lorry seized
-
సిమెంట్ అక్రమ వ్యాపార కేంద్రంపై దాడులు
చౌటుప్పల్ (మునుగోడు) : అక్రమంగా సాగిస్తున్న సిమెంట్ వ్యాపార కేంద్రంపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మికంగా దా డులు నిర్వహించారు. ట్యాంకర్ల నుంచి అక్రమ పద్ధతుల్లో సిమెంట్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులతోపాటు కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. సిమెంట్ ట్యాంకర్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. రూ.11,500 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ఏరుకొండ వెంకటయ్య సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన నీల మల్లేశం లారీ డ్రైవర్‌గా, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రా మానికి చెందిన రుద్రాక్షి నరహరి క్లీనర్‌గా సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ప్రాం తంలోని మైహోం ఇండస్ట్రీస్ నుంచి ఏపీ24 డ బ్ల్యూ 4073 నంబరు గల ట్యాంకర్ లారీలో సిమెంట్‌ను తీసుకుని హైదరాబాద్‌లోని ఆ కంపెనీకి చెందిన గోదాముకు వెళ్లారు. అక్కడ లారీలోని సిమెంట్‌ను ఖాళీ చేసి తిరిగి కంపెనీకి బయలుదేరారు. ఈ క్రమంలో మండల కేంద్రం లోనే నివాసం ఉంటున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన దేశగోని సుధాకర్ ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన సిమెంట్ కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. అప్పటికే తమకు అందిన సమాచారం ప్రకారం ఎస్ఓటీ పోలీసులు సమీపంలో మాటువేసి ఉన్నారు. ట్యాంకర్ నుంచి సిమెంటును బస్తాల్లోకి నింపుతున్న క్రమంలో పట్టుకున్నారు. 350 సిమెంటు బస్తాల సిమెంట్ స్వాధీనం సుధాకర్‌కు చెందిన అక్రమ కొనుగోలు కేంద్రంలో దాడులు చేసిన ఎస్ఓటీ పోలీసులు 350 సిమెంటు బస్తాలు లభ్యమయ్యాయి. సిమెంటును దిగుమతి చేస్తున్న లారీ సైతం పట్టుబడింది. లారీడ్రైవర్, క్లీనర్ల వద్ద రూ.11,750 నగదు, రెండు సెల్ఫోన్లు లభ్యమయ్యాయి. వీరిద్దరితో పాటు కొనుగోలుదారుడైన సుధాకర్‌ను అరెస్టు చేశారు. మరోసారి చిక్కితే పీడీయాక్ట్ సిమెంటు అక్రమ వ్యాపారం నిర్వహించే వ్యక్తులతో పాటు సిమెంటును విక్రయించే లారీ డ్రైవర్లు, క్లీనర్లపై నిఘా పెంచామని సీఐ తెలిపారు. ఒకసారి పట్టుబడిన వ్యక్తులు మరోసారి చిక్కితే పీడీయాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్తున్న సిమెంటు లారీ వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న అక్రమ వ్యాపారులకు విక్రయిస్తున్న లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని గుర్తుచేశారు. ఈ తతంగంలో సంబంధిత సిమెంటు గోదాముల వద్ద పనిచేసే వ్యక్తుల సహకారం సైతం ఉందని తెలిపారు. పట్టుబడిన వ్యక్తులను రిమాండ్ నిమిత్తం రామన్నపేట కోర్టుకు తరలించామని సీఐ వివరించారు. సమావేశంలో స్థానిక ఎస్ఐ ఎన్.నవీన్‌బాబు, ఎస్ఓటీ ఎస్ఐ లక్ష్మీనారాయణ ఉన్నారు. -
లారీలను వెంబడించి పట్టుకున్న ఎమ్మెల్యే
పరిగి వికారాబాద్ : ‘చెట్లన్నీ నరుక్కుంటూ పోతే మొక్క లు నాటి ఏంలాభం.. నాటుడు తక్కువైంది.. నరుకుడు ఎక్కువైంది’. అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమంగా కలప తరలిస్తున్నారంటూ మంగళవారం అర్ధరాత్రి కొంతమంది యువకులు ఇచ్చిన సమాచారంతో బయలుదేరిన ఆయన లారీలను వెంబడిస్తూ వెళ్లారు. ఇదే సమయంలో ఫారెస్టు అధికారులకు సమాచారం అందించడంతో వారు సైతం ఎమ్మెల్యేకు జతకలిశారు. కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లిగేట్ సమీపంలో షాద్‌నగర్ వైపు వెళ్తున్న నాలుగు లారీలను పట్టుకున్నారు. అనంతరం వీటిని పరిగి రేంజర్ కార్యాలయానికి తరలించారు. ఫారెస్టు ఆఫీసులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ ఫారెస్టు రేంజర్ శ్రీవాణి వివరాలు వెల్లడించారు. ముజాహిద్పూర్ పరిసరాల్లోని అటవీ ప్రాంతం తో పాటు వ్యవసాయ పొలాల్లోని చెట్లను నరికి లారీల్లో తరలిస్తున్నట్లు తెలిపారు. ఇందులో మామిడి, యూకలిప్టస్, వేప, తుమ్మ తదితర చెట్ల మొదళ్లు, దుంగలు ఉన్నట్లు స్పష్టంచేశారు. ఎమ్మెల్యే టీఆర్ఆర్ మాట్లాడుతూ.. ఎన్నిసార్లు హెచ్చరించినా కలప అక్రమ రవాణా ఆగడం లేదని మండిపడ్డారు. మొరం, మట్టి, కలప తదితర సహజ వనరులు తరలిపోతున్నా యని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులు, రెవె న్యూ, అటవీశాఖల అధికారులకు సమాచారం అందించాలని యువత, మహిళలను కోరారు. అటవీశాఖ అధికారులు మహిళా ఆఫీసర్లైనా బాగా స్పందిస్తున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణరెడ్డి, టీ.వెంకటేశ్, ఫారెస్టు అధికారులు ఉన్నారు. -
ఇసుక మాఫియాకు చెక్
రాయగడ : అక్రమంగా తరలిస్తున్న ఇసుక, మెటల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కల్యాణ సిగుపూర్ తహసీల్దార్ మేరీ నాయక్ తెలిపారు. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రైల్వే ద్వారా గత కొన్ని నెలల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్రాకు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. రాయగడ–కొరాపుట్ రైల్వేలైన్ మధ్య ఉన్న బాలుమస్కా రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా సుమారు 3 వ్యాగన్ల ఇసుక, ఒక వ్యాగన్ మెటల్ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న కల్యాణసింగుపురం తహసీల్దార్ దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సమారు రూ. కోటి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపినట్లు అధికారులు తెలిపారు. కొల్నార రెవెన్యూ పరిధిలోని దుందిరిఘాటీ, కల్యాణసింగుపురం ప్రాంతంలో ఉన్న నాగావళి నది ఒడ్డు నుంచి ఇసుక బల్లుమాస్క రైల్వేస్టేషన్‌కు ప్లాస్టిక్ సంచుల్లో అక్రమంగా తరలిస్తున్నారు. బల్లుమాస్క నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఇసుక బస్తాలతో పాటు మెటల్‌ను కూడా తరలిస్తున్నారు. అధికారుల అండతోనే అక్రమ రవాణా నదీ పరీవాహక ప్రాంతం నుంచి ఇంత భారీ స్థాయిలో ఇసు క, మెటల్ అక్రమంగా రవాణా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదంతా అధికారులు, ప్రభుత్వ నేతలతో కలిసి చేస్తున్న వ్యవహారమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుక క్వారీకి రెవెన్యూ విభాగం అనుమతులు మంజూరు చేసిన అనంతరం రవాణాకు అనుమతులు వస్తాయని అప్పుడే రైల్వే అధికారులు తరలించేందుకు సుముఖత వ్యక్తం చేస్తారని అలాంటప్పుడు ఎవరు తప్పు చేసినట్లు అని స్థానికులు నిలదీస్తున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి రైల్వే అధికారుల వరకు ఈ ఇసుక మాఫి యాతో సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక, మెటల్ బల్లుమాస్క రైల్వే అధికారుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు సుమారు రూ.2.50లక్షల జరిమానా విధించి విడిచిపెట్టారన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌కు అధికారులు స్పందించకపోవడం దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
కల్తీకారం తరలిస్తున్నలారీలు సీజ్
గంపలగూడెం: కల్తీకారం తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగొలను దగ్గర గురువారం దాడులు చేపట్టిన పోలీసులు కల్తీ కారం లోడుతో వెళ్తున్న రెండు లారీలను గుర్తించారు. చెక్‌పోస్టులను తప్పించుకునేందుకు వ్యాపారుల ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు గుర్తించిన పోలీసులు దారి కాచి వాటిని పట్టుకున్నారు. రెండు లారీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
58 ఇసుక లారీలు సీజ్
- డ్రైవర్లపై కేసు నమోదు, అరెస్ట్ దాచేపల్లి : ఇసుకను అక్రమంగా రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్న లారీలను పోలీసులు శనివారం సీజ్ చేశారు. ఏపీలోని పలు జిల్లాల నుంచి సముద్రపు ఇసుకలో కృష్ణానది ఇసుకను కలిపి ఇతర రాష్ట్రానికి తరలిస్తున్న 58 లారీలను గుర్తించి సీజ్ చేసి 58 మంది లారీడ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దాచేపల్లి ఎస్సై కట్టా ఆనంద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి సముద్రపు ఇసుకను లారీల్లో లోడు చేసుకుని తెలంగాణకు తరలిస్తున్నారు. దాచేపల్లి మండలం పొందుగల పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద లారీలను ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీ చేసిన లారీల్లో ఇసుక రవాణాకు సంబంధించి అనుమతి పత్రాలు సక్రమంగా లేకపోవటం, లీజుదారు పేరు, హైదరాబాద్‌లోని ఇసుక చేరాల్సిన అడ్రసు ఒకేలా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కొన్ని లారీల్లో ఓవర్‌లోడ్ కూడా ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. సముద్రపు ఇసుకలో కృష్ణానది ఇసుకను కూడా కలిపినట్లు తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. దీంతో 58 లారీలను సీజ్ చేసి నడికుడి సబ్ మార్కెట్ యార్డుకు తరలించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 58 మంది లారీ డ్రైవర్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి గురజాల కోర్టులో హాజరుపరిచామని ఎస్సై ఆనంద్ వెల్లడించారు. -
కోడికొండ చెక్‌పోస్టులో తనిఖీలు
- రెండు లారీలు సీజ్ చిలమత్తూరు రూరల్ : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తోన్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖాధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఒక్కో లారీలో 33 టన్నుల బియ్యం రవాణా అవుతోంది. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉండవచ్చు. ఎలాంటి బిల్లులు చూపించక పోవడంతో లారీలను సీజ్ చేసినట్లు డీసీటీఓ జేబీ నందా తెలిపారు. పట్టుబడిన లారీలు(కేఏ04ఏఏ 0227, కేఏ04ఏఏ 0224) కొత్త చెరువుకు చెందిన ఓ టీడీపీ నేతకు చెందినవిగా సమాచారం. -
ఇసుక అక్రమ రవాణా... ముగ్గురి అరెస్ట్
కొవ్వూరు(పశ్చిమగోదావరి): గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. లారీని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇసుక తరలించడానికి ఉపయోగించిన బోటును వదిలేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
2 ఇసుక లారీలు స్వాధీనం
మాడుగుల: అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక లారీలను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం వి.వి.అగ్రహారంలో మంగళవారం రాత్రి జరిగింది. వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు లారీలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.