Living Planet Report 2016
-
Living Planet Index: ఐదో వంతు జీవ జాతులు... అంతరించే ముప్పు
ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేíÙంచారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది. మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’’ అని తేలి్చంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్ బయో డైవర్సిటీ సమిట్‌లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు. ప్రమాదపుటంచుల్లో... 1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే... ► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది. ► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం. ► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది. ► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ► కార్చిచ్చులు, గ్లోబల్ వారి్మంగ్ వంటివి ఇందుకు తోడవుతున్నాయి. ► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది. ఏం చేయాలి? తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది... ► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్ వార్మింగ్కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి. ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వన్యప్రాణుల మరణ వేదన!
ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు మునుపెన్నడూ లేనంత వేగంగా అంతర్థానమవుతున్నాయి! మానవ చర్యల కారణంగా మూడింట రెండు వంతుల వన్యప్రాణులు 2020 నాటికి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో దాదాపు సగం వన్యప్రాణులు అంతర్థాన దశలో ఉన్నాయని తన ద్వైవార్షిక నివేదిక ‘ది లివింగ్ ప్లానెట్ రిపోర్ట్–2016’లో తేటతెల్లం చేసింది! – సాక్షి సెంట్రల్ డెస్క్ మానవ చర్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 1970–2020 మధ్య సగటున 67 శాతం తగ్గిపోనుందని నివేదిక అంచనా వేసింది. 1970–2012 మధ్య పక్షులు, క్షీరదాలు, ఉభయచరాలు, చేపలు, సరీసృపాల సంఖ్య 58 శాతం క్షీణించిందని పేర్కొంది. దీన్ని బట్టి 2020 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య మూడింట రెండు వంతులు క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరోవైపు పర్యావరణంపై మానవుల ప్రభావాన్ని నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ఆవాసాల విధ్వంసం, అటవీ విస్తీర్ణం తగ్గడం, వన్యప్రాణులను వధించడం కొన్ని కారణాలుగా పేర్కొంది. మన ఆహార, ఇంధన వినియోగ మార్గాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆవాసాల విధ్వంసం... ప్రపంచ మొత్తం జీవజాలంలో సగం వాటా బ్రెజిల్, చైనా, యూఎస్, రష్యా, భారత్ దేశాలదే. ‘గ్లోబల్ బయోకెపాసిటీ హబ్్స’గా ఉన్న ఈ దేశాలు ఇతర దేశాలకు వనరులను ఎగుమతి చేసే ప్రాథమిక దేశాలుగా కూడా ఉన్నాయి. ఫలితంగా ఈ దేశాల్లోని జీవ వ్యవస్థలపై అధిక భారం పడుతోంది. ఇది ఆ జీవులు ఆవాసాలు కోల్పోవడానికి కారణమవుతోందని నివేదిక వెల్లడించింది. ఆవాసాల విధ్వంసం, వన్యప్రాణుల దోపిడీకి ఆహార ఉత్పత్తే ప్రాథమిక కారణమని తెలిపింది. జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ రవిసింగ్ పేర్కొన్నారు. పర్యావరణ మార్పులు ► ఏడాదికి 1.30 మి.మీ. చొప్పున పెరుగుతున్న సముద్ర మట్టంతో భారత్ ప్రపంచంలో అత్యంత విపత్కర ప్రాంతంగా నిలవనుంది. ► ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ వంటి ప్రాంతాల్లో గత 40 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ► 2100 నాటికి సముద్ర మట్టం మీటరు పెరిగితే దేశంలో 14 వేల చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ► వరదలు, కరువు, వేడిగాలులు వంటి విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా దేశంలో 2000–15 మధ్య కాలంలో ఐదువేల మందికి పైగా మరణించారు. భూతాపం ప్రభావం కారణంగా 2080–2100 నాటికి ఆహార ఉత్పత్తి 10–40 శాతం తగ్గుతుందని అంచనా. -
లివింగ్ ప్లానెట్ రిపోర్ట్-2016
మానవ జనిత విపత్తుల వల్ల 2020 నాటికి మూడింట రెండొంతుల సకశేరుకాలు విలుప్తత చెందే ప్రమాదమున్నట్లు గిగిఊ (World Wide Fund for Nature) విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్-2016 పేర్కొంది. ప్రపంచ వన్య మృగాల పరిస్థితులను సమీక్షిస్తూ గిగిఊ ప్రతి రెండేళ్లకోసారి ఈ నివేదికను విడుదల చేస్తుంది. 1970 నుంచి ప్రపంచ వన్య ప్రాణుల సంఖ్య 58 శాతం మేర తగ్గినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. భూమిపై మనిషి పరిణామం చెందక ముందే జీవుల విలుప్తత కనిపిస్తుంది. చివరి సారిగా భారీ స్థాయిలో రాక్షస బల్లులు అంతరించాయి. ప్రకృతి కారణాల వల్ల జీవులు అంతరించడం సాధారణ విషయం. అయితే ప్రస్తుతం మనిషి ప్రభావాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న ఆంథ్రోపోసిన్ అనే ఈ యుగంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా, అతి వేగంగా జీవులు అంతరిస్తున్నాయని ఈ నివేదికను బట్టి అర్థమవుతోంది. జీవ వైవిధ్య విలుప్తత వల్ల మనిషి ఆహార, ఆరోగ్య, పోషణ భద్రత తగ్గడమే కాకుండా చివరకు మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఒక జాతి జీవుల్లోని జన్యు వైరుధ్యం; విభిన్న జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న వైరుధ్యమే జీవవైవిధ్యం. వ్యవసాయ విస్తరణ, కలప, మానవ నివాసాలు, డ్యాంలు, రోడ్లు, రైల్వే మార్గాల నిర్మాణం కోసం ఇంతకుముందు జరిగిన, ప్రస్తుతం కూడా కొనసాగుతున్న అడవుల క్షీణత, నష్టమే వన్యప్రాణులకు ప్రధాన ముప్పుగా పరిణమించింది. దీనికి అదనంగా బయటి జాతుల ప్రవేశం కూడా స్థానీయ జీవవైవిధ్యానికి పెద్ద సవాలుగా మారింది. ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తూ బయటి జాతులు ప్రవేశించినప్పుడు వాటి అనూహ్య విస్తరణ ద్వారా స్థానీయ జాతులు అంతరించే ప్రమాదముంది. ఉదా: పొలాల్లో ఎలుకల బెడదను నియంత్రించడానికి ఆస్ట్రేలియా ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ కేన్ టోడ్ అనే కప్పను తమ దేశంలోకి ప్రవేశపెట్టింది. ఈ భారీ కప్ప ఎలుకలతోపాటు స్థానిక కప్ప, సర్ప జాతులను పూర్తిగా నాశనం చేసే స్థాయికి వేగంగా విస్తరించింది. ఆవాసాల నష్టం, క్షీణత, కొత్త జాతుల ప్రవేశంతోపాటు పర్యావరణ కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పు, ఆహారం, ఔషధాలు, శరీర భాగాల కోసం వేట మొదలైనవి కూడా వన్యప్రాణుల జనాభా తగ్గుదలకు కారణమవుతున్నట్లు ఈ నివేదిక గుర్తించింది. ఆహారం, ఔషధాల కోసం.. వాజాల కోసం సొర చేపలను, ఆహారం కోసం తిమింగలాలు, డాల్ఫిన్లు, ఉడుములు, జింకలు, ఇతర వన్య పక్షులను, కొమ్ముల కోసం ఖడ్గ మృగాలను, పొలుసుల కోసం పిపీలకాహారులను, తైలం కోసం పునుగు పిల్లులు, కస్తూరి జింకలను, శరీర భాగాల కోసం పులులను మానవుడు వేటాడటం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతోంది. చైనా సంప్రదాయ వైద్య విధానంలో పులుల శరీర భాగాలను వినియోగించడంపై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అయినా ఈ విధానాన్ని చైనా నిషేధించలేక పోతోంది. చమురు, క్రిమిసంహారకాలు.. చమురు వెలికితీత, రవాణాలో జరిగే ప్రమాదాల ద్వారా తరచూ సముద్ర కాలుష్యం సంభవిస్తోంది. సముద్ర ఉపరితలంపై చమురు పొర పేరుకుపోయి నీటిలో ఆక్సిజన్ కరిగే ప్రక్రియకు అవరోధం ఏర్పడుతోంది. ఫలితంగా సముద్ర జలచరాలు ఆక్సిజన్ అందక మరణిస్తున్నాయి. 2010లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో బ్రిటిష్ పెట్రోలియానికి చెందిన చమురు బావి ప్రమాదంలో దాదాపు 11,500 చ.కి.మీ. మేర సముద్ర ఉపరితలంపై మందంగా చమురు పేరుకుపోయింది. వ్యవసాయ రంగంలో నియంత్రణ లేకుండా వినియోగిస్తున్న క్రిమి సంహారక అవశేషాలు కూడా ఆహార శృంఖలాల ద్వారా వన్యప్రాణుల్లోకి చేరుతున్నాయి. పశువులకు వాడే డైక్లోఫినాక్ అవశేషాలు వాటిలో పేరుకుపోతున్నాయి. మరణించిన ఈ పశువులను తినడం వల్ల రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శీతోష్ణస్థితి మార్పు.. ప్రస్తుతం శీతోష్ణస్థితి మార్పు ఒక ప్రధాన ముప్పుగా మారిందని కూడా నివేదిక పేర్కొంది. మానవులపై మాత్రమే కాకుండా ఇతర జీవ జాతులపై కూడా దీని ప్రభావాలను ఇప్పటికే గుర్తించారు. శీతోష్ణస్థితి మార్పు వల్ల వన్యప్రాణుల వలసలు, ప్రజననం అస్తవ్యస్తమై వాటి సంఖ్య తగ్గిపోతోంది. భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగేకొద్దీ 20-30 శాతం మేర జీవవైవిధ్యం నష్టపోయే ప్రమాదముందని ఇదివరకే ఐ్కఇఇ (Intergovernmental Panel on Climate Change) తన నివేదికలో పేర్కొంది. కేవలం సకశేరుకాలకే.. లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ (ఔ్కఐ) ఆధారంగా ఈ నివేదికను గిగిఊ సంస్థ తయారు చేసింది. జువాలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ (ోఔ), గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్, స్టాక్‌హోం ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థలు కూడా ఈ నివేదిక రూపకల్పనలో పాల్గొన్నాయి. 3,706 సకశేరుక జాతుల (చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు)కు చెందిన 14,152 పరిశీలన జనాభా (monitored populations)కు సంబంధించిన శాస్త్రీయ సమాచారం ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. 1970 నుంచి 2012 వరకు సకశేరుక జనాభాలో 58 శాతం తగ్గుదల నమోదైనట్లు దీనిద్వారా తెలుస్తోంది. 2014 నివేదిక ప్రకారం 1970-2010 మధ్య కాలంలో 52 శాతం మేర సకశేరుకాల జనాభా తగ్గింది. అయితే స్వాదుజల జీవ జాతుల జనాభా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. 2014 నివేదికతో పోల్చితే ఈ నివేదిక 668 జాతులు, 3,772 భిన్న జనాభాలను అదనంగా అధ్యయనం చేసింది. అయితే ఈ నివేదికను కేవలం సకశేరుక జాతుల సమాచారం ఆధారంగానే రూపొందించారు. భవిష్యత్‌లో అకశేరుక, మొక్క జాతులను కూడా అధ్యయనంలోకి తీసుకోనున్నారు.