lottery fraud
-
దేశంలోనే అత్యధిక ఎన్నికల బాండ్ల కొనుగోలు.. చుట్టూ వివాదాలు
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అయితే ఈ డేటా వచ్చిన వెంటనే ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్’ పేరు మారుమోగింది. ఆ సంస్థ 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువ చేసే ఎన్నికలబాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. భారీగా ఎన్నికలబాండ్లు కొనుగోలు చేసిన ఆ కంపెనీ యజమాని, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మయన్మార్‌లో సాదాసీదా కూలీగా జీవనం సాగించిన మార్టిన్ రూ.కోట్ల విరాళాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగాడో ఈ కథనంలో తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే లాటరీ వ్యాపారం భారత్‌లోనే పుట్టిన మార్టిన్ చిన్నతనంలో మయన్మార్‌లో చాలాకాలం పాటు కూలీగా జీవనం సాగించారు. తన 13వ ఏటా తిరిగి భారత్‌కు వచ్చి తమిళనాడులోని కోయంబత్తూరులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు దేశం అంతటా విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్‌కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్లకు భూటాన్, నేపాల్‌లో కూడా తన బిజినెస్‌ను మొదలుపెట్టారు. తర్వాత స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్టైల్, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లాటరీలు చట్టబద్ధమని తెలుసుకున్న మార్టిన్ ఆయా రాష్ట్రాల్లో సుమారు 1,000 మందిని నియమించుకుని వ్యాపారం సాగిస్తున్నారు. నాగాలాండ్, సిక్కింలో అయితే తన కంపెనీకి చెందిన 'డియర్ లాటరీ' సంస్థదే ఆధిపత్యం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్ వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వరల్డ్ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం కూడా ఉంది. వివాదాలతో వెలుగులోకి.. సిక్కిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2008లో రూ.4,500 కోట్లకు పైగా మోసానికి పాల్పడడంతో మార్టిన్ పేరు బయటకొచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మార్టిన్ కంపెనీలు బహుమతి పొందిన టికెట్లను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2011లో అక్రమ లాటరీ వ్యాపారాలపై అణిచివేతలో భాగంగా తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా తన కంపెనీలో సోదాలు నిర్వహించారు. 2013లో, కేరళ పోలీసులు రాష్ట్రంలో అక్రమ లాటరీ కార్యకలాపాలపై దర్యాప్తులో భాగంగా మార్టిన్ సంస్థలో దాడులు చేశారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై ఈడీ పలు మార్లు దాడులు చేసింది. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. -
ఒక్క ఫోన్ నెంబర్‌తో లూటీ... రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు
హిమాయత్‌నగర్: అమెజాన్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుపై, మీ ఫోన్ నంబర్‌పై రూ. కోటి లాటరీ వచ్చిందని నగర మహిళకు ఎర వేశారు సైబర్ నేరగాళ్లు. రూ.కోటి మీ సొంతం కావాలంటే ప్రాసెసింగ్ చార్జీల నిమిత్తం కొంత డబ్బు చెల్లించాలన్నారు. దీనికి ఆశపడిన బాధితురాలు వారు కోరిన విధంగా పలు దఫాలుగా 15 రోజుల్లో రూ. 15 లక్షలు వారు చెప్పిన ఖాతాల్లో జమ చేసింది. రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం చేతికి అందకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ నుంచి రూ. 11 లక్షలు... గోల్కొండ కేంద్రంగా పని చేస్తున్న ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి రూ. 11 లక్షలు మాయమైనట్లు కంపెనీ ప్రతినిధులు మంగళవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యా దు చేశారు. కంపెనీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాల ఫోన్ నంబర్లను ఇటీవల మార్చారు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే కంపెనీ ఖాతా నుంచి రూ. 11 లక్షలు డెబిట్ అయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడగా రూ. 4 లక్షలను ఫ్రీజ్ చేయగలిగారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. (చదవండి: పోలీసులకు విదేశీ వనిత కృతజ్ఞతలు) -
లక్కీ డ్రా గ్యాంగ్..ఇలా చిక్కారు!
జగిత్యాలక్రైం: లక్కీ లాటరీ పేరుతో సామాన్యులకు సభ్యత్వం ఇస్తూ ప్రతీనెల వాయిదాల పద్ధతిలో డబ్బు తీసుకుని డ్రా నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండగా జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి, జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో సోమవారం దాడి చేసి 13 మందిపై కేసు నమోదు చేశారు. మోతె గ్రామానికి చెందిన లోకిని చంద్రమౌళి, చైత్రిక ఎంటర్ప్రైజెస్ పేరుతో లక్కీ డ్రా దందా నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా మరో 12 మంది ఆరె ధర్మయ్య, ప్రదీప్, బొల్లం కిరణ్, నర్ర శేఖర్, నాంపల్లి పవన్, చిలుక సతీశ్, నాయిని రాజన్న, వేముల రమేశ్, సతీశ్, రాకేశ్, కొక్కు సందీప్, సామల్ల చందు ఏజెంట్లుగా పని చేస్తున్నారు. ఒక్కో సభ్యుడి నుంచి వారానికి రూ.300 వసూలు చేసి లక్కీ డ్రా నిర్వహిస్తూ పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి రూ.2.07 లక్షల నగదు, ఆరు రిసీప్ట్ బుక్స్, చైత్రిక ఎంటర్ప్రైజెస్ బుక్లెట్స్ 130, లాటరీ కాయిన్స్ 45, లాటరీ కాయిన్స్ రోలింగ్, ప్లాస్టిక్ కుర్చీలు 70, టెంట్ 1, టేబుల్ ఫ్యాన్స్ 22, పెడెస్టెల్ ఫ్యాన్స్ 2, మిక్చర్ గ్రైండర్స్ 25, గ్యాస్‌స్టౌవ్ 4 స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. -
రూ.46 లక్షల లాటరీ వచ్చిందని..
సాక్షి, నిజమామాద్ : సైబర్ నేరస్తులు రూటు మార్చారు. గతంలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టించి నగదు కాజేసిన నేరగాళ్లు.. తాజాగా గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. లాటరీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్‌లో జరిగిన సంఘటననే దీనికి నిదర్శనం. ఆర్మూరు మండలం చేవూరుకు చెందిన అశోక్‌కి ఇటీవల ఓ అజ్ఞాతవాసి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు మీద రూ.46లక్షల లాటరీ వచ్చిందని, రూ,16లక్షలు తమ అకౌంట్లో జమచేస్తే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని నమ్మించారు. లాటరీ డబ్బులు వస్తే తమ బతుకులు బాగుపడుతాయని భావించిన అశోక్, ముత్తమ్మ దంపతులు.. పుస్తెల తాడుతో సహా ఇంటిని అమ్మేసి రూ.16లక్షలు సైబర్ నేరస్తుల అకౌంట్లో జమచేశారు. కొద్ది రోజుల తర్వాత అది ఫేక్ లాటరీ అని తెలిసింది. దీంతో అశోక్ దంపతులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం స్పందించి తమ డబ్బులు రికవరీ చేయించాలని బాధితులు వేడుకుంటున్నారు. -
లాటరీ పేరిట రూ.70 లక్షల మోసం
సాక్షి, అల్లిపురం (విశాఖ దక్షిణ): లాటరీ పేరిట పలు విడతల్లో రూ.70లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన బి.రామకృష్ణ అనే వ్యక్తి ఈ – మెయిల్‌కు 2015వ సంవత్సరంలో ఒక మెయిల్ వచ్చింది. అందులో వరల్డ్ లాటరీ ఆర్గనైజేషన్ నుంచి 250 గ్రేట్ బ్రిటిష్ పౌండ్స్ గెలుచుకున్నారన్నది సారాంశం. దీంతో రామకృష్ణ తిరిగి వారు అడిగిన సమాచారం అందించాడు. తరువాత ఫాస్టర్ న్యూ మాన్ అనే వ్యక్తి +448726148738 నంబరు నుంచి ఫోన్ చేశాడు. తాను హెచ్ఎస్బీసీ యూకే బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను.., మీ ప్రైజ్ మనీ తమ యూకే బ్యాంకులో జమైంది, దానిని క్లెయిమ్ చేసుకోవాలంటే హెచ్ఎస్బీసీలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని సూచించాడు. అందుకోసం కొంత సొమ్ము కట్టాలని, తరువాత తాము పంపే హెచ్ఎస్బీసీ ఏటీఎం కార్డు ద్వారా ఎక్కడి నుంచైనా ప్రైజ్ మనీ డ్రా చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో బాధితుడు రూ.34,500 డిపాజిట్ చేశాడు. తరువాత వారు చెప్పిన విధంగా హెచ్ఎస్బీసీ యూకే ఏటీఎం కార్డు రావడంతో దాని యాక్టివేషన్ కోసం వరల్డ్ బ్యాంకుకు కొంత సొమ్ము కట్టాలని, యాంటీ టెర్రరిస్ట్, ఇన్సూరెన్స్ కోసం మరికొంత సొమ్ము కట్టాలని చెప్పడంతో డిపాజిట్ చేశాడు. తరువాత గెలుచుకున్న ప్రైజ్ మనీని తమ రిప్రజెంటేటివ్ కెల్విన్ ఫిలిప్స్ మీ ఇంటికి తెచ్చి ఇస్తారని చెప్పడంతో... కెల్విన్ ఫిలిప్స్‌ను విశాఖపట్నం రైల్వేస్టేషన్లో రామకృష్ణ రిసీవ్ చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తరువాత ఫిలిప్స్ తెచ్చిన డిజిటల్ లాకర్ బాక్స్‌ను తెరిచి బ్లాక్ కోటెడ్ కరెన్సీని ఒక లిక్విడ్‌లో ముంచి కొన్ని చేంజ్ అయిన యూకే పౌండ్స్‌ను చూపించి నిజమేనని నమ్మించాడు. తరువాత తాను తెచ్చిన లిక్విడ్ అయిపోయిందని, అది తరువాత కొరియర్లో పంపుతానని చెప్పటంతో అది నిజమేనని నమ్మిన బాధితుడు వారి సూచించిన అకౌంట్లలో విడతల వారీగా రూ.70 లక్షలు డిపాజిట్ చేశాడు. అయితే ఎంతకీ లిక్విడ్ కొరియర్ రాకపోవటంతో జరిగిందంతా మోసం అని తెలుసుకొని గురువారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. డబ్బులు ఊరికే రావని, మోసగాళ్ల చేతుల్లో మోసపోవద్దని, లాటరీల పేరిట వచ్చే మెసేజ్‌లు, లెటర్లు, ఈ మెయిల్స్ నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని సీఐ గోపీనాథ్ హెచ్చరించారు. -
కౌన్ బనేగా ‘బకరా’!
సాక్షి, సిటీబ్యూరో : కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) ప్రోగ్రాం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా దాని పేరు చెప్పి మోసాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ పేరుతో లాటరీ తగిలిందంటూ ఇద్దరు నగరవాసులకు ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.6.7 లక్షలు కాజేశారు. బాధితుల్లో ఒకరు గృహిణి కాగా, మరొకరు వాచ్మెన్. వీరి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులిద్దరికీ నేరగాళ్లు వాట్సాప్‌లో కాల్ చేయడం, ఒకే పేరు చెప్పి పరిచయం చేసుకోవడం, రూ.25 లక్షల ప్రైజ్‌మనీ అంటూ ఎర వేయడం కొసమెరుపు. లండన్‌లో ఉద్యోగమంటూ మరో యువతి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.75 లక్షలు కాజేశారు. ఇదిలా ఉండగా... ఓ వివాహితపై సైబర్ వేధింపులకు పాల్పడిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గృహిణి నుంచి రూ.4.48 లక్షలు... మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన మహిళ అబీదకు ఈ నెల 12న ఓ వాట్సాప్ కాల్ వచ్చింది. రాణా ప్రతాప్ సింగ్ అంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి ముంబైలోని కేబీసీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. కేబీసీ లక్కీ డ్రాలో రూ. 25 లక్షలు గెలుచుకున్నారంటూ ఎర వేశాడు. ప్రైజ్ మనీ తీసుకోవడానికి కేవలం రూ. 20 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి గుర్తింపు కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలు అందించాలన్నాడు. ఆమె వివరాలు పంపడంతో ఓ ‘అధికారిక లేఖ’ కూడా పంపించారు. ఆపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులమంటూ విజయకుమార్, బీకే మిస్రా పేర్లతో మరో ఇద్దరు రంగంలోకి దిగారు. తమ గుర్తింపుకార్డులను సైతం వాట్సాప్‌లో పంపిన వీరు ఆర్బీఐ ద్వారా మీ ప్రైజ్‌మనీ ఖాతాలోకి రానుందని నమ్మబలికారు. జీఎస్టీ, ఆదాయపుపన్ను సహా వివిధ చార్జీ పేరు చెప్పి రూ.4.48 లక్షలు తమ ఖాతాల్లో వేయించుకున్న తర్వాత మరో రూ.2.75 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రూ.2.26 లక్షలు పొగొట్టుకున్న వాచ్‌మన్ దత్తాత్రేయ కాలనీకి చెందిన వాచ్‌మన్ బన్సీలాల్‌కు ఈ నెల 25న వాట్సాప్ కాల్ వచ్చింది. రాణా ప్రతాప్ పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి అదే కేబీసీ, రూ.25 లక్షల బహుమతి కథ చెప్పాడు. ఆ డబ్బు తీసుకోవడానికి ముందుగా రూ. 16 వేలు ఆదాయపుపన్నుగా చెల్లించాలంటూ నమ్మించాడు. ఈ మాటలు నమ్మిన బన్సీలాల్ డబ్బు డిపాజిట్ చేశాడు. ఇలా అతడి నుంచి రూ.2.26 లక్షలు కాజేశారు. ఆపై మరో రూ.1.3 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానించిన అతను సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. విదేశీ ఉద్యోగమంటూ రూ.1.75 లక్షలు... లండన్‌లోని ప్రిన్సెస్ రాయల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఉద్యోగం పేరుతో ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన యువతి నుంచి రూ.1.75 లక్షలు కాజేశారు. న్యూ మెట్టుగూడకు చెందిన వినీతకు ఉద్యోగానికి సంబంధించిన ఆన్లైన్లో సమాచారం అందింది. దానికి సంబంధించిన హెచ్ఆర్ హెడ్ మోర్‌గెయిన్ క్లీన్ పేరుతో అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది. మూడేళ్లు పని చేయడానికి బాండు ఇస్తే నెలకు 4500 పౌండ్ల జీతం అంటూ అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఒప్పంద పత్రాలు సైతం ఆన్లైన్లో పంపించారు. ఆపై వీటిని వీసా ప్రాసెసింగ్ కోసం ఢిల్లీలోని బ్రిటీష్ ఎంబసీకి పంపుతున్నామని, సదరు కార్యాలయం నుంచి గ్రహమ్ మెర్టిన్ సంప్రదిస్తారన్నారు. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.29,900 కాజేసి దీనికి బోగస్ రసీదులూ పంపారు. ఆపై గ్రహమ్ పేరుతో సంప్రదించిన వ్యక్తి ఐఈఎల్టీఎస్ సర్టిఫికెట్ ఉంటేనే వీసా వస్తుందని, అది తామే ఏర్పా టు చేస్తామని మరో రూ.60 వేలు కాజేశారు. ఆపై రూ. 89,707 బీటీఏగా (బేసిక్ ట్రావెల్ అలవెన్స్‌స్) చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. ఈ డబ్బు చెల్లిస్తేనే ఢిల్లీలోని యూకే ఎంబీసీలోకి వెళ్లేందుకు గేట్పాస్ లభిస్తుందంటూ భయపెట్టారు. దీంతో బాధితురాలు బజాజ్ ఫైన్సాన్ నుంచి అప్పు తీసుకొని మరీ డబ్బు చెల్లించింది. సైబర్ నేరగాళ్లు మళ్లీ డబ్బు డిమాండ్ చేస్తుండటంతో అనుమానించింది. ఢిల్లీలోని లండన్ ఎంబీసీకి ఫోన్ చేసి సంప్రదించగా మోసంగా తేలింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
గ్రేట్ చీటర్!
సాక్షి, సిటీబ్యూరో: ఒక్కోసారి ఒక్కో ప్రాంతం... మోసాలు చేయడానికి మా త్రం ఒకే పంథా... 2006 నుంచి రెండు రాష్ట్రాల్లో నేరాలు... జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ మొదలు... నిజామా బాద్ కమిషనరేట్ టార్గెట్‌గా ఐదు చీటింగ్స్... ఇలాంటి ‘ఘన చరిత్ర’ కలిగిన కరుడుగట్టిన మోసగాడు అఫ్తాబ్ అహ్మద్ షేక్. నిజామాబాద్ అధికారులను ముప్పతిప్ప లు పెట్టిన ఇతడిని నగర సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సొత్తుతో సహా ఆదివారం అక్కడి అధికారులకు అప్పగించారు. పానీపూరీ వ్యాపారే తొలి టార్గెట్... మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి చెందిన అఫ్తాబ్ 2006లో తొలినేరం చేశాడు. నర్సి ప్రాంతంలోని పానీపూరీ బండి నిర్వాహకుడికి టోపీ పెట్టాడు. ఓ రోజు అతను నర్సి ఠాణా ఎదురుగా పానీపూరీ వ్యాపారి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో సదరు చిరు వ్యాపారి తన స్టౌల్లో కిరోసిన్ పోసుకుంటున్నాడు. ‘అంత ఖర్చుపెట్టి గ్యాస్‌నూనె ఎందుకు వాడతావు? కట్టెల పొయ్యి వెలిగించుకోవచ్చు కదా?’ అంటూ అతడికి సలహా ఇచ్చాడు. కట్టెలు దొరకడం కష్టంగా ఉందంటూ పానీపూరీ వాలా చెప్పగా... ఎదురుగా ఉన్న పోలీసుస్టేషన్‌లోని చెట్టును చూపించిన అఫ్తాబ్ దాన్ని కొట్టుకోమని, ఇప్పుడే పోలీసులతో మాట్లాడతానని చెప్పాడు. పానీపూరీ ఇప్పించమంటూ... పానీపూరీ వ్యాపారి చూస్తుండగానే సదరు ఠాణా సెంట్రీ వద్దకు వెళ/Šæళన అఫ్తాబ్ తనకు ఆకలిగా ఉందని, డబ్బులు లేవణ/æ చెప్పాడు. మీరు ఇవ్వమంటే సదరు చిరు వ్యాపారి పానీపూరీలు ఇస్తాడని వేడుఖక్షశఢఃథక్ష జాలిపడిన సెంట్రీ అఫ్తాబ్‌కు ఓ ప్లేట్ పానీపూరీ ఇవ్వమని పానీపూరీ వ్యాపారికి సైగ చేశాడు. అనంతరం సదరు వ్యాపారి వద్దకు వెళ్లిన అఫ్తాబ్... పోలీసులు చెట్టు కొట్టుకునేందుకు అనుమతిచ్చినందున ‘ఖర్చుల’ పేరుతో రూ.1000 తీసుకుని వెళ్లిపోయాడు. మరుసటి రోజు పానీపూరీ వ్యాపారి చెట్టు కొట్టేందుకు ఠాణా లోకి వెళుతుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అఫ్తాబ్ చేసిన మోసం బయటపడి వదిలేశారు. అరటి పళ్ల వ్యాపారం పేరుతో... అఫ్తాబ్ స్వస్థలమైన బీడ్‌లో అరటి పంట ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వీటికి అంతగా డిమాండ్ లేకపోవడంతో వ్యాపారం నిమిత్తం 2007లో హైదరాబాద్‌కు వచ్చాడు. పాతబస్తీలోని రెయిన్‌బజార్‌లో స్థిరపడిన ఇతను అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అరటి పండ్ల వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో మోసగాడిగా మారాడు. గతంలో పేట్‌బషీరాబాద్, వనస్థలిపురం, మీర్‌పేట, మొఘల్‌పుర, మలక్‌పేట, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, లంగర్‌హౌస్, కామారెడ్డి, దేవన్పల్లిల్లో నేరాలు చేసి అరెస్టయ్యాడు. 2011లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ అత్యాచారం కేసులో అరెస్టై 2017 వరకు జైలు జీవితం అనుభవించాడు. గత జనవరిలో జైలు నుంచి వచ్చిన ఇతను గత నెల నుంచి మళ్ళీ మోసాలు ప్రారంభించాడు. ఈసారి నిజామాబాద్ కమిషనరేట్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ మోసాలు చేయడం కోసం ఓ వాహనం అవసరం కావడంతో గుల్బర్గా వెళ్లాడు. ఇన్స్టాల్మెంట్ జాబితాతో... చోరీ వాహనంతో నిజామాబాద్ చేరుకున్న అఫ్తాబ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లా తయారై షోరూం యజమానిని మాటలతో బోల్తాకొట్టించి అతని వద్ద ఇన్స్టాల్మెంట్లో గృహోపకరణాలు కొన్న వారి జాబితా సేకరించాడు. దీని ఆధారంగా మధ్య వయస్కులైన మహిళా వినియోగదారుల ఇళ్లకు వెళ్లి షోరూం తీసిన డ్రాలో మీకు 5 తులాల బంగారం తగిలిందని చెప్పేవాడు. అది తీసుకోవడానికి రావాలంటూ తన వాహనంపై ఎక్కమనేవాడు. మీ ఒంటిపై బంగారం ఉంటే షోరూమ్ వారు బంగారం ఇవ్వరని చెప్పి ఆ సొత్తును ఇంట్లో ఉన్న వారికి అప్పగించేలా చేసేవాడు. ఆపై టార్గెట్‌ను కొంతదూరం తన వాహనంపై తీసుకువెళ్ళి దింపేవాడు. వెనక్కు వెళ్లి తనతో పాటు వచ్చిన మహిళకు చెందిన బంగారం ఇవ్వమంటోందంటూ ఇంట్లో వారికి చెప్పి అది తీసుకుని ఉడాయించేవాడు. 40 రోజుల్లో ఈ పంథాలో ఐదు నేరాలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఆదివారం అతడిని అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి 18 తులాల బంగారం, వాహనం రికవరీ చేసి నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు. లాటరీలో వాహనంతగిలిందంటూ... అక్కడ ఓ డిగ్రీ విద్యార్థిని టార్గెట్‌గా చేసుకున్న అఫ్తాబ్ అతడి వద్దకు వెళ్లి తానో సంస్థ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. మాటలతో బురిడీ కొట్టించి లాటరీలో బైక్ వచ్చిందంటూ ఆ స్టూడెంట్ వాహనంపైనే షో రూం వద్దకు తీసుకెళ్లాడు. విద్యార్థిని బయటే ఉంచి.. లోపలకు వెళ్లిన అఫ్తాబ్ బైక్ కొంటానంటూ నిర్వాహకులకు చెప్పి ఓ మోడల్ ఎంపిక చేసుకున్నాడు. తన బంధువుకు చూపిస్తానంటూ దానిని బయటికి తీసుకువచ్చి ఇదే నీకు లాటరీలో వచ్చిన వాహనంగా చెప్పాడు. అందుకు అవసరమైన పత్రాలు తెస్తానని సదరు విద్యార్థి బండితో పాటు ఖర్చుల కోసం రూ.వెయ్యి తీసుకుని నేరుగా నిజామాబాద్ వచ్చేశాడు. దీంతో బాధితుడి పోలీసులను ఆశ్రయించాడు. -
‘లాటరీ పేరిట లూటీ’ వ్యక్తి అరెస్టు
పెర్కిట్(ఆర్మూర్): మాయ మాటలు చెప్పి పలు చోట్ల బంగారు నగలు లూటీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏసీపీ శివకుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని యాకూత్పురకు చెందిన ఆఫ్తాబ్ అహ్మద్ షేక్ ఈనెల 8న బాల్కొండలో సల్లగరిగ రమేశ్ ఇంటికి చేరుకుని మీ తండ్రి గంగారాంకు లాటరీలో పల్సర్ బైకు బహుమతిగా వచ్చిందని మాయమాటలు చెప్పాడు. అనంతరం రమేశ్ దంపతులను ఆర్మూర్‌లో బహుమతి అందజేసే కంపెనీకి ఉన్నఫలంగా రావాలన్నాడు. ఈ క్రమంలో రమేశ్ తల్లి నుంచి మీ కుమారుడు నీ నగలతో పాటు కోడలు నగలను ఇవ్వమన్నాడని నమ్మించాడు. అనంతరం నగలను తీసుకుని ఉడాయించాడు. తాము దోపిడీకి గురయ్యామని గ్రహించిన బాధితుడు బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తు పట్టారు. శనివారం పెర్కిట్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తున్న రమేశ్ నిందితుడిని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించారు. తానే నగల లూటీ చేసినట్లు విచారణలో అంగీకరించాడు. దీంతో ఆదివారం ఆఫ్తాబ్ అహ్మద్ షేక్‌ను రిమాండుకు తరలించారు. 17 కేసుల్లో నిందితుడు.. కాగా డ్రైవర్‌గా పని చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అఫ్తాబ్ అహ్మద్ షేక్ 17 కేసుల్లో నిందితుడని ఏసీపీ తెలిపారు. 2007లో చోరీలు మొదలు పెట్టిన నిందితుడు మహారాష్ట్ర కొల్లాపూర్‌లో అత్యాచారం కేసులో ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఉమ్మడి జిల్లాలోని బాల్కొండతో పాటు బోధన్, నవీపేట్, వర్ని, బాన్సువాడ, కర్నాటక రాష్ట్రంలోని ఎంబీ నగర్లో చోరీలు చేశాడు. హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లూటీ చేసిన 14 కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. పోలీసులకు దొరికిన ప్రతిసారి నోటి నుంచి రక్తం కారుస్తూ తనకు క్యాన్సర్ ఉందంటూ పోలీసులను సైతం అయోమయానికి గురి చేసేవాడు. నిందితుడి నుంచి రూ. 5లక్షల 40 వేల విలువగల 18 తులాల బంగారు నగలు, కర్నాటకలో చోరీ చేసిన రూ.60 వేల విలువ గల పల్సర్ బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు నరేందర్, రాములు, రమేశ్, సురేందర్, ఖేర్ బాజీ, రాథోడ్‌లకు సీపీ కార్తికేయ ద్వారా రివార్డును అందిస్తామని ఏసీపీ తెలిపారు. -
‘వాట్సాప్’ వంచన!
లాటరీ వచ్చిందంటూ ఎర నగర వ్యాపారికి రూ.15 లక్షల టోకరా ఆర్బీఐ పేరుతో వెబ్సైట్ రూపకల్పన సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రముఖ సంస్థల పేరుతో లాటరీలు వచ్చాయంటూ ఎర వేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త ఎత్తు వేస్తున్నారు. దాదాపు ప్రతి ఒక్క స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడూ ఉపయోగించే వాట్సాప్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. నగరానికి చెందిన ఓ వ్యాపారికి వాట్సాప్ లాటరీ వచ్చిందంటూ పలు దఫాలుగా రూ.15 లక్షలు దండుకున్నారు. ఈ వ్యవహారంలో సైబర్ నేరగాళ్లు ఆర్బీఐ పేరుతో బోగస్ వెబ్‌సైట్‌ను సైతం రూపొందించడం కొసమెరుపు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన వ్యాపారి ఆదిత్యకు గత నెలలో ఓ మెయిల్ వచ్చింది. లండన్ నుంచి సదరు మెయిల్ పంపిస్తున్నామని చెప్పిన నేరగాళ్లు వాట్సాప్ సంస్థ తీసిన లాటరీలో భారీ బహుమతి తగిలిందని తెలిపారు. తనకు సంబంధించిన పూర్తి వివరాలు పంపాల్సిందిగా సైబర్ నేరగాళ్లు కోరడంతో ఆదిత్య అలానే చేశారు. లాటరీ డబ్బునువాట్సాప్ కంపెనీ ఆర్బీఐ వద్ద జమ చేస్తుందని, అక్కడ నుంచే నగదు తీసుకోవాల్సి ఉంటుందని వారు నమ్మించారు. నగదు బదిలీ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ఆర్బీఐ వెబ్సైట్ నుంచి తెలుసుకునే ఆస్కారం ఉందని చెప్పారు. ఆర్బీఐ పేరుతో ఓ బోగస్ వెబ్సైట్ సైతం రూపొందించిన నేరగాళ్లు ఆ వివరాలు ఆదిత్యకు పంపించారు. దీంతో పూర్తిగా వారి వల్లో పడిన ఆదిత్య సైబర్ నేరగాళ్లు కోరిన విధంగా రూ.2 లక్షలు ఓ బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ‘ఆర్బీఐ వెబ్సైట్’లో ప్రవేశించడానికంటూ ఆదిత్యకు ఓ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను పంపగా, వీటి ఆధారంగా బోగస్ సైట్లోకి లాగిన్ అయిన బాధితుడు అందులో తాను డిపాజిట్ చేసిన రూ.2 లక్షలకు సంబంధించిన వివరాలు చూశాడు. దీంతో నేరగాళ్లను పూర్తిగా నమ్మడంతో వివిధ రకా పన్నుల పేరుతో ఆదిత్య నుంచి మొత్తం రూ.15 లక్షలు గుంజారు. ఆర్బీఐ పేరుతో రూపొందించిన రెండు ఏటీఎం కార్డులూ బాధితుడికి పంపారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ రిజర్వ్ బ్యాంక్ అధికారిణిగా ఫోన్ చేసి లాటరీ నగదు మొత్తం డిపాజిట్ అయ్యిందని చెప్పింది. అనంతరం మరోసారి ఫోన్లో్ల ఆదిత్యను సంప్రదించిన సైబర్ నేరగాళ్లు బహుమతి సొమ్మును డిపాజిట్ చేయడానికి ఇద్దరు వాట్సాప్ ఉద్యోగులు లండన్ నుంచి వస్తున్నార ని, విమాన ఖర్చులకు రూ.60 వేలు డిపాజిట్ చేయాల్సిందిగా కోరారు. అయితే అప్పటికే ఒకరు డబ్బు రిజ ర్వ్ బ్యాంకులో డిపాజిట్ అయిందని చెప్పగా, ఆ తర్వాత ఇద్దరు వచ్చి డిపాజిట్ చేస్తారనడంతో అనుమానం వచ్చిన బాధితుడు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆదిత్య డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలు, సాంకేతిక ఆధారాలను బట్టి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.