Lists
-
గూగుల్ కి షాకిచ్చిన కోర్టు
అలహాబాద్: గ్లోబల్ సెర్చి ఇంజీన్ కంపెనీ గూగుల్ సీఈవో, భారత్ లోని గూగుల్ ఇతర ప్రధాన అధికారులు ఇబ్బందుల్లో పడ్డారు. మంగళవారం అలహాబాద్ స్థానిక కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును టాప్ టెన్ క్రిమినల్స్ లిస్టులో చేర్చడంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సీఈవో సహా ఇతర భారత్ కు చెందిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. న్యాయవాది సుశీల్ కుమార్ మిశ్రా ఫిర్యాదుపై విచారించిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 31 కి వాయిదా వేసింది. గత ఏడాది గూగుల్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ టెన్ నేరస్థుల జాబితాలో మోదీ ఫోటో ప్రత్యక్షంకావడంతో వివాదం రేగింది. దావూద్, అబ్బాస్ నఖ్వీ లాంటి కరడుకట్టిన క్రిమినల్స్ పక్కన ప్రధాని నరేంద్ర మోదీ పేరు జతచేరడంపై న్యాయవాది సుశీల్ కుమార్ మిశ్రా 2015 నవంబరులో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేశారు. అయితే ఇది క్రిమినల్ కేసు కిందికి వస్తుందని దీన్ని సీజెఎం తిరస్కరించారు. దీన్ని సవాల్ చేస్తూ సుశీల్ కమార్ రివిజన్ పిటిషన్ దాఖలుచేశారు. దీంతో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా టాప్ టెన్ క్రిమినల్ లిస్ట్ లో మోదీ పోటోపై గూగుల్ క్షమాపణ చెప్పింది. ఎక్కడో పొరపాటు జరిగిందని వివరణ యిచ్చిన సంగతి తెలిసిందే. -
అదే గందరగోళం
బ్యాంకులకు చేరిన రుణమాఫీ జాబితాలు వీటిలోనూ తప్పుల తడకలే! నోటీసుబోర్డులో పెట్టని వైనం రుణమాఫీ అంశంపై అదే గందరగోళంగా కొనసాగుతోంది. జాబితాలు మొదట రెవెన్యూ శాఖకు విడుదల చేసినా.. ఇప్పుడు బ్యాంకులకు పంపించినా.. వాటిలో స్పష్టత కొరవడింది. వాటిగురించి స్పష్టమైన సమాచారం ఎవ్వరూ ఇవ్వలేకపోతున్నారు. దీంతో తమకు రుణమాఫీ జరుగుతుందా, లేదా అన్న సంశయంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మచిలీపట్నం : ఇటీవల ప్రభుత్వం నుంచి బ్యాంకులకు రుణమాఫీ జాబితా పంపారు. జాబితాలు పంపిన ప్రభుత్వం వీటిని బ్యాంకుల వద్ద నోటీసు బోర్డుల్లో ఉంచాలా, లేదా అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో బ్యాంకర్లు జాబితాను ప్రదర్శించకుండా నిలిపివేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక వాటిని బయటపెడతామని చెబుతున్నారు. ప్రస్తుత జాబితాలో అర్హత ఉన్న రైతుల పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో తమకు రుణమాఫీ జరుగుతుందా, లేదా అన్న సంశయంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రెండో జాబితా ఉంటుందని అధికారులు చెబుతున్నా అది ఎప్పటిలోగా విడుదల చేస్తారనే అంశంపైనా స్పష్టత లేదు. సగం మందికి పైగా రైతుల పేర్లు లేవు... బందరు మండలం కానూరు పీఏసీఎస్‌లో 650 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. తొలి విడత జాబితాలో 345 మంది రుణమాఫీ పొందేందుకు అర్హులని ఈ సొసైటీకి ప్రభుత్వం ద్వారా ఆన్లైన్లో జాబితా వచ్చింది. ఈ జాబితాలో మిగిలిన రైతుల పేర్లు లేకపోవటంతో తాము రుణమాఫీ పొందేందుకు అర్హులమేనని, తమ పేర్లను రుణమాఫీ అర్హుల జాబితాలో చేర్చాలని రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొలమానం పాటిస్తారా... ప్రస్తుతం జరిగే రుణమాఫీలో కొలమానం ప్రకారం రుణమాఫీ జరుగుతుందనే వాదన వినబడుతోంది. ఒక కుటుంబంలోని సభ్యులకు ఎంత భూమి ఉన్నా ఆ కుటుంబానికి 1.50 లక్షలు మాత్రమే రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కుటుంబం సాగుచేసిన భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం, కుటుంబ సభ్యులందరికీ ఆధార్ నంబరును బట్టి రుణమాఫీ జరుగుతుందనే వాదన వినబడుతోంది. ఒక కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంటే అందులో మూడు ఎకరాలకు పట్టాదారు పాస్‌పుస్తకం, ఐబీ ఖాతా ఉండి మిగిలిన రెండు ఎకరాలు అసైన్డ్ భూమిగా ఉండి దానికి పట్టాదారు పాస్‌పుస్తకం లేకుంటే ఈ రెండు ఎకరాలకు సంబంధించి రుణమాఫీ జరగదనే వాదన వినబడుతోంది. ఈ కొలమానం పట్టాదారు పాస్‌పుస్తకం లేని భూమికి వర్తించదని బ్యాంకు అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అంతా అయోమయం... ప్రభుత్వం బ్యాంకులకు పంపిన జాబితా ఒక రకంగా ఉండగా, రెవెన్యూ అధికారులు గ్రామస్థాయిలో విచారణ చేసి పంపే జాబితాలు వేరే విధంగా ఉన్నాయని పలువురు పీఏసీఎస్ అధ్యక్షులు చెబుతున్నారు. ప్రభుత్వం బ్యాంకులకు పంపిన జాబితాలో అర్హులుగా ఉన్న వారి పేర్లు, రెవెన్యూ అధికారుల పరిశీలనలో అనర్హులుగా వస్తున్నాయని కొన్ని కొత్త పేర్లు చేరుతున్నాయని వారు పేర్కొంటున్నారు. నూజివీడులోని కొన్ని గ్రామాల్లో వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారి పేర్లు రుణమాఫీ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం పంపిన, రెవెన్యూ అధికారులు తయారు చేసిన జాబితాలకు పొంతన లేకపోవటంతో బ్యాంకు అధికారులు ఈ జాబితాలను బయటపెట్టేందుకు వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. మొదటి విడత జాబితా వివరాలను ఇంకా ఆన్లైన్లో ఉంచలేదు. -
రుణమాఫీకి మళ్లీ కొర్రీ!
జాబితాలపై పునర్విచారణకు ఆదేశం లబ్ధిదారుల వడపోతకు సర్కారు ఎత్తులు వీఆర్వోల చేతికి రుణమాఫీ జాబితాలు 11లోగా నివేదిక కోరిన ప్రభుత్వం రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులూ పన్నుతోంది. బ్యాంకర్లు రెండు మాసాలు కుస్తీలు పట్టి తయారుచేసిన జాబితాలపై పునర్విచారణ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే అనేక రకాల వడపోతల అనంతరం తయారుచేయించిన జాబితాలపైనా మరోసారి విచారణకు ఆదేశించడం మరికొంతమంది లబ్ధిదారుల పేర్లు తొలగించేందుకేనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మచిలీపట్నం/విజయవాడ : రుణమాఫీ జాబితాలపై పునర్విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంకర్లు పంపిన వివరాలు సరిగా ఉన్నాయో లేవో విచారణ జరపాలని రెవెన్యూ శాఖకు సూచించింది. వీఆర్వోల ద్వారా గ్రామగ్రామానికి వెళ్లి జాబితాలపై పునర్విచారణ జరపి, ఒక్కో లబ్ధిదారుని గురించి విడివిడిగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. దీంతో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ హడావుడిగా జిల్లాలోని సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లను సమావేశపరిచి జాబితాలు అందజేశారు. ఈ నెల 11వ తేదీ లోగా జిల్లాలోని అన్ని మండలాల్లో యుద్ధప్రాతిపదికన జాబితాల పునఃపరిశీలన ప్రక్రియ పూర్తిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆయన ఆదేశించారు. దీంతో జిల్లాలోని 50 మండలాల్లో తహశీల్దారులు తమ పరిధిలోని వీఆర్వోలకు శనివారం జాబితాలు అందించారు. రుణమాఫీ అయ్యే రైతుల వివరాలతో పాటు అతని కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల పూర్తి వివరాలు సేకరించాలని మార్గదర్శకాలు ఇచ్చారు. ఇద్దరు కుటుంబసభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, ఇంటి నంబరులను సేకరించాలని ఆదేశించారు. జిల్లాలో 425 సహకార సంఘాల్లో దాదాపు రెండు లక్షల మంది రైతులు లబ్ధిదారుల జాబితాలో ఉండగా, వాణిజ్య బ్యాంకులకు సంబంధించి మరో రెండు లక్షల మంది వివరాలను రెవెన్యూ సిబ్బంది విచారించాల్సి ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో లక్షలాదిమందికి సంబంధించిన వివరాలు విచారణ చేయడం కష్టమని రెవెన్యూ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకుల జాబితాల్లో 10 శాతం గల్లంతు వివిధ బ్యాంకుల ద్వారా పంపిన లబ్ధిదారుల జాబితాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 శాతం పేర్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల చేతికి అందిన జాబితాలను కొన్ని మండలాల్లో బ్యాంకుల సిబ్బంది పరిశీలించారు. తాము పంపిన జాబితాల్లో కొన్ని పేర్లు మాయమైనట్లు వారు గుర్తించారు. వీటికి సంబంధించి బ్యాంకులకు ఇంతవరకు ఎటువంటి సమాచారమూ రాలేదు. రైతాంగం బ్యాంకుల వద్దకు వెళ్లి జాబితాల కోసం అడుగుతున్నట్లు ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. జాబితాల్లో పేర్లు గల్లంతయ్యాయని, అంతా గందరగోళంగా ఉందని ఆ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. కుటుంబ సభ్యుల వివరాలు ఎందుకో? రుణమాఫీ మెత్తాన్ని కుదించేందుకు ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాలను కూడా రెవెన్యూ సిబ్బంది ద్వారా విచారణ చేయిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకర్లు తమ వద్ద అప్పు తీసుకున్న రైతులకు సంబందించిన సమాచారం ఇవ్వగా, వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లు, ఆస్తుల వివరాలు అడుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ ఎలాంటి మెలిక పెడుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.