల్లీసింగ్!
మూడో తరగతి చదివే చిన్నారికి ‘ద రాక్ డ్వైన్’ అంటే.. బెడ్రూంలో కటౌట్ పెట్టుకునేంత ఇష్టం. దీంతో అంతా తనని రాక్ సింగ్ అని పిలిచేవారు. డ్వైన్ను సూపర్‌మ్యాన్‌గా భావించిన ఆ చిన్నారి.. తనని సూపర్ ఉమన్‌గా ఊహించుకుంది. తన ఊహ అక్కడితో ఆగిపోలేదు. తనతోనే పెరిగి పెద్దై నేడు సూపర్ ఉమన్ లిల్లీసింగ్ గా ఎదిగింది. కామెడీ కంటెంట్ వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేస్తూ సోషల్ మీడియా స్టార్‌గానే గాక, కోట్లమంది ఫాలోవర్స్‌తో ప్రపంచంలోనే పాపులర్ యాక్టర్, ర్యాపర్, వ్లాగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెనడాలో స్థిరపడిన పంజాబీ దంపతులు సుఖ్విందర్ సింగ్, మల్విందర్ సింగ్‌ల రెండో సంతానంగా 1988 సెప్టెంబర్ 26న ఒంటారియాలోని స్కార్‌బరోలో లిల్లీ సైనీ సింగ్ పుట్టింది. లిల్లీకి నీనా అనే అక్క ఉంది. స్కార్బరోలోనే విద్యనభ్యసించిన లిల్లీ... యార్క్ యూనివర్సిటీలో సైకాలజీలో డిగ్రీ చదివింది. డిగ్రీలో ఉండగా లిల్లీ భాంగ్రా నృత్యాన్ని నేర్చుకుంది. సూపర్ ఉమన్.. డిగ్రీ పూర్తయ్యాక కలెక్షన్స్ ఏజెన్సీలో ఉద్యోగంలో చేరినప్పటికి, అది తనకి నచ్చకపోవడంతో.. జాబ్ వదిలేసి 2010లో ‘సూపర్ ఉమన్’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. కామెడీ, ఫన్నీ వీడియోలు రూపొందించి తన ఛానల్లో పోస్టుచేసేది. పురుషులపై ప్యారడీ, తన తల్లిదండ్రులు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులను అనుకరిస్తూ లిల్లీ చేసే కామెడీని ఎక్కువమంది లైక్ చేసేవారు. లిల్లీ చేసిన తొలి వీడియో ‘అఫీషియల్ గైడ్ టు బ్రౌన్ గార్ల్స్’లో భారతీయ సంప్రదాయ దుస్తులు వేసుకుని వ్యంగ్యం, కామెడీలతో హాస్యాన్ని రక్తికట్టించడంతో బాగా వైరల్ అయింది. దీంతో లిల్లీ ఛానల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య కోటి దాటింది. ఈ ఉత్సాహంతో ‘సూపర్ ఉమన్ వ్లాగ్స్’ పేరిట రెండో యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసింది. ఈ ఛానల్లో తన డైలీ రొటీన్ యాక్టివిటీ వీడియోలు పోస్టు చేసేది. ఫోర్బ్స్ టాప్‌టెన్‌లో.. లాస్ ఏంజిల్స్‌కు మకాం మార్చి తన వీడియోలతో రాకెట్లా దూసుకుపోయి కోటిన్నరకు పైగా సబ్‌స్రై్కబర్స్‌తో 10.5 మిలియన్ డాలర్లను సంపాదించి 2017లో ఫోర్బ్స్ అత్యధిక ఆదాయం కలిగిన యూట్యూబ్ స్టార్స్ టాప్ టెన్‌లో లిల్లీ సింగ్ నిలిచింది. తన ప్రతిభతో అనేక అవార్డులు అందుకుంది. మంచినటిగానూ.. యూట్యూబర్‌గా బిజీగా ఉంటూనే హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ‘డాక్టర్ క్యాబీ’, బాలీవుడ్ సినిమా‘స్పీడీ సింగ్స్, థ్యాంక్యూలలో నటించగా, బబుల్స్ అండ్ మిస్టీ అనే యానిమేటెడ్ సినిమాకు గాత్రం అందించింది. తరువాత హాలీవుడ్ సినిమా ఐస్ ఏజ్: కొలిజన్ కోర్స్’, ‘బ్యాడ్ మామ్స్‌లో నటించింది. ఓ పంజాబీ సాంగ్‌ను ర్యాప్ చేసి పాడడంతో బాలీవుడ్ సినిమా గులాబ్ గ్యాంగ్‌లో పెట్టారు. కాగా అనేక సామాజిక అంశాలపై స్పందించే లిల్లీ సింగ్ ఈ ఏడాది జరిగిన గ్రామీ అవార్డ్స్ ఈవెంట్లో ‘ఐ స్టాండ్ విత్ ఫార్మర్స్’ అని రాసి ఉన్న మాస్క్ ధరించి ఇండియాలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపింది. ఎ లిటిల్ లేట్ విత్ లిల్లీసింగ్.. నిర్విరామంగా వీడియోలతో అలరించిన లిల్లీసింగ్ 2018 నవంబర్‌లో ‘‘గత ఎనిమిదేళ్లుగా మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. కొద్దిరోజులు వీడియోలు చేయలేను’’ అని చెప్పి కొద్దికాలం బ్రేక్ తీసుకుంది. తర్వాత 2019లో ‘‘నేను ‘బైసెక్సువల్‌ని’ అని ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని కొందరు విమర్శిస్తే, మరికొందరు ఆమె నిజాయితీని మెచ్చుకున్నారు. ఇదే ఏడాది కార్సన్ నిర్వహించే ఎన్బీసీ షోను లిల్లీ సింగ్ చేపట్టి, అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రసారమయ్యే ‘ఎ లిటిల్ లేట్ విత్ లిల్లీసింగ్’కు వ్యాఖ్యాతగా మారింది. దీంతో లేట్ నైట్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి మహిళగా లిల్లీసింగ్ నిలిచింది. కాగా ఈ షోను ఈ ఏడాది ముగిస్తున్నట్లు ఎన్బీసీ ప్రకటించింది.చివరి ఎపిసోడ్ జూన్ 3న ప్రసారం కానుంది. -
రైతుల నిరసనకు లిల్లి సింగ్ మద్దతు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు కొంతమంది అంతర్జాతీయ ప్రముఖలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మరో ప్రముఖ వ్యక్తి చేరారు. ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 63వ గ్రామీ అవార్డు వేడకల్లో ప్రముఖ కెనడీయన్ యూట్యూబర్ లిల్లి సింగ్.. భారత్‌లోని రైతులకు మద్దతుగా ఉంటానని సూచించే ఓ మాస్క్ ధరించి పాల్గొన్నారు. నల్లని సూట్ ధరించి ‘ఐ స్టాండ్ విత్ ఫార్మర్స్’ అని రాసి ఉన్న మాస్క్‌ను వేసుకొని రెండ్ కార్పెట్‌పై ఫోటోలకు పొజులిచ్చారు. అనంతరం ఆమె తన ట్విటర్ ఖాతాలో ఆ ఫోటోను పోస్ట్ చేశారు. ‘అవార్డు వేడుకల్లోని రెడ్ కార్పెట్‌పై దిగే ఫోటోలకు మీడియా కవరేజ్ అధికంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే మీరు మీడియా ముందుకు వచ్చి స్వేచ్ఛగా భారత రైతులకు మద్దతు ప్రకటించండి’ అని ఆమె కామెంట్ జతచేశారు. రైతులకు మద్దతు ప్రకటించిన లిల్లి సింగ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇటీవల పర్యవరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్, అమెరికన్ పాప్ సింగర్ రెహానా, పోర్న్ స్టార్ మియా ఖలీఫా తమ మద్దతును రైతులకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారి మద్దతుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు నవంబర్‌లో సింగు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కనీస మద్దతు ధరపై చట్ట పరమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. I know red carpet/award show pictures always get the most coverage, so here you go media. Feel free to run with it ✊🏽 #IStandWithFarmers #GRAMMYs pic.twitter.com/hTM0zpXoIT — Lilly // #LateWithLilly (@Lilly) March 15, 2021 చదవండి: కాంక్రీట్ గోడ నిర్మాణం: రైతులపై కేసు నమోదు -
సుష్మాకు సూపర్ ఉమన్ ట్వీట్ల వర్షం
భారతదేశం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇక్కడకు రావాలని చాలా ప్రయత్నించింది. కానీ టొరంటోలోని భారత రాయబార కార్యాలయం నుంచి వీసా పొందాలంటే ఆమెకు చుక్కలు కనిపించాయి. సాధారణంగా యూట్యూబ్‌లో తనదైన శైలిలో వీడియోలు పెడుతూ అందరినీ తెగ నవ్వించే లిల్లీ సింగ్.. అలియాస్ సూపర్ ఉమన్ ఈసారి ట్విట్టర్ ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదించింది. తన కష్టాలు తీర్చమని, టొరంటో ఎంబసీ విషయం చూడాలని కోరింది. మధ్యలోప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా తన ట్వీట్లలో ట్యాగ్ చేసింది. టొరంటోలోని రాయబార కార్యాలయంలో వీసా పొందడం చాలా కష్టంగా ఉందని, అసలు ఏమాత్రం ప్రొఫెషనల్‌గా లేదని తెలిపింది. తాను వీసా పొందడానికి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లానో, ఎన్ని కష్టాలు పడ్డానో చూడండంటూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. అక్కడి ఉద్యోగులు చాలా తలబిరుసుగా ఉన్నారని, కేవలం ఒక్క ప్రశ్న అడిగినందుకు తన మీద పలు సందర్భాల్లో మండిపడ్డారని తెలిపింది. ఆ తర్వాత ఆమెకు వీసా అయితే వచ్చింది. కానీ తాను ఒక ఏడాది పాటు వీసా కావాలని దరఖాస్తు చేస్తే.. కేవలం మూడు నెలలకు మాత్రమే ఇచ్చారని వాపోయింది. అక్కడున్న వారిలో ఒక్క ఉద్యోగి మాత్రం చాలా స్నేహ పూర్వకంగా ఉన్నారని, తాను ఇంటర్నెట్ సెలబ్రిటీ అని తెలిసిన తర్వాత తనతో కలిసి ఒక ఫొటో కూడా తీసుకున్నారని లిల్లీసింగ్ చెప్పింది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఆమెకు సమాధానం అయితే ఇవ్వలేదు గానీ, మొత్తానికి మూడు నెలలకైనా వీసా మాత్రం ఆమె చేతికి వచ్చేసింది కాబట్టి ఎంచక్కా భారతదేశం రావచ్చు. ఇక్కడ అవకాశం ఉంటే అపాయింట్మెంట్ తీసుకుని సుష్మా స్వరాజ్‌ను కూడా కలవచ్చు. తాను తొలిసారిగా రాసిన ‘హౌ టు బీ ఎ బాస్: ఎ గైడ్ టు కాన్కరింగ్ లైఫ్’ అనే పుస్తకం ప్రమోషన్ కోసం ఆమె ఈ నెలాఖరులో భారతదేశానికి రానుంది. Love india but gotta say that the consulate of india in Toronto is literally the worst place on earth. Such a disappointment. — Lilly | #BawseBook (@IISuperwomanII) 6 April 2017 For travel to India, the consulate makes acquiring a visa the most difficult task. I hope one day @narendramodi can remedy this. It's sad. — Lilly | #BawseBook (@IISuperwomanII) 6 April 2017 .@SushmaSwaraj just a kind note to make you aware that the Consulate of India in Toronto is extremely difficult and unprofessional.