local police
-
ఇరు గ్రామాల మధ్య కొట్లాట
ఎచ్చెర్ల క్యాంపస్ : ఆటోలో ప్రయాణికులను తీసుకువెళ్లే విషయంలో బడివానిపేట, కొత్తవానిపేట గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రామాల యువకులు ఒకరిపై ఒకరు దాడికి దిగేవరకు దారి తీసింది. బడివానిపేట గ్రామానికి చెందిన ప్రయాణికులను కొత్తవానిపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తీసుకువెళ్లలేదని వారి వాదన. అయితే కొత్తవానిపేట ఆటోను బడివానిపేట గ్రామస్తులు మార్గమధ్యలో శుక్రవారం నిలిపివేశారు. దీంతో ఇరు గ్రామాల యువకులు కొయ్యాం రోడ్డులో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇరు గ్రామాలకు చెందిన మైలపల్లి నారాయుడు, లక్ష్మణ, చంటి కొత్త అప్పన్న, అలుపాన అప్పన్న, నిమ్మ రాములతో పాటు మరి కొందరికి గాయాలయ్యాయి. విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో ఆయా గ్రామాలకు వెళ్లి సందర్శించారు. ఈ గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి, శాంతి భద్రతలు సమీక్షిస్తున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. -
‘చిరు’ భరోసా..!
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘చిరు వ్యాపారుల’ బిల్లుతో జిల్లాలో సుమారు 8వేలమందికి పైగా మేలు చేకూరనుంది. వారి హక్కులకు రక్షణ లభించనుంది. కొత్త పథకాలు అందుబాటులోకి వచ్చి బతుకుకు భరోసా లభించనుంది. ఈ దిశగా జిల్లాలో చర్యలు ప్రారంభం కావడంతో ఫలితాలకోసం ఆ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. పాలమూరు, న్యూస్‌లైన్ : పట్టణాలు, మున్సిపాలిటీ వీధుల్లో పొద్దంతా తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తూ, కుటుంబాలను పోషించుకునే చిరు వ్యాపారులకు బాసటగా నిలిచే ప్రత్యేక బిల్లుకు పార్లమెంటు అమోదించడంతో జిల్లాలో ఉన్న సుమారు 8వేలమందికి పైగా ఉన్న వారు లబ్దిపొందనున్నారు . పట్టణంలో ఎక్కడ బండి పెట్టినా స్థానిక పోలీసులు, పురపాలక సంఘ అధికారులు,సమీపంలోని భవన యజమానులతో వారికి ఇబ్బందులు ఉండేవి. వీరందరినీ నిత్యం అభద్రతాభావం వెంటాడుతోంది. వీరిలో చాలా వరకు పండ్లు అమ్ముకునే బండ్లు, కూరగాయలు, ఇడ్లీ, ఫాస్ట్‌ఫుడ్, ఇతరాలు, ఆయా సామాగ్రిని తోపుడు బళ్లతో విక్రయిస్తుంటారు. వీరంతా పురపాలక సంస్థలకు నిర్ణీత రుసుము రోజువారీ లెక్కన చెల్లిస్తున్నా వారికి సరైన రక్షణ లేదు. ఎప్పుడైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైనప్పుడు పోలీసుల ప్రతాపానికి చిరు వ్యాపారులు అవస్థ పడేవారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి వీధి వ్యాపారులకు సౌకర్యాలు కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరికోసం ఉద్దేశించిన బిల్లు కారణంగా దశాబ్దాల కాలంగా ఒకే ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు యంత్రాంగం చర్యలు చే పట్టింది. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన విభాగం చర్యలు ప్రారంభించింది. మహబూబ్‌నగర్‌తోపాటు నారాయణపేట, గద్వాల, వనపర్తి, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, జడ్చర్ల, కొల్లాపూర్, అచ్చంపేట, అయిజ మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల్లోని వీధి వ్యాపారుల వివరాలను సేకరించి.. వారి వ్యాపారాలకు భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హులను గుర్తించి, వీరికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులతో చర్చించి అనుమతి పొందుతారు. స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేసి వీరి పురోగతి కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టనున్నారు. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో .. పురపాలక సంస్థ పరిధిలో ఉన్న వీధి వ్యాపారులు రేషన్, వాటర్, ఆధార్ వంటి గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. దశాబ్దాల కాలానికి మించి ఒకే చోట వ్యాపారం చేస్తున్న వారిని స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేస్తారు. వారికి బీమా సౌకర్యం కల్పిస్తారు. లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 10 మంది, 1.50 లక్షలలోపు జనాభా ఉన్న చోట 15 మంది, మూడు లక్షలు జనాభా ఉంటే 20 మందితో ప్రత్యేక కమిటీలు వేస్తారు. ఈ బందాలు వీధి వ్యాపారుల హక్కులు, వారి వ్యాపారానికి ఆధారం కల్పించడానికి కషి చేస్తాయి. మెప్మా పర్యవేక్షణలో.. మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను సిద్ధం చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే ఈ సర్వేను చేపట్టి వీధి వ్యాపారులను లెక్కించారు. వీరంతా ఎన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు. తదితర వివరాలను సేకరించారు. గతంతో పోలిస్తే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర వివరాలను సేకరించేందుకు ఆయా శాఖలు సిద్ధమవుతున్నాయి. కొత్త బిల్లు ప్రకారం..! పట్టణ వ్యాపార సంఘం నుంచి ప్రతీ వీధి వ్యాపారి ఒక ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఈ పత్రం ఉన్న వారిని తొలగించడానికి వీలుండదు. గుర్తించిన వారిని సమూహాలుగా ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమాలు వ్యక్తిగత సహాయక సమూహం (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) మాదిరిగా నిర్వహణ చేపడతారు. వీరికి ప్రభుత్వం తరఫున వివిధ పథకాలను వర్తింప చేస్తారు. ఇళ్ల నిర్మాణం, స్థలాల కేటాయింపు, రుణాలు, ఇతర సౌకర్యాల కల్పన తదితర చర్యలుంటాయి. వ్యాపారుల నేపథ్యాలను అనుసరించి సీఆర్పీల ద్వారా సర్వే చేయించి కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగానే వారికి రుణాలు మంజూరు చేస్తారు. -
‘ఔటర్’పై వేగానికి కళ్లెం
ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసుల ప్రతిపాదనలు నాలుగు లేన్లకు నిర్ణీత వేగం ఆమోదిస్తే అమలు చేయడమే తరువాయి స్పీడ్ పెరిగినా.. తగ్గినా ఫైన్ కట్టాల్సిందే సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రమాదాలను నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు ‘స్పీడ్ లిమిట్’ అనే కొత్త విధానానికి తెర తీశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. హెచ్ఎండీఏ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. నాలుగు లైన్ల ఔటర్‌పై ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 నుంచి 120 కి.మీ. వేగంతో పోవచ్చు. అయితే ఒక్కోలైన్కు ఒక్కో స్పీడ్ నియంత్రణ పెడితే ప్రమాదాలు అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఎంత వేగంతో వెళ్లాలో నిర్ధారించుకున్న వాహనం ఏ దారిలో వెళ్లాలో అదే దారిలో వెళ్లాలి. వేగం తగ్గినా పెరిగినా స్పీడ్ గన్ పరిగెడుతుంది. తద్వారా చలానా రాస్తారు. ఇలా చేయడం వల్ల ఒకరి దారికి ఒకరు అడ్డురాకండా మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం ఓఆర్ఆర్పై నాలుగు లైన్లలోను 120 కి.మీ. స్పీడ్‌తో వెళ్లవచ్చనే నిబంధన వల్ల 120 కి.మీ. స్పీడ్‌తో వచ్చే వాహనానికి ముందు 50 కి.మీ. స్పీడ్‌తో వెళ్తున్న వాహనం అడ్డు వస్తోంది. దీంతో 120 కి.మీ. స్పీడ్‌తో వెళ్తున్న వాహ నం ఓవర్టేక్ చేసి మరో లైన్‌ద్వారా ముందుకు వెళ్లాల్సి వచ్చేది. ఇలా పలుసార్లు ఓవర్‌టేక్‌లు చేస్తూ లైన్లు మార్చుతున్న క్రమంలోనే వాహనం అదుపు తప్పడం గాని, మరో వాహనాన్ని ఢీ కొట్టడం గాని జరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై పోస్టుమార్టం రోడ్డు ప్రమాదాలు జరగడం ఆ తరువాత అందరు మరచిపోవడం ఇది నిన్నటి మాట. సైబరాబాద్‌లో ఇక నుంచి ప్రతి రోడ్డు ప్రమాదాలపై ఘటన జరిగిన వెంటనే పోస్టుమార్టం నిర్వహిస్తారు. ప్రమాదం ఎలా జరిగింది..? అందుకు కారణాలు ఏమిటి..? ఎవరిది తప్పు..? భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? తదితర అంశాలకు జవాబులు వెంటనే పోలీసు వెబ్సైట్లో పొందుపర్చాలి. ఈ వివరాలను పోలీసు బాస్‌లు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇక నుంచి ప్రమాదాలు నివారించవచ్చంటున్నారు అధికారులు. అయితే ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను త్వరలో రూపొందించి అమలుల్లోకి తెస్తామని ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. సైబరాబాద్‌లో ఏఏ ప్రాంతాల్లో వాహనాలు ప్రమాదాలకు గురికాకండా ఎలా వెళ్లాలనే అంశాలను కూడా పోలీసు వెబ్సైట్లో చేరుస్తామన్నారు. ట్రాఫిక్‌కు 22 మంది ఎస్ఐలు ట్రాఫిక్ విభాగానికి కొత్తగా 22 మంది ప్రొబేషనరీ ఎస్ఐలు వచ్చారని ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. వీరిలో ఐదుగురు ఎస్ఐలను త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రారంభించే పెట్రోలింగ్‌కు ఉపయోగిస్తామన్నారు. ఒక్కో వాహనంలో ఒక ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. ప్రత్యేకంగా 16 మంది కానిస్టేబుళ్లకు కూడా ఇందుకోసం శిక్షణ ఇచ్చామన్నారు. సీట్‌బెల్డ్, పార్కింగ్, రాంగ్‌రూట్, ఓవర్ స్పీడ్లపై వీరు దృష్టి పెడతారు. త్వరలో రెండు స్పీడ్ గన్స్, రెండు క్రేన్లు కూడా వస్తున్నాయన్నారు. - అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ