lorry bus
-
లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. 20మందికి గాయాలు
అల్గునూర్ (మానకొండూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ – కరీంనగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తోపాటు 20 మంది గాయపడ్డారు. ఎల్ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. మెట్పల్లి డిపోకు చెందిన బస్సు శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి మెట్‌పల్లికి బయల్దేరింది. బస్సులో డ్రైవర్, కండక్టర్, 21 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు రాత్రి 2 గంటలకు నుస్తులాపూర్ వద్దకు చేరుకుంది. ఈ సమయంలో ఐరన్ కడ్డీల లోడ్‌తో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ నర్సయ్య ప్రయత్నించాడు. అయితే లారీ కన్నా ఎక్కువ పొడవు ఉన్న ఇనుప కడ్డీలు బస్సు డ్రైవర్ ఉన్న భాగంలోనికి చొచ్చుకెళ్లాయి. దీంతో బస్సు అదుపు తప్పి వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్‌తోపాటు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
లారీని ఢీకొన్న బస్సు : 15 మందికి గాయాలు
భోగాపురం: మండలంలోని రాజాపులోవ వద్ద జాతీయ రహదారిపై బుధవారం ముందుగా వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...పార్వతీపురం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో విశాఖపట్నం వెళ్తుంది. రాజాపులోవ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఎస్ఐ తారకేశ్వరరావు, మహేష్‌లు చికిత్స నిమిత్తం భీమిలి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారు వీరే... ఈ ప్రమాదంలో సంతకవిటి మండలం తలతంపర గ్రామానికి చెందిన ముడసర్ల ఉమా మహేశ్వరి, వికారాబాద్కి చెందిన మంతన గౌడ్భీమారెడ్డి, పార్వతీపురం మండలం డీ.కే పట్నానికి చెందిన సిమికి చిన్నారావు, బంటి జగన్నాధం, గుర్ల మండలం గేదెలపేట గ్రామానికి చెందిన నారడచెల్లి అప్పలస్వామి, నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మీసాల రామునాయుడు, చింతలవలసకి చెందిన వానపల్లి ఈశ్వరరావు, నిడగల్లు గ్రామానికి చెందిన మువ్వల రవి, విశాఖపట్నం విశాలాక్షినగర్కి చెందిన డొంకాన ప్రదీప్, సీతానగరానికి చెందిన దాసురెడ్డి లకు‡్ష్మనాయుడు, కండక్టరు రాజనాల శ్రీనివాస్, మొంజికల్లు గ్రామానికి చెందిన గౌడ్ సాయిరాం, పీఎంపాలెంకి చెందిన సోంపేట ధనలక్ష్మి, సోంపేట సౌజన్య, ఆనందపురానికి చెందిన పులపా మౌనిక, కొమరాడ మండలానికి చెందిన రాయపల్లి సంధ్యారాణి, రాయిపల్లి సూర్యనారాయణ గాయపడ్డారు. -
వోల్వో బస్సు - లారీ ఢీ
నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో బుధవారం వోల్వో బస్సు - లారీ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు లారీని ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీని తప్పించబోయి..
తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. లారీని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కంప చెట్లు అడ్డు తగలడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఒంటిమిట్ట, న్యూస్‌లైన్: ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంఘటన శనివారం ఒంటిమిట్టలో చోటు చేసుకుంది. తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాడిపత్రి నుంచి తిరుపతికి వెళ్తున్న సమయంలో ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఓవర్‌టెక్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టబోతుండటంతో డ్రైవర్ బస్సును పక్కకు మళ్లించడంతో, అక్కడే ఉన్న ఇరవై అడుగుల వాగులోకి బస్సు బోల్తా పడింది. బస్సులో 32మంది ప్రయాణికులున్నారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, మిగిలిన వారందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కడపకు చెందిన జగన్మోహన్రెడ్డి(21) అనే విద్యార్థి బస్సు అడుగు భాగాన ఇరుక్కుపోయాడు. స్థానికులు అతి కష్టం మీద విద్యార్థిని బయటికి తీసి రిమ్స్‌కు తరలించారు. విద్యార్థికి రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం తిరుపతికి తరలించారు. విజయవాడకు చెందిన నరేష్(45), కడపకు చెందిన అనురాధ(38), నందలూరు మండలంలో ఏఎన్ఎంగా పని చేస్తున్న శారద(40)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. మిగిలిన ప్రయాణికులందరికీ స్వల్పగాయాలయ్యాయి. వీరందరూ స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. బస్సు వాగులో పడ్డ సమయంలో కంపచెట్లు అడ్డు పడటంతో పెనుప్రమాదం తప్పింది. సంఘటన స్థలాన్ని రాజంపేట ఆర్డీఓ ఎం.విజయసునీత పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానంపై ఆరా తీశారు. బస్సు ప్రమాదంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.