loudspeaker
-
మళ్లీ ‘చెత్త’ పని చేసిన నార్త్ కొరియా కిమ్!
ఇప్పటి వరకు ఉత్తర కొరియా తన దగ్గరున్న క్షిపణులు, అణుబాంబులతో దక్షిణ కొరియాను బెదిరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశం దక్షిణ కొరియాను ‘చెత్త బెలూన్ల’తో కవ్విస్తోంది. ఉత్తర కొరియా ఇటీవల 150 బెలూన్లకు చెత్తను కట్టి దక్షిణ కొరియాలోకి విడుదల చేసింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఖఠినవైఖరి అవలంబిస్తామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.ఉత్తరకొరియా తీరును ఎండగడుతూ లౌడ్ స్పీకర్ల ద్వారా మరోసారి వ్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియాలోని ప్రధాన నగరం)నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సియోల్(దక్షిన కొరియాలోని ప్రధాన నగరం) పరిపాలనా అధికారులు హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభిస్తామని జాతీయ భద్రతా అధికారులు హెచ్చరించారు.కొద్ది రోజులుగా ఉత్తర కొరియా చెత్తతో కూడిన వందలాది బెలూన్లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఈ బెలూన్లు తెస్తున్న చెత్తలో ఉత్తర కొరియా ప్రచార సామాగ్రి ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైన్యం తెలిపింది. కాగా సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర చెత్తను పారవేస్తున్న దక్షిణ కొరియా కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తర కొరియా తెలిపింది. ఈ ప్రటన తరువాతనే దక్షిణ కొరియాకు చెత్త కట్టిన బెలూన్లు రావడం ప్రారంభమయ్యింది.1950లలో కొరియా యుద్ధం జరిగినప్పటి నుండి ఉత్తర, దక్షిణ కొరియాలు తమ ప్రచార కార్యక్రమాలలో బెలూన్లను ఉపయోగిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా 2018- అంతర్-కొరియా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ ఒప్పంద ఉద్దేశ్యం ఇరు కొరియా దేశాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడే వరకూ సరిహద్దు శత్రుత్వాన్ని తగ్గించడం.ఈ ఒప్పందాన్ని ఎత్తివేడం వల్ల ఉత్తర కొరియా సరిహద్దులో దక్షిణ కొరియా మళ్లీ సైనిక విన్యాసాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుందని, పొరుగు దేశం కవ్వింపు చర్యలని తిప్పొకొట్టవచ్చని భద్రతా మండలి పేర్కొంది. ఒప్పందపు రద్దు ప్రతిపాదనను ఆమోదం కోసం క్యాబినెట్ కౌన్సిల్‌కు సమర్పించనున్నారు. కాగా ఉత్తర కొరియా ఇప్పటివరకు దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెత్తతో కూడిన బెలూన్లను ఎగరేసింది. వీటిలో పేడ, సిగరెట్ పీకలు, గుడ్డ ముక్కలు, వ్యర్థ కాగితాలు ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ బెలూన్లలో ఎటువంటి ప్రమాదకర పదార్థాలు లేవు. -
ఆర్టీసీ బస్సుల్లో ఫుల్ సౌండ్‌తో పాటలు వింటున్నారా? ఇకపై జాగ్రత్త!
బెంగళూరు: బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలా మందికి మొబైల్లో పాటలు వినడం, సినిమాలు చూడటం అలవాటు ఉంటుంది. జర్నీ బోర్ కొట్టకుండా ఈజీగా టైమ్ గడిచిపోయేందుకు ఇది మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే మరికొంతమంది లౌడ్ స్పీకర్‌తో పక్కన వారిని పట్టించుకోకుండా బయటకు వినపడేలా వింటున్నారు. ఈ సౌండ్స్ వల్ల బస్సుల్లోని ఇతర ప్రయాణికులకు అప్పుడప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. చదవండి: అమెరికా వెళ్తున్నారా ? మోత మోగుతున్న విమాన ఛార్జీలు! ఈ క్రమంలో కర్ణాటక ఆర్టీసీ సంస్థ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. ఎవరైతే రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారో.. వారు మొబైల్ స్పీకర్ల ద్వారా పాటలు వినడాన్ని నిషేధించింది. బస్సులో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఈ యంత్రంతో ఢిల్లీ వాయుకాలుష్యం పరార్!! మామూలోడు కాదు.. గతంలో కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఆధారంగా కర్ణాటక హైకోర్టు నిషేధం విధించాలని నిర్ణయించింది. బస్సులో అనవసర శబ్ధాల అంతరాయంపై ఆంక్షలు విధించాలని కోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. మొబైల్లో ఎక్కువ సౌండ్ పెట్టి పాటలు, వీడియోలను ప్లే చేసే వినియోగాన్ని పరిమితం చేయాలని పిటిషనర్ కోరారు. చదవండి: వంటింట్లో పాలు పొంగిపోతున్నాయా?.. ఈ చిట్కా బాగుందే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు.. అధిక సౌండ్‌తో పాటలు ప్లే చేయవద్దని అలాగే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని బస్సులోని అధికారులు (డ్రైవర్, కండక్టర్) ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది. ఒకవేళ ప్రయాణికుడు అధికారుల సూచనలను పాటించకపోతే ప్రయాణీకుడిని బస్సు నుంచి దింపవచ్చని హైకోర్టు పేర్కొంది. -
సౌండ్ తగ్గించమన్నాడని హత్య
చాదర్‌ఘాట్: లౌడ్ స్పీకర్ విషయంలో జరిగిన ఘర్షణ వృద్ధుడి హత్యకు దారి తీసింది. చాదర్‌ఘాట్ పోలీసుల కథనం ప్రకారం... అజంపురాలో నివాసం ఉండే సయ్యద్ నూరోద్దిన్ (65) ఇంటి పక్కనే ఎలక్ట్రీషియన్ రాజేష్ (28) నివాసం ఉంటున్నాడు. రాజేష్ రెండు నెలలుగా తన ఇంటిపైభాగంలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి ఎక్కువ సౌండ్ పెడుతున్నాడు. తమకు ఇబ్బందిగా ఉంటోందని సౌండ్ తగ్గించమని నూరోద్దిన్... రాజేష్ తల్లితో రోజూ గొడవ పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లి రాజేష్‌కు చెప్పగా... కోపోద్రిక్తుడైన రాజేష్ ఇంట్లోని తల్వార్‌తో నూరోద్దిన్ చెయ్యి నరకడంతో పాటు తలపై దాడి చేశాడు. దీంతో నూరోద్దిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నూరోద్దిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. స్థానికంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చాదర్‌ఘాట్ సీఐ వెంకట్‌రెడ్డి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు రాజేష్‌ను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
3డి ప్రింటర్‌తో లౌడ్ స్పీకర్.. ఎన్నారై విద్యార్థి ఘనత
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సృష్టించడంలో భారతీయులది అందెవేసిన చేయి. ఇప్పుడా విషయం మరోసారి రుజువైంది. ఎన్నారై విద్యార్థి అపూర్వ కిరణ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ౩డి ప్రింటర్ లోంచి లౌడ్స్పీకర్లు ప్రింట్ చేసింది. ఇందులో ప్లాస్టిక్, కండక్టివ్, అయస్కాంత విడిభాగాలున్నాయి. ఇది అచ్చం మామూలు లౌడ్‌స్పీకర్ లాగే పనిచేస్తుంది. కేవలం విడిభాగాలను రూపొందించి కలపడమే కాక.. పూర్తిస్థాయి లౌడ్స్పీకర్లను ౩డి ప్రింటర్లలోంచి బయటకు తీసే పద్ధతిని వీరు కనిపెట్టారు. అపూర్వ కిరణ్, రాబర్ట్ మెక్ కర్డీ ఇద్దరూ కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీళ్లు మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ హాడ్ లిప్సన్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టుపై పనిచేశారు. తాను కొత్తగా ౩డి ప్రింట్ చేసిన ఈ లౌడ్‌స్పీకర్ చక్కగా పనిచేస్తోందని చెబుతూ దాన్ని యాంప్లిఫయర్కు కలిపారు. ఇది పనిచేస్తోందని చూపించేందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగాన్ని వినిపించారు. ఇక ఈ లౌడ్‌స్పీకర్ తయారీలో అయస్కాంతం కోసం సమన్వయ శ్రీవాత్సవ అనే కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విద్యార్థి సాయం తీసుకున్నాడు. స్ట్రాన్షియం ఫెర్రైట్ సాయంతో వాళ్లు అయస్కాంతాన్ని తయారు చేయగలిగారు. చివరికి రీసెర్చి ఫాబర్ మీద 3డి ప్రింటింగ్ చేశారు. మరికొద్ది కాలంలో వినియోగదారులు తమ ఇంట్లోనే ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రింట్ చేసుకునే అవకాశం కూడా వస్తుందని అపూర్వ కిరణ్ బృందం చెబుతోంది.