looking
-
ఆమె చేతిలో ‘భర్త కావాలి’ బోర్డు.. 30 నిముషాల్లో మారిన సీన్!
ఎవరైనాసరే తనకొక జీవిత భాగస్వామి కావాలని, సుఖదుఃఖాల్లో తోడుగా నిలవాలని కోరుకుంటారు. అయితే అందరికీ తగిన జీవిత భాగస్వామి లభించడం అంత సులభంకాదు. అనువైన జీవిత భాగస్వామిని దక్కించుకునేందుకు కొంత శ్రమించాల్సి వస్తుంది. ఇందుకోసం కొందరు డేటింగ్ యాప్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఒక యువతి దీనికి భిన్నంగా కొత్త పద్ధతిని అనుసరించింది. అమెరికాలో రెండేళ్లుగా సింగిల్‌గా ఉంటున్న బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ కరోలినా గీట్స్ భర్తను ఎన్నుకునేందుకు కొత్తగా ప్రయత్నించింది. కరోలీనాకు మంచి భార్త కావాలట. ఇందుకోసం ఆమె తన చేతులతో ఒక బోర్డు పట్టుకుని రోడ్డుపై నిలుచుంది. ఆ బోర్డుపై ‘భర్త కోసం వెదుకుతున్నాను’ అని రాసివుంది.ఈ బోర్డు పట్టుకుని ఆమె పట్టణంలో తిరుగుతోంది. సోహో పట్టణానికి చెందిన గీట్స్ మీడియాతో మాట్లాడుతూ తాను ఒక సైన్ బోర్టుపై ‘భర్త కోసం వెదుకుతున్నాను’ అని రాసి దానిని పట్టుకుని, పట్టణంలో తిరగాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. టిండర్, హింజ్ లాంటి డేటింగ్ యాప్‌ల ద్వారా కొందరు పురుషులతో స్నేహం చేసి, వాళ్లెవరూ నచ్చక తన టైమ్ వృథా చేసుకున్నానని ఆమె తెలిపింది. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. ఆమె పట్టణంలోని రోడ్లపై ఈ బోర్టు పట్టుకుని తిరుగుతుండగా 30 నిముషాల అనంతరం ఒక వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు. దీంతో వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం గీట్స్ మీడియాతో మాట్లాడుతూ భర్త కోసం వెదుకుతూ రోడ్డు మీదకు వచ్చిన 30 నిముషాలకు తనకు ఫలితం కనిపించిందని, ఇకపై తాము ఒకరికొకరు తెలుసుకోవాల్సి ఉందని, ఇప్పుడంతా కొత్తగా ఉందని, ఈ పరిచయం ఎక్కడికి దారితీస్తుందో చూడాలని అన్నారు. ఇది కూడా చదవండి: ఇంటి తవ్వకాల్లో పురాతన బాక్సు.. తెరిచి చూడగానే.. -
పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!
ఏ సమస్యనైనా దాచడం సాధ్యమేమోగానీ... పెదవులకు వచ్చే సమస్యలు ఇట్టే బయటకు కనిపిస్తాయి. దాంతో అనారోగ్యం బయటపడటంతో పాటు అందం కూడా తగ్గుతుంది. ఫలితంగా సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తగ్గుతుంది. అందుకే పెదవుల ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివి... పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే... అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. సిగరెట్లు తాగేవారిలో పెదవులు నల్లగా, బండగా మారవచ్చు. అందుకే స్మోకింగ్ అలవాటును వెంటనే మానేయాలి మహిళల్లో లిప్‌స్టిక్ వాడేవారు వాటి కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రొపైల్ గ్యాలేట్ అనే రసాయన పదార్థం ఉంటుంది. దాని వల్లనే ప్రధానంగా అలర్జీలు వస్తుంటాయి. లిప్‌స్టిక్ వాడే వారు అది తమకు సరిపడుతుందా లేదా అన్న విషయాన్ని తొలుత పరిశీలించుకుని, తమకు సరిపడుతుందని తేలిన తర్వాతే వాడటం మంచిది నిద్రకు ఉపక్రమించే ముందు లిప్స్టిస్ శుభ్రంగా కడుక్కోవాలి. ఆ టైమ్‌లో పెదవులపై పలుచగా నెయ్యి లేదా బాదం నూనె రాసుకోవచ్చు కొన్ని టూత్‌పేస్ట్‌ల వల్ల కూడా మనకు పెదవులపై దురద రావచ్చు. అలాంటప్పుడు వాటిని ఉపయోగించడం ఆపేయాలి నీరు ఎక్కువగా తాగుతుండాలి. పెదవులు తడి ఆరిపోకుండా చూసుకోవాలి. అయితే నాలుకతో తడపకూడదు. (చదవండి: మచ్చలు లేని ముఖ సౌందర్యం కోసం..బీట్రూట్తో ఇలా ట్రై చేయండి!) -
గూగుల్ కి ఆ డ్రైవర్లు కావాలట!
గూగుల్ సంస్థ తన డ్రైవర్‌లెస్ కార్లకై డ్రైవర్లకోసం చూస్తోంది. తాను ప్రయోగాత్మకంగా అతి త్వరగా మార్కెట్లోకి ప్రవేశపెట్టే ఈ కార్లను మానిటర్ చేసే ఉద్యోగుల (డైవర్ల) కోసం చూస్తోంది. దీనికోసం వారికి భారీగానే జీతాలను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే ఈ కార్లను రహదారులపై ప్రయోగత్మకంగా నడిపిస్తున్న గూగుల్.. వాటికోసం 24 నెలల కాంట్రాక్టు పద్ధతిన ప్రత్యేకంగా డ్రైవర్ల నియామకం చేపట్టినట్టు అరిజోనా రిపబ్లిక్ అధికారులు తెలిపారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వాహన భద్రతా నిపుణులను రిక్రూట్ చేసుకోబోతోంది. ఇలా నియమించుకునే ఈ డ్రైవర్లకు గంటకు సుమారు 1300 రూపాయల (20 డాలర్లు) చొప్పున చెల్లించనుంది. అయితే దీనికి ఆ ఉద్యోగులు చేయాల్సిందల్లా.. రహదారులపై ఈ కార్లు ఎలా నడుస్తున్నాయి? ఇతర వాహనాలు.. మనుషులు అడ్డొచ్చినపుడు ఎలా తప్పించుకుంటున్నాయో గమనిస్తూ.. ఎప్పటికప్పుడు నివేదిక తయారుచేయాలి. అంతేకాదు అవసరమైతే కారు మీద పూర్తి నియంత్రణను తీసుకోవాల్సి ఉంటుందని, ఆ కార్లను మాన్యువల్‌గా కూడా నడపాల్సి ఉంటుందని తెలిపింది. వివరణాత్మక, ఖచ్చితమైన నివేదికను అందించాలని కోరింది. రోజుకు 6 నుంచి 8 గంటల చొప్పున.. వారానికి ఐదు రోజులు పనిచేయాల్సి ఉంటుంది. 12 నుంచి 24 నెలల ఒప్పందంతో ఈ డ్రైవర్లను గూగుల్ నియమించుకోనుంది. అందుకోసం దరఖాస్తు చేసుకునే వారికి క్లీన్ డ్రైవింగ్ రికార్డుతో పాటు.. ఎలాంటి క్రిమినల్ రికార్డులు ఉండకూడదు. కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అన్నట్టు ఈ డ్రైవర్లకు టైపింగ్ వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ నిమిషానికి కనీసం 40 పదాలు ఉండాలట. ప్రస్తుతం 23 లెక్సస్ సెల్స్ డ్రైవింగ్ కార్లు, 34 గండ్రాప్ కార్ల ద్వారా ఒక వారంలో 10,000 నుంచి 15,000 మైళ్ళ డ్రైవింగ్ తో మొత్తం 1.6 మిలియన్ మైళ్ళదూరాన్ని కవర్ చేస్తోంది. -
మళ్ళీ కోలీవుడ్ వైపు అంజలి
-
కళ్లు మూసుకున్నా కనిపిస్తుంది!
లండన్: పోయిన కంటిచూపును తెప్పించడంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. అందుబాటులోవున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు మాంచెస్టర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు రే ఫ్లిన్కు చూపు తెప్పించారు. ఎనిమిదేళ్ల క్రితం కంటిచూపుపోయి బాధ పడుతున్న ఫ్లిన్కు కృత్రిమ రెటినాను అమర్చి, దానికి కంప్యూటర్, వీడియో కెమేరాను అనుసంధానించి సరికొత్త పద్ధతిలో కంటిచూపు తెప్పించారు. అందుకోసం వీడియో కెమేరా కలిగిన ప్రత్యేక కళ్ల జోడును తయారు చేయించారు. అది ఎలా పనిచేస్తుందంటే.. కళ్లజోడు మధ్యనున్న ఓ చిన్న వీడియో కెమేరా మనముందున్న దృశ్యాలను చిత్రీకరించి వాటిని వెంటనే మెడలో వేలాడే చిన్న కంప్యూటర్‌కు పంపిస్తుంది. అది వాటిని విద్యుత్ ప్రచోదనాలుగా మార్చి వాటిని కనుగుండు పక్కన అమర్చిన చిన్న యాంటెన్నాకు కేబుల్ సహాయం లేకుండా పంపిస్తుంది. అక్కడి నుంచి చిన్న కేబుల్ ద్వారా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కాస్త ఎలక్ట్రోడ్స్గా మారి కంటి రెటినా ఉపరితలంపైకి వెళతాయి. అక్కడ ఎలక్ట్రోడ్స్ రెటీనా కణాలను ప్రరేపిస్తాయి. తద్వారా మెదడు వీడియో గ్రాహక చిత్రాలను గుర్తిస్తాయి. రెటీనా దెబ్బతిన్న ఓ వృద్ధుడికి ఈ రకంగా చూపు తెప్పించడం ప్రపంచంలో ఇదే మొదటి సారని మాంచెస్టర్ రాయల్ ఐ హాస్పటల్ సర్జన్స్ తెలియజేస్తున్నారు. ఎవరో ఒకరి సహాయం లేకుండా బయటకు వెళ్లలేక పోయిన ఫ్లిన్ ఇప్పుడు ఎవరి సహాయం లేకుండానే చక్కగా పార్క్‌కు వెళ్లి వాకింగ్ చేస్తున్నానని చెబుతున్నారు. మరీ వీడియోలో రికార్డయినంత స్పష్టంగా దృశ్యాలను చూడలేమని, ఏ వస్తువునైనా పోల్చుకోగలమని, అవుట్లైన్స్నుబట్టి పేపర్ కూడా చదవొచ్చని ఆ హాస్పటల్ ఆప్తమాలోజిస్ట్ పావులో స్టాంగ తె లిపా రు. కళ్లు మూసుకున్నా కంటి ముందు వస్తువులు కనిపించడం ఈ చూపులోవున్న విశిష్టతని వివరిం చారు. ఎందుకంటే మూసుకున్నది కళ్లుగానీ వీడియో కెమేరా కన్నుకాదుగదా! పుట్టుకతో గుడ్డివాళ్లకు ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి చూపు తెప్పించడం ఎలా ? అన్న అంశంపై పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు. -
కళకళలాడుతున్న జూరాలా ప్రాజెక్టు