loans Cancel
-
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్‌తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
రుణ మాఫీ.. రైతు హ్యాపీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాలపరిమితితో సంబంధం లేకుండా రూ.లక్ష లోపు అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని, వెంటనే ఇది అమల్లోకి వస్తుందని కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో మెతుకుసీమ రైతాంగం మోములో చిరు నవ్వులు విరిశాయి. బంగారం తనఖాపెట్టి తెచ్చుకున్న రుణాలతో పాటు, స్వల్పకాలిక, రుణాలను కూడా మాఫీ కానుండడంతో జిల్లాలోని 3,65,787 మంది రైతులకు లబ్ధి కలగనుంది. మొత్తంగా జిల్లాలో రూ.2403.66 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని అంచనా . లీడ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జిల్లాలో 4,58,637 మంది రైతులకు సంబంధించిన మొత్తం రూ.3321.95 కోట్ల రుణాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1559.92 కోట్లు బంగారం కుదవ బెట్టిన రుణాలు, మరికొన్ని టర్మ్ రుణాలు ఉన్నాయి. గత నాలుగేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే రూ.లక్ష, అంతకు లోపు రుణాలు తీసుకున్న రైతులు 2,76,678 మంది ఉన్నారు. ఈ రైతులు తీసుకున్న రుణాలు మొత్తంగా రూ.1762.09 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు 29,347 మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి 184.58 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వీటితో పాటు మరో 5,670 మంది రైతులు 89.29 కోట్లు ఇతర వ్యవసాయ అనుబంధ రుణాలు తీసుకున్నారు. కేబినెట్నిర్ణయం నేపథ్యంలో ఈ మొత్తం రుణం మాఫీ కానుంది. వీటితో పాటు బంగారు రుణాలు కూడా మాఫీ అవుతున్నాయి కాబట్టి బ్యాంకు అధికారుల కసరత్తు కూడా దాదాపు పూర్తైయింది. అందువల్ల వెంటనే రైతుల రుణాలు మాఫీ కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఆ ప్రకటన కోసం నిరీక్షణ
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్: అధికారం కోసం టీడీపీ చేసిన ఒకే ఒక్క ప్రకటన రైతులను, డ్వాక్రా మహిళలను, బ్యాంకర్లను అయోమయానికి లోనుచేస్తోంది. వ్యవసాయ రుణాలతోపాటు డ్వాక్రా సంఘాల రుణాలను రద్దు చేస్తామంటూ ఎన్నికల వేళ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ నేపథ్యంలో బకాయిలు, వాయిదాల చెల్లింపులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. డ్వాక్రా మహిళలు బ్యాంకు రుణాలు చెల్లించవద్దని, తాము అధికారంలోకి రాగానే రద్దు చేసేస్తామని టీడీపీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి ఇరవై రోజులు గడిచింది. ఎప్పుడు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారా... దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందా అన్న ఆశతో మహిళలు ఎదురు చూస్తున్నారు. అయితే రుణాలు రద్దవుతాయా..? ఎప్పటి నుంచి అమలు చేస్తారు.. ఎలా అమలు చేస్తారు..? ఇలాంటి సందేహాలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి. గ డచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 71,418 స్వయం సహాయ సంఘాలకు రూ. 1,402 కోట్ల రుణాలను వివిధ బ్యాంకులు మంజూరు చేశాయి. వాటికి సంబంధించి డ్వాక్రా సంఘాలు నెలనెలా వాయిదాలు చెల్లించాలి. ఫిబ్రవరి వరకు సక్రమంగా చెల్లించినా ఆ తర్వాత నుంచి వాయిదాలు కట్టడం నిలిచి పోయింది. దీంతో పలుమార్లు బ్యాంకు అధికారులు రుణాలు చెల్లింపునకు యానిమేటర్లపైనా, ఇందిరా క్రాంతి పథం అధికారులపైనా ఒత్తిడి తీసుకువచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో జిల్లా స్థాయి సమావేశంలో డీఆర్డీఏ అధికారుల దృష్టికి తీసువెళ్లారు. డ్వాక్రా రుణాల మాఫీ అవుతాయో లేదో తెలియక డ్వాక్రా సంఘాలు, రుణాలు చెల్లింపులు జరగక బ్యాంకులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నాయి. కొత్త రుణాలకు మోకాలడ్డు.: రుణాలు సక్రమంగా చెల్లించిన డ్వాక్రా సంఘాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. చెల్లింపులు నిలిపి వేయటంతో వడ్డీ కూడా ప్రభుత్వం నిలిపి వేసింది. వసూలు దాదాపు నిలిచి పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకులు కొత్త రుణాల మంజూరుకు మోకాలడ్డుతున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణం మంజూరు చేస్తామంటూ బ్యాంకు అధికారులు ఇందిర క్రాంతి పథం అధికారులు తేల్చి చెబుతున్నారు. రుణమాఫీ జరగాలి లేదా రుణ వాయిదాలు చెల్లించాలి అప్పుడు మాత్రమే కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంది.