లారీని ఢీకొన్న బస్సు : 15 మందికి గాయాలు | 15 injured in lorry and rtc bus accident | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న బస్సు : 15 మందికి గాయాలు

Published Thu, Feb 1 2018 1:08 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

 15 injured in lorry and rtc bus accident - Sakshi

గ్యాస్‌ సిలెండర్ల లారీని ఢీకొన్న ఆర్‌టీసీ బస్సు

భోగాపురం: మండలంలోని రాజాపులోవ వద్ద జాతీయ రహదారిపై బుధవారం ముందుగా వెళ్తున్న గ్యాస్‌ సిలిండర్ల లారీని ఆర్‌టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...పార్వతీపురం డిపోకి చెందిన ఆర్‌టీసీ బస్సు ప్రయాణికులతో విశాఖపట్నం వెళ్తుంది. రాజాపులోవ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా గ్యాస్‌ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీని ఆర్‌టీసీ బస్సు ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఎస్‌ఐ తారకేశ్వరరావు, మహేష్‌లు చికిత్స నిమిత్తం భీమిలి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన వారు వీరే...
ఈ ప్రమాదంలో సంతకవిటి మండలం తలతంపర గ్రామానికి చెందిన ముడసర్ల ఉమా మహేశ్వరి, వికారాబాద్‌కి చెందిన మంతన గౌడ్‌భీమారెడ్డి, పార్వతీపురం మండలం డీ.కే పట్నానికి చెందిన సిమికి చిన్నారావు, బంటి జగన్నాధం, గుర్ల మండలం గేదెలపేట గ్రామానికి చెందిన నారడచెల్లి అప్పలస్వామి, నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మీసాల రామునాయుడు, చింతలవలసకి చెందిన వానపల్లి ఈశ్వరరావు, నిడగల్లు గ్రామానికి చెందిన మువ్వల రవి, విశాఖపట్నం విశాలాక్షినగర్‌కి చెందిన  డొంకాన ప్రదీప్, సీతానగరానికి చెందిన దాసురెడ్డి లకు‡్ష్మనాయుడు, కండక్టరు రాజనాల శ్రీనివాస్, మొంజికల్లు గ్రామానికి చెందిన గౌడ్‌ సాయిరాం, పీఎంపాలెంకి చెందిన సోంపేట ధనలక్ష్మి, సోంపేట సౌజన్య, ఆనందపురానికి చెందిన పులపా మౌనిక, కొమరాడ మండలానికి చెందిన రాయపల్లి సంధ్యారాణి, రాయిపల్లి సూర్యనారాయణ గాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement