lovely university
-
రోబోలతో వైరస్ పని పట్టు
న్యూఢిల్లీ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రులలో రోబోలను ఉపయోగించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మనుషులు వెళ్లలేని, వెళ్లకూడని చోట్లకు రోబోలను పంపి విధులు నిర్వర్తించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా సోకిన వారికి మందులు అందించడంతో పాటుగా, ఆస్పత్రులను శుభ్రం చేసేందుకు రోబోలు ఉపయోగపడుతున్నాయి. గతేడాది చివర్లో చైనాలోని వూహాన్లో వైరస్ వెలుగు చూసినపుడు అక్కడి ఆస్పత్రులలో రోబోలనే వాడారు. రోగుల శరీర ఉష్ణోగ్రతను కొలిచేందుకు, మందులు అందించేందుకు, రోగి ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేందుకు అవి సహాయపడ్డాయి. రోగి ముక్కు, గొంతు నుంచి టెస్ట్ శాంపిళ్లను సేకరించడానికి రోబోలు ఉపయోగపడతాయని అమెరికాకు చెందిన కార్నిగే మెలాన్ యూనివర్సిటీ నిపుణులు తేల్చారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ ఆస్పత్రిలో అతినీలలోహితక కాంతితో చేసే క్లీనింగ్ పనిని రోబో కేవలం 10నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోబోలు కీలక పాత్ర పోషించగలవని పంజాబ్ లవ్లీ యూనివర్సిటీకి చెందిన డీన్ లోవి రాజ్ గుప్తా తెలిపారు. ‘రోబోలు అన్ని స్థాయిల్లోనూ మానవ ప్రమేయాన్ని తగ్గిస్తాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ కాలంలో అవి మరింత ఉపయోగపడగలవు. రోగులకు కావాల్సిన వాటిని అందించగలవు’ అని పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం వైద్యులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, వారికి కరోనా సోకకుండా రోబోలను వినియోగించుకోవచ్చని అదే యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అనిత గెహ్లోత్ అన్నారు. మన దేశంలో.. రోగులకు దూరంగా ఉంటూ చికిత్స అందించడంలో రోబోలు భారత వైద్యులకు ఉపకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వైద్యులకు చికిత్సతో పాటుగా ఆహారం, మందులు అందించేందుకు హ్యూమనాయిడ్ రోబోలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. దీనివల్ల వైద్యులకు, వైద్య సిబ్బందికి వైరస్ సోకే ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీ నిపుణులు ఐసోలేషన్‌లోని రోగులకు వైద్యం అందించేందుకు రోబోను తయారు చేశారు. అది రోగి గదిలోకి మందులు, ఆహారాన్ని తీసుకెళ్లగలదు. -
దయచేసి హాస్టల్స్‌లో ఒంటరిగా ఉండొద్దు..!
చంఢీగడ్/అనంతపురం : పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సీటీలో ఓ తెలుగు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవ్యక్తిగా గుర్తించారు. మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్టు విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ వల్ల తెలుస్తోంది. ఒంటరి జీవితాన్ని ముగిస్తున్నానని విద్యార్థి లేఖలో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ ప్రకారం.. ‘ఇక సెలవు. వెళ్లిపోతున్నాను. మిమ్ములనందరినీ వదిలిపెట్టి. నా చావుకు నేనే కారణం. నా ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎవరైనా నావళ్ల ఇబ్బంది పడుంటే సారీ, దయచేసి హాస్టల్స్‌లో ఉన్నప్పుడు రూమ్‌లలో ఒంటరిగా ఉండకండి. రోజుకి కనీసం గంటైనా ఆడుకోవటానికి వెళ్లండి. రిలాక్స్ కావడానికి అదే మంచి మార్గం. లేకుంటే నాలాగే సూసైడ్ ఆలోచనలు వస్తాయి. సూసైడ్ చేసుకునే వారిని పిరికివాళ్లుగా తీసిపారేయకండి. ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం వందేళ్లు బతికినా రాదు. అంతకష్టం సూసైడ్ చేసుకోవడం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. మా అమ్మానాన్నల గురించి చెప్పాలంటే, నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించే గొప్పవాళ్లు. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాళ్లు. పాపం వారెలా తట్టుకుంటారో నేను చనిపోయానని తెలిసి. నా రియల్ లైఫ్‌లో జగదీష్ అంత దానకర్తని చూడలేదు. చిన్నప్పటినుంచి మా అన్నవాళ్లు కూడా సపోర్టు చేస్తూ వచ్చారు. ఇంక మీరే అమ్మానాన్నని బాగా చూసుకోవాలి. ఇంక చెప్పడానికేం లేదు. నా ప్రాణస్నేహితులకు, మిత్రులకు, శత్రువులకు, బంధువులందరికీ నా జీవితంలో మీరూ భాగమైందుకు కృతజ్ఞతలు. నాకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేదు. గుడ్‌బై. వీలైతే మరణానంతరం నా అవయవాలు దానం చేయండి’అని ముగించాడు. ఇక విద్యార్థి మృతదేహాన్ని సొంతూరికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. -
‘లవ్లీ’ వర్సిటీ విద్యార్థులకు మంచి ప్యాకేజ్
జలంధర్: లవ్లీ ప్రొఫెషనల్ యూనివ ర్సిటీకి చెందిన ఎంబీఏ విద్యార్థుల్ని రూ. 4.67 లక్షల వార్షిక వేతనానికి ప్రముఖ ఏషియన్ పెయింట్స్ సంస్థ టెరిటోరియల్ సేల్స్ ఆఫీసర్లుగా ఎంపిక చేసింది. ఎంపికైన విద్యార్థులు 2015 జూన్‌లోగా విధుల్లో చేరతారు. వర్సిటీ డెరైక్టర్ జనరల్ హెచ్ఆర్ సింఘాల్ ఎంపికైన విద్యార్థుల్ని మంగళవారం అభినందించారు.