liquor driniking
-
మద్యం తాగే వాళ్లు భారతీయులే కాదు..
పాట్నా: మద్యం తాగే వాళ్లు అసలు భారతీయులే కాదంట.. మందు తాగే వారందరూ మహా పాపులు అంటూ స్వయంగా ఓ రాష్ఠ్ర ముఖ్యమంత్రే అనడం ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఎవరంటే.. బీహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022ను కఠినతరం చేస్తూ సవరణలు చేశారు. ఈ బిల్లు తాజాగా గవర్నర్ ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం.. ఎవరైనా మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే జరిమానాతో పాటుగా ఒక నెల జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. కాగా, జరిమానా డిపాజిట్ చేసి బెయిల్ పొందే అవకాశం కల్పించారు. అయితే, ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగుతుండగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సందర్బంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. మద్యం సేవించే వారు అసలు భారతీయులే కాదన్నారు. మందు తాగే వారందరూ మహా పాపులు అంటూ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారని అన్నారు. ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా మద్యం సేవించే వారిని తాను భారతీయులుగా పరిగణించను అని వ్యాఖ్యానించారు. మద్యం సేవించడం హానికరం అని తెలిసిన కొందరు సేవిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మద్యం సేవించి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 2021లో చివరి ఆరు నెలల్లో మద్యం కారణంగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. బీహార్‌లో 14-15 మంది పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం కింద చేసిన అరెస్టులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను మాత్రమే విచారించడంతో బీహార్‌లోని న్యాయవ్యవస్థ పనితీరుపై మద్యం చట్టం ప్రభావం చూపుతోందని సుప్రీంకోర్టు గత ఏడాది వ్యాఖ్యానించింది. शराब पीने वाले @NitishKumar के अनुसार हिंदुस्तानी नहीं और वो महापापी और महाअयोग्य और उनके लिए कोई सहानुभूति नहीं @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/bfTB4YU28w — manish (@manishndtv) March 31, 2022 -
పెరుగుతున్న ‘ఫారెన్ లిక్కర్’పై మోజు..
విదేశీ మద్యంపై మనోళ్లు మనసు పారేసుకుంటున్నారు. ‘ఫారెన్ లిక్కర్’పై మోజు పెంచుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో విదేశీ మద్యం వినియోగం పెరుగుతోంది. దేశీయ ప్రీమియం బ్రాండ్లే కాదు, ఖరీదైన ఫారెన్ స్కాచ్‌ను సేవించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. హైదరాబాద్ వంటి మహా నగరాలు, గోవా వంటి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లోనే ఎక్కువగా వినియోగించే ఈ ఫారెన్ లిక్కర్ ఇప్పుడు జిల్లాలోనూ అమ్ముడు పోతుండడం గమనార్హం. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో విదేశీ మద్యం విక్రయాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. గత మూడు నెలల్లో ఈ ఫారెన్ స్కాచ్ అమ్మకాలు సుమారు పది నుంచి 20 శాతం పెరిగినట్లు ఆబ్కారీశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జిల్లాలో 90 కేసుల విదేశీ మద్యం అమ్మకాలు జరగగా, అది అక్టోబర్ మాసాంతానికి 110 కేసులకు పెరిగింది. గత నెల నవంబర్ మాసానికి ఏకంగా 122 కేసుల విదేశీ మద్యం అమ్ముడు పోయినట్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. రూ.5 వేల నుంచి రూ.20 వేల దాకా.. గతంలో ఒకటీ, రెండు మద్యం షాపుల నుంచి మాత్రమే ఫారెన్ లిక్కర్ ఇండెంట్ ఉండేదని, అది కూడా ప్రతి నెలా ఉండేది కాదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం ప్రతి నెలా ఈ ఫారెన్ లిక్కర్ ఇండెంట్ ఉంటోందని మాక్లూర్‌లోని ఐఎంఎల్ డిపో మెనేజర్ జె.వెంకటస్వామి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఈ ఫారెన్ లిక్కర్ ఫుల్ బాటిల్ ధర రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తమ డిపోలో సుమారు 54 బ్రాండ్ల విదేశీ మద్యం నిల్వలున్నాయని, సుమారు 30 బ్రాండ్లే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని డిపో అధికారులు తెలిపారు. దేశీయ మద్యం కంపెనీలే ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసిన మద్యాన్ని దిగుమతి చేసుకుని ఐఎంఎల్ డిపోలకు సరఫరా చేస్తున్నాయని వారు చెబుతున్నారు. గతంలో ఫారెన్ నుంచి వచ్చేవారు తెస్తేనే.. ఉపాధి కోసం జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు అధికంగా వెళ్లారు. వారు తిరిగి వచ్చే సమయంలో అక్కడి నుంచి ఒకటీ, రెండు మద్యం బాటిళ్లు తెచ్చేవారు. ఈ విదేశీ మద్యాన్ని బంధువులు, అత్యంత సన్నిహితులతో మాత్రమే సేవించే వా రు. ఇలా విదేశాల నుంచి వచ్చిన వారి వద్ద మాత్రమే గతంలో ఫారెన్ ‘సరుకు’ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. ఆ విదేశీ బ్రాండ్లన్నీ జిల్లా లోని వైన్సుల్లో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఫారెన్ స్కాచ్ వినియోగదారులు పెరగడానికి కారణమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇటీవలి కాలంలో ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే లిక్కర్ ‘సిట్టింగ్’లు సాధారణమై పోయాయి. పెళ్లిళ్లలోనూ మందు ప్రియుల కోసం ‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేస్తున్నారు. కాస్త సంపన్నుల ఇళ్లలో శుభకార్యాలకు సాధారణ ఖరీదైన లిక్కర్‌తో పాటు ఈ ఫారెన్ స్కాచ్‌ను అతిథులకు అందించడం స్టేటస్ సింబల్‌గా మారి పోయింది. -
మద్యం సేవించేందుకు వయోపరిమితి
తిరువనంతపురం : మద్యం సేవించేందుకు వయోపరిమితిని పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది కూడా. మద్యం సేవించే యువత సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంతో ఏం ఒరగకపోవచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కాగా, 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రయత్నించగా.. అది కుదరలేదు. దీంతో కేవలం ఫైవ్‌స్టార్ హోటళ్లకు మాత్రమే లైసెన్సులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవటంతో వందలాది పబ్‌లు, బార్లు మూతపడ్డాయి. ఉద్యమకారులు ఆ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ పబ్, బార్ యజమానుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అంతేగాక పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఇప్పుడు ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేరుగా మళ్లీ లైసెన్సులు జారీ చేయటం ప్రారంభించింది. అందులో భాగంగా ముందుగా త్రీస్టార్‌హోటళ్లతోపాటు రిసార్ట్స్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అయితే యువతను కట్టడి చేసేందుకు మాత్రం వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఓ జిమిక్కుగా అభివర్ణిస్తోంది. మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కి.. కంటి తుడుపు చర్యగా వయో పరిమితిని పెంచిందని విమర్శిస్తోంది. -
మద్యం మత్తులో వ్యక్తి హల్చల్
హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఈ ఘటన నగరంలోని షాపూర్ నగర్లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో శనివారం స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్య సిబ్బది, రోగులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వ్యక్తి వివరాలు తెలియరాలేదు.