lord krishna temple
-
శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సంలో సీఎం జగన్
-
ఇక మథుర వంతు.. ఆ భూములపై యాజమాన్య హక్కులు ఎవరివి?
మొన్న అయోధ్య, నిన్న కాశీ, ఇవాళ మథుర దేశంలో మందిరం, మసీదు వివాదాలు రాజుకుంటున్నాయి. అయోధ్యలో వివాదం సమసిపోయి శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంటే, కాశీ విశ్వనాథుడి ఆలయంలో జ్ఞానవాపి మసీదు రగడ ఇంకా చల్లారకుండానే హఠాత్తుగా మథుర వివాదం తెరపైకి వచ్చింది. మథుర ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదు భూమిపై యాజమాన్య హక్కులు ఎవరివన్న చర్చ ఉత్కంఠని రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న మసీదుపై భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పిటిషన్ విచారించడానికి మథుర జిల్లా న్యాయస్థానం అంగీకరించడంతో ఆ స్థలంపై ఎందుకు వివాదం నెలకొందో సర్వత్రా ఆసక్తిగా మారింది. మథురలో శ్రీకృష్ణుడు జన్మించినట్టుగా భావిస్తున్న స్థలానికి ఆనుకొని షాహీ ఈద్గా మసీదుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు నిర్మించారు. కృష్ణుడి ఆలయాన్ని కొంత భాగం పడగొట్టి ఆ మసీదు కట్టారని, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించినట్టుగానే ఈ మసీదులో కూడా వీడియోగ్రఫీ సర్వే చేస్తే హిందూ దేవాలయ ఆనవాళ్లు కనిపిస్తాయని హిందూమత పరిరక్షకులు బలంగా విశ్వసిస్తున్నారు. కోర్టులో ఉన్న కేసులు ఎన్ని ? ఈ వివాదంపై కోర్టులో ఇప్పటివరకు డజనుకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్ల సారాంశం ఒక్కటే. షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని విజ్ఞప్తి చేశాయి. మరికొన్ని పిటిషన్లు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే మాదిరిగా ఈ మసీదులో కూడా సర్వే చేపట్టాలని, అంతే కాకుండా ఆ ప్రాంగణంలో పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరాయి. మసీదు భూములపై హక్కులు ఎవరివి ? 1670 సంవత్సరంలో నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదుని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని నాజల్ ల్యాండ్‌గా గుర్తించారు. అంటే ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించిన భూమిగా చెప్పాలి. అప్పట్లో మరాఠాల అధీనంలో ఉన్న ఈ భూమి ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. 1815 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వేసిన వేలంలో కృష్ణజన్మభూమిగా భావిస్తున్న కేత్రా కేశవ్దేవ్ ఆలయానికి సమీపంలో ఉన్న 13.77 ఎకరాల భూమిని బెనారస్‌కు చెందిన రాజాపాట్నిమాల్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన వారసులు ఆ స్థలాన్ని జుగల్ కిశోర్ బిర్లాకి విక్రయించారు. పండిట్ మదన మోహన్ మాలవీయ, గోస్వామి గణేశ్ దత్, భికెన్ లాల్జీ ఆటెరీ పేర్లపై ఆ భూములు నమోదయ్యాయి. వీరంతా కలిసి శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌గా ఏర్పడి కేత్రా కేశవ్దేవ్ ఆలయం ప్రాంగణంపై యాజమాన్య హక్కులు సాధించారు. మసీదు కింద తవ్వకానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకిలు బందీలుగా ఉన్న, శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం మసీదు కింద ఉందని, కోర్టుకెక్కిన కొంతమంది పిటిషన్‌దారులు విశ్వసిస్తున్నారు. మసీదు కింద తవ్వడానికి కోర్టు అనుమతిస్తే చెరసాల బయటకు వస్తుందని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. రామజన్మభూమి మీద ఒక పుస్తకం రాసిన లక్నోకు చెందిన అడ్వొకేట్ రంజన అగ్నిహోత్రి శ్రీకృష్ణ జన్మభూమి మీద దృష్టి సారించారు. మరో ఆరుగురితో కలిసి షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని , ఆ భూ యాజమాన్య హక్కులన్నీ తమకి అప్పగించాలంటూ శ్రీకృష్ణ విరాజ్మాన్ తరఫున 2020లోనే దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో న్యాయమూర్తి ఛాయా శర్మ అప్పటికే ఆలయానికి ఒక ట్రస్టు ఉందని ఆ స్థలంపై ఆలయానికి, మసీదుకి మధ్య 1968లోనే అవగాహన కుదిరిందంటూ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రంజన్ అగ్నిహోత్రి జిల్లా కోర్టుకెక్కడంతో ఇరువైపుల వాదనలు విన్న జిల్లా సెషన్స్ జడ్జి రాజీవ్ భారతి విచారణకు అంగీకరించారు. ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది ? రామజన్మభూమి ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం మనకి స్వాతంత్య్రం సిద్ధించిన 1947, ఆగస్టు 15 నాటికి మతపరమైన కట్టడాలు ఎవరి అధీనంలో ఉంటే, భూ హక్కులు వారికే సంక్రమిస్తాయని, మరెవరికీ ఆ కట్టడాలని కదిల్చే హక్కులు లేవని ఆ చట్టం చెబుతోంది. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన, వారసత్వ కట్టడాలకి మాత్రం మినహాయింపు ఉంది. అందుకే రామజన్మభూమి వివాదంలో తీర్పు ఆలయ నిర్మాణానికి అనుకూలంగా వచ్చింది. మథుర ఆలయానికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉండడంతో పురావస్తు కట్టడం కింద మినహాయింపు వచ్చి తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని పిటిషన్‌దారులు ఆశతో ఉన్నారు. 1968లో రాజీ కుదిరిందా ? కోర్టు రికార్డుల ప్రకారం 1968 సంవత్సరంలో ఆలయ నిర్వహణ కమిటీ అయిన శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్,షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. కోర్డు డిక్రీ ద్వారా ఇరు వర్గాలు ఒక రాజీ ఫార్ములాకు వచ్చాయి. అప్పటికింకా 13.77 ఎకరాల భూమిలో పూర్తి స్థాయి నిర్మాణాలు లేవు. ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ముస్లింలు జీవనం సాగిస్తూ ఉండేవారు. అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం వారిని ఖాళీ చేయించి మందిరానికి, మసీదుకి సరిహద్దులు ఏర్పాటు చేశారు. ఆలయానికి అభిముఖంగా మసీదుకి ఎలాంటి తలుపులు, కిటికీలు ఉండకూడదు. రెండు ప్రార్థనాలయాలకి మధ్య గోడ కట్టాలని తీర్మానించారు. ఈ ఒప్పందానికి ఉన్న చెల్లుబాటుపై కూడా కోర్టు విచారణ చేయనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అతిథి దేవోభవ!
తల్లి, తండ్రి, గురువు తర్వాత అతిథిని దేవుడిగా చూడమంది మన సంస్కృతి. ఒక మనిషి తన తావు నుంచి మన తావుకు వచ్చినప్పుడు అతని గౌరవం, మర్యాద దెబ్బ తినకుండా ఆదరించి పంపడం చాలా అవసరమైన గొప్ప సంస్కారమని మన సంస్కృతిచెబుతుంది. మన పురాణాలు కూడా ఉదాహరణలిస్తున్నాయి. ఇంటికి వచ్చిన శత్రువునైనా ఆదరించాలనిభారతీయ సంస్కృతి చెబుతుంది. ‘అతిథి’ అంటే తిథి, వార, నక్షత్రాలు లేకుండా వచ్చేవాడని అర్థం. అంటే అనుకోకుండా రావటమన్నమాట. అలా వచ్చారంటే వారు భగవంతునితో సమానం. సాక్షాత్తు ఆ దేవుడే అతిథి రూపంలో మన ఇంటికి వచ్చి, మనకు సేవ చేసే భాగ్యం కలిగించాడని దీని భావం.మన సంప్రదాయంలో నలుగురిని భగవంతుడిగా భావించాలని కృష్ణ యజుర్వేదంలోని తైత్తరీయోపనిషత్తు చెబుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మొదటి ముగ్గురితో మనకు రక్త సంబంధం, విజ్ఞాన సంబంధం ఉంటాయి. కాని నాలుగో వ్యక్తితో ఎటువంటి సంబంధమూ లేకపోయినా వారిలోనూ భగవంతుడిని దర్శించాలని ఈఉపనిషత్తు చెబుతోంది. ఇంటికి వచ్చిన అతిథి ఎవరో మనకు తెలియకపోయినా, గుమ్మంలోకి రాగానే, కాళ్లుకడుక్కోవడానికి నీరు ఇచ్చి, లోపలకు సాదరంగా ఆహ్వానించి, దాహానికి మంచి నీళ్లు ఇచ్చి, వింజామర వీచి, కుశల సమాచారాలు అడగాలి. వచ్చిన అతిథికి బడలిక తీరాక, భోజనం చేయమనిఅడగాలి. ఇంట్లో ఆహార పదార్థాలు తక్కువగా ఉన్నప్పటికీ, అతిథిని సంతృప్తి పరచి, ఆతిథ్యం ఇచ్చేవారు ఉపవాసం చేయాలని పెద్దలు చెబుతారు. అలాగే అతిథికి కేటాయించిన గదిలో సుగంధ పరిమళాలు వెదజల్లేలా ధూపం, వెలుగు కోసం దీపం ఉంచాలని, భగవంతుడికి నైవేద్యం సమర్పించినట్లుగా, పవిత్ర భావంతో భోజనం వడ్డించాలని, భోజనం అయిన తరవాత అతిథికి అక్షంతలు ఇచ్చి, వారి దీవెనలు అందుకోవాలని భారతీయ సంప్రదాయం చెబుతోంది.వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి విశ్వామిత్రుడు రాజలాంఛనాలతో, తన పరివారంతో అకస్మాత్తుగా వచ్చినప్పుడు వశిష్ఠుడు తన దగ్గరున్న కామధేనువును స్మరించి వారందరికీ షడ్రసోపేతమైన భోజనం వడ్డించి, వారిని సంతృప్తులను చేయడం మనకు కనిపిస్తుంది.పాండవులు అరణ్య వాసంలో ఉండగా వారి వద్దకు దుర్వాసుడు తన శిష్యులతో అతిథిగా వస్తాడు. అప్పటికి పాండవులు భోజనాలు ముగించి, అక్షయపాత్రను కడిగి బోర్లించారు. అతిథిని ఏ విధంగా గౌరవించాలో తోచక ద్రౌపది శ్రీకృష్ణుyì ని ప్రార్థించింది. ఆయన వెంటనే దుర్వాస మహర్షికి, ఆయన శిష్యులకు కడుపు నిండిపోయేలా చేశాడు. వారు పాండవులదగ్గరకు వచ్చి, కడుపులు నిండుగా ఉన్నాయని, పాండవులను ఆశీర్వదించి తరలి వెళ్లిపోయారు. అలా పరోక్షంగా ఆ అతిథులను సంతృప్తులనుచేశారు. శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు కుచేలుడు శ్రీకృష్ణుని దర్శించుకోవటానికి రాజ్యానికివచ్చాడు. కృష్ణుడు సింహాసనం దిగి వచ్చి, కుచేలు కి అతిథి సత్కారాలు చేసి, దారిద్య్ర బాధలు తొలగించాడు. స్నేహితుడే అయినా అతిథిలా వచ్చాడు. ఆనందంగా తరలివెళ్లాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడు అతిథి గొప్పదనం చెబుతూ ‘రావణుడు వచ్చి శరణు కోరినా ఆయనకు నేను అతిథిలా భావించి, సేవించుకుంటాను’ అంటాడు. గొప్ప అతిథి మర్యాదలు చేసినవాడిగా బలి చక్రవర్తిని చెప్పుకోవచ్చు. ఆయన యజ్ఞం చేసి, వచ్చిన అతిథులకు అడిగినది లేదనకుండా దానం చేశాడు. అంతేనా? వామనుడు అతిథిగా వచ్చి, మూడు అడుగుల నేల కోరగానే, అన్నీ ధారపోసి, అందరి మన్ననలు పొందాడు. శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం నాటకంలో ఒకనాటి రాత్రి ఒక దొంగ చారుదత్తుడి ఇంటికి దొంగతనానికి వస్తాడు. అతడికి ఆ ఇంట్లో ఏమీ దొరకదు. అందుకు చారుదత్తుడు బాధపడి, అయ్యో వచ్చిన అతిథి రిక్తహస్తాలతో వెళ్లిపోతున్నాడే అనుకుంటాడు. చిరుతొండనంబిని పరీక్షించడానికి శివుడే అతిథి రూపంలో వస్తాడు. బిడ్డలు ఉన్న ఇంట్లోనే భోజనం చేస్తానంటాడు. అప్పటికి వారికుమారుడు శిరియాళుడు మరణిస్తాడు. అతిథి మర్యాదలు ఎలా చేస్తాడో తెలుసుకోవటం కోసమే శివుడు ఈ పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో చిరుతొండ నంబి నెగ్గి, శివసాయుజ్యం పొందాడని బసవ పురాణం చెబుతోంది. భారతంలో సక్తుప్రస్థుడి కుటుంబం వారం రోజులుగా తిండి లేక అవస్థలు పండుతుంది. ఆ రోజు వారికి పేలాల పిండి దొరుకుతుంది. నలుగురు నాలుగు భాగాలు చేసుకుని తినబోతారు. అంతలోనే ఇంద్రుడు అతిథిగా వస్తాడు. ఆయనను ఆహ్వానించి నక్తుప్రస్థుడు తన భాగాన్ని ఆయనకు వడ్డిస్తాడు. ఆయనకు ఆకలి తీరదు. తర్వాత భార్య, ఆ తరవాత కుమారుడు, కోడలు కూడా వారివారి భాగం పేలాల పిండితోఅతిథిని సంతృప్తిపరుస్తారు. మెచ్చిన ఇంద్రుడు ఆ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు.మానవులే కాదు జంతువులు కూడా అతిథి సత్కారం చేశాయి. ఒక పావురాల జంటలో ఆడ పావురం, ఇంటికి వచ్చిన అతిథి కోసం అగ్నిలో దూకుతుంది. తన మాంసంతో అతిథిని సంతృప్తి పరుస్తుంది.రామాయణంలో అరణ్యవాసం చేస్తున్న రాముడు సీతను వెతుకుతూ, తన ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి పండ్లతో అతిథి సత్కారాలు చేసింది.ఇక ఈ ఉదంతం అందరికీ తెలిసిందే. అత్రి మహర్షి భార్య అనసూయ ఇంటికి త్రిమూర్తులు అతిథిలుగా వస్తారు. ఆతిథ్యం ఇచ్చేవారు వివస్త్రలుగా వడ్డించాలని నియమం పెడతారు. అప్పుడు అనసూయ త్రిమూర్తులను చంటిపిల్లలుగా మార్చి, వారికి పాలిచ్చి అతిథిసత్కారాలు పూర్తి చేస్తుంది. అతిథికి భోజనం పెడితేనే కానీ భోజనం చేయకూడదనే నియమం కొందరికి ఉండేది. సుమారు 50 సంవత్సరాల క్రితం వరకు ఇంటికి అతిథులు రావాలనే ఆశతో వంట సిద్ధంగా ఉంచేవారు. ఇవాళ అతిథులకు వెళ్లడానికి సమయం ఉండటం లేదు. ఆతిథ్యం ఇచ్చేవారికి సమయం ఉండటం లేదు. అతిథులు వచ్చిపోయే ఇల్లు, ఊరు, దేశం కళకళలాడతాయి. మనం వొండుకొని మనం మాత్రమే తినే జీవితంలో నిజమైన రుచి ఉందంటారా?– వైజయంతి పురాణపండ -
112 కోట్లకు చేరిన ఆలయ ఆదాయం!
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన బక్నే బీహారీ దేవాలయ ఆదాయం వంద కోట్ల మార్కును దాటేసింది. వ్రిందావన్ లో ఉన్న ఈ కృష్ణుడి దేవాలయ ఆదాయం గత మూడేళ్లలో రెండు రెట్లు పెరిగింది. 1864లో స్థాపించిన ఈ ప్రాచీన అపురూప దేవాలయానికి 2015-16 ఆర్ధిక సంవత్సరంలో రూ.112కోట్ల ఆదాయం వచ్చింది. ప్రధానంగా విరాళాలు, దేవాలయం పేరు మీద ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీల నుంచి అధిక ఆదాయం సమకూరినట్లు సమాచారం. దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ టూరిజం అధికారి తెలిపిన వివరాల ప్రకారం 2015లో మొత్తం 1.26 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శింకున్నారు. కాగా, ఆలయ ఆదాయంపై ఆలయ కమిటీ ఎలాంటి అధికారికి ప్రకటనా చేయలేదు.